Well Come To “This Is Divine Law”
భాషను ఎంచుకోండి: తెలుగు English हिंदी About


Copyrite©2025
దైవలోక ధర్మ శాస్త్రం -దైవ నియమం
BY: M. వెంకట రాజు (శ్రీ రామ ధర్మజ)
info@thisisdivinelaw.com
All rights reserved. No part of this book may be reproduced, stored in a retrieval system, or transmitted in any form or by any means-electronic, mechanical, photocopying, recording, or otherwise-without the prior written permission of the publisher and the author, except in the case of brief quotations used in reviews, articles, or scholarly works.
గ్రంథ పరిచయం
‘దైవ నియమం’
విశ్వంలో వున్న అన్ని నియమాలు ఒకే ఒక నియమాన్ని అనుసరించి పని చేస్తున్నాయి. ఆ నియమాన్ని దైవ నియమం (divine law) గా వివరిస్తూ ‘దైవలోక ధర్మ శాస్త్రం’ అనే ఈ గ్రంధంలో వివరించడమైనది.
ఈ నియమాన్ని పరిపూర్ణంగా గ్రహించి మానవులు మానవత్వం నుండి దైవత్వంలోకి మారి మోక్షాన్ని పొందాలి. అదేవిధంగా ఈ భూలోకాన్ని దైవ లోకముగా మార్చాలన్నదే ఈ గ్రంథం యొక్క ప్రదానోద్దేశం. ఈ లక్ష్యం నెరవేరాలంటే మానవుడు కొన్ని దైవ రహస్యాలు తెలుసుకోవాలి. ఆ దైవరహస్యాలను ఈ గ్రంథంలో వివరించడమైనది. దైవ రహస్యాలు సృష్టి నియమాలుగా కొన్ని భౌతికంగా కంటికి కనిపించేవి గాను, మరికొన్ని కంటికి కనిపించకుండా అతీత శక్తిగా పనిచేస్తున్నాయి. కంటికి కనిపించే నీరు, అగ్ని ధర్మాన్ని తెలుసుకున్నందున మానవుడు వాటిని అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాడు. అలాగే వాటి వల్ల కలిగే ప్రమాదాలను తెసుకుని వాటి యందు జాగరూకుడై వుంటున్నాడు. కాని కనిపించని అతీత శక్తి నియమాలను తెలుసుకోలేక పోవడం వలన బాధలు పడుతున్నాడు. అంతే కాక ఆ శక్తిని అనుకూలముగా మార్చుకోలేకపోతున్నాడు. ఈ గ్రంథంలో అతీత శక్తి అంటే ఏమిటో దాని గురించి తెలియ చేయడమైనది. అతీత శక్తిని తెలుసుకోవడం వలన ప్రమాదాలు రాకుండా వుండేలా జాగ్రతలు చెప్పడమైనది. అలాగే ఆ శక్తిని తమకు అనుకూలంగా మరియు లోకహితం కోసం ఎలా మార్చుకోవాలో తెలియ చేయడమైనది.
ఈ గ్రంథం లో సృష్టి రహస్యాలు ఎంతో సరళంగా ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా అర్థమయ్యేలా వివరించడమైనది. ఈ గ్రంథం పాఠకులకు వైజ్ఞానికంగా, అధ్యాత్మికంగా స్పష్టమైన దిశా నిర్దేశం చేస్తుంది. ఈ గ్రంథం చదివిన తర్వాత ప్రకృతిని, పదార్థాలను చూసే దృక్పథం మారుతుంది. ఈ శాస్త్రం పూర్తిగా అర్థమైతే ఇది వరకు చూసిన విధముగా ఈ లోకాన్ని, పదార్థాన్ని చూడరు. దాన్ని ఖచ్చితంగా ఏ దృక్పథంలో చూడాలో అలాగే చూస్తారు. తద్వారా సృష్టి రహస్యాలపై ఒక పరిపూర్ణమైన అవగాహన ఏర్పడుతుంది.
అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ మొదలైన వారు విశ్వంలోని అన్ని నియమాలు ఒకే నియమం పై పనిచేస్తూ వుండవచ్చు అని The Theory of Everything ను ప్రతిపాదించారు. వారు వూహించినట్లుగా ఆ నియమం భౌతిక మైనది కాదు. అది మొదట మనో నియమముతో మొదలై తర్వాత బౌతిక రూపం దాలుస్తుంది. ఆ నియమాన్నే ఈ గ్రంధంలో ‘దైవనియమం’ గా వివరించడమైనది. ఈ నియమాన్ని సకల జీవరాసులు ఎలా వుపయోగిస్తున్నాయి. మానవుడు ఆ నియమాన్ని ప్రతికూలముగా, అనుకూలముగా ఎలా వుపయోగిస్తున్నాడు. అనే అనేక విషయాలు ఈ గ్రంథంలో వివరించడమైనది.
కృతజ్ఞతలు
తల్లితండ్రులకు
నా జీవితంలో మా నాన్న గారి జీవన విధానం, వారి అనుభవాలు నాకెన్నో పాఠాలు నేర్పాయి. వారి జీవితం నుంచి నేను ఎంతో లౌకిక జ్ఞానాన్ని పొందాను. ప్రపంచాన్ని చూపించిన మొదటి గురువు మా నాన్న గారు. వారు మొదటి నుండి తనను నమ్మిన వారి కోసం అండగా వుంటూ ఎంతో మంది జీవితాలకు వెలుగునిచ్చారు. వారు బోధించిన విలువలు నా జీవితలో అమూల్యమైనవి. వారు లేని లోటు నా మాటల్లో వివరించలేను. వారు భౌతికంగా దూరమైనప్పటికీ మనస్సుకు దగ్గరగా వున్నారు. నా పితృ దేవులు కీర్తి శేషులు మంజుల వెంకటేశ్వర్లు గారికి సాష్టాంగ ప్రణామాలు. వారి ఆశీస్సులు, అనుగ్రహం ఎల్లవేళలా వుండాలని మనసారా కోరుకుంటున్నాను. నిస్వార్థముగా నా శ్రేయస్సు కోసం నిరంతరం తపిస్తున్న నా మాతృ మూర్తి మంజుల రమణమ్మ గారికి కొడుకుతో సమానముగా చూసిన తల్లి మంజుల లక్ష్మి దేవి గారికి సాష్టాంగ ప్రణామాలు. వారి ప్రేమ,త్యాగం, సహనం, మద్దత్తుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.
నాకు వివాహం జరిగిన నాటి నుండి, తన అచంచలమైన ప్రేమ, సహకారంతో, నిరంతర శ్రమతో నా ప్రతి అడుగులోనూ తోడుగా నిలిపిన నా భార్య పుష్పాంజలిగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా జీవితంలో అరుదైన రత్నాల్లాంటి ఇద్దరు అమూల్యమైన సంతానాన్ని ప్రసాదించిన ఆమె మాతృత్వానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను.
అలాగే ఎంతో ఆప్యాయతతో నన్ను ఆదరిస్తూ, మద్దత్తుగా వున్న నా ముగ్గురు తమ్ముళ్లకూ వారి కుటుంబ సభ్యులకూ, నా ఇద్దరు చెల్లెళ్లకూ వారి కుటుంబ సభ్యులకూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అదే విధంగా, నా జీవిత ప్రయాణంలో నాతో కలిసి నడిచి, అవసరమైన ప్రతి సమయంలో మద్దత్తుగా వున్న నా బంధువులకు, మిత్రులకు, సమాజంలోని సత్సహచరులకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
వశిష్ట,వాల్మీకి, వ్యాస మహర్షులకు
ఈ గ్రంథంలో ‘అతీంద్రియ శక్తుల’ గురించి వివరించడమైనది. వాటికి సాక్షాముగా మహర్షి వాల్మీకి గారు రచించిన రామాయణం లోని సంఘటనలను ఆదారముగా సమర్పించబడినవి. అదే విధంగా, మహర్షి వేదవ్యాసులు వర్ణించిన దశావతారాల ద్వారా అంతర్లీనంగా పరిణామ సిద్ధాంతం (Evolution Theory)నే వివరించినట్లు అందరూ గ్రహించవలసిన అవసరం ఉంది. బ్రహ్మర్షి వశిష్ట మహర్షి లోకానికి మహా జ్ఞానాన్ని ప్రసాదించారు.
ఈ సందర్భంలో నేను బ్రహ్మజ్ఞాని మహర్షి వశిష్ఠులకూ, వాల్మీకి, వ్యాసభగవానులకు మరియు ఇతర ఋషులకూ నా హృదయపూర్వక భక్తి, కృతజ్ఞతలను అర్పిస్తున్నాను.
ప్రొఫెసర్ ఆచార్య మసన చెన్నప్ప గారికి
ఈ గ్రంథ రచన పూర్తయిన తర్వాత, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వాధ్యక్షులైన ఆచార్య మసన చెన్నప్ప గారికి దీనిని పరిశీలించి తగిన సూచనలు చేయమని కొరడమైనది. తెలుగు భాషపై వారికున్న అసామాన్య ప్రతిభతో ఈ గ్రంథాన్ని ఎంతో ఓర్పుతో పరిశీలించి, మరింత మెరుగుపరిచారు. తన అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. వారు భాషా జ్ఞానం, శాస్త్ర జ్ఞానం మాత్రమే కాకుండా, నైతిక విలువలు కలిగిన సత్స్వభావులు. స్వచ్ఛమైన చిరునవ్వుతో పలకరించే ఆత్మీయులు. వారికి దైవానుగ్రహం ఎల్లప్పుడూ లభించాలని, వారు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను. వీరిని నాకు పరిచయం చేసిన బేతవోలు రాంబ్రహ్మం గారికి, ప్రొఫెసర్ నిత్యానందరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
బ్రహ్మర్షి శ్రీ చాగంటి కోటేశ్వరావు గారికి
బ్రహ్మర్షి శ్రీచాగంటి కోటేశ్వరావు గారి ఉపన్యాసములను నేను టెలివిసన్ మాధ్యమంగా వింటూ వుంటాను. పవిత్రమైన హృదయంతో ధర్మ బ్ధమైన నైతిక విషయాలను భోదించే వారి వాక్ శక్తి నాకు ఎంతో ప్రశాంతతను, ఆనందాన్ని కలిగిస్తూ వుంటుంది. సమాజ శ్రేయస్సు కాంక్షిస్తూ, ఎన్నో అమూల్యమైన విషయాలు తెలియ చేస్తున్న బ్రహ్మర్షి శ్రీ చాగంటి కోటేశ్వరావు గారికి నా హృదయ పూర్వక ప్రణామాలు అర్పిస్తున్నాను.
పాఠకులకు విజ్ఞప్తి
ఈ గ్రంథం మత గ్రంథము గా బావించకండి ఇది విజ్ఞాన గ్రంథము. పూర్వంలో దైవ నియమాన్ని ఎలా ఉపయోగించారో పాఠకులు అర్థం చేసుకోవడానికి రామాయణం, మహాభారతం నుండి కొన్ని విశేషాలను పేర్కొన్నాము. ఆ విశేషాలను స్వీకరించి, వాటి సారాన్ని విచారించే దృష్టికోణంతో ఈ గ్రంథాన్ని చదివితే, సంపూర్ణ జ్ఞానాన్ని పొంది, మంచి ఫలితాన్ని పొందగలరు.
అలాగే, ఈ గ్రంథంలో దుర్భర పరిస్థితుల గురించి వివరించబడింది. ఆ పరిస్థితులు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైనవి కావు. ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ప్రజలు ఈ కష్టాలను అనుభవిస్తున్నారు. నేను ఇవన్నీ మీడియా ద్వారా గమనిస్తూ వచ్చాను. ఈ కష్టాలు త్వరలో అంతమై, ప్రజలు ప్రశాంతమైన, ఆనందకరమైన జీవితాన్ని గడపాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.
Yours faithfully
M. వెంకట రాజు (శ్రీ రామ ధర్మజ)
Contents
- దైవ సభ.. 1
- దైవలోక ధర్మ శాస్త్ర ఆవిర్భావం. 2
- దైవీ శక్తి, శ్రీరాముడి మనస్సుతో అనుసంధానమై మాట్లాడుట. 4
- శ్రీరాముడి లోక సంచారం. 7
- శ్రీరాముడు ప్రపంచంలోని దురవస్థలను చూసి మహా శక్తికి తెలియచేస్తూ విచారించుట. 8
- శ్రీ రాముడు ఈ లోకాన్ని దైవ లోకముగా చూడాలని తన సంకల్పాన్ని తెలియ చేయుట. 12
- ‘దైవ శక్తి’ దైవలోకము కావడానికి మార్గాన్ని తెలియ చేయుట. 13
- భూలోకము దైవలోకము కావడానికి శ్రీరాముడు చేయవలసిన కార్యములను దైవ శక్తి తెలియ చేయుట. 16
- శ్రీరాముడు సృష్టిలోని రహస్యముల యొక్క సందేహములను వ్యక్తము చేయుట. 17
- దైవీ శక్తి దైవ రహస్యాలను తెలియ చేయుట. 19
- మనస్సుకు,శక్తికి వున్న అవినాభావ సంబంధం గురించి తెలియచేయుట. 20
- ఆత్మ జ్ఞానం బోధించుట. 21
- జీవుడు మనో బలాన్ని, మనో విశ్వాసాన్ని పొందుతున్న క్రమము. 23
- జీవుడు విషయ భావన చేయడం తో కర్మ ప్రారంభమవుతుంది. 25
- జీవుని మనో భ్రాంతి, మనో విశ్వాసమునకు అనుగుణంగా వుంటున్న శక్తి. 26
- దృక్(జీవుడు) యొక్క దృక్పథం పై దృశ్యం (పదార్థం, శరీరం) ఆధారపడి వుంటుంది. 28
- జీవుడు భూతకాల కర్మ ప్రభావమునకు వర్తమానములో కర్మఫలమును జడముగా అనుభవిస్తున్నాడు. 35
- దృశ్య ప్రభావానికి జీవుని మనో దృక్పథం మార్పుచెందుట. 36
- విశ్వము నందు రెండు బలములు గల ఆత్మల గురించి వివరించుట. 43
- పరిపాలనాత్మ, సహకారాత్మలకు వివిధ బౌతిక ధర్మాలను కల్పించుట. 45
- ఆత్మ ఉనికి. 47
- జీవుని త్రివిధ శరీరాలు. 55
- సంకల్పానికి అనుగుణంగా జీవులు శరీర, ఇంద్రియములను పొందుట. 56
- భౌతిక శరీర నిర్మాణము. 58
- ఇంద్రియములు అవయవములు శక్తి వంతముగా మార్పుచెందుట. 64
- జీవుని ప్రయాణం- బల సమీకరణ. 69
- జీవుని విశ్వాసమునకు అనుగుణంగా అతీంద్రియముగా పనిచేస్తున్న శక్తి. 70
- యోగా, వ్యాయామాలచే మానవుని శరీరము శక్తి వంతం అవుట. 72
- 29.సాధనలో శరీరములోని అయవముల గుణాలు మార్పుచెందుట. 75
- ప్రకృతి జీవునికి స్వీయ రక్షణను కల్పిస్తుంది. 76
- జీవుడు అమరుడు. శరీరము నందు దివ్య పదార్థముగా వున్నాడు. 77
- జీవుడి మనస్సును అనుసరించి పనిచేస్తున్న శక్తి. 78
- జీవుని జ్ఞానం సంస్కార రూపంలో. 83
- అభివృద్ధి చెందిన శరీర జ్ఞానాన్ని జీవుడు ప్రాప్తముగా పొందుతున్నాడు. 84
- దైవ శరీరం వరకు పరిణామక్రమం. 86
- భవిష్యత్తుకు అనుగుణంగా దేహ నిర్మాణం, సృష్టి నిర్మాణం. 91
- సృష్టి క్రమంలో, నిష్పత్తిలో వుండేలా కల్పింపబడిన ధర్మాలు. 92
- జగత్ శరీర(బ్రహ్మండ) నిర్మాణం. 94
- జీవుడు దైవ శక్తిని అంతరిక్షములో పొందుట. 95
- జీవుని శరీరం యోగ, బోగ శరీరముగా బహుల ధర్మాలు కలిగి వుండుట. 102
- లౌకిక విషయాలలో కర్మ ప్రభావము. 110
- ధర్మం వలన ముక్తి, మోక్షం లభించుట. 120
- దైవలోక ధర్మ శాస్త్రం. 121
- క్రోధం…. 142
- శీలము…. 144
- మనస్సు-బుద్ది. 144
- సత్యము. 149
- జ్ఞానం. 154
- శౌచము (శుబ్రత). 155
- దేహము -ప్రయోజనము. 158
- దేహి -దేహము. 158
- శమము. 163
- సంతోషం. 165
- దైవలోక పరిపాలనా నియమం (Divine Rule) ఉపయోగాలు. 166
.
1. దైవ సభ
ధర్మాచార్యులు: సభకు నమస్కారం. సభకు విచ్చేసిన పెద్దలకు, మిత్రులకు శ్రేయోభిలాషులకు నా వందనాలు. ఎంతో కాలము నుంచి మన ఋషులు విశేషముగా చెబుతున్నది, మనకు వార సత్వముగా వస్తున్న జ్ఞాన సంపద అది ‘దర్మో రక్షతి రక్షితః’. అంటే ‘ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనలను రక్షిస్తుంది అని అర్థం.
ధర్మం అంటే ఒక శక్తి వంతమైన గుణం, ధర్మం అనే పదం మంచికి పర్యాయ పదముగా పిలవబడుతుంది. సత్కర్మ, సన్మార్గం, జ్ఞానం, క్రమము, యమము నియమము, సూత్రము, నీతి, న్యాయం, సత్యం, బాధ్యత, ఉపాధి, వృత్తి, కర్తవ్యనిష్ఠ మొదలైన అనేక జ్ఞానవిషయముల సారాంశమే ధర్మం. ధర్మానికి వ్యతిరేకముగా చెడుకి పర్యాయపదముగా పిలువబడేది అధర్మం. అధర్మం, అజ్ఞానం, అసత్యం, దుర్మార్గం, అక్రమము, దుష్కర్మ, దుర్గుణం, అవినీతి, అన్యాయం, బాధ్యతారాహిత్యం మొదలైన వాటిని అజ్ఞానానికి సూచికలుగా గుర్తిస్తాము. ధర్మం జ్ఞానానికి, సత్యానికి సూచిక. అధర్మం అజ్ఞానానికి, అసత్యానికి ప్రతీక.
మానవుడు ధర్మం తప్పితే జీవనం అస్తవ్యస్తమవుతుంది. అందువల్ల ప్రజలు నిశ్చింతగా, నిర్భయంగా జీవించాలంటే ధర్మాన్ని ఆశ్రయించాలి. నిరంతరం ఎరుక కలిగి ధర్మాన్ని ఆచరిస్తూ వుండాలి. ధర్మం యొక్క గొప్పదనాన్ని తెలుసుకున్న మన పూర్వీకులు మరియు పాలకులు దాన్ని రక్షిస్తూ, ప్రజల యోగ క్షేమాలు కోరి ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ వస్తున్నారు. అనేక యుగాలుగా ధర్మ శాస్త్రం మానవుడి నడవడికకు ఒక దిక్సూచిగా వుంది.
కాల క్రమంలో ధర్మం కనుమరుగయి అధర్మం రాజ్యమేలుతూ వుంది. అనేకులు ధర్మం ఆచరించకపోవడం వలన లోకం దుర్భర స్థితికి చేరుకుంది.ఈ దురవస్థలను సమూలంగా నిర్మూలించే ధర్మశాస్త్రం ఆవిర్భవించిది . ఈ సారి చెప్పబడిన ధర్మశాస్త్రం సామాన్యమైన ధర్మ శాస్త్రం కాదు ‘దైవ లోక ధర్మ శాస్త్రం’. దైవ లోక ధర్మ శాస్త్రమును గూర్చి తెలుసుకొని ఆచరిస్తూ, ఆచరింప చేయడం వలన ఈ లోకం దైవ లోకముగా విరాజిల్లుతుంది. దైవ లోకము నందు దేవతలు ఎటువంటి ధర్మాన్ని కలిగి వున్నారో అటువంటి ధర్మం అనుగ్రహింపబడింది.
2. దైవలోక ధర్మ శాస్త్ర ఆవిర్భావం.
దైవలోక ధర్మ శాస్త్రం ఎలా ఆవిర్భవించిందో సవివరముగా తెలియ చేస్తాను. శ్రద్ధగా ఆలకించండి.
M వెంకట రాజు అలియాస్ శ్రీ రామ ధర్మజ వారు దైవలోక ధర్మ శాస్త్రాన్ని తెలియ చేశారు. తల్లిదండ్రులు ప్రసాదించిన పేరు వెంకట రాజు అయినప్పటికీ, ఆయనను రామధర్మజ అనే నామంతో పిలవడానికి ఒక లోతైన ఆధ్యాత్మిక కారణం ఉంది.
రామ నామం – ఆత్మకు, జీవునికి ప్రతీక.
ధర్మజ నామం – మహాశక్తికి, ప్రకృతికి ప్రతిరూపం.
ఈ రెండు తత్త్వాల మధ్య జరిగిన దివ్య సంభాషణే ఈ గ్రంథరూపంలో మీకు తెలియజేయబడుతోంది.
ధర్మాచార్యులు: భక్త మహాశయులరా! మీకు చెప్పబోయే రహస్యాన్ని జాగ్రత్తగా వినండి మనకు ఏదైనా సందేహం వస్తే దానికి ‘శక్తి’ నుంచి తిరిగి సమాధానము వస్తుంది. ‘శక్తి’ విశ్వం లోని ఈ మొదలు నుంచి ఆ చివరి వరకు ప్రతి అణువు కదలికలను జీవునికి తెలియ జేయగలదు. ఆ కదలికలను మార్చగలదు. జీవుడు స్వయముగా ‘శక్తి’ని కలిగి వున్నాడు ఆ శక్తియే జీవుడి సందేహాలకు సమాధానమును ఇస్తుంది. జీవుడి సంకల్పానికి అనుగుణంగా తదనుగుణమైన మార్పులు చేస్తుంది. అందుకు జీవుడు ఎంతటి తపోబలాన్ని కలిగివుంటే, శక్తి అంతటి సమర్థవంతముగా ఆయా కార్యములు నెరవేరుస్తుంది.
ఇది పూర్తిగా అర్థం చేసుకుంటే నరక లోకాన్ని సైతం స్వర్గ లోకముగా మార్చవచ్చు. పరమాణువు నుండి బ్రహ్మాండం వరకు ఆయన దృష్టికి వచ్చిన విషయాన్ని తెలియ చేశాడు. వాటిలోని పరమ సత్యాన్ని, మహా దోషములను తెలుయ చేశాడు. పదార్థం ఏదో, పరమార్థం ఏదో, సారవంతమైనది ఏదో, నిస్సారవంతమైనది ఏదో తన ‘శక్తి’ తో పసిగట్టి తెలియచేసాడు. తన కంట పడ్డ అనేక విషయాలను దానికి తన మహాశక్తి తెలియ చేసిన మహాద్భుత సమాదానమును మీకు తెలియచేస్తున్నాను.
ప్రతి ఒక్కరిలో ఇతఃపూర్వ జన్మ లలోని సంస్కార జ్ఞానం స్మృతులుగా, అనుభవాలుగా వుంటాయి. అవి ఈ జన్మలో మనము చేసే ప్రతి పనిలో, కార్యములో వాటి వాసనాబలం చేత అవి అనుభవానికి వస్తూ ఆయా పనులను ప్రభావితం చేస్తూ వుంటాయి. తాను చేయదలచిన కార్యములను ప్రేరేపిస్తూ వుంటాయి. అది మంచి అయినా చెడు అయినా జ్ఞప్తి చేయడం సంస్కార జ్ఞానము యొక్క ధర్మం. ఈ ప్రవృత్తి వలన శ్రీరాముడు భూమి పై జన్మించి సరిగా 14 సంవత్సరములు కాక మునుపే తనకు అనేక పూర్వానుభూతులు అనుభవానికి వస్తూ వుండేవి.
జగన్నాటకముతో కూడిన ఈ ప్రపంచాన్ని, సృజనాత్మకమైన, వైవిధ్యభరితమైన ఈ ప్రకృతిని చూసి ఆయనకు ఎన్నో సందేహాలు తలెత్తుతూ వుండేవి. వాటి స్థితి గతుల గురించి ఆలోచిస్తూ చింతిస్తూ వుండేవాడు.
శ్రీరాముడు తన మనస్సులో దీర్ఘంగా ఆలోచిస్తూ.. నన్ను నడిపిస్తున్నది ఏ శక్తి? ఈ సృస్టిని ఎవరు స్థిరంగా వుంచుతూ? సరైన దిశలో నడిపిస్తున్నారు? భూమి, గాలి ఆకాశం, నీరు ,నిప్పు మొదలైనవి భూమిపై జీవి మనుగడకై వున్నట్లుగా పంచభూతాలు సమ నిష్పత్తిలో ఎలా వున్నాయి? వాటిని ఎవరు నియంత్రిస్తున్నారు? అని ఇలా అనేక సందేహములతో చింతిస్తూ వుండేవాడు. ఇలా చింతిస్తూ వుండగా ‘శక్తి’ శ్రీరాముడి మనస్సుతో అనుసంధానమై ఇలా మాట్లాడుతుంది.
3. దైవీ శక్తి, శ్రీరాముడి మనస్సుతో అనుసంధానమై మాట్లాడుట.
మహాశక్తి; శ్రీ రామా! శాంతించు. ఈ వయస్సులో అంతతీవ్రముగా విచారణ చేయడం శ్రేయస్కరం కాదు . అన్నింటికీ త్వరలో సమాధానమును తెలుసుకుంటావు. శ్రీ రామా! నేను నీ శక్తిని. నీ అంతరంగము నందు అంతర్వాహిని గా వున్నాను. నేను మహా మాయను నీ సందేహాలను, కోరికలను, సంకల్పాలను నెరవేర్చే శక్తి ని. నీ మనసులో ఏదైనా సంకల్పాన్ని కలిగి వుంటే దేశ కాలాలను అనుసరించి వాటిని నెరవేర్చడం నా ధర్మం. ఆనందాన్ని కోరుకుంటే ఆనందాన్ని, ధనాన్ని కోరుకుంటే ధనము, ధాన్యాన్ని కోరుకుంటే ధాన్యము, సంతానాన్ని కోరితే సంతానాన్ని, నీకు అనుగ్రహిస్తున్నాను, నీవు కోరుకోకున్ననూ దేశకాలపరిస్థితులకు అనుగుణంగా వివిధ కార్యములకు ప్రేరేపించడము, వివిధ ఉపాధులను కల్పించడము నా ధర్మం. నీవు ఏ కార్యాన్నైనా సంకల్పిస్తే ఆ కార్యాన్ని నిర్విఘ్నముగా నెరవేర్చే ‘ధర్మజ’ ను నేను. శ్రీ రామా! నా శక్తి యుక్తుల గురించి ఇది వరకు నీవు ఎరుక కలిగి వున్నావు. ప్రస్తుతము పూర్వ జ్ఞానాన్ని మరచి వున్నావు. దేశము, కాలము యొక్క మహిమ వలన అలాగే శరీరము కలిగివున్న నియమము వలన ఎరుక లేకున్నావు. త్వరలో నీకు అన్నీ బోధపడతాయి.
శ్రీ రామడు: ధర్మజ (మహా శక్తి)! నీ శక్తి నేను గ్రహించగలుగుతున్నాను. ప్రస్తుతము నేను అనేక ఆలోచనలతో సందేహములతో సతమతమవుతున్నాను, నామనస్సు నిలకడగా వుండటం లేదు, ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయో అంతు పట్టడం లేదు. ఈ విపరీత పరిణామాలకు కారణమేమిటో తెలియ చేయండి. నా మదిలో వస్తున్న ఆలోచనలను నీకు విన్నవిస్తున్నాను ఒకసారి ఆలకించండి.
మహా శక్తి: శ్రీరామా! నీ మదిలోని ఆలోచనలు నాకు ఎరుకే. నీ మనస్సు లో జనిస్తున్న ఆలోచనలు పూర్వజన్మ స్మృతులు. ఇప్పుడు నీవు అన్ని విషయములు తెలుసుకునే వయస్సు కాదు. దానికి సరైన వయస్సు, సమయం వచ్చినప్పుడు సవిరంగా తెలియ చెబుతాను. ప్రస్తుతం కొన్ని విషయములు వివరిస్తాను ఆలకించు.
రామా! నీలోని పూర్వ సంస్కార బలము వలన అవి నిన్ను ప్రభావితం చేస్తున్నాయి. నీవు కలిగి వున్న సంస్కార జ్ఞానము బయటకు వ్యక్తము కావడం దాని ధర్మం. కానీ ఇది సరైన సమయం కాక పోవడం వలన నియంత్రిస్తున్నాను. నీ బలము, జ్ఞానము అనేవి దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా నియంత్రిస్తాను, వ్యక్తము చేస్తాను. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా నీవు ఆయా పరిస్థితులకు బద్ధుడవై వుంటావు. ఇది నా ధర్మం. సమయం సమీపించినప్పుడు పూర్వ జ్ఞానం జ్ఞప్తికి వస్తుంది.
శ్రీ రామా! నీవు దేని కోసం ప్రయత్నిస్తున్నావు? ఎటువంటి సంకల్పం చేస్తున్నావు? అన్న దానిని అనుసరించి దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ఆయా జ్ఞానాన్ని, బలాన్ని, సంపదలను ఇస్తాను. నీవు ఆయా శక్తులను ఉపయోగించే అధికారాన్ని కలిగి వున్నావు. కావున నీవు కలిగివున్న శక్తులను ఏ కార్యమునకు వుపయోగించాలి అన్నది అత్యంత ప్రధానమైనది. నీవు కలిగి వున్న ఈ మహిమాన్వితమైన దైవ జ్ఞానమును ఉన్నత కార్యమునకు, లోకోద్ధరణకు వుపయోగించడం వలన సార్ధకత చేకూరుతుంది. దానికోసమై నీవు ప్రపంచస్థితిగతులను తెలుసుకోవాలి. నీకు సరైన వయస్సు వచ్చినప్పుడు నిన్ను ఆయా కార్యములందు నిన్ను నడిపిస్తాను. నీకు అనుభవములోకి వస్తున్న అనేక విషయములతో పాటు ప్రస్తుత లౌకిక, పారమార్థిక విషయములుకూడా నీకు తెలియాలి. అప్పుడే నీవు కలిగి వున్న శక్తిని ధనాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని శ్రేష్ఠమైన మార్గములో వినియోగించి లోకోద్ధరణకు వుపయోగించగలవు. నేను నిన్ను ఉచ్ఛ నీచ స్థితుల యందు నియమిస్తూ, నడిపిస్తూ వుంటాను ఆయా పరిస్థితులకు చలించక స్తితప్రజ్ఞుడవై వుండు. అప్పుడే నీవు పొందవలసిన దానియందు సరైన అవగాహన వస్తుంది. అంత వరకు ఓర్పు వహించు. ఎక్కువగా ఆలోచించక ప్రశాంత చిత్తుడవై వుండు. బాల్యమును ఆస్వాదించు. యౌవనంలోకి రాగానే ఉత్తమమైనదేమిటో తెలుసుకుంటావు.
శ్రీ రాముడు; నా మనస్సులోని సందిగ్ధతలను తొలగించి నందుకు ఓ మహా శక్తి! నీకు నా ధన్యవాదములు. నన్ను సరైన మార్గములో నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇక ముందు కూడా ఉత్తమ మార్గంలో నడిపించాలని నిన్ను కోరుతున్నాను.
మహాశక్తి; భవిష్యత్తులో మంచి కార్య సిద్ధి పొందడానికి వర్తమానములో కఠిన పరిస్థితులు ఎదుర్కోవలసి వుంటుంది. దానికి మానసికంగా, శరీరకంగా సిద్ధపడి వుండు. అంతా మంచే జరుగుతుంది. విజయోస్తు.
ధర్మాచార్యులు: పూర్వ స్మృతుల అనుభవముచే సందిగ్దతలో వున్న శ్రీ రాముడిని మహాశక్తి శాంతింప చేయుటచే అతడు మనస్సులోని సందేహములను వదిలి, పరమ ప్రశాంతతతో, మనో నిశ్చయముతో, వుంటూ తన బాల్యాన్ని తోటి బాలురతో కలసి ఆట పాటలతో ఆనందముగా గడుపుతూ, ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసాడు. తదనంతరం తన తండ్రి గారి మార్గ నిర్దేశంలో నడుస్తూ ఉన్నాడు.
4.శ్రీరాముడి లోక సంచారం.
యౌవనములోకి వచ్చిన శ్రీరామడిని విధి చేయదలచిన కార్యం వైపు నడిపించసాగింది. శ్రీరాముడి లోక సంచారము ప్రారంభమయింది. మహా శక్తి లోకములోని ఉచ్ఛ నీచ స్థితిగతుల లోకి శ్రీ రాముడిని నడిపిస్తుంది. ప్రపంచంలో అనేక విషయాలు, సంఘటనలు చూస్తూ లోక వ్యవహారములు నిశితముగా గమనిస్తున్న శ్రీరాముడిని ఆయా పరిస్థితులు ప్రభావితం చేసి ఆలోచింప చేస్తున్నాయి. కొంత కాలము అత్యంత పేదరికములో వుంటూ, వారి జీవితస్థితి గతులను చూసేవాడు, ధనవంతుడుగా వుంటూ వారిలో ఒకడిగా జీవిస్తూ వుండే వాడు. అనేక వ్యవస్థలలోనూ, సంస్థలలోనూ ఉద్యోగిగాను అనేక వ్యాపారములలోనూ వ్యాపారిగాను, వుంటూ వారి వ్యవహారాల తీరును తెలుసుకున్నాడు. కాల క్రమంలో అనేక ఒడుదుడుకులు, ఎత్తుపల్లాలు చూసాడు. చాలా సంవత్సరాలుగా ప్రజల జీవన విధానాన్ని, వ్యవహార శైలిని పాలకుల పరిపాలన తీరును గమనిస్తున్న శ్రీరాముడు ప్రపంచం చాలా దుర్భర దయనీయ స్థితిలో అల్లకల్లోలముగా వుంది అని గ్రహించాడు. అనేక ప్రాంతములలో ప్రపంచ స్థితి గతులను చూసిన శ్రీరాముడికి ప్రపంచ భవిష్యత్తుపై ఆందోళన కలిగి, పాలకుల పరిపాలన తీరును, ప్రజల వ్యవహార శైలిని చూసి బాధాతప్త హృదయం తోను, ఆగ్రహముతోను నిశ్చేష్టుడై, నిరాశతో వున్నాడు .
5.శ్రీరాముడు ప్రపంచంలోని దురవస్థలను చూసి మహా శక్తికి తెలియచేస్తూ విచారించుట.
శ్రీ రాముడు: మహా మాయ ప్రపంచములోని ప్రజల, పాలకుల వ్యవహార శైలిని వారు చేసే అన్యాయాన్ని, అధర్మాన్ని చూసి సహించలేకున్నా. వారి తీరు నిరాశా నిస్పృహలతో కూడి వుంది. ప్రజలలో ఉత్సాహము, ప్రశాంతత కనిపించడం లేదు. ప్రజలు నిర్భయంగా జీవించలేకున్నారు. వారిలో భయము, ఆందోళన, సుస్పష్టముగా కనిపిస్తున్నాయి. పాలకుల పరిపాలనా తీరు దుర్మార్గముగా వుంది. పాలకులు ప్రజల సుఖసంతోసములను కోరి ధర్మ బద్ధముగా పాలించాలి. కానీ, అనేక మంది పాలకులు అధర్మముతో, దోపిడీదారులుగా ప్రజలను పీడిస్తూ పాలిస్తున్నారు.
ఆయా వ్యవస్థలలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు వారి కర్తవ్యాలను బాధ్యతాయుతముగా నిర్వహించుట లేదు. కర్తవ్యము నందు నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, బద్ధకం స్పష్టముగా కనిపిస్తున్నాయి. ఒకరిని చూస్తే ఇంకొకరు అసూయాద్వేషములతో రగిలి పోతున్నారు. ఒకరినొకరు ప్రేమతో వ్యవహరించడం లేదు. వీరిలో అజ్ఞానం గూడుకట్టుకుని వుంది.
లంచగొండితనము, పెత్తందారీ తనము, అహంకారం ఇలా అనేకములైన దుర్గుణములు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి.
ప్రపంచంలో శాంతి, ఆనందము లోపించినవి. ఎంతో శక్తి సామర్థ్యములు కలిగినవాడు, మహా జ్ఞాన వంతుడు అయిన మానవుడు మృగములా ప్రవర్తిస్తున్నాడు. అతని మనస్సు చాలా దయనీయముగా వున్నది. ఒకరితో నొకరు వ్యవహారించే తీరు అత్యంత అజ్ఞానముతో కూడుకొని వుంది.
మాయా దేవి! లోకంలో స్థిరమైన ఆర్థిక స్థితి, శారీరక ఆరోగ్యము, మానసికమైన ప్రశాంత జీవనమునకు మించిన ఐశ్వర్యం మరేది లేదు కదా. కానీ ప్రపంచంలో ప్రజలు ఆర్థిక అసమానతలతో, భయాందోళనలతో జీవిస్తున్నారు .అజ్ఞానము అధర్మము వల్లనే ఎక్కడ చూసినా చాలా దుర్భర పరిస్థితులు ఏర్పడినాయి .
ప్రపంచంలో ధనమును ప్రోగుచేయుటలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. పాలు కలుషితం, నీరు కలుషితం, ఆహారం కలుషితం చేస్తున్నారు. అనేక విధములైన మోసపూరిత వ్యవస్థలతో ప్రజలు బాధలకు గురవుతున్నారు.
ప్రజలు ధనము కోసం జూదం, వంచన, లోభము వంటి అధర్మ మార్గములలో ప్రయాణిస్తున్నారు. ప్రపంచమంతా అజ్ఞానము తో కూడిన అంధకారము అన్ని వైపులా వ్యాపించి ఉంది.
ప్రజలు లోకానికి అవసరములేని నిరుపయోగకరమైన పనులు కూడా చాలా కుతూహలంగా ప్రారంభిస్తున్నారు. జనులు తమ కాలమంతా వ్యర్థము చేసుకుంటున్నారు. ఉత్తమమైన ఫలితమేది వారికి లభించుటయే లేదు.
మనస్సులో అనేక దోషాలు, కుసంస్కారాలు గూడుకట్టుకొని వుంటున్నాయి. లోభము వలన మానవుడు బుద్ధిహీనుడై, గుణహీనుడై, శక్తి హీనుడై, అనుక్షణం అనేక వ్యసనములలో మ్రగ్గుతూ వుంటున్నాడు. అంతరంగము నందు పుట్టిన దుష్ట సంకల్పములే ఈ జీవుడిని దీనుడిగా చేస్తున్నాయి.
పరిపాలకుడు ప్రజలను బిడ్డలవలే భావించాలి, ప్రజలు పరిపాలకుడిని తండ్రివలే భావించాలి, గౌరవించాలి. ప్రస్తుత ప్రపంచంలో పరిపాలకుడు ప్రజలను వర్గభేదముతో చూస్తున్నాడు, నిందిస్తున్నాడు. ప్రజలు పాలకుడిని కుల మత జాతి వర్గ భేదముతో ఎంచుకుంటున్నారు. వేరొకరిని శత్రుత్వ భావనతో చూస్తున్నారు.
నల్లజాతి, తెల్లజాతి అంటూ జాతి విద్వేషాలు, కుల విద్వేషాలు, మత విద్వేషాలతో ప్రపంచం అల్లకల్లోలముగా వుంది.
ప్రపంచంలో డ్రగ్స్, బ్లాక్ మైల్, సైబర్ స్కామ్స్ వంటి వాటితో చాలా తెలివిగా, మోసపూరితముగా, అడ్డదారిలో ధనాన్ని సంపాదిస్తున్న వారు అధికముగా వున్నారు. వాటికి బానిసలుగా మారుతున్నవారున్నారు.
కష్టపడి సంపాదిస్తున్న వారికి సరైన ప్రోత్సాహం అందటం లేదు. ఎంతో కష్ట పడి పని చేస్తున్న వారు కూడా దోపిడి దారుల చేతులలో పడి వారినుంచి శ్రమకు తగినంత ఫలం అందక పోవడం వలన తిండి దొరకక, దుఃఖపీడితులై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ధర్మముగా చేసే వ్యాపారములు ఆదాయము రాక పోవడం వలన అనేకులు దివాళా తీస్తున్నారు. అధర్మముతో చేసే వ్యాపారములే లాభసాటిగా వెలుగొందుతున్నాయి.
ప్రపంచంలో నిన్నటి వరకు ఐశ్వర్యముతో వున్న వాడు మరుసటి రోజుకే అంతాపోగొట్టుకున్న బికారిగా మారుతున్నాడు . ఆర్ధిక స్థితిగతులు చాలా బలహీనముగా వున్నాయి. ఆర్ధిక స్థిరత్వము అనునది ఎక్కడా కనిపించడం లేదు.
ప్రస్తుతము ఎంతోమంది నైపుణ్యము గలవారు నిరుద్యోగముతో ఏమి చేయాలో తోచక నిశ్చేష్టులై వున్నారు. వారి శక్తి నైపుణ్యాలు నిరుపయోగం అవుతున్నాయి. ప్రతి యేటా ఉన్నత విద్యను అభ్యసించి అనేకమంది పట్టభద్రులై వస్తున్నారు. వారి భవిష్యత్తుకు స్పష్టమైన దారి అంటూ లేదు. ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేని దుస్థితిలో ఉన్నాయి.
అనేకులు మానసిక వైకల్యముతో బుద్ధిహీనులుగా, ఉన్మాదులుగా మారి చిన్నపిల్లలను బలితీసుకుంటున్నారు.
ఏమి చేయాలో తెలియని, మార్గనిర్దేశం చేయలేని అజ్ఞానులు తమకు సంపదలు ఉండి ఎటువంటి ప్రయోజనము లేదు. అద్భుత ప్రతిభానైపుణ్యం గల వారు ఎటువంటి ఉపాధి లేకుండా సంచరిస్తున్నారు. ఏమిటి ఈ దారుణమైన ,అస్తవ్యస్తమైన దుస్థితి?
పుట్టినప్పటినుండి కంటికి రెప్పలా కాపాడి మంచి భవిష్యత్ ఇచ్చిన తల్లి తండ్రులకు వృద్ధాప్యములో అండగా వుంటున్న వారు బహు కొద్ధి మంది మాత్రమే కనిపిస్తున్నారు. కుటుంబ విలువలు మరిచి ఆత్మీయులతో సాన్నిహిత్యము కన్నా, వస్తువులతో ఎక్కవ సాన్నిహిత్యాన్ని పెంచుకుంటున్నారు.
లోకంలో ఒక్కో ప్రాంతములో అందమైన భవంతులు, ఆహ్లాదకరమైన వాతావరణము, అన్ని వసతులతో ప్రజలు ఆనందముగా జీవిస్తున్నారు. ఆయా ప్రదేశాలు స్వర్గాన్ని తలపిస్తున్నాయి. మరి కొన్ని ప్రదేశములలో ప్రజలు వుండటానికి ఇళ్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి సరైన బట్టలు లేకుండా నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ వ్యత్యాసము ఎందుకు?
పట్టణాలు అభివృద్ధికి సూచికగా వెలుగొందుతున్నప్పటికి ఆ వెలుగుకు కారణమైన కార్మికులు, కాంట్రాక్టర్ల జీవితాలు అంధకారములో వున్నాయి.
అధికముగా దుర్దశ, ద్వేషము, అస్థిరత మొదలైన వాటితో కూడికొని కనబడుతున్న ఈ లోకము లో వినాశనము తప్పించి ఇందులో సారవంతమైనది నాకు కనిపించడం లేదు. దుష్టస్వభావము కలిగివున్న మానవుడు చివరకు వినాశనమునే పర్యవసానముగా పొందుతున్నాడు.
ధర్మాచార్యులు: లోక స్థితి గతులను చూసి ఆవేశముతో, ఆగ్రహముతో, విచారిస్తూ, వివరిస్తున్న శ్రీరాముడి మాటలు విన్న మహా శక్తి రామా! నీలోని ఆవేశాన్ని, అంతరంగాన్ని అర్థం చేసుకున్నాను. నీవు తిరుగాడిన లోక సంచారం శుభ పరిణామానికి దారితీస్తుంది. ప్రపంచము ఎలా వుండాలని కోరుకుంటున్నావు. ఈ లోక వ్యవహారములు చూసిన వాటిలో నీవు గ్రహించినవి అనుభవములోకి వచ్చినవి ఏవి? నీ శక్తిని ఏ కార్యమునకు వినియోగించుకోవాలని అనుకుంటున్నావు. వెల్లడించుము.
6.శ్రీ రాముడు ఈ లోకాన్ని దైవ లోకముగా చూడాలని తన సంకల్పాన్ని తెలియ చేయుట.
శ్రీరాముడు: మహా దేవి! భూలోకమును దైవ లోకముగా మార్చడానికి కావలసిన అన్ని వనరులు పుష్కలంగా వున్నాయి. ఈ లోకం దైవ లోకముగా చూడాలనుకుంటున్నాను దానికి మార్గాన్ని ఉపదేశించు.
ఈ లోకంలో అందరికీ కావలసినవి అన్నీ వనరులు పుష్కలంగా వున్నాయి. కానీ వాటిని ఎలా ఉపయోగించాలో ఈ పాలకులకు చేత కాక దుర్వినియోగం అవుతున్నాయి. బలం వున్న వాడు నాకు మాత్రమే అంతా కావాలి అనే స్వార్థంతో వ్యవహరించడం వలన మిగతావారు ఆకలి బాధలతో, పేదరికముతో బ్రతుక వలసి వస్తుంది. అత్యంత శక్తి వంతుడు, అత్యంత మేధా శక్తి సంపన్నుడు, దైవ సమానుడు అయిన మానవుడు తన శక్తిని పరిమితంగా వుపయోగించి జీవిస్తున్నాడు. తన శక్తితో ప్రపంచాన్ని మాహాద్భుతముగా నిర్మించుకుని జీవించవచ్చు. నేను చూసిన ప్రపంచము ఒకలా వుంది. ఈ ప్రపంచాన్ని చూశాక నా ఊహకు అనుభవానికి వచ్చే ప్రపంచం మరోలా వుంది. ఈ ప్రపంచాన్ని ఇంకా అందముగా తీర్చి దిద్దవచ్చు. అది అంత కష్టమేమి కాదు అనిపిస్తున్నది. మానవుడు తన శక్తిని నిరుపయోగమైన పనులకే ఎక్కువగా కేటాయిస్తున్నాడు లోకొద్ధరణకు తన శక్తిని తక్కువగా వుపయోగిస్తున్నాడు. మానవులు కలిసి కట్టుగా జీవిస్తూ తమ శక్తి యుక్తులతో ప్రతి నగరమును సుందరమైన మహా నగరంగా, అందమైన గృహాలతో, ఉద్యాన వనాలతో సుందరముగా నిర్మించుకొని జీవనం సాగించవచ్చు.
మహా శక్తి! ప్రజలకు కావలసిన అన్ని వసతులు, అవసరాలు తీర్చగలిగే వాతావరణాన్ని కల్పించు. సర్వ జనులు పరమ ప్రశాంతముగా జీవించాలి. అలాగే పరిపూర్ణ జ్ఞానం తో, అష్టైశ్వర్యాలతో తులదూగే మహా భాగ్యాన్ని ప్రసాదించు.
మానవుడు మానసికంగా దైవత్వాన్ని, శారీరకంగా దైవ బలాన్ని కలిగి వుండే మార్గాన్ని తెలియ పరుచు.
నీ అనుగ్రహంతో ఈ లోకాన్ని దైవలోకముగా చేయాలని కోరుకుంటున్నాను.
మహా శక్తి: శ్రీరామా! తథాస్తు. యుష్మత్ మనోవాంఛా ఫల సిద్ధి రస్తు. నీ మనోవాంఛ నెరవేరుతుంది.
7. ‘దైవ శక్తి’ దైవలోకము కావడానికి మార్గాన్ని తెలియ చేయుట.
మహా శక్తి: శ్రీ రామా! లోకానికి క్షేమాన్ని చేకూర్చే కోరికను కోరావు. తప్పక నెరవేరుతుంది. ఈ మహత్ కార్యం నెరవేరాలంటే ఈ లోకములోని ప్రజలందరికీ 3 విధములైన దివ్య జ్ఞానాన్ని అందించాలి. 1. దైవ నియమం 2. దైవ లోక ధర్మ శాస్త్రం. 3 సూపర్ పవర్ అడ్మినిస్ట్రేషన్ కలిగి వున్న ‘దైవ లోక పరిపాలనా ధర్మం’ అందివ్వాలి. పొందిన దివ్యజ్ఞానాన్ని లోకము లోని పాలకులు, ప్రజలందరూ తెలుసుకొని ఆచరించి, అమలు చేయడం వలన ఈ లోకము దైవ లోకముగా వెలుగొందుతుంది. కాలక్రమంలో మానవుడు దైవత్వాన్ని, దైవ బలాన్ని పొందుతాడు. ప్రజలందరికీ అన్ని వసతులు సమకూరుతాయి. సర్వ జనులు సుఖ శాంతులతో ఆనందముగా జీవిస్తారు.
1. దైవ నియమం: ప్రకృతిలో వున్న అన్ని నియమాలు ఒకే ఒక మహా నియమాన్ని అనుసరించి పనిచేస్తున్నాయి. ఆ మహా నియమమే దైవ నియమం. ఈ అతీంద్రియ విషయజ్ఞానము వలన సత్యం బోధపడుతుంది. కంటికి కనిపిస్తున్నది మాత్రమే సత్యం అనుకుంటున్నారు. కంటికి కనిపించని సత్యం కూడా వున్నది అది అతీంద్రియ విషయజ్ఞానముతో బోధపడుతుంది. బాహ్య విషయ జ్ఞానం అనగా నీరు, నిప్పు, గాలి, పదునైన పరికరాలు మొదలైన వాటి దగ్గర ఎలా వ్యవహరించాలి. వాటి ప్రభావమును బట్టి ఎంత దూరములో వుండాలి, ఎంత దగ్గరగా వుండాలి అనే జ్ఞానం వుండటం వలన వాటి నుంచి వచ్చే ప్రమాదాల నుంచి తప్పించుకుంటూ మానవుడు జాగరూకుడై వుంటున్నాడు. అలాగే వాటిని తన అవసరాలకు అనుగుణంగా కూడా వుపయోగించుకొని ప్రయోజనమును పొందుతున్నాడు. కానీ కంటికి కనిపించని అతీంద్రియ విషయజ్ఞానం గ్రహించలేక పోవడం వలన దాని ప్రభావానికి లోనై ప్రమాదాలు తెచ్చుకొని బాధపడుతున్నాడు. అతీంద్రియ విషయజ్ఞానం ప్రజలకు బోధ పడాలి. అప్పుడే వారు దానిని అనుకూలముగా మార్చుకొని సర్వ బాధల నుంచి విముక్తి పొందుతారు.
అతీంద్రియ విషయజ్ఞానం వలన ప్రజలకు సృష్టి రహస్యాలు భోధపడుతాయి. మహా జ్ఞానులుగా అవతరిస్తారు. సృష్టి నియమాలు, ప్రకృతి నియమాలు తెలుసుకుని భయ భక్తులతో జీవిస్తారు.
2.దైవ లోక ధర్మ శాస్త్రం: ఈ లోకము దైవ లోకముగా వుండటానికి ప్రజలు ఖచ్చితముగా పాటించవలసిన మానసిక, శారీరక నియమాలు ఈ శాస్త్రంలో చెప్ప బడినవి. వాటిలో 1 ఉపదేశం 2 ఆదేశం. వాటిని తెలుసుకుని ఆచరించాలి. వాటి వలన మానసిక మార్పు, శారీరక మార్పు చోటుచేసుకుంటుంది. మానవత్వం నుండి దైవత్వం లోకి మార్పుచెందుతాడు.
3.‘దైవ లోక పరిపాలనా నియమము’: సూపర్ పవర్ అడ్మినిస్ట్రేషన్ తో కూడిన దైవ లోక పరిపాలనా నియమము లో ఒక క్రమములో పాలనా ధర్మం, నిష్పత్తిని అనుసరించి ఆయా వృత్తుల ధర్మాలు వాటి క్రమము నిర్దేశించ బడి వుంటాయి. వాటిని పరిపాలనలో అమలు చేయడం వలన ప్రజలకు కావలసిన అన్ని అవసరాలు సమకూరడంతో పాటు ఆనందంగా జీవిస్తారు. ఈ లోకము దైవ లోక పరిపాలనను అనుభవిస్తుంది.
సూపర్ పవర్ అడ్మినిస్ట్రేషన్ కలిగిన దైవలోక పరిపాలనా నియమంలో పాలకులు, అధికారులు, ఉద్యోగులు ధర్మంగా నడిచేలా మార్గనిర్దేశం చేస్తుంది. వారి వారి కర్తవ్యాలను వారికి తెలియ చేస్తుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతా యుతముగా వారి విధులను సక్రమంగా నిర్వర్తించేలా చేస్తుంది.
లోకమునందు ఈ మూడు దివ్య జ్ఞానములలో ఏ ఒక్కటి లోపించినా అది సాధారణ లోకముగా వుంటుంది. వాటి ధర్మాలు క్షీణిస్తే నరక లోకముగా మారుతుంది. మూడు దివ్య జ్ఞానములను ఆచరిస్తున్న లోకము దైవ లోకముగా విరాజిల్లుతుంది.
శ్రీ రాముడు: మహా మాయా! ఈ మూడు దివ్య జ్ఞానములను దయతో అనుగ్రహించు.
8. భూలోకము దైవలోకము కావడానికి శ్రీరాముడు చేయవలసిన కార్యములను దైవ శక్తి తెలియ చేయుట.
మహా శక్తి : శ్రీ రామా ఈ మహత్ కార్యానికి నీ సహకారం కూడా వుండాలి. ఈ అఖండ జ్ఞానం నీయందు నిఘూడముగా వుంది. నీవు కలిగి వున్న మహా జ్ఞానాన్ని తిరిగి జ్ఞప్తిలోకి తీసుకు రావడం వలన మూడు దివ్య జ్ఞానములు ప్రజలకు అనుగ్రహింపబడుతాయి. దానికి నీవు చేయవలసినదల్లా ఈ మహా జ్ఞానమును నిరంతరం విచారిస్తూ, ఒక తపస్సుగా నిరంతరం ఆయా విషయములను గూర్చి చింతిస్తూ వుండగా, నేను ఆయా విషయ జ్ఞానమును నీకు తెలియ చేస్తాను. నీ మనో వాంఛ, నీ మనో సంకల్పం, నీ మనో విచారణ ను అనుసరించే నేను శక్తి వంతముగా క్రియా శీలముగా పనిచేస్తాను.
మహా మాయ: శ్రీ రామా! ముందుగా నీకు అతీంద్రియ విషయజ్ఞానమునందు, ఈ సృష్టి రహస్యముల యందు నీకు ఎటువంటి సందేహములు వున్నాయో వెలుబుచ్చు. వాటిని తెలుసుకొనే క్రమంలో ఆయా జ్ఞానాన్ని గ్రహిస్తావు.
9. శ్రీరాముడు సృష్టిలోని రహస్యముల యొక్క సందేహములను వ్యక్తము చేయుట.
శ్రీరాముడు: మహా మాయ! ఈ సృష్టి రహస్యముల యందు చాలా సందేహాలే వున్నాయి. అలాగే ఆశ్చర్యముగానూ వున్నాయి. వాటిలో ముఖ్యమైనది ఈ వినాయకుడి శిల్పమును చూశావా ఎంత సుందరముగా వున్నదో! దీనిని మలిచినది చేయితిరిగిన శిల్పి అని ఎరుక కలిగి వున్నాను. చిరు నవ్వుతో ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్న సజీవ శిల్పముగా వున్న అందమైన మగువను ఏ మహా శిల్పి మలిచాడు అనే సందిగ్దములో వున్నాను. కానీ ఈ సజీవ శిల్పమును సృష్టించడానికి ఏదో అతీత శక్తి వుంది. అది ఏది? ఏవిధముగా కనుగొనాలి?
దైవము సృష్టించాడని లోకము అంటుంది. దైవము సృష్టించినచో ఈ మానవులలో ఈ వ్యత్యాసము ఎందుకు. ఒకడు బలవంతుడిగా మరొకడు బలహీనుడిగా, ఒకడు ధనవంతుడిగా, ఇంకొకడిని పేదవాడుగా సృష్టింపబడుతున్నాడు. దేవుడు అందరికీ సమన్యాయం చేయవచ్చుకదా. ఈ భేదాలు ఎందుకు?
మానవుడు వస్తువుకు, యంత్రానికి వివిధ ధర్మాలను కల్పించి తన అవసరాలకు వినియోగిస్తున్నాడు. మానవ దేహము సజీవముగా వుండటానికి అవసరమైన ఇంద్రియాలకు, అవయవములకు ఆయా ధర్మాలను ఎవరు కల్పించారు. ఒక రైతు చెరువులో వున్న నీటిని తన పొలములోకి తీసుకు రావడానికి యంత్ర ధర్మం కలిగి వున్న మోటార్ పంపును వుపయోగించి తన పొలములోని చెట్లకు నీరు పంపిణీ చేస్తున్నాడు. అదేవిధముగా మానవుని శరీరములో వున్న సజీవయంత్రము అయిన గుండె రక్తాన్ని పంపు చేసి శరీరములోని ధమనులద్వారా ఇంద్రియములు, అవయవాల, కణముల మొత్తానికి పంపిణీ చేస్తుంది. ఇంత శక్తి వంతముగా పనిచేస్తున్న గుండెకు ఎవరు ఆ ధర్మాన్ని కల్పించారు. మానవ మేధా శక్తి మోటార్ కు యంత్ర ధర్మాని కల్పించడమైనది. శరీయములో వున్న గుండె, ఊపిరితిత్తులు వంటి అసాధారణమైన సజీవ యంత్రాలను ఏ మేధాశక్తి సృష్టించింది?
మహా శక్తి: శ్రీరామా! సారవంతమైన సందేహాలు వ్యక్తపరిచావు వాటికి ఆ ధర్మాలను ఎవరు కల్పించారు? ఎందుకు కల్పించారు? అనునది తెలియపరుస్తాను శ్రద్ధగా ఆలకించు.
10. దైవీ శక్తి దైవ రహస్యాలను తెలియ చేయుట.
చెట్టు నుంచి ఫలమును పొందడమనే ప్రధానమైన లక్ష్యముతో మానవుడు మోటారు యంత్ర ధర్మమును నియమించి ఉపయోగిస్తున్న విధముగా జీవునికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను అలాగే సుఖ, దుఃఖముల విషయ జ్ఞానమును అనుభవానికి ఇవ్వడమే ప్రధాన లక్ష్యముగా ‘చిత్ శక్తి’ భౌతిక శక్తిని సృష్టిస్తుంది. సృస్టించబడిన ‘భౌతికశక్తి’ జీవునికి ఆయా విషయ జ్ఞానాన్ని ఇస్తుంది. భౌతిక శక్తి కన్ను, కరములు, ముక్కు, చర్మం మొదలైన ఇంద్రియముల ధర్మాలను కలిగి ఆయా విషయ జ్ఞానాన్ని ఇస్తుంది . ఇంద్రియముల పోషణ రక్షణ కోసం గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు మొదలైనవి కల్పించ బడింది.
దేహములో వున్న ఇంద్రియాలు, అవయవాలు జీవునికి విషయ జ్ఞానం తెలియ చేయడానికి సహకరించే సాధనములుగా వున్నాయి.
భౌతిక శక్తి కంటికి వస్తువును చూపించే పదార్థ ధర్మాన్ని కలిగి వుండటం వలన జీవుడు కన్ను ద్వారా వస్తువును చూడగలుగుతున్నాడు. అలాగే కంటిద్వారా ఆయా రూపముల యొక్క విషయ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు. ‘శక్తి’ చెవి యందు శబ్దాన్ని వినిపించే పదార్థ ధర్మం కలిగి వుండటం వలన జీవుడు దానితో శబ్ద జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు. చర్మము నందు సుఖదుఃఖములు తెలుసుకునే ధర్మాన్ని కలిగి వుండటం వల్ల జీవుడు స్పర్షజ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు. దేహములోని అన్ని ఇంద్రియముల అవయములను శక్తి కల్పించడానికి ప్రధాన కారణము జీవునికి ఆయా విషయ జ్ఞానము తెలియ చేయడమే.
శ్రీరాముడు: మహా దేవి! ’శక్తి’ జీవునికి విషయ జ్ఞానం ఎందుకు తెలియచేస్తుంది?
11. మనస్సుకు, శక్తికి వున్న అవినాభావ సంబంధం గురించి తెలియచేయుట.
మహా మాయ: శ్రీ రామా! మనస్సుకు, శక్తికి అవినాభావ సంబంధం వుంది. దాని కారణముగా జీవుడు ఎటువంటి విషయ భావన చేస్తున్నాడో ‘చిత్ శక్తి’ భౌతిక శక్తిచే అటువంటి విషయ జ్ఞానాన్ని అనుభవానికి ఇస్తుంది. ఎటువంటి విషయ వాంఛను కలిగి వున్నాడో ఆయా విషయ వాంఛలను నెరవేర్చే సాధనములను ‘శక్తి’ ప్రకృతి గుణములచే కల్పించి వాటిచే విషయ వాంఛను నెరవేరుస్తుంది. జీవుని మనో ఉద్దేశం శక్తికి దైవ నియమముగా సందేశము అందుతుంది. దానిని అనుసరించి శక్తి తదనుగుణమైన గుణాన్ని కలిగి వుంటుంది. జీవుని విషయ భావన వలన జీవుడు బలమును-బలహీనతను, ఆనందమును-బాధను, భ్రమను-విశ్వాసాన్ని పొందుతున్నాడు. విషయ వాంఛ వలన అయా వాంఛను నెరవేర్చే సాధనములుగా ఇంద్రియములను సృష్టిస్తుంది.
శ్రీరాముడు: మహా మాయ! జీవునికి విషయ జ్ఞానమును, విషయేంద్రియములను ఇస్తున్న ప్రకృతి జ్ఞానం గురించి ఇంకా క్షుణ్ణముగా తెలుసుకోవాలని వుంది.
మహా మాయ: శ్రీరామా! బాహ్యముగా విషయ జ్ఞానమును అనుభవానికి ఇస్తున్న ప్రకృతి గురించి తెలుసుకునే ముందు అంతర్ విషయముగా వున్న ‘ఆత్మ’ జ్ఞానం గురించి తెలుసుకోవాలి. ఒక్క ఆత్మ జ్ఞానం తెలుసుకోవడం వలన శతకోటి రూపాలలో వున్న ప్రకృతి జ్ఞానం బోధపడుతుంది.
12. ఆత్మ జ్ఞానం బోధించుట.
ఆత్మ ఒక చైతన్యము. అది వ్యక్తము కాదు. తన మనో జ్ఞానం భౌతిక శక్తి(ద్రవ్యరాశి)గా వున్న ప్రకృతి రూపములో వ్యక్తమవుతుంది. విశ్వము నందు విషయ జ్ఞానముగా, పదార్థ రూపంలో వ్యక్తమవుతున్న ప్రకృతి ఆత్మ మనో జ్ఞానములకు అనుగుణంగా వ్యక్తమవుతుంది.
ఆత్మ చైతన్యము నందు విషయ భావన చేసే మనస్సు. మనో భావనకు ప్రతిస్పందిస్తున్న ‘శక్తి’ రెండు తత్త్వాలు ఆత్మ జ్ఞానముగా వున్నాయి. మనో భావనకు చిత్ శక్తి ప్రభావితమవుతూ మనస్సు ఎటువంటి విషయ భావన చేస్తుందో, అటువంటి విషయానుభవాన్ని ఇవ్వడానికి భౌతిక శక్తిని సృష్టిస్తుంది. భౌతిక శక్తి విషయ జ్ఞానాన్ని ఇవ్వడానికి వివిధ ద్రవ్యరాశి ధర్మాలను కలిగి ప్రకృతి గుణముగా విషయ జ్ఞానమును మనస్సుకు అనుభవానికి ఇస్తుంది. ప్రకృతి మనస్సు యొక్క ప్రతి బింబముగా వుంటుంది.
ప్రకృతి లో వున్న అన్ని పదార్థ నియమాలు మనస్సు యొక్క నియమాన్ని అనుసరించి వుంటాయి.
చిత్ శక్తి విషయ జ్ఞానాన్ని కల్పించేది. భౌతిక శక్తి(ద్రవ్యరాశి) విషయ జ్ఞానముగా వుంటున్నది. చిత్ శక్తి ఆంతరంగిక జ్ఞానము. భౌతిక శక్తి బాహిర జ్ఞానము.
ఆత్మ చైతన్యము నందు భావన చేసే జీవుడు జీవి, దేహి, దృక్, విషయి అనే పేర్లతో పిలువబడుతున్నాడు. మనో భావనకు ప్రభావితమవుతూ విషయ జ్ఞానమును సృష్టిస్తున్న శక్తిని చిత్ శక్తి, మహా శక్తి, క్రియా శక్తి అనియు, విషయ జ్ఞానమును అనుభవానికి ఇస్తున్న భౌతిక శక్తిని ప్రకృతి, పదార్థము, ద్రవ్యరాశి, విషయము, ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, దేహము, దృశ్యము అని సందర్బానుసారముగా పిలవబడుతుంది.
చిత్ శక్తి అనునది జీవుని సంకల్పాలను, కోరికలను నెరవేర్చే అతీత శక్తిగా వుంది. ఇక్కడ ప్రధానముగా తెలుసుకోవలసిన నిగూఢ రహస్యం ఒకటి వుంది. మనస్సు భావన చేసేది జీవుడు గ్రహించగలడు. కానీ భావనను అనుసరించి చిత్ శక్తి అతీత శక్తిగా పనిచేస్తున్న విషయం జీవునికి గోచరించదు. దీని కారణముగా చిత్ శక్తి చేస్తున్న కార్యములను జీవుడు గ్రహించలేకున్నాడు. చిత్ శక్తి కంటికి కనిపించేది కాదు.
శ్రీ రాముడు: మహా శక్తి! మనో భావనకు, మనో సంకల్పానికి ‘శక్తి’ సహకరిస్తున్నప్పుడు, మనస్సు ఎంతో ఇష్టముగా కోరికునే కొన్ని కోరికలు ఎందుకు తీర్చడం లేదు?
మహా శక్తి: శ్రీరామా! జీవుని మనో బలం, మనో విశ్వాసమునకు అనుగుణంగా శక్తి పనిచేస్తుంది. జీవుని మనో బలం, మనో విశ్వాసం ఎంత బలముగా వుంటే అంత శక్తి వంతముగా పనిచేస్తుంది.
శ్రీ రాముడు: మహా మాయ! జీవుడు మనో బలాన్ని, మనో విశ్వాసాన్ని ఎలా పొందుతున్నాడు?
13. జీవుడు మనో బలాన్ని, మనో విశ్వాసాన్ని పొందుతున్న క్రమము.
మహా శక్తి: ఒక విషయముపై జీవుడు చేసే సుదీర్ఘ కాల విషయ విచారణ వలన మనస్సు ఆయా విషయ విచారణా బలాన్ని, మనో బలాన్ని పొందుతుంది.
జీవుడి మనో ఉద్దేశ్యము, మనో సంకల్పము యొక్క నియమమే శాసనముగా చిత్ శక్తి భౌతిక శక్తికి పదార్థ(ద్రవ్యరాశి) ధర్మాన్ని కల్పిస్తుంది.
శ్రీ రామా! మనస్సుకు శక్తికి వున్న అవినాభావ సంబంధము వలన శక్తి ఎలా పనిచేస్తుంది? జీవుడు మనో బలమును ఎలా పొందుతున్నాడో మొదటగా దేహము నందు వివరిస్తాను, తర్వాత లౌకిక కోరికల గురించి వివరిస్తాను తెలుసుకొనుము.
జీవుడు విచారణ చేస్తున్న విషయాన్ని మనస్సు అనుకూలము, ప్రతికూలము అనే భేదము లేకుండా ఆయా బలాలను పొందుతుంది. సుదీర్ఘ కాలం అనుకూల భావన చేస్తే మనస్సుకు అనుకూల బలం పెరుగుతుంది. ప్రతి కూల విచారణ చేస్తే ప్రతికూల బలం వృద్ధిచెందుతుంది.
జీవుని మనస్సు ఏ విషయ భావన చేస్తే శక్తి ఆ విషయముపై క్రియను కలిగి వుంటుంది. ఏ దృక్ఫథంతో వుంటే శక్తి ఆ దృక్ఫథాన్ని అనుసరించి పనిచేస్తుంది. జీవుడు ప్రశాంతమనస్సుతో సంతోషానికి సంబంధించిన అనుకూల విచారణ చేయడం వలన ‘శక్తి’ విషయము నందే క్రియను కలిగి అనుకూల శక్తిగా వుంటుంది. విచారణా బలాన్ని అనుసరించి ‘శక్తి’ తదనుగుణమైన విషయ జ్ఞానమును శరీరములో వ్యక్తముచేస్తుంది. జీవుడు సంతోషకర విషయభావన వలన శరీరము నందు తేజస్సును, ఆరోగ్యమును, ఉత్సాహమును, ఆనందమును కలిగి వుంటాడు. దుఃఖ సంబంధమైన ప్రతికూల విషయ భావన చేయడం వలన ‘శక్తి’ ప్రతికూల బలముగా నిరుత్సాహముగా, నిస్తేజముగా, నీరసముగా శరీరము నందు వ్యక్తమవుతుంది. జీవుడు భావన చేస్తున్న విషయ విచారణా బలమును శక్తి జీవుని ముఖములో దేహములో వ్యక్తము చేస్తుంది. జీవుడు ఆగ్రహముతో, ఉగ్ర భావనతో వుండటం వలన శక్తి ఉగ్ర రూపంలోకి మారుతుంది. కళ్ళు ఎరుపు రంగు లోకి మారి శరీరం తదనుగుణమైన వికారాలను వ్యక్తపరుస్తుంది.
మనిషి ఆహారం వండటానికి తనకు వున్న రెండు చేతులు రెండు పనులను చేస్తున్నప్పుడు, కుడి చేతితో పోయిలోకి కట్టెలు, ఎడమ చేతితో అగ్గిపెడుతునట్లయితే. జరుగుతున్న ఈ చర్యలకు చేతులను కర్తలను చేయకుండా వ్యక్తిని కర్తగా చేసి కుడిచేత్తో కట్టెలు పెడుతున్నాడు, ఎడమ చేత్తో నిప్పు పెడుతున్నాడు అని వివరించే విధముగా. మనస్సు మరియు శక్తి చేసే పనులకు జీవుడు కర్తగా వున్నాడు. జీవుడు మనస్సుతో విషయ భావన చేస్తున్నాడు. శక్తి దానికవసరమైన క్రియను చేస్తూ ఆయా ఫలితాన్ని అనుభవానికి ఇస్తుంది. మనస్సు, శక్తి జీవునికి జ్ఞాన శక్తులుగా వున్నాయి. వీటికి అధిష్ఠానముగా వున్న ఆత్మ అన్ని చర్యలకు సాక్షిగా వుంటుంది.
జీవుడి ఆంతరంగిక జ్ఞానాన్ని శక్తి ప్రకృతి గుణములచే జీవుని అనుభవానికి ఇస్తూ అతని మనస్సు ఏ స్థితిలో వుందో వ్యక్తపరుస్తుంది.
దేహము నందు శక్తిగా వ్యక్తమవుతున్న తేజస్సు, ఉత్సాహము, నిరుత్సాహము, కోపము, ఆనందము, దుఃఖము, మొదలైన శరీర వికారములు ఉత్పన్నమవడానికి మనస్సే కారణమై వున్నది. జీవుడు చేస్తున్న భావ జ్ఞానమే శక్తి శరీర జ్ఞానములో వ్యక్తమవుతుంది.
కారణములో ఏముందో కార్యములో అదే కనిపిస్తుంది.
14. జీవుడు విషయ భావన చేయడం తో కర్మ ప్రారంభమవుతుంది.
శ్రీరామా! జీవుడు విషయములను విచారణ చేయడమే కర్మ. జీవుడు చేసే కర్మ వలననే కర్మ ఫలముగా విషయ జ్ఞానం అనుభవానికి వస్తుంది.
విషయములను భావన చేస్తున్న జీవుడు మూడు దశలలో విషయ జ్ఞానమును కర్మ ఫలముగా పొందుతున్నాడు. విషయ భావన చేయడం ప్రారంభ దశ. ప్రారంభ దశలో భావన చేస్తున్న విషయము అనుభవానికి రాదు. 2. అదే విషయమును పదే పదే మననం చేయడం వలన చిత్ శక్తి ఆయా క్రియను చేస్తూ విచారణా బలం వృద్ధిచేస్తుంది. విషయ విచారణ బలం వలన విషయ మనో బలం బలపడుతుంది. 3. బలపడిన విషయ మనో బలాన్ని అనుసరించి చిత్ శక్తి భౌతిక శక్తిచే కర్మ ఫలముగా విషయ జ్ఞానాన్ని అనుభవానికి ఇస్తుంది.
భూతకాలములోని విషయ భావన, విషయ విచారణా బలాన్ని అనుసరించి వర్తమానములో ప్రతిఫలముగా విషయ జ్ఞానం అనుభవానికి వస్తుంది. వర్తమానములోని విషయ భావన, విషయ విచారణా బలాన్ని అనుసరించి భవిష్యత్తులో విషయ జ్ఞానముగా అనుభవానికి వస్తుంది.
మనస్సు ఏ విషయ భావన చేస్తుందో, భౌతిక శక్తి నీవు భావన చేసేది ఇది అని మనస్సుకు స్ఫురింపచేస్తుంది. స్ఫురింప చేస్తున్నదే దేహతత్త్వములో వ్యక్తమవుతుంది. మారుతున్నది జీవుడి యొక్క మనస్తత్వం మాత్రమే. కానీ జీవుడు మారడు.
తన మనస్సు నుంచి మొదలైన భావనకు తదనంతరం జరుగుతున్న రెండు క్రియలకు ఆత్మ సాక్షిగా వు౦టుంది. దీపము నందు ఉష్ణము, కాంతి అనే రెండు క్రియలు ఉన్నట్లే ఆత్మ యందు భావన చేసే జీవుడు జీవముగా. ప్రతి స్పందిస్తున్న శక్తి ప్రకృతిగా వివిధ క్రియలు కలిగి వున్నాయి . జీవుడు కనిపించడు అతని మనో జ్ఞానం ప్రతి బింబముగా దేహ రూపములో కనిపిస్తుంది.
15. జీవుని మనో భ్రాంతి, మనో విశ్వాసమునకు అనుగుణంగా వుంటున్న శక్తి.
జీవుడు ఏ ఏ విషయముల నందు ఎటువంటి మనో భ్రాంతి లేదా మనో విశ్వాసమును కలిగి వున్నాడో శక్తి ఆయా విషయ ధర్మములలో వుంటూ విషయ జ్ఞానమును అనుభవానికి ఇస్తుంది.
జీవుడు తాను కలిగి వున్న ఉద్దేశ్యము, మనో భ్రాంతి, మనో విశ్వాసాన్ని అనుసరించి భౌతికశక్తి తదనుగుణమైన రూపము, బలము, జ్ఞానమును కలిగి వుంటుంది.
జీవుడు ఏదైనా ఒక విషయమును గూర్చి ఆలోచన చేస్తున్నప్పుడు దానిపై ఒక దృక్పథాన్ని ఏర్పరచుకుంటాడు. అనుకూల ఉద్దేశ్యాన్ని కలిగినప్పుడు మనో విశ్వాసాన్ని పొందుతున్నాడు. ప్రతికూల ఉద్దేశ్యాన్ని కలిగి వున్నప్పుడు మనో భ్రాంతిని పొందుతున్నాడు.
మనస్సు ఏది వుంది అని భావిస్తు౦దో, ఎలా వుందని విశ్వసిస్తు౦దో, భ్రమ పడుతుందో పర్యవసానముగా ‘శక్తి’ జీవుడికి ఆయా అవస్థలను ప్రకృతి గుణములచే అనుభవానికి ఇస్తుంది.
జీవుడు మనోవిశ్వాసం వలన ధైర్యమును, ఉత్సాహమును. మనోభ్రాంతి వలన భయము, ఆందోళనను పర్యవసానముగా పొందుతున్నాడు.
చెట్ల పొదల్లో నుంచి వస్తున్న శబ్దానికి అక్కడ ఏదో వుంది అనే ప్రతికూల ఉద్దేశ్యముతో భ్రమపడి ఆందోళన చెందే వ్యక్తికి, తన శక్తి ఆందోళన వ్యక్తపరిచే దేహ ధర్మాన్ని కలిగి చెమటలు పట్టడం, కంపించడం, గుండె వేగముగా స్పందించడం వంటి క్రియలకు కారణమవుతుంది. అదేవిధముగా సానుకూల దృక్పథము, స్థిరత్వము, కుతూహలము గల వ్యక్తి అదే శబ్దానికి అక్కడ వున్న దాన్ని చూడాలి అనే కుతూహలముతో, మనో విశ్వాసముతో వుండటం వలన ఉత్తేజముగా, నిర్భయముగా, ఆనందముగా వుంటాడు. తన శక్తి శరీరము నందు అదే జ్ఞానముతో వ్యక్తమవుతుంది. మనస్సు భ్రమతో భయమును కలిగివుంటే ప్రకృతి భయమును వ్యక్త పరిచే పదార్థ గుణాన్ని కలిగి వుంటుంది. మనస్సు విశ్వాసంతో ధైర్యము కలిగివుంటే శక్తి ధైర్యమును అనుభవానికి తెచ్చే ప్రకృతి ధర్మం కలిగివుంటుంది. జీవుని ఉద్దేశ్యమును అనుసరించి శక్తి తదనుగుణమైన ప్రవృత్తి చే వివిధ గుణాలను కలిగి వుంటుంది. జీవుడి యొక్క మనోభ్రాంతి, మనో విశ్వాసము భౌతికముగా శరీరములో ప్రతి ఫలిస్తాయి.
జీవుడు ఎటువంటి అంతరంగిక భావా జ్ఞానము కలిగి వుంటే ప్రకృతి అటువంటి భౌతిక స్వభావ జ్ఞానముగా పదార్థ ధర్మాన్ని కలిగి వుంటుంది.
బాధను కలిగించే విషయములు మననం చేయరాదు, ఏదో జరుగుతుంది అని జరగని సంఘటనలు వూహించుకోవద్దు, ఒకరిపై ద్వేషభావనతో వూగిపోతూ చింతించకూడదు, ఇటువంటి వాటి వలన మనస్సు బలహీన పడుతుంది. మనస్సు బలహీన పదడుతుంది అంటే తన శక్తి కూడా బలహీన స్థితిలో వుంటుంది అని గ్రహించాలి.
16. దృక్(జీవుడు) యొక్క దృక్పథం పై దృశ్యం (పదార్థం, శరీరం) ఆధారపడి వుంటుంది.
శ్రీ రామా! జీవుడు తన దేహములో పొందే తేజస్సు, ఆనందము, భయము, నిర్భయము, ఆందోళన, ధైర్యము, ఉత్సాహము మొదలైన వాటికి మనో ఉద్దేశము కారణం. అదే విధముగా జీవులు వాటి శరీరం యొక్క రూపం, బలం కల్గి వుండటానికి కారణం అవి ఎన్నో జన్మల నుంచి తమదేహ బలమును రూపమును భావన చేస్తున్నాయి. దేహముపై వాటి భావనా బలాన్ని, మనో ఉద్దేశాన్ని అనుసరించి జీవులు వాటి వాటి శరీర రూపము, బలము కలిగి వున్నాయి.
జీవులు అనేక జన్మల నుంచి సుదీర్ఘ కాలముగా వాటికి తెలియకుండానే అంతర్గత ఉద్దేశ్యముతో దేహ రూపమును, బలమును భావన చేస్తున్నాయి. తదనుగుణంగా జీవులు అటువంటి శరీర రూపము, బలము పొందుతున్నాయి. సర్వ జీవులు వాటి వాటి మనోరూపము, మనోబలముతో కనిపిస్తున్నాయి.
జీవుడు కలిగివున్న ఉద్దేశ్యాన్ని, దాని భావనా బలాన్ని అనుసరించి శక్తి ఆయా క్రియలను స్ఫురింపచేస్తుంది. మనస్సు, శక్తి వేరు వేరు మార్గాలలో వుండవు. మనస్సు ఎక్కడుంటే శక్తి అక్కడే వుంటుంది. మనస్సును ఏ విషయము పై వుంచితే శక్తి ఆ విషయముపై వుంటుంది, ఏ దృక్పథం తో వుంచితే శక్తి అదే దృక్పథం తో క్రియను కలిగి వుంటుంది. మనస్సు ఎంత బలముతో వుంటే శక్తి అంతే బలముతో పని చేస్తుంది. జీవులు విషయము పై ధ్యాసను తక్కువ సమయం వుంచితే ధ్యానం అని, సుదీర్ఘ కాలం తదేక మైన తీక్షణతను కలిగి వుంటే తపస్సు అని అంటారు. మనస్సు ఏ విషయ భావనతో ధ్యానం, తపస్సు చేస్తుందో ఆ విషయముపై మనోదృక్పథం బలపడి విశ్వసింపబడుతుంది. తదనుగుణంగా శక్తి ఆయా విషయజ్ఞానముగా ప్రకృతి ధర్మాన్ని కలిగి వుంటుంది.
జీవులు విశ్వసించిన దేహ బలం తోనూ, దేహ రూపంతోనూ ప్రస్తుతం శరీర జ్ఞానాన్ని కలిగి వున్నాయి. బలమైన శరీర భావన బలపడి మనో విశ్వాసం కలిగి వున్న జీవులు బలమైన శరీర జ్ఞాన౦ తో కనిపిస్తున్నాయి. బలహీన శరీర భావన బలపడి మనోభ్రాంతిని కలిగి వున్న జీవులు బలహీన శరీర జ్ఞానంతో కనిపిస్తున్నాయి. ప్రపంచములో కనిపిస్తున్న సర్వ జీవులు వాటి మనో జ్ఞానముతో, మనో బలముతో, మనో రూపముతో కనిపిస్తున్నాయి.
సింహం, ఏనుగు, కోతి, కుందేలు, మానవుడు (బలవంతుడు, బలహీనుడు, తెలివైన వాడు, బుద్ధి హీనుడు) మొదలైనవారు వారి మనో భావనతో, మనో ఉద్దేశ్యముతో, మనో బలముతో, మనో రూపముతో కనిపిస్తున్నారు. శక్తి వాటి మనో ఉద్దేశ్యమునకు అనుగుణమైన జ్ఞానాన్ని, బలాన్ని, రూపాన్ని కలిగి శరీర రూపంలో వ్యక్తమవుతుంది.
సింహం యొక్క మనో జ్ఞానము శరీర జ్ఞానముగా దాని అనుభవానికి వస్తుంది. ఇతరులకు తన జ్ఞానాన్ని వ్యక్తపరుస్తుంది. కుందేలు మనో జ్ఞానం శరీర జ్ఞానముగా దాని అనుభవానికి వస్తుంది. తన జ్ఞానం లోకానికి వ్యక్త పరుస్తుంది.
లోకములో వున్న కోటాను కోట్లుగా వివిధ రూపాలను కలిగి వున్న జీవరాశులు వాటి మనో వికారాలతో, మనో జ్ఞానముతో కనిపిస్తున్నాయి.
మనస్సులో భావన దృఢపడినప్పుడు, అది అనుభవముగా సిద్ధిస్తుంది.
జీవుల మనస్సులో ఏ రంగూ, రూపం, బలం దృఢమై వున్నాయో, వాటి శరీరములో అదే రంగు, రూపం, బలం వ్యక్తమవుతున్నాయి.
గోడ మీద బొమ్మ వేయక మునుపు చిత్రకారుడు మనస్సులో బొమ్మను చిత్రించుకున్నట్లు. జీవుడే చిత్ర కారుడై తాను చిత్రించుకున్న మనో రూప చిత్రములనే శరీరములో వ్యక్తపరున్నాడు.
భౌతిక శక్తిగా కనిపిస్తున్న పదార్థము సత్యము కాదు. జీవుని మనో భ్రాంతి మేరకు చిత్ శక్తి భౌతిక శక్తిచే పదార్థ భ్రాంతిని కల్పిస్తుంది. కనిపించని జీవుడు సత్యం. జీవుని ఉనికిని భౌతిక పదార్థము తెలియ చేస్తుంది.
పీచుమిటాయి అమ్మేవాడు దాన్ని చిన్న పిల్లవాడు ఏ ఆకారములో అడిగితే వాడి సంతోషం కోసం ఆయా ఆకారములతో ఇస్తాడు. ఆ పిల్ల వాడు ఇది చిలుకా ,ఇది పులి అని ఆయా ఆకారాలలో దాన్ని చూసి సంతోష పడుతుంటాడు. కానీ ఆ పీచుమిటాయి ఇచ్చే వాడికి సర్వం తెలుసు కనుక భేదం వుండదు. మనస్సు కోరిక మేరకే ఆత్మ శక్తి ఆయా భ్రాంతిని కల్పిస్తుంది.
జీవుడు సుదీర్ఘ కాలము భావన చేసే క్రమంలో తన బలము, రూపముపై ఒక నిశ్చయానికి వస్తాడు. తన మనో నిశ్చయమునకు అనుగుణంగా శక్తి శరీర జ్ఞానముగా వుంటుంది. జీవుడు తన శరీర భావన చేసే క్రమములో భావన బలపడుతుంది. బలపడిన మనోబలమునకు, రూపమునకు అనుగుణంగా శక్తి శరీర బలాన్ని, శరీర రూపాన్ని కలిగి వుంటుంది .
జీవుడు సుదీర్ఘ కాలము అనుకూల భావన మననం చేసే క్రమములో అనుకూలత మనసులో బలపడి తదనుగుణమైన దేహ బలము, జ్ఞానము అనుభవానికి వస్తుంది. జీవుడు సుదీర్ఘ కాలము ప్రతికూల భావన మననం చేసే క్రమములో ప్రతికూలత మనస్సులో బలపడి శక్తి పదార్థ జ్ఞానముచే జీవుడికి బలహీనతను, అజ్ఞానమును అనుభవానికి ఇస్తుంది. ప్రతికూలతను విశ్వసించిన జ్ఞానమును భ్రమ అనియు అనుకూలతను విశ్వసించిన జ్ఞానమును విశ్వాసము అనియు గ్రహించాలి.
జీవుడు తాను బలవంతుడను అనే మనో ఉద్దేశ్యాన్ని కలిగి వుండటం వలన శక్తి తదనుగుణమైన క్రియను కలిగి బలమైన శరీర జ్ఞానముగా, బలమైన మానసిక జ్ఞానముగా వుంటుంది. జీవుడు ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ధైర్యాన్ని, తేజస్సును కలిగివుంటాడు, తాను ఎంత విశ్వాసాన్ని కలిగివుంటే శక్తి అంతే ధర్మముతో అతని ప్రవర్తనలోను, చర్యలలోనూ, వ్యక్తిత్వం లోనూ, వాక్కు లోనూ, ప్రతిభ లోను వ్యక్తమవుతుంది. తన బలమైన భావన యే బలమైన శరీరంగా తన అనుభవంలోకి వస్తుంది.
జీవుడు దోషభూయిష్టమైన ఆత్మ స్తుతి వలన భ్రమను. శ్రేష్ఠమైన ఆత్మ స్తుతి వలన విశ్వాస జ్ఞానమును కలిగి వుంటాడు.
జీవుడి మనోజ్ఞానం అంతరంగికమైనది. దాన్ని ప్రతిబింబించే శరీర జ్ఞానం భౌతిక మైనది.
జీవుడు నేను బలహీనుడను అనే మనో భ్రమచే బలహీనమైన మనోనిశ్చయం ఏర్పడుతుంది. జీవుడు భ్రమను కలిగి వుంటే తన శక్తి కాలానుగుణంగా బలహీనమైన శరీరజ్ఞానాన్ని, బలహీనమైన మానసిక జ్ఞానాన్ని కలిగి వుంటుంది. అప్పుడు జీవుడు నిరుత్సాహంతోనూ, బాధాతప్త హృదయంతోనూ, భయాన్ని కలిగివుంటాడు, తన అజ్ఞాన౦ తన వ్యక్తిత్వం లోనూ, ప్రవర్తన లోనూ వ్యక్తమవుతుంది. బలహీనభావమే బలహీన విషయ జ్ఞానముగా అనుభవంలోకి వస్తుంది, వ్యక్తి బలహీన భావనను సుదీర్ఘకాలం భావన చేయడం వలన శక్తి తదనుగుణమైన క్రియనే చేస్తూ బలహీన శరీరజ్ఞానముగా వుంటుంది.
జీవుడు బలహీనమైన వాడు కాదు. శక్తి బలహీనమైనది కాదు మనస్థితిని బలహీనముగా వుండటం వలననే దేహ జ్ఞానం బలహీనముగా మారుతుంది.
భ్రమను కూడా ప్రతికూల విశ్వాసముగా. విశ్వాసమును అనుకూల భ్రమగా గ్రహించాలి. శబ్దం మరియు భావ౦ జీవుడిని ప్రభావితం చేస్తున్నందువలన, బలపడిన ప్రతికూలతను భ్రమ అనియు, బలపడిన అనుకూలతను విశ్వాసమనియు భావించడం మంచిది.
బలహీన భావనను మననం చేయకూడదు, ఒకవేళ అది స్ఫురణకు వచ్చినా దానిని విరమించు కొని మంచి భావనలు కలిగి వుండాలి.
శ్రీరాముడు: మహా శక్తి! చిన్న జీవి నేను పెద్ద జీవిని అని భావన చేస్తే పెద్ద జీవిగా మారుతుందా? బలహీనుడు నేను బవంతుడను అని భావన చేస్తే బలవంతుడుగా మారుతాడా?ఈ విషయముపై మరింత స్పస్టత ఇవ్వవలసినదిగా విన్నవించుకుంటున్నాను.
మహా శక్తి: జీవుడు భావన చేస్తున్న విషయం మనస్సులో ధ్రుడపడినప్పుడే అది వ్యక్తమవుతుంది. మనస్సు ‘నేను ఇది’ అని దృఢంగా విశ్వసించే జ్ఞానము మాత్రమే అనుభవానికి వస్తుంది. ప్రతి జీవి, ప్రతి మానవుడు తాను కలిగివున్న విశ్వాసంతో, బలపడిన అభిప్రాయంతో కనిపిస్తున్నారు.
బలహీన శరీరాన్ని కలిగి వున్న వ్యక్తి నేను బలవంతుడను అని అనుకున్నంత మాత్రమున బలవంతుడు కాడు. తన ప్రవర్తనలో మార్పుతెచ్చుకొని, బలమైన చర్యలు, కార్యాలు చేస్తూ వుంటే, బలవంతుడననే మనో నిశ్చయానికి వస్తాడు. తన మనో నిశ్చయానికి అనుగుణంగా తన శక్తి బలమైన శరీరాన్ని, మానసిక బలాన్ని ఇస్తుంది.
బలమైన వ్యక్తి బలహీన భావన కొద్ది కాలం పాటు వున్నంతమాత్రాన తన శక్తి బలహీన పడి బలహీనంగా మారదు, సుదీర్ఘ కాలం బలహీన భావనను కలిగి వుండి, బలహీన ప్రవర్తన కలిగి వుంటూ, బలహీనమైన చర్యలు చేస్తూ వుంటే తన మనస్సు బలహీనుడననే మనో నిశ్చయానికి వస్తుంది. కనుక జీవుడు తాను కలిగి వున్న మనో నిశ్చయ జ్ఞానముతోనే కనిపిస్తాడు.
భ్రమ వలన క్రుంగి పోరాదు. విశ్వాసమును కలిగి వుండాలి. డాంబికంగా వుండ కూడదు. విశ్వాసం కూడా భ్రమయే అని భావించాలి. లోకాన్ని ఎరిగిన చిదానందస్వరూపునిగా వెలుగొందాలి.
శరీరములో విశ్వాసాన్ని ప్రదర్శించాలి అని తాపత్రయ పడకూడదు. ఆత్మ జ్ఞానం తెలుసుకున్నందు వలన నీ శక్తి తదనుగుణంగా మలుచుకుంటుంది.
మనస్సు పొంగిపోతూ వుంటే శక్తి పొంగుతూ వుంటుంది, ఉద్రేకముగా వుంటే ఉద్రేకములో వుంటుంది. మనస్సు శక్తిని కదిలిస్తుంది. మనస్సు ఎంత ప్రశాంతముగా వుంటే శక్తి అంత శాంత స్వభావములో వుంటుంది.
ప్రతికూల ఆలోచనలు వస్తున్నాయని ఆందోళన చెందవలసిన పని లేదు. కొన్ని లక్షల ప్రతికూల ఆలోచనలు వచ్చినా ఆత్మ జ్ఞానము తెలిసి వున్న వారిని అవి ప్రభావితం చేయలేవు.
మనస్సు ప్రతి చిన్న విషయానికి చలించకుండా, ఆందోళన పడకుండా, ప్రశాంతముగా వుండటానికి ప్రతి రోజు కొంత సమయము ఆత్మానుభవములో వుండాలి. ఆత్మ అనుభవములోకి రావాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చోవాలి. అప్పుడు శరీరం రిలాక్స్ అవుతుంది. అలాగే శరీరంలోని ప్రతి అవయవం రిలాక్స్ చేయాలి. అరికాళ్లు, మోకాళ్ళు, తొడలు, పొత్తి కడుపు, కడుపు, హృదయ స్థానం, భుజాలు, అరిచేతులు, మెడలు, నేత్రాలు, ముఖము, నుదురు, చెవులు తల ఇవన్నీ గమనిస్తూ రిలాక్స్ గా వుండేలా చూడాలి. నిదానముగా రెండూ మూడు పర్యాయాలు చేయడము వలన మనస్సులో ప్రశాంతత ఆవహిస్తుంది. పరమ ప్రశాంతతతో వున్న స్థితిని అనుభవిస్తూ కొంత సమయానికి ఆలోచనలను శూన్యం చేయాలి. ఆలోచనలు శూన్యం చేయడం అంటే ఆలోచనలను నియంత్రించడం కాదు. ఆలోచనలు లేకుండా తటస్థం(neutral)గా, స్వేచ్ఛగా వుండటం. ఆలోచనలు నియంత్రిస్తున్నావు అంటే అక్కడ మనస్సు పనిచేస్తుంది అని అర్థం. మనస్సు ఆలోచనలను చూడకుండా తటస్థం గా వుండటం వలన నిశ్చలమైన, పరమ ప్రశాంతమైన ఆత్మ స్థితి అనుభవానికి వస్తుంది. ఆ స్థితి పరమ శాంతిని, పరమానందమును ఇస్తుంది. ఆత్మ స్థితిలో ప్రతిరోజూ కొంత సమయం కేటాయించడం వలన ఆత్మ అనుభవానికి వస్తుంది. శరీరం నేను కాదు ‘ఆత్మనే నేను’ అనే సత్యం అనుభవానికి వస్తుంది. ఈ సాధన విరామ సమయంలో అనేక పర్యాయములు చేసే క్రమంలో మనస్సు ప్రతి చిన్న విషయానికి చలించకుండా ఉత్తమ స్థితిలో వుంటుంది.
ఆత్మానుభవం లో వుండటానికి మరో మార్గం. శ్వాసమీద ద్యాశ. శ్వాస తీసుకోవడం అలాగే వదలడం శరీర సహజ లక్షణం. శరీరములో జరుగుతున్న ఉచ్వాస, నిచ్వాసలను గమనిస్తూ వుండాలి. అలా చేసే క్రమంలో మనస్సు ప్రశాంతముగా మారుతుంది. ఆ ప్రశాంతస్థితి ఆత్మానందములోకి తీసుకువెళుతుంది.
శ్రీ రాముడు: ఒకడు సరిగా నడవలేక పోతుంటాడు, ఒకడు అనారోగ్యముతో సరిగా కూర్చోలేడు, నడవలేడు, ఒకడు మతి స్థిమితం లేక పిచ్చివాడిలా తిరుగుతుంటాడు. ఒకడు చేయికూడా కదపలేని స్థితిలో వుంటాడు. వారందరూ వారి వారి మానసిక స్థితిలో కనిపిస్తున్నారా?
మహా శక్తి : శ్రీ రామా! . తన పూర్వ సంకల్పాలకు అనుగుణంగా ప్రాప్తముగా శరీరాన్ని పొందిన జీవుడు దాన్ని ప్రమాదానికి గురి చేశాడు లేదా ప్రమాదానికి గురయాడు అనే గ్రహించాలి. ఆ స్థితి మానసిక స్థితి కాదు, అతడు పొందిన సజీవ వాహనం ప్రమాదవశాత్తు దెబ్బతిన్నది అని గ్రహించాలి
17. జీవుడు భూతకాల కర్మ ప్రభావమునకు వర్తమానములో కర్మఫలమును జడముగా అనుభవిస్తున్నాడు.
శ్రీరామా! భూతకాలములో జీవుడు చేసిన 10 క్షణముల ప్రతికూల మనో భావనకు వర్తమానములో శరీరము నందు దుఃఖం పొంది ఆ స్థితికి ఆధీనుడై దుఃఖాన్ని జడముగా అనుభవిస్తున్నాడు. వర్తమానములో శాంత స్వభావం, అనుకూల ఆలోచనలు కలిగి వుండటం వలన భవిష్యత్తులో అనగా 10 క్షణముల తర్వాత శరీరము నందు తదనుగుణమైన ఆనందానికి, ఉత్సాహానికి జీవుడు ఆధీనుడై వాటిని జడముగా అనుభవిస్తాడు. వర్తమానమును తాను మార్చలేడు. భవిష్యత్తును మార్చే శక్తి తనకు వుంది. ఇదే నియమము జీవుల శరీర గుణములకు కూడా వర్తిస్తుంది.
జీవులు భూతకాలంలో అనేక జన్మల నుంచి పొందిన దేహ బలమునకు, దేహ రూపమునకు అనుగుణంగా వర్తమానకాలములో భావనా జ్ఞానముగా ఆయా దేహ గుణములను కలిగి వున్నాయి. గుణాధీనమైన జీవులు జడముగా ఈ స్థితియే నేను అని ఆయా స్థితిని అనుభవిస్తున్నాయి. జీవులు వర్తమానమును జడముగా అనుభవించవలసివచ్చినా, భవిష్యత్తును మార్చుకునే శక్తి జీవులకున్నది. దాని కారణముగా వాటి మనో జ్ఞానం,వాటి చర్యలు మారటం వలన చిన్న జీవులు సైతం బలమైన జీవులు గా వేరు వేరు రుపాలలో మార్పుచెందుతున్నాయి.
జీవుడు అనుభవించే స్వర్గ, నరకాలు కూడా జడములుగా అనుభవిస్తున్నాడు. భూత కాలములో చేసిన దుష్కర్మలకు జీవుడు వర్తమానములో కర్మఫలముగా దుఃఖమును, నరకములను భూలోకమునందే జడముగా అనుభవిస్తున్నాడు. వర్తమానములో చేసే సత్కర్మలకు భవిష్యత్తులో సుఖ, సంతోషములను ఫలాలుగా పొందే శక్తి సామార్ద్యాలు వున్నాయి.
18. దృశ్య ప్రభావానికి జీవుని మనో దృక్పథం మార్పుచెందుట.
మహా శక్తి: శ్రీరామా! జగత్ లో వున్న దృశ్యము కూడా ద్రష్ట యొక్క మనో జ్ఞానాన్ని మారుస్తుంది. మనో జ్ఞానం అనుసరించి తన శరీర జ్ఞానం మారుతున్నది.
జగత్తు నందు వున్న విషయములను చూస్తున్న జీవుని మనస్సు ప్రభావితమవుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణము, చల్లటి వెన్నెల మొదలైన దృశ్యాలు. ద్రష్ట యొక్క దృక్పథాన్ని మార్చి ప్రశాంతతను ఇస్తున్నవిధముగా ఇతర విషయములు కూడా ప్రభావితం చేస్తున్నాయి.
దృశ్యముగా వున్న వ్యక్తి శరీర వికారాలకు ద్రష్టగా వున్న ఇతరుల శక్తి ప్రభావితమవుతుంది.
ప్రపంచములో దృశ్యముగా కనిపిస్తున్న వ్యక్తి కోపము, ద్వేషము, సంతోషముతో కనిపిస్తున్న దృశ్యము వలన అతడిని చూస్తున్న ద్రష్ట మనో భావన కూడా మారుతుంది. తనను కూడా ఆయా జ్ఞానం కొంత ఆవహిస్తుంది. ఎదుటి వ్యక్తి యొక్క దేహ వికారములకు ప్రభావితమై తిరిగి ఆయా వికారములకు పొంది భావోద్వేగానికి లోనవుతాడు. తాను నవ్వితే ఇతను నవ్వడం, అతడు ఏడుస్తే ఇతడు ఏడ్వడం వంటి మనో వికారములను పొందుతాడు. తదనుగుణగా తన భౌతిక శక్తికూడా ఆయా వికారములకు వ్యక్తము చేస్తుంది.
ఎదుటి వ్యక్తిలో వున్న కోపము ద్వేషము, ఆనందము తనను కొంత ప్రభావితం చేస్తున్నప్పటికీ ఆయా భావనలు స్వీకరించని వారిపై అది పూర్తి ప్రభావం చూపదు. వారితో తాదాత్మ్యం చెందుతున్న వారిని మాత్రమే ఆవహిస్తుంది. వారి భావనతో లీనమై పోతే జ్ఞానం అనుభవానికి వస్తుంది.
సమాజములో వారి సన్నిహితులను, ఆదర్శవంతులను, ఉన్నతమైన వ్యక్తి మనో వికారములను ఇతరులు అనుకరిస్తారు. జీవుడు ఎవరినైతే ఉత్తముడిగా భావిస్తాడో అతనిని అనుకరిస్తాడు, తన ప్రవర్తన, కొంత వరకు అతనిలాగే మార్పుచెందుతుంది.
ఆయా ప్రాంతము వారు వారి సమాజంలో ఉత్తములుగా వున్నవారిని మనస్సులో ఎంపిక చేసుకుని వారికి తెలియకుండానే అనుకరిస్తారు. అనుకరణలో మొదట స్వరం త్వరగా మారుతుంది. మాట్లాడే విధానం, తర్వాత వ్యక్తిత్వం, ప్రవర్తన, బలము, ఆచారవ్యవహారములు, ముఖకవలికలు మార్పుచెందుతాయి.
శరీర జ్ఞానాన్ని ఒకరిని ఒకరు అనుకరిస్తున్న ఆయా ప్రాంతములోని వారు ఒకే ముఖ కవలికలను కలిగి వుంటున్నారు. భారతీయులు, చైనీయులు, అమెరికన్స్, యురోపియన్, జపనీస్ ఆఫ్రికన్స్ వారి వారి ప్రాంతములలోని ముఖకవలికలు ఒకేలా వుండటానికి కారణం వారి వాతావరణంలో వున్న వారి లాగే మనో భావం, మనోవికారం చెందడం. వారి ముఖ తత్వాన్ని అనువదించుకుని కామ రూపాన్ని ధరిస్తున్నారు. ఆత్మలో భేదం లేదు. వారి మనో వికార భేదం వలన వివిధ రకాల ముఖకవలికలు కలిగి వున్నారు. జీవుడి మనో భావాన్ని, మనో వికారాన్ని అనుసరించే ఆయా రూపాలున్నాయి.
కోతులు, అస్ట్రలోపితికస్, హూమో హబిలిస్,హూమో హబిలిస్, హోమో ఎరెక్టస్, నియాండర్తల్స్, హోమొ సెపియన్స్ మొదలైనవి మానవ పరిణామక్రమము అని శాస్త్రవేత్తలు చెబుతున్నవి ఒక దశ నుండి ఇంకో దశకు మనో వుద్దేశాన్ని, మనో వికారాలు మార్పు చేసుకున్నాయి. మార్పు చెందిన వాటిని వేరొకటి అనుకరిస్తున్నాయి. వాటి చర్యలు, అవి తినే
ఆహారము, వాటి ప్రయాణము కూడా వాటికి సహకరించాయి.
శక్తి తత్వం తెలుసుకున్న మహా ఋషులు దైవాంశ సంభూతులు అయిన హనుమతుడు, శుక్రాచార్యులు, శ్రీకృష్ణుడు మొదలైన వారు వారి తపోబలంతో కోరినట్లుగా కామ రూపాలను ధరించి ఆయా కార్యములను సాధించారు. ఆంజనేయుడు తన శక్తిని లోకకళ్యాణార్థం వుపయోగించాడు. ఆయా శక్తులను తమ స్వార్థానికి వినియోగించిన మారీచుడు, శూర్పణఖ మొదలైన వారు లోకానికి హాని తలపెట్టారు.
తమను తాము రక్షించుకోవడానికి, వేటాడడానికి కూడా కొన్ని జీవులు కామ రూపాన్ని ధరిస్తున్నాయి. ఉదా హరణకు: ఊసరవెల్లి, ఆక్టోపస్, కీటకాలు మొదలైనవి.
ఎవడి మానసిక బుద్ధిని బట్టి వాడు తన ఇంటికి రంగు వేసుకుంటున్న విధముగా జీవుని మానసిక వికారమును బట్టి శరీర తత్త్వం మార్పు చెందుతుంది. జీవుడు ఆయా గుణాలను, రూపాలను తనకు ఆపాదించుకుంటున్నాడు.
ముఖకవలికలలో తేడాలు మానవులలో మాత్రమే కాకుండా ప్రతి జీవజాతిలోనూ వేరువేరుగా వుంటాయి. ఆవులు అన్నీ ఒకే ముఖకవలికలను కలిగి వుండవు. ఆవు దేనికి అది ప్రత్యేకమైన మనో రూపాన్ని కలిగి వుంటుంది. దాన్ని వాటిని కాసే వాడు మాత్రమే గుర్తించగలడు.
వ్యక్తులు వారి వారి ప్రాంతాల్లోని మనో జ్ఞానాన్ని తమకు ఆపాదించుకుని తిరిగి వ్యక్తపరుస్తున్నారు. దృశ్యముగా కనిపిస్తున్న ఎదుటి వ్యక్తి శరీర జ్ఞానాన్ని తానూ ధరిస్తున్నాడు. ఇట్టి సామాజిక జ్ఞానం శరీరము నందు కూడా ఆపాదించబడుతుంది.
జనులు సమాజంలోని వారి శరీర తత్త్వం, భాష, కులము, వేష ధారణ, వృత్తి మొదలైనవి వారికన్నా వేరుగా వున్నట్లయితే తమ వారు కాదనే భావనతో వుంటూ వేరే జాతిగా చూస్తున్నారు. దానికి కారణం వారి మనస్సు ఆయా స్థితులను ఇచ్ఛగించక పోవడం. అది తన మనస్సు కలిగి వున్న అజ్ఞానం. కనుకనే తన ఆజ్ఞానాన్ని తెలుసుకున్న వాడే మహాజ్ఞాని.
జాతి, కుల, వర్గ భేదం కలిగి వున్న వారిని ఆజ్ఞానులుగానే భావించాలి, తాను కలిగి వున్న ఉద్దేశ్యం సమాజమంతా విషపుగాలిలా వ్యాపిస్తుంది. వారు ఆజ్ఞానాన్ని వ్యాప్తి చేసి సమాజానికి విఘాతం తలపెట్టే అజ్ఞాన దాతలు.
తాను చూస్తున్న, ప్రేమిస్తున్న, ద్వేషిస్తున్న, వ్యక్తి అసలు రూపం అది కాదు. తాను దైవపదార్థంగా వున్న జీవుడు.
శ్రీ రామ! జీవుడు దైవ స్వరూపుడు. జీవుడి మనస్తత్వానికి అనుగుణంగా రూపాన్ని, బలాన్ని జ్ఞానాన్ని సృష్టిస్తున్న శక్తి యే దేవత. ఇరువురి పరస్పర సహకారముతోనే ఏ కార్యమైనా జరుగుతుంది.
దైవం వుంది అని విశ్వసించిన వాడు దైవమును, దైవ శక్తిని దర్శిస్తాడు. దెయ్యం వుందని విశ్వసించిన వాడు దెయ్యమును, దుష్ట శక్తిని చూస్తాడు. ఎవరు ఎటువంటి మనస్థితిని కలిగి వుంటారో అటువంటి అనుభవాలనే పొందుతున్నారు. మనస్సును కలతపెట్టే దుష్ట భావనలు చేసే వారు ఉన్మాదులుగా మారుతున్నారు. శాంత స్వభావముతో వున్న వారు ఆనందముగా వుంటున్నారు. వారి ఆలోచనలే వారిని మనిషులను చేస్తున్నాయి, రాక్షసులను చేస్తున్నాయి, మహనీయులను చేస్తున్నాయి.
జీవుడి యొక్క మనస్సు కుంచించుకుని వుంటే శక్తి కుంచించుకుని వుంటుంది. మనస్సు వికాసం పొందితే శక్తి, బుద్ధి వికాసం పొందుతాయి.
కనపడుతున్న పదార్థమునకు ఉనికి లేదు. దీనికి అధిష్టానమైన ఆత్మ ఒక్కటే సత్ వస్తువు. ఆత్మ ఉన్నది, అదే సత్ స్వరూపం. అని గ్రహించిన వాడు ఎవడో వాడే ముక్తుడు.
మానవుడు కొంత సేపు దుఃఖము నందు మళ్ళీ దాని తత్త్వాన్ని మార్చి కొంత సేపు సంతోషము నందు వుంటున్నాడు. ఒక సారి బలముగాను మరొక సారి బలహీనముగాను ఉంటున్నాడు. మారుతున్నది నిత్యము కాదు. వాటిని మారుస్తున్నవాడు నిత్యముగా వుంటాడు.
గదిలో వున్న దీపకాంతి గోడ మీద ప్రసరిస్తున్నప్పుడు ఆ ‘కాంతి’ ఆ గోడయే నేను దాని రంగు, బలము, బలహీనతలు నేనే అనుకుంటే ఎంతటి మూర్కత్వమో, ఆత్మ చైతన్యములో భాగముగా వున్న మనస్సు దాని యొక్క కాంతి దేహముపై ప్రసరిస్తున్నప్పుడు అజ్ఞానముచే ఈ దేహమే నేను దానికి వున్న రూపము, బలము బలహీనతలు నేనే అని భావించి ఇది కూలుతుందేమోనని భయపడటం అంతే మూర్కుత్వము. తన సత్తా జ్యోతిస్వరూపం. తన అధిష్టానం ఆత్మ స్వరూపం. అని నిర్భయంగా వున్న వాడే మహా జ్ఞాని.
జీవుడు కలిగి వున్న దేహము పంచభూతాల సమన్వయము. జీవుడు దేహముతో చేయవలసిన కార్యములకు పంచభూతాలు సహకారముగా వున్నాయి.
శ్రీ రాముడు: మహా శక్తి పంచభూతాలు జీవునికి ఎందుకు సహకరిస్తున్నాయి.
19 . విశ్వము నందు రెండు బలములు గల ఆత్మల గురించి వివరించుట.
మహాశక్తి: శ్రీ రామా! విశ్వము నందు రెండు బలములు గల ఆత్మలు వున్నాయి. పరిపాలనాత్మ, సహకారాత్మ. మనో బలం, తపో బలం అధికముగా వున్న ఆత్మ పరిపాలనాత్మ. దాని కన్నా బలం తక్కువ గల ఆత్మ సహాకార ఆత్మ.
పరిపాలనాత్మ (ప్రభావితం చేసే ఆత్మ) సంకల్ప శక్తిని, బలమైన శక్తిని కలిగి వుంటుంది. సహకారాత్మ (ప్రభావితం అవుతున్న ఆత్మ), పరిపాలనాత్మ యొక్క సంకల్పాన్ని నెరవేర్చే సహకార శక్తిని కలిగి వుంటుంది.
ఆత్మ మనో భావనకు శక్తి ప్రభావితమవుతున్న విధముగా పరిపాలనాత్మ మనో సందేశానికి సహకార ఆత్మ యొక్క భౌతికశక్తి ప్రభావితం అయి సందేశానికి అనుగుణమైన పదార్థ నియమములో వుంటుంది. పరిపాలనాత్మ సహకారాత్మల యొక్క శక్తికి కల్పించబడిన ఉపాధి నియమమే అవి కలిగి వున్న పంచభూతములు, అష్టవసువులు.
పరిపాలనాత్మ మనో సందేశం సహకారాత్మలకు దైవసందేశంగా వెళుతుంది. అందిన దైవ నియమాన్ని అనుసరించి సహకారాత్మలు వివిధ ధర్మాలను కలిగి వున్నాయి.
సహకారాత్మల భౌతిక శక్తిని సాధనముగా చేసుకుని పరిపాలనాత్మ దేహమును కలిగి వున్నాడు. దేహములో జీవుడుగా వున్నది పరిపాలనాత్మ. దేహములో వుంటూ ఆయా కార్యములను నిర్వహిస్తున్న పంచభూతాలు మరియు అష్టవసువులు సహకారాత్మలు.
జీవుడు కలిగి వున్న దేహము కోటాను కోట్ల పంచభూతాలు, సూక్స్మ జీవులను కలిగి వుంది. పరిపాలనాత్మ యొక్క ‘చిత్ శక్తి’ వాటిని ఆకర్శించి, వాటి భౌతిక శక్తికి వివిధ ధర్మాలను కల్పించడం వలన వాటి సహకారముతో మానవుడు దేహమును పొంది జీవిస్తున్నాడు.
20. పరిపాలనాత్మ, సహకారాత్మలకు వివిధ బౌతిక ధర్మాలను కల్పించుట.
పరిపాలనాత్మ మనో సంకల్పానికి ప్రభావితమవుతున్న చిత్ శక్తి సహకార ఆత్మలను ఆకర్శిస్తుంది. వాటి యొక్క చిత్ శక్తిని నియంత్రిస్తుంది. అలాగే వాటి భౌతికశక్తికి నియమాలను కల్పిస్తుంది. సహకార ఆత్మలు పరిపాలనా శక్తి ఆదేశానికి అనుగుణంగా పనిచేస్తాయి .
జీవుడి మనో బలాన్ని అనుసరించి భూతాత్మ, జీవాత్మ, మహాత్మ, దైవాత్మ గా ఆయా బలములను కలిగి వుంటాడు.
భూతాత్మ పంచభూతాల ధర్మాన్ని కలిగి వుంటుంది, పరిపాలనాత్మ జీవాత్మగా అధిక శక్తిని కలిగి జీవులుగా, మానవులుగా శరీర ధర్మాన్ని కలిగి వుంటుంది. మహాత్మ అఖండ శక్తిని కలిగి మానవులుగాను, మహనీయులుగాను శరీర జ్ఞానాన్ని, బుద్ధి బలాన్ని కలిగి వుంటుంది. దైవాత్మ దైవ శక్తిని కలిగి దైవ శరీర జ్ఞానాన్ని, అఖండ బలాన్ని కలిగి వుంటుంది.
జీవాత్మ మరియు మహాత్మ భూతాత్మలకు పరిపాలనాత్మగా వుంటుంది. భూతాత్మకు, జీవాత్మకు మరియు మహాత్మకు దైవాత్మ పరిపాలనాత్మగా వుంటుంది.
పంచభూతాలు ఉపపంచభూతాలుగా, మహా పంచభూతాలుగా, అఖండ పంచభూతాలుగా వివిధ బలాలు, ధర్మాలు కలిగి వుంటాయి. ఉప పంచభూతాలు ఎలక్ట్రాన్స్, ప్రొటాన్స్, నూట్రాన్స్ మొదలైన పరమాణు రూపంలో వున్నాయి. ఉప పంచభూతాలు పంచాభూతాలకు శక్తిగా సహాకారాత్మలుగా వుండటం వలన పంచభూతాలు వాటి సహకారముతో ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి(ఘన పదార్థం) వంటి ధర్మాలను కలిగి వుంటాయి . మహా పంచభూతాలు పంచభూతాలు మరియు ఉప పంచభూతాల సహకారముతో దేహములోని అవయవాలుగా రూపుదాలుస్తాయి. అఖండ పంచభూతాలు బ్రహ్మాండములో పంచభూతాల, ఉపపంచభూతాల సహకారముతో సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాలుగా రూపుదాలుస్తాయి.
భూతాత్మ భౌతిక శక్తికి కల్పించిన పదార్థ నియమం వలన జీవుడు ఆ తత్త్వానికి లోబడి తదనుగుణమైన ధర్మములనే నిర్వర్తిస్తాడు. తన మనస్సు, చిత్ శక్తి చలించకుండా ఆయా కార్యమునందే వుంటున్నాయి.
పరిపాలనాశక్తి సహకారాత్మల భౌతిక శక్తికి విద్యుత్ ఆయస్కాత శక్తి, గ్రావిటీ శక్తి, బలమైన శక్తి, బలహీన శక్తిగా వివిధ ధర్మాలను కల్పిస్తుంది. అందు వలన భౌతిక శక్తి భూతాత్మల యందు మహా భూతాత్మలయందు పంచభూతాల ధర్మాలను కలిగి పరిపాలనాత్మకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలతో పాటు చలి, వేడి, కఠినత్వం, సున్నితత్వం మొదలైన విషయ పరిజ్ఞానాన్ని అనుభవానికి ఇస్తున్నాయి. జీవుడు దేహ సహాయముతో కనురెప్ప వేయాలన్నా, ఒక్క అడుగు ముందుకు వేయా లన్నా వీటి సహకారం లేనిదే జరగదు.
శ్రీ రామా! వ్యక్తమయి కనిపిస్తున్న ప్రతి పరమాణువు నందు ఆత్మ ఆధారమై వుంది. తన భౌతిక శక్తి ఉపాధిని కలిగి వుంటుంది.
జీవుడు స్వయముగా శక్తిని కలిగి వుంటాడు. ఒక వ్యక్తి వొక వస్త్రాన్ని ధరించి దాని రూపాన్ని వేరొక వ్యక్తికి ఇస్తున్న విధముగా, జీవుని యొక్క భౌతిక శక్తికి కల్పించబడిన పదార్థ ధర్మమే వేరొక జీవునికి శబ్ధ,స్పర్శ విషయ జ్ఞానాన్ని ఇస్తుంది . వస్త్రము వ్యక్తిని ఆధారముగా చేసుకున్న విధముగా భౌతిక శక్తి జీవున్ని ఆధారము చేసుకుని విషయ జ్ఞానాన్ని ఇస్తుంది.
శ్రీ రాముడు: ధర్మజా (మహా శక్తి)! పరిపాలనాత్మ, సహాకారాత్మలు ఎలా ఉనికిలోకి వచ్చాయి. వీటికి పుట్టుక ఎలా సంభవిస్తుంది.
21. ఆత్మ ఉనికి
ఆత్మ పుట్టుక, మరణము లేనిది. అది శుద్ధచైతన్యం. నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. శరీరము నశించినను ఆత్మ నశించదు. ఆత్మ సర్వ శక్తి వంతమైనది, ఆత్మ ఆద్యంతములులేనిది, త్రి కాలముల యందు వుండునది. అనగా భూత, భవిష్యత్, వర్తమాన కాలములందు వుండునది. సర్వ వ్యాపకమైనది. అవినాశి, అద్వితీయమైనది, స్థిరమైన ఉనికి కలిగినటువంటిది. అన్ని వస్తువులయందు, పదార్థముల యందు, ప్రాణికోటి యందు అనుస్యూతముగా నిరంతరము వుంటూ లుప్తము కానటువంటిది. మాలిన్యరహితమైనది. శుద్దమైనది, అమృత తుల్యమై ఆనందస్వరూపము కలిగినటువంటిది. స్వయం ప్రకాశకమై ఈ సృష్టి నంతటిని చైతన్యవంతం చేస్తూ ప్రకాశింప చేయునట్టిది. అది ఏకము, సంపూర్ణము, సర్వగతము-సాక్షి. పుష్పమాలికలోని దారమువలె అన్నిటియందు అనుస్యూతముగా వెలుగొందునది. ఏకమై వుంటూ సమస్తమునకు అధిష్టానమైనది. అది వెలుగులన్నిటికి వెలుగు. తాను ప్రకాశిస్తూ అన్నింటిని ప్రకాశింప చేసేది. నేను అని తెలియ బడేది. సద్రూపము, అపరిచ్ఛిన్నము, నిష్కలము, అవ్యయము, అఖండము, అప్రమేయము, అనాదియై, స్వతంత్రమై, సర్వాధారమై, సర్వాధిష్ఠానమై, సర్వ శ్రేష్ఠమై, సర్వ వ్యాపకమై, సర్వోన్నతమై, సర్వజ్ఞమై, స్వయం సిద్ధమై, విభువై, సర్వానుగతమై,సర్వాశ్రయమై, సచ్చిదానందస్వరూపమై, సర్వప్రాణకోటియందు ప్రకాశించునది. ఇట్టి నిరాకారము, అవ్యక్తము, అద్వితీయమైన సద్రూపాన్నే సత్ అని ఆత్మ అని అంటారు.
సృష్టి ఆదియందు శూన్యాకాశంగా, చిదాకాశముగా, దేహ రహితముగా వున్న ఆత్మ తన మనస్సు భావన చేయన౦త వరకు తనకు భౌతిక శక్తి అనునది లేకుండా అచేతనముగా ఉంటుంది. దేశము, కాలము, పరిమాణం, పరిణామం అనేవి లేకుండా శక్తి ఆత్మ యందే నిశ్చలముగా, నిరాకారముగా వుంటు౦ది. ఎప్పుడైతే మనస్సు నందు దేహమును కలిగి వున్నాననే భావన కలుగుతుందో అప్పుడు విచారణా బలానికి అనుగుణంగా చిత్ శక్తి క్రియను కలిగి భౌతిక శక్తిని కల్పిస్తుంది. కల్పించబడిన భౌతిక శక్తి మనో జ్ఞానమునకు అనుగుణమైన పదార్థ ధర్మము కలిగి మనస్సుకు దేహ అనుభవాన్ని ఇస్తుంది. ప్రారంభ దశలో పొందిన దేహము జడముగా, దేహరహితముగా పరమాణు దశలో అత్యంత సూక్ష్మముగా గ్రహించలేనిదిగా వుంటుంది. ఎప్పుడైతే జీవుడు పదార్థమును దేహముగా పొందిన తర్వాతనే తన భౌతికశక్తికి దేశము, కాలము, పరిమాణం, పరిణామము అనునవి ప్రారంభమవుతాయి. ఆత్మకు కాలము లేదు, ఆత్మ కొలవ బడదు ఆత్మ చైతన్యములోని మనస్సు భావన చేస్తున్న విషయము విషయ జ్ఞానముగా ప్రకృతి రూపంలో కనిపిస్తుంది. విషయముగా కనిపిస్తున్న పదార్థమే కొలవగలిగే పరిమాణము కలిగి వుంటుంది.
ఆకాశతత్వం, మనస్తత్వం కలిగివున్న జీవుడు మరియు చిత్ శక్తి ప్రజ్ఞను కలిగి వున్నాడు. విషయ జ్ఞానాన్ని ఇస్తున్న భౌతిక శక్తి (ప్రకృతి) ప్రజ్ఞను కలిగి వుంది.
శూన్యాకాశము నందు చలనము లేకుండా వున్న జీవుడు దేహ భ్రాంతి పొందడం వలన శక్తి దేహ భ్రాంతిని తెలిపే పదార్థ ధర్మమును జీవుడికి స్ఫురింప చేస్తుంది. ఆది యందు దేహ భ్రాంతిచే పదార్థమును దేహముగా పొందిన ఆత్మలు భూతాత్మలుగా వాటి శక్తి ఎటువంటి నియమం లేకుండా దుమ్ము దూళి రూపంలో విశ్వము నందు సంచరిస్తూ వుంటాయి .
పరమాణు స్థితిలో దేహ భావాన్ని పొందిన జీవుడు తన మనస్సు హృదయ స్తాన౦, మనో భావానికి చలిస్తూ, దేహ జ్ఞానాన్ని తెలిపే పదార్థం శక్తి స్థాన౦. హృదయం చలించే శక్తిని నియంత్రిస్తుంది. ఆందోళన చెందుతున్న మనస్సును తన శక్తి నియంత్రిస్తుంది. మనస్సు, శక్తి పరస్పర ఆదేశంతో, సహకారంతో నిశ్చలత్వాన్ని కలిగి వుంటున్నాయి.
పదార్థము గా ఉనికి లోకి వచ్చిన భూతాత్మ భౌతిక శక్తిని ఎవరూ నాశనము చేయలేరు. ఆత్మ నాశనము లేనిది. దాని భౌతికశక్తి అయిన పదార్థము నాశనము లేనిది. లోకక్షేమంకోరి వాటి భౌతిక శక్తికి పదార్థ ధర్మ౦ మార్చబడుతుంది. సృష్టి క్రమములో వుండటానికై పరిపాలనాత్మ శక్తి భూతాత్మ శక్తికి ఉప పంచభూతాలుగా, పంచభూతాలుగా ఆయా ధర్మాలను కల్పిస్తున్నది.
భూతాత్మగా వున్న జీవుడు సంకల్ప వికల్పాలచే, విషయ విచారణాబలముచే మనో బలాన్ని పొందుతున్నాడు. మనో బలాన్ని అనుసరించే భూతాత్మ పరిపాలనాత్మగా బలాన్ని పొందుతుంది.
ఎటువంటి నియమం లేకుండా ధూళిగా వున్న భూతాత్మలకు పరిపాలనాత్మ మనో సందేశానికి అనుగుణంగా చిత్ శక్తి భుతాత్మల భౌతిక శక్తికి పంచభూత ధర్మాలను కల్పిస్తుంది.
జీవాత్మ(పరిపాలనాత్మ) మనో ఉద్దేశ్యమే సందేశముగా శక్తి భూతాత్మలను ఆకర్షించి వివిధ ధర్మాలను కల్పిస్తుంది. చిత్ శక్తి విధివలె భూతాత్మలకు ధర్మాన్ని కల్పిస్తుంది. జీవాత్మ విధాతలా శక్తికి లక్ష్యాన్ని చూపిస్తుంది.
ప్రతి ఆత్మ శక్తికి స్థిరము గా వుండేలా ప్రకృతి నియమం కల్పించబడుతుంది. భూతాత్మలకు కల్పింపబడిన ప్రకృతి నియమములచే వాటి మనస్తత్వం స్థిరముగా వుంటూ వాటి శక్తి వివిదధఉపాధులను పొందుతాయి.
డాక్టర్ వైద్యుడుగా తన మేధాశక్తి వైద్య పరి జ్ఞానాన్ని కలిగి వున్న విధముగా, భూతాత్మలు గుణమునకు ఆధారముగా వుంటున్నాయి వాటి శక్తి గుణముగా వుంటుంది. జీవుడు అగ్ని తత్వం కలిగిన వాడు అయితే. శక్తి అగ్నిగా వుంది. పరస్పరం ఆధార ఆధేయ సంబంధం కలిగి ఒకే పదార్థముగా వున్నాయి. ఆత్మచైతన్యం జీవం, శక్తి జీవ చలనం. శక్తి భూతాత్మల మనో వికారమును నియంత్రిస్తూ నిర్దేశించిన గుణములో వుండేలా చేస్తుంది. ఒకో భూతాత్మ ఒకో గుణాన్ని కలిగి ఆయా విషయ జ్ఞానాన్ని ఇస్తున్నాయి.
ఆత్మ చైతన్యం కొలవ బడనప్పటికీ ఆత్మ మనో బలం కొలవ బడుతుంది. ఆత్మ మనో జ్ఞానం ఏ స్థితిలో వుందో కొలవ బడుతుంది. సృష్టి ధర్మానికి, లోకక్షేమానికి అనుగుణంగా కల్పింపబడిన ఆత్మ యొక్క భౌతికశక్తి ఏ నియమములో వుందో కనిపిస్తుంది. భూతాత్మలు సహకారాత్మలుగా వాటికి కల్పించిన పంచభూతాల నియమంలో కనిపిస్తున్నాయి. సర్వ జీవుల భౌతిక శరీరాలు వాటి మనో జ్ఞానంతో, మనో సంకల్పంతో కనిపిస్తున్నాయి.
కంటికి కనిపించని జీవుడు వాస్తవము. కంటికి కనిపిస్తూ జీవుడికి పదార్థ ధర్మముచే విషయ జ్ఞానాన్ని అనుభవానికి ఇస్తున్న భౌతిక శక్తి వాస్తవము కాదు. భౌతిక శక్తి జీవునికి ఆయా విషయ భ్రాంతిని కల్పించే మాయ.
ఆత్మ శూన్యమున౦దే వుంది. ఆత్మ కలిగివున్న భౌతిక శక్తి శూన్యము న౦దే వుంది. మనస్సు ఎటువంటి విషయ భావన చేస్తుందో ఆ విషయ జ్ఞానాన్ని చూడగలిగేలా, స్పురించగలిగేలా, పదార్థం ఏ ధర్మముతో వుందో తెలుసుకునే వెసులుబాటు పరిపాలనా శక్తి కల్పిస్తున్నది. కార్య నిమిత్తమై వాటి యొక్క జ్ఞాన స్థితిని తెలుసు కొనుటకు, జీవుడు తనను తాను ఏ స్థితిలో వున్నాడో గ్రహించుటకు, ఇతరులు ఏ స్థితిలో వున్నారో గ్రహించుటకు. పంచభూతాలు ఏ నియమములో ఉన్నాయో తెలుసుకొనుటకు పరిపాలనా శక్తి పదార్థమును వ్యక్తము చేస్తుంది. విషయ జ్ఞానాన్ని, విషయ లోపాలను తెలుసుకొనుటకు జీవుడి ఉచ్ఛ స్థితి, నీచ స్థితి ని గ్రహించి పరిష్కరించుటకై శక్తి పదార్థమును వ్యక్తము చేస్తుంది.
జీవాత్మ, తన చిత్ శక్తి కలిసి దివ్య శరీరముగా వుంటుంది. చిత్ శక్తి జీవునుకి అహం భావాన్ని మాత్రమే అనుభవానికి ఇస్తుంది. శబ్ధ స్పర్శ రూప రస గంధాలు ,సున్నితత్వం ,కఠినత్వం మొదలైన విషయ జ్ఞానమును పంచభూతములచే దేహ ధర్మాన్ని కల్పించి జీవునికి ఆయా విషయానుభవాన్ని ఇస్తుంది.
చిత్ శక్తి భౌతిక శక్తిని సృష్టించి దానిచే జఠిలమైన విషయానుభూతిని ఇస్తుంది. పంచభూతాల శక్తి, ప్రకృతి గుణాలను కలిగి వున్నాయి. ప్రకృతి రూపంలో వున్న మాయ సుతిమెత్తనైన మృదువైన అనుభూతిని, అలాగే జటిలంగా వుండే కఠినమైన అనుభూతిని మనస్సుకు స్ఫురింప చేస్తుంది. మాయ మనస్సుకు గుణాలను స్ఫురింప చేయడం ద్వారా మనస్సు ప్రతిస్పందిస్తూ తాను చెప్పినట్లు వుంటుంది. ఈ మాయ జీవునిలో కదలికలు తెస్తుంది. మోహింప చేస్తుంది. జీవున్ని తన అదుపాజ్ఞలో వుంచుకుంటుంది.
మహా మాయను కలిగి వున్న పరిపాలనాత్మ తన మాయచే చిన్న మాయను కలిగి వున్న సహకారాత్మలను ప్రభావితం చేస్తుంది.
మానవుడు తన భౌతిక శక్తిగా వున్న చేతిబలంతో వస్తువుకు గుణాలను కల్పిస్తున్న విధముగా పరిపాలనాత్మ కలిగివున్న (will power)తో చిత్ శక్తి భూతాత్మలకు పంచభూతాల ధర్మాన్ని కల్పిస్తుంది.
ప్రతి ఆత్మ దివ్య శరీరాన్ని మరియు భౌతిక శరీరాన్ని కలిగి వుంటాయి. భూతాత్మ తన చిత్ శక్తి కలిసి దివ్య శరీరం గా వుంటాయి. తన భౌతికశక్తికి కల్పించిన ఉపాధి నియమం భౌతిక దేహముగా వుంటుంది.
పరిపాలనాత్మ అయిన జీవాత్మ ద్రష్ట, ద్రష్ట మనో దర్శనానికి అనుగుణంగా భూతాత్మలు దృశ్యముగా ఆయా కార్య రూప ధర్మాలను కలిగి వుంటున్నాయి.
పరిపాలనాత్మ అయిన జీవాత్మ కార్య సంకల్పాన్ని కలిగి వుంటుంది. చిత్ శక్తి కార్య కర్తగా సంకల్పాన్ని నెరవేర్చే సంకల్పశక్తిని కలిగి వుంటుంది. సహకారాత్మలు అయిన భూతాత్మలు సంకల్పాన్ని నెరవేర్చే కార్య నిర్వాకులుగా వుంటున్నాయి.
జీవాత్మ మరియు భూతాత్మ రెండు పరస్పర ఆధార ఆధేయ సంబంధం, కార్య కారణ సంబధం కల్గి వుంటాయి. జీవాత్మ ఉద్దేశ్యం భూతాత్మలయిన పంచభూతాలకు సందేశముగా వెళుతుంది. అవి తమకు అందిన సందేశానికి అనుగుణంగా ఆయా కార్యములను నిర్వర్తిస్తాయి.
పంచభూతాలు జీవాత్మ మనో భావాన్ని తెలిపే శరీర జ్ఞానాన్ని, లక్షణాన్ని కలిగివున్నాయి.
కుమ్మరి కుండ ఆకారాన్ని వ్యక్త పరచడానికి మట్టి(పదార్థం) ఆధారంగా వున్న విధంగా, పరిపాలనాత్మ(జీవాత్మ) తన మనో వికారాలను వ్యక్త పరచడానికి పంచభూతాలు(భూతాత్మలు) ఆధారంగా వున్నాయి.
జీవాత్మ భావన చేస్తున్న మనో బలానికి, రూపానికి అనుగుణంగా పంచభూతాల శక్తి ఆయా బలాలను, రూపాన్ని తెలిపే శరీర ధర్మాలను కలిగి వున్నాయి. సర్వ జీవుల మనో జ్ఞానం వాటి దేహ రూపంలో కనిపించడానికి పంచభూతాలు సహకరిస్తున్నాయి.
జీవుడు తనను తాను ఎట్లు భావిస్తున్నాడు అన్న దానిని అనుసరించి, ఈ జీవుడు జంతువు, పక్షి, బలవంతుడు, బలహీనుడు ,మహనీయుడు ,దేవుడు అనే వివిధ రూపములను, గుణములను కలిగి వున్నాడు. దైవము కాని జీవి ఏదీ లేదు. మనిషి జ్ఞానము తక్కువగా వున్నంత మాత్రమున మనిషి కాకుండా పోడు. అలాగే జీవుని మనో జ్ఞానము పరిమితముగా వున్నంత మాత్రమున జీవుడు కాకుండా పోడు. సర్వ జీవులలోనూ వున్నది దైవ స్వరూపమే. జీవాత్మ పరిమితంగా భావించడం వలన పరిమిత దేహ జ్ఞానములో పరిమితంగా కనిపిస్తుంది. కాని తన శక్తి, సర్వ వ్యాపకమైనది అని గ్రహించి విశ్వసించిన నాడు తన శక్తి దైవ శక్తిగా వుంటుంది.
ఆత్మ చైతన్యము నందు స్పందించే జీవుడు, ప్రతిస్పందించే శక్తితో కలిసి ప్రకృతి పురుషుడుగా వున్నాడు. ప్రకృతి పురుషుల విషయ సంయోగం వలన విశయ జ్ఞానం ఆవిర్భవిస్తుంది.
జీవుడు ఏ విషయముతో సంయోగం చేస్తే ఆయా విషయములు ఆవిర్భవిస్తున్నాయి.
ఈ దేహము అను శిల్పమునకు పరిపాలనాత్మ అయిన ద్రష్టయే శిల్పి, పంచభూతాలే శిలలుగా వుంటూ ద్రష్ట మనో దర్శనమునకు అనుగుణంగా శిల్పముగా మారుతున్నాయి.
శ్రీరామా! జీవునికి అతని భౌతికశరీరం లోని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అతని సంకల్పాలను, కోరికలను నెరవేర్చే ఐశ్వర్య యోగం గా వున్నాయి. జీవుడు తన శక్తి తో కలిసి జీవాత్మ గా, దివ్య శరీరముగా, దైవపదార్థం గా భౌతికశరీరము నందు వున్నాడు. జీవుడు ఇంద్రియముల ద్వారా విషయ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు. అంతేగాని ఇంద్రియము తాను కాడు. ఇంద్రియములు తాను కలిగి వున్న సంపద. వ్యక్తి టెలిఫోన్ లోని స్వీకర్ ద్వారా విషయ జ్ఞానాన్ని తెలుసుకుంటూ మైక్ ద్వారా మనోభావ౦ వ్యక్త పరుస్తున్న విధముగా, జీవుడు తన మనోభావాన్ని కంఠము ద్వారా చెబుతున్నాడు. ఇతరుల మనో భావాన్ని చెవులద్వారా వింటున్నాడు. వెళ్లాలని సంకల్పించిన చోటికి కాళ్ల ద్వారా వెళుతున్నాడు. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు జీవుడు విషయ జ్ఞానం తెలుసుకొనే ఇంద్రియసంపదగా వున్నాయి. జీవుడు ఇంద్రియసంపద కలిగి వుండటం ఒక యోగం. ఆయా యోగములు జీవుడి మనో సంకల్పాలకు అనుగుణంగా సమకూరుతున్నాయి.
యోగం అంటే లేనిది పొందడం, కలిగి వుండటం లేదా కలిసి వుండటం. యోగం కలిగి వున్న వారు దాని భోగమును అనుభవిస్తారు. గృహము కలిగి వుండటం గృహ యోగం. గృహము కలిగి వుండటం వలన దాని భోగమును అనుభవిస్తున్నారు. ధనము కలిగి వుండటం ధనయోగం. ధన యోగం వలన దాని బోగాన్ని అనుభవిస్తున్నారు. వాహన యోగం కలిగి వుండటం వలన దాని భోగం అనుభవిస్తున్నారు. జీవుడు విషయ వాంఛ వలననే దేహమును పొందాడు. జీవుడు దేహము కలిగి వుండటం యోగం. దేహము కలిగి వుండటం వలన దాని భోగాన్ని అనుభవిస్తున్నాడు. పక్షికి రెక్కలు కలిగి వుండటం యోగం వాటి వలన ఆకాశములో అది విహారిస్తూ భోగాన్ని అనుభవిస్తుంది.
శ్రీ రామా! దేహముగా వున్న ప్రకృతి జీవుడు ధరించు వస్త్రము వంటిది. స్థిరముగా మరియు రక్షణగా వుండే నివాసము వంటిది. జీవుడు ప్రయాణించడానికి వాహకము వంటిది.
22. జీవుని త్రివిధ శరీరాలు.
జీవుడికి దేహముగా వున్న ప్రకృతి, 3 విధములైన శరీర జ్ఞానములను కలిగి వుంది. 1 దివ్య శరీరము. 2 పాంచ భౌతిక శరీరము 3 జగత్ శరీరము.
దివ్య శరీర౦; శూన్యమునందు దేహ భావనచే దేహ జ్ఞానమును పొందిన శరీరం దివ్య శరీరం. దివ్య శరీరము నందు జీవుడు దేహభావనను, మనో భావనను, కోరికలను, సంకల్పాలను కలిగి వుంటాడు. పూర్వ వాసనలను కలిగి వుంటాడు. ఆత్మ, మనస్సు,చిత్ శక్తి కలిగి వున్న జీవుడు దివ్య శరీరం కలిగి వుంటాడు.
2 పాంచ భౌతిక శరీరం; దివ్య శరీర౦ కలిగి వున్న జీవుని తన మనో భావనను, మనో సంకల్పాన్ని నెరవేర్చే సంకల్ప యోగ శరీరమే పంచభూతాలచే నిర్మితమైన ఈ భౌతిక శరీరం. జీవుడు భౌతిక శరీరమును వాహకముగా చేసుకొని భూమి యందు సంచరిస్తన్నాడు. భూతాత్మలకు వాటికి కల్పించిన పదార్థ ధర్మమే భౌతిక శరీరముగా వుంటుంది. అవి వాటికి కల్పించిన పంచభూతముల శక్తిని వాహకముగా చేసుకుని ప్రయాణిస్తాయి
3 జగత్ శరీరం: జీవుడి సంకల్పాలను నెరవేర్చే భౌతిక శరీరమునకు ఆశ్రయముగా, స్థిరముగా వుండుటకు ఆధారముగా వున్న భూమి, సూర్య, చంద్ర గ్రహ నక్షత్రాలే జగత్ శరీరం. జీవించడానికి వున్న భూమి. జీవుడి మనుగడకు ఆధారముగా వున్న సూర్యుడు, చంద్రుడు, గ్రహనక్షత్రాలు మొదలైనవాటిని జీవుడు జగత్ శరీరముగా కలిగి వున్నాడు. ఈ విధంగా ఆత్మ 3 విధాలైన శరీర జ్ఞానములను సంపదగా కలిగివుంది.
శ్రీరాముడు: మహా శక్తి మనో భావన వలన శరీర జ్ఞానాన్ని కలిగివున్నాడు. దానికి శక్తి, పంచభూతాలు సహకరిస్తున్నాయి అన్నది స్పష్టముగా గ్రహించగలిగాను. విషయ వాంఛ, మనో సంకల్పము వలన ఇంద్రియాలు ఎలా పొందాడు? అదేవిదముగా జీవులలో ఒకొక్కటి ఒకో శరీర జ్ఞానాన్ని, ఇంద్రియ జ్ఞానాన్ని కలిగి వున్నాయి. కొన్ని పాకుతూ పోయే శరీరాలను కలిగి వున్నాయి. కొన్ని పరిమితముగా నడిచే శరీరాలను కలిగి వున్నాయి. కొన్ని అత్యంత వేగముగా వెళ్లగలిగే శరీరాలను కలిగి వున్నాయి. కొన్ని రెక్కలతో వెళ్లగలిగే శరీరాలను కలిగి వున్నాయి. జీవులు వివిధ శక్తులను ఎలా పొందాయి. వీటి వ్యత్యాసానికి కారణము ఏమిటి?
మహా శక్తి: శ్రీరామా! జీవుడు ఎటువంటి శక్తి కోసం ప్రయత్నిస్తే తన మనో బలాన్ని, ప్రయత్న బలాన్ని అనుసరించి భౌతికశక్తి తదనుగుణమైన శరీర జ్ఞానంతో వుంటుంది.
23. సంకల్పానికి అనుగుణంగా జీవులు శరీర, ఇంద్రియములను పొందుట.
జీవాత్మలు వాటికి వున్న బలాన్ని, పంచభూతాల శక్తిని ఒకక్కటి ఒకోలా ఉపయోగిస్తున్నాయి.
జీవుడు నడవాలని ప్రయత్నిస్తే పంచభూతాలు నడిచే శక్తిగా వున్నాయి. పాకి వెళ్లాలని ప్రయత్నిస్తే పాకి వెళ్ళే శక్తిగా వున్నాయి. జీవి ఎగిరే ప్రయత్న చేయడం వలన ఎగిరే శక్తిగా వున్నాయి. జీవులు వాటి సంకల్పానికి, ప్రయత్న బలానికి అనుగుణంగానే వేరు వేరు శక్తులను, బలాలను పొందుతున్నాయి.
శ్రీరామా! జీవులు కలిగి వున్న కర్మేంద్రియములు కాళ్ళు, చేతులు, రెక్కలు, జ్ఞానేంద్రియములు అయిన నేత్రాలు, చెవులు మొదలైనవి జీవులు ఎటువంటి మనో వాంఛ కోసం ప్రయత్నిస్తున్నాయో ఆయా మనో వాంఛలను నెరవేర్చే సాధనములుగా సంప్రాప్తమయ్యాయి.
జీవుడు నడవాలనే అనేక ప్రయత్నముల వలన చిత్ శక్తి పంచభూతాలచే విషయ వాంఛను నెరవేర్చే కాళ్లు సమకూర్చినది. జీవి తన నిత్య జీవితంలో తన అవసరంకోసం కొన్ని కోట్ల సార్లు ఎగిరే ప్రయత్నం చేయడం వలన తన మనో వాంఛకు అనుగుణంగా పంచభూతాలు జీవి సంకల్పాన్ని నెరవేర్చే భౌతిక శక్తిగా రెక్కల ధర్మాన్ని కలిగి వున్నాయి.
పంచభూతాలు, జీవాత్మ సంకల్పించిన కార్యార్థమై ఆ కార్య సఫలతకు ఏది ఉపయుక్తమో తత్సంబంధమైన ఇంద్రియ నియమం కలిగి వుంటున్నాయి. శరీరంలోని అన్ని పదార్థ నియమాలు విషయ జ్ఞానాన్ని తెలిపే ధ్యేయ౦తో వున్నాయి.
జీవుడు తన మనోదృష్టి ఎక్కడ వుంచితే శక్తి అక్కడ వుంటుంది, దేని కోసం ప్రయత్నిస్తే శక్తి ఆ కార్యం చేస్తుంది. ఏ దృక్పథంతో వుంటే శక్తి ఆ జ్ఞానాన్ని కలిగి వుంటుంది. అలాగే శక్తి జీవుడికి సందేశము ఇస్తూ అతడిని ప్రభావితం చేస్తుంది. జీవుడు శక్తిని ఏ ధర్మం వైపు నడిపిస్తే శక్తి ఆ ధర్మాన్ని కలిగి వుంటుంది. జీవుడి సందేశాన్ని శక్తి అంగీకరిస్తుంది. శక్తి ఆజ్ఞలు జీవుడికి అందుతున్నాయి. అప్పుడతడు తదనుగుణముగా ప్రవర్తిస్తున్నాడు.
జీవుడు దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నాడో ప్రయత్న బలాన్ని అనుసరించి చిత్ శక్తి పంచ భూతాలను ఆకర్శిస్తుంది. ఆకర్శింపబడిన పంచభూతాలు జీవాత్మ మనో లక్ష్యాన్ని నెరవేర్చే ఇంద్రియసాధనాలుగా వివిధ ధర్మాలను కలిగి వున్నాయి.
24. భౌతిక శరీర నిర్మాణము.
శ్రీ రామా! పదార్థముగా, అశరీరుడుగా వున్న జీవుడు, తన మనో సంకల్పముతో దేహాన్ని, ఇంద్రియాలను ఎలా పొందాడో చెబుతాను ఆలకించు.
భూమి యందు జడపదార్థముగా, దేహ రహితముగా వున్న జీవుడు కదలాలనే మనో ప్రయత్నము వలన శక్తి కదలటానికి అవసరమైన దేహ ధర్మాన్ని కల్పిస్తుంది.
భూమి యందు నిరాకారముగా వున్న జీవి సంకల్ప వికల్పాలచే, మనో వికారములచే మనో బలాన్ని పొంది కొన్ని కోట్ల సంవత్సరాలకు పరిపాలనాత్మగా బలాన్ని పొందుతుంది. పరిపాలనాత్మగా బలాన్ని పొందిన జీవుడు కదలాలనే ప్రయత్నం చేయడం వలన అతని మనో సంకల్పాన్ని నెరవేర్చడానికి శక్తి పంచభూతాలను ఆకర్శించి జీవి కదలగలిగే సాధనముగా శరీర జ్ఞానాన్ని ఇస్తుంది .జీవి కదలటానికి చేసే ప్రయత్నంలో ఎంత మనో బలాన్ని కలిగి వుంటే, అంత భౌతిక శరీరమును మాత్రమే పొందుతుంది.
జీవుని యొక్క మనో బలాన్ని అనుసరించి శక్తి త్రిదశలలో పనిచేస్తుంది. ప్రారంభంలో కదలాలనే సంకల్పము, అదే సంకల్పముతో పదే పదే కదిలే ప్రయత్నము చేయడం వలన ఎంతో కాలానికి కదలగలను అనే భావన బలబడుతుంది. బలపడిన భావనే కర్మ బలం. కర్మ బలాన్ని విచారణా బలాన్ని అనుసరించి చిత్ శక్తి క్రియను కలిగి పంచభూతాలచే కర్మ ఫలమును ఇస్తుంది. జీవుడి మనో భావనకు అనుగుణంగా శక్తి కదలటానికి అనువైన దేహమును ప్రాప్తింప చేస్తుంది. అలా కదలటానికి ప్రారంభ దశలో పొందిన శరీరమే సూక్ష్మ భౌతికదేహము. జీవుడు కలిగి వున్న సూక్ష్మ భౌతికదేహమే జీవి ప్రారంభ పరిణామ దశలో సూక్మ జీవులుగా కనిపిస్తున్నాయి.
జీవి మనో బలం, మనోవిశ్వాసమే బలమైన అయస్కాంతంలా పంచభూతాలను ఆకర్శిస్తుంది, తనకు శక్తిగా చేసుకుంటుంది, బలమైన ఆయుధంలా నియమాన్ని కల్పిస్తుంది.
పరిమితముగా సూక్ష్మ భౌతిక దేహాన్ని కలిగివున్న జీవి కాలక్రమములో సంకల్ప వికల్పాలచే, కదిలే ప్రయత్నములో అధిక స్థూలదేహ భావనను పొందుతుంది. జీవి భావనా బలమునకు అనుగుణంగా పంచభూతాలు ఆకర్షింపబడి అధిక దేహ బలాన్ని పొందుతుంది . జీవుడి మానసిక పరిణామమే దేహ పరిణామానికి కారణం. జీవి మానసికంగా పరిణతి చెందితే క్రమంగా శారీరకంగా పరిణతి చెందుతుంది .
జరిగే ప్రతి కార్యమును శక్తి ప్రభావితం చేస్తుంది. జీవుడు ప్రభావితమవుతున్నాడు. జీవుడు-శక్తి పరస్పర సహకారముతో కార్యములు జరుగుతున్నాయి. శక్తి ధర్మాలలో ఒకటి అయిన ఇచ్ఛా శక్తి జీవుడు కదిలేలా ఇచ్ఛను కలిగిస్తుంది. దాని కారణముగా ఆయా కార్యములను చేసేలా జీవుడు ప్రభావితమవుతున్నాడు. జ్ఞాన శక్తి బుద్ధి రూపమై వుండి ఆయా కర్మలకు ప్రేరేపిస్తుంది. శక్తి జీవుడిని ప్రభావితం చేస్తుంది. జీవుడు శక్తిని ప్రభావితం చేస్తూ విషయజ్ఞానాన్ని పొందుతున్నాడు.
చిత్ శక్తి పంచభూతాలకు మహా పంచభూతాలుగా బలాన్ని ఇచ్చి జీవిని నడిపించ గలిగే ఇంద్రియ బలాన్ని కల్పిస్తుంది.
జీవాత్మ వేగముగా కదలాలనే ప్రయత్నం చేయడం వలన ‘శక్తి’ జీవునికి వేగముగా ముందుకు కదలగలిగే సాధనముగా ఇంద్రియ సామర్ధ్యమును ఇస్తుంది. దానికోసమై పంచభూతాలకు వివిధ నియమాలను కల్పిస్తుంది. నియమాన్ని కలిగివున్న పంచభూతాలు కాళ్లు, మొప్పల అవయవములుగా వుండే వివిధ ధర్మాలను కలిగి వున్నాయి. తదనుగుణంగా జీవులు కర్మేంద్రియముల సహకారంతో వేగంగా ముందుకు వెళ్లగలిగే సామర్థ్యాన్ని కలిగివున్నాయి. వాటి ప్రయత్న బలాన్ని బట్టి చిన్న చిన్న జీవులుగా అలాగే పెద్ద జీవులుగా చేప, తాబేలు మొదలైన రూపాలు సంతరించుకున్నాయి.
ముడి పదార్థముగా వున్న ఇనుమును అవసరానికి అనుగుణమైన ఆకృతిని, ధర్మాన్ని కల్పించి వాహనానికి చక్రంలా ఉపయోగించవచ్చు, అదేవిధముగా నీరు వొడిసి పట్టుకోవడానికి కుండ గా, పండ్లు కోయడానికి కత్తిగా ఇనుముకు ఏ ధర్మాన్ని కలిపిస్తే ఆ ధర్మాన్ని కలిగి వున్న విధముగా, పరిపాలనాత్మ భూతాత్మశక్తికి,మహా భూతాత్మకి సమర్ధత గల పదార్థ ధర్మాన్ని, పంచభూతాల ధర్మాన్ని ,ఇంద్రియ ధర్మాన్ని కల్పించి ఆయా కార్యములకొఱకు నియమిస్తుంది.
మనో సంకల్పము, కార్య ప్రయత్నమే కర్మ. జీవుడి కర్మ బలాన్ని అనుసరించే ఇంద్రియ బలము ప్రాప్తిస్తుంది.
శ్రీరామా! ఒకరి సహకారంతో ఒకరు విహారానికి వెళ్ళు విధంగా, నడవాలనుకున్న జీవాత్మ, నడవడానికి సహకరిస్తున్న పంచభూతాలు కలిసి విహరిస్తున్నాయి. జీవాత్మ పొందే అనుభూతిని పంచభూతాలు, మాహాపంచభూతాలు కూడా వాటి పరిధిలో పొందుతున్నాయి.
జీవాత్మ తీసుకొనే ఆహారం భూతాత్మలైన పంచభూతాలకు, మహా పంచభూతాలైన జీవకణాలకు, అవయవాలకు, ఇంద్రియాలకు, అందేలా ఆకలి కల్పించి ఇతర పంచభూతాలు ప్రభావితంచేస్తున్నాయి, తీసుకునే ఆహారం వాటి స్థాయిలో అవి స౦తృప్తిని అనుభవిస్తున్నాయి.
జీవుడు శరీరముతో అనుభవిస్తున్న బోగములు పంచభూతాలు కూడా అనుభవిస్తున్నాయి. దాని కారణంగా జీవుడు తీసుకునే ఆహారానికి పంచభూతాలు ప్రభావితమవుతూ శరీరము నందు కోపం ద్వేషం ,సాత్త్వికం, సామారస్యము వ్యక్తము చేస్తూ వుంటాయి.
నేత్ర రహితంగా వున్న జీవి శరీరం పై కాంతి తరంగాలు స్ఫురించడం వలన ఆ దృశ్యాన్ని స్పష్టంగా చూడాలనే జీవాత్మ మనో వాంఛకు అనుగుణంగా పంచభూతాలు దృశ్యాన్ని స్పష్టముగా చూపి౦చే నేత్ర జ్ఞానాన్ని, నేత్ర నిర్మాణమును కలిగివున్నాయి.
జీవాత్మ యందు అస్పష్టముగా స్ఫురిస్తున్న కాంతిని స్పష్టముగా చూడాలనే మనో సంకల్పాన్ని, దాని కర్మ బలాన్ని అనుసరించి చిత్ శక్తి పంచభూతాలను ఆకర్శిస్తుంది. చిత్ శక్తి సందేశ సమాచారానికి అనుగుణంగా పంచభూతాలు కాంతిని చూపించే పరిష్కార జ్ఞానేంద్రియముగా నేత్ర ధర్మాన్ని కలిగివున్నాయి.
జీవుడు సంకల్పం చేస్తాడు ‘శక్తి’ ఆ సంకల్పాన్ని నెరవేర్చే ఫార్ములాను ఇస్తుంది. ఫార్ములాను అనుసరించి పంచభూతాలు పనిచేస్తాయి.
చిత్ శక్తి, పంచభూతాలకు మరియు ఇంద్రియాలకు వాటి పాత్రకు తగ్గ పదార్థ సామర్థ్యమును ఇస్తుంది.
జీవుడికి శబ్ధ తరంగాలు స్ఫురించడం వలన శబ్ధాన్ని స్పష్టంగా వినాలనే తన మనో అభీష్టానికి అనుగుణంగా పంచభూతాలు ప్రభావితమవుతూ, శబ్దాన్ని వినిపించే జ్ఞానేంద్రియ ధర్మాన్ని కలిగి వున్నాయి.
జీవుడి మనో సంకల్పానికి అనుగుణంగా కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు మనో వాంఛ ఫలసిద్ధిగా వున్నాయి.
జీవి మనో సంకల్పం వలన కాళ్ళు, చేతులు, మొప్పలు పొందుతున్న విధంగా , వాటి వేటకు అవసరమైన అవయవ ఆయుధాలను కూడా వాటి మనో ప్రయత్నాన్ని అనుగుణంగా పొందుతుంది.
జీవి వేటాడే క్రమంలో జీవిని పట్టుకోవాలనే ప్రయత్నంలో తన మనో ఉద్దేశ్యమే ఆదేశంగా పంచభూతాలకు చేరుతుంది. తదనుగుణంగా పంచభూతాలు జీవి సంకల్పానికి అవసరమైన పంజా ఆకారాన్ని కలిగి వున్నాయి, పిల్లి ఇతః పూర్వపు సంకల్పం వలన త్రిదశలలో పంజా జ్ఞానాన్ని పొందుతుంది.
జీవి దాని అవసరం కోసం పదే పదే ఆయా కర్మలు చేసే క్రమంలో సాధనా బలం వలన will power పెంపొందుతుంది. మనస్సు will power బలంగా వుంటేనే, చిత్ శక్తి తదనుగుణమైన భౌతిక శక్తిని కల్పిస్తుంది.
జీవి దేని కోసం అయితే ప్రయత్నిస్తుందో అది దేశ కాలాలకు అనుగుణంగా త్రిదశలలో( కర్మ చేయడం, 2 కర్మ బలం పొంది తదనుగుణమైన క్రియ జరగడం,3. కాలక్రమంలో కర్మ ఫలం అనుభవానికి రావడంలో ) సంప్రాప్తమవుతుంది.
పిల్లి జీవులను పట్టుకోవాలనే ఇతఃపూర్వ సంకల్పమే ప్రస్తుతము కలిగివున్న పంజా జ్ఞానం. వేటగాడికి పదునైన కత్తులు ఇచ్చిన విధముగా ‘శక్తి’ జీవి అవసరానికి అవసరమైన గోర్లను ఇస్తుంది.
జీవి అనేక ప్రయత్నములలో సాధనా బలమును, తపో బలాన్ని కలిగి వుంటుంది. తపొ బలాన్ని అనుసరించే శక్తి అంతే బలముతో క్రియను కలిగి పంచభూతాలను ఆయా కార్యములలో నియమిస్తుంది.
ప్రస్తుతము జీవులు కలిగి వున్న ఇంద్రియములు వాటికి పూర్వ కర్మ ఫలము వలన లభించినవే.
జీవునికి భూత కాలములోని సంకల్పాన్ని, కర్మ బలాన్ని అనుసరించి వర్తమానములో జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు ప్రాప్తించినవి. వర్తమానములో చేసే కర్మలు, కర్మ బలాన్ని అనుసరించి భవిష్యత్తులో కర్మ ఫలముగా శరీర జ్ఞానం సిద్ధిస్తుంది.
ప్రతి జీవిలో దాని మనో భావము, మనో సంకల్పము ఇంద్రియములలో, శరీరములో కనిపిస్తుంది.
జీవులకు ప్రాప్తించిన ఇంద్రియాలను అవి జడముగా అనుభవలసినదే. వర్తమానములో అవి చేసే పనులను బట్టి భవిష్యత్తులో మార్పుచెందుతాయి.
జీవుడి మనో సంకల్పమే శక్తికి దిశను చూపిస్తుంది. శక్తి ఆ దిశగానే ప్రయాణిస్తూ, పంచభూతాలను ఆయా మార్గములలో ప్రయాణింపచేస్తుంది.
పక్షి రెక్కలను పొందక ముందు చిన్న జీవిగా వున్నప్పుడే అది తన మనుగడకోసం పైకి, క్రిందకూ దూకుతూ ఎగిరే ప్రయత్నంలో తన దృక్పథానికి, అవసరానికి అనుగుణంగా పంచభూతాలు ఆ అవసరాన్ని నెరవేర్చే యోగ్యమైన రెక్కల శక్తిని కలిగి వున్నాయి. పక్షికి వున్న రెక్కలు దాని మనో సంకల్పాన్ని నెరవేర్చే సాధనాలుగా ఉన్నాయి.
జీవి ఎగిరే ప్రయత్నములో అనేక ప్రయత్నాలలో కర్మ బలాన్ని పొందుతుంది. కర్మ బలమే పంచభూతాలను ఆకర్శించే శక్తిని కలిగి వుంటుంది. ఆకర్శించబడిన పంచభూతాలు రెక్కల ధర్మాన్ని కలిగి వున్నాయి.
దారాన్ని ఆధారం చేసుకుని ముత్యాలు హారము అయినట్లు. సంకల్పాలను(పూర్వవాసనలను) ఆధారం చేసుకుని జీవుడికి జ్ఞానేద్రియములు, కర్మేంద్రియములు ముత్యాలలా కూర్చబడి వున్నాయి.
జీవుడి లక్ష్యం, శక్తి లక్ష్యం, పంచభూతాల లక్ష్యం వేరు వేరు కాదు. జీవుడి మనో లక్ష్యాన్ని అనుసరించి శక్తి, పంచభూతాలు, మహా పంచభూతాలు అన్నీ ఒకే లక్ష్యసాధనతో పనిచేస్తున్నాయి.
25. ఇంద్రియములు అవయవములు శక్తి వంతముగా మార్పుచెందుట.
శ్రీ రామా! జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పొందిన జీవి వాటిని అధికముగా వినియోగించే క్రమంలో అవి బలముగా, శక్తివంతముగా మార్పు చెందుతున్నాయి.
జీవి కర్మ ఫలముగా పొందిన అవయవ, ఇంద్రియ జ్ఞాన౦ మొదట పరిమిత శక్తితో, సూక్ష్మముగా, బలహీనముగా వుంటున్నాయి. జీవుడు పదే పదే అయా ఇంద్రియములను వినియోగించే క్రమములో వాటితో వివిధ కార్యములు చేసే సాధనా క్రమ౦లో తను కలిగివున్న బలహీన స్థితి తొలగి బలమైన ఇంద్రియములుగా మార్పు చెందుతున్నాయి. ఏ ఇంద్రియాన్ని ఎక్కువగా వినియోగిస్తే ఆ ఇంద్రియములోని బలహీనత తొలగి దానికి బలం చేకూరుతుంది. కష్టమైనదనే బలహీనమైన భావనయే మనో భ్రమ. కార్య సాధనలో భ్రమను తొలగించి మనో బలాన్ని, మనో విశ్వాసాన్ని బలపడేటట్లు చేస్తుంది. మనో విశ్వాసానికి అనుగుణంగా భౌతిక శక్తి బలమైన అవయవాన్ని, ఇంద్రియాన్ని, శరీర జ్ఞానాన్ని కలిగివుంటుంది.
జీవి తాను చేసే సాధనా బలంతో will power ను పెంపొందించుకొని ఇంద్రియ జ్ఞానాన్ని బలపర్చుకుంటున్నాయి.
జీవి నడుస్తూ కాళ్లను ఎక్కువగా వినియోగించే క్రమంలో తన శక్తి, పంచభూతాల శక్తి ఆయా కార్యముల యందే పనిచేస్తూ వుంటుంది. జీవి నడవటంలో, వేటాడుతూ పరుగుతీసే క్రమంలో కాళ్లను ఎక్కువగా వినియోగించడం వలన, బలహీనత తొలగి బలమైన కాళ్లుగా పరిణామం చెందుతున్నాయి.
జీవి కాళ్లను ఎక్కువగా వినియోగించే క్రమంలో కాళ్లపై వున్న బలహీన దృక్పథం తొలగి బలమైన దృక్పథాన్ని పొందుతుంది. తన దృక్పథాన్ని అనుసరించి బలమైన కాళ్లుగా మార్పు చెందుతున్నాయి. దానికి అనుబందంగా వున్న శరీరంకూడా బలంగా మార్పు చెందుతుంది. కార్య సాధనలోనే జీవి తన ఇంద్రియాలను, అవయవాలను బలంగా మార్చుకుంటుంది. చిన్న జీవి బలమైన జీవిగా బలమైన శరీర౦గా పరిణామం చెందుతుంది.
గ్రద్ద ఆకాశం పైనుంచి ఆహారాన్ని చూసే క్రమంలో తన నేత్రాలను ఎక్కువగా వినియోగిస్తూ దూరంగా వున్న వస్తువులను చూడాలనే మనో వాంఛకు అనుగుణగముగా పంచభూతాలు దూరంగా వున్న వస్తువులను చూపించాలానే లక్ష్యముతో నిరంతరం ఆయా వృత్తి యందే వుంటూ బలమైన నేత్రధర్మాన్ని కలిగివున్నాయి. తదనుగుణంగా గ్రద్ద శక్తి వంతమైన నేత్ర జ్ఞానాన్ని కలిగి వున్నది, అలాగే దాని కాళ్లు, రెక్కలు ఎక్కువగా వినియోగించడం వలన బలమైన కర్మేంద్రియాలుగా మార్పు చెందాయి. మనస్సు ఏ విషయం పై ఎక్కువ దృష్టి పెడితే, దేనికోసం ప్రయత్నిస్తే శక్తి ఆ కార్యము నందు పనిచేస్తూ బలముగా మారుస్తుంది.
గ్రద్ద తన దైన౦దిన జీవితంలో మనోబలాన్ని, మనోవిశ్వాసాన్ని పెంచుకొని బలమైన డేగలా బలమైన రెక్కలను, బలమైన కాళ్లను, శక్తివంతమైన నేత్రములను అభివృద్ధి చేసుకుంటుంది.
మనో విశ్వాసాన్ని అనుసరించే శక్తి ప్రయాణం చేస్తుంది. ఆయా ధర్మాలను కల్పిస్తుంది. ‘శక్తి’ని జీవుడి మనో విశ్వాసం, మనో బలమే కదిలిస్తుంది.
శ్రీ రామా! భూలోకంలో వున్న ఏ జీవైనా దానికి ఎటువంటి ఇంద్రియ శక్తి యైనా లభించింది అంటే అది దాని ప్రయత్నం, సాధనా బలం వలనే ప్రాప్తించినది. ప్రయత్నం, సాధన లేకుండా ఏది ప్రాప్తించదు. ప్రయత్నం వలన సాధనా బలం, కర్మ బలాన్ని పొంది. జీవులు కర్మ ఫలములను పొందుతున్నాయి.
ప్రయత్నం యొక్క రూపమే కర్మ. అట్టి కర్మ బలానికి పర్యవసానముగానే ప్రతి జీవి పొందిన ఇంద్రియములు బలముగా మారుతున్నాయి.
జీవి తాను దైనందిన జీవితంలో చేసే కార్య సాధనవలనే దాని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, శరీర సామర్ధ్యం వృద్ధి చెందటానికి కారణ మవుతుంది. ప్రయత్నం చేస్తున్న కొద్ది సాధనాబలం పెంపొందుతుంది. సాధనా బలముతో కష్టమనే మనో బలహీనత తొలగుతుంది, మనో బలం, మనో విశ్వాస౦ బలపడుతుంది. దానికి అనుగుణంగా శరీర, ఇంద్రియజ్ఞానం వుంటుంది.
జీవి మనోబలం మారడం వలన దాని లోకం మారుతుంది, గ్రద్ద దాని సాధనా బలముతో బలమైన డేగ గా మారి దాని, జ్ఞానం, ఆకారం, రూపం మార్చుకుని వేరే జీవిగా కనిపిస్తుంది. ఆత్మ యందు వికారము, ఆకారములు వుండవు. దాని బలము, జ్ఞానమే వికారము, ఆకారము పొందుతుంది. జీవుని మానసికమైన మార్పు భౌతిక శరీరంలో కనిపిస్తుంది. పిల్లి వేటాడే క్రమంలో మనో బలాన్ని, మనో జ్ఞాన పరిణతిని చెంది శరీర జ్ఞానంలో పులిలా, సింహంలా వేరు వేరు జాతులుగా మార్పు చెందుతుంది.
కోడి పైకి ఎగిరే ప్రయత్నములో దాని సాధనా బలాన్ని అనుసరించి అది అంతే రెక్కలను కలిగి వుంది. అది ఇంకా ఎక్కువగా ఎగిరే ప్రయత్నం చేయక పోవడం వలనే తన శక్తి ఇంతే అనే పరిమిత భ్రమలో వుంటుంది. జీవి తన ప్రయత్న బలం తో శరీరశక్తిని ఎంత వినియోగిస్తే అంతటి బలాన్ని మాత్రమే పొందుతుంది.
కోడి మరియు గ్రద్ద లో వున్న పంచభూతాలు ఒకటే. పంచభూతాలకు బలం, బలహీనత అనేవి వుండవు. పంచభూతాలు చేస్తున్న వ్యవస్థలు బలము, బలహీనముగా వున్నాయి. వాటికున్న ఇంద్రియ వ్యవస్థలు ఆయా స్థితిని కలిగి వుండటానికి కారణం పూర్వ ప్రయత్నం. కోడి మరియు గ్రద్ద వాటి వాటి పూర్వ కర్మ బలాన్ని అనుసరించి ప్రస్తుతం ఆయా శరీర తత్త్వంలో వున్నాయి.
ప్రయత్నమును బట్టి కర్మ, కర్మ తీవ్రతను బట్టి కర్మ బలాన్ని కలిగి వుంటుంది. కర్మ బలాన్ని అనుసరించి శక్తి క్రియా బలం కలిగి వుంటుంది. క్రియాబలాన్ని అనుసరించి దాని ప్రతిఫలం వుంటుంది.
పిల్లి వేటాడే క్రమంలో బలమైన శరీరాన్ని పొందింది, పిల్లి పరుగెత్తుతూ జీవులను వేటాడే క్రమంలో ఎక్కువగా కాళ్ళను వుపయోగించడం వలన దాని కాళ్ళు, శరీరం బలాన్ని పొంది అడవి పిల్లిలా పరిణామం చెందింది. అదే క్రమంలోనే అడవి పిల్లి చిరుత పులిగా, పెద్ద పులిలా, సింహంగా వేరు వేరు రూపాల్లో బలాన్ని సంతరించుకుంది. ఆత్మ మారలేదు కాని దాని మనో భావ౦ ,మనో బలం మార్పుచెందాయి. జీవి వేరు వేరు రూపాన్ని బలాన్ని పొందటం వలన వేరు వేరు జాతులుగా పిలవబడుతుంది.
బంగారం వివిధ రూపాలలో వుంది. ఒకటి ఉంగరంగా ఉపాధిని కలిగివుంది, ఒకటి హారముగా వుంది. రూపాలు వేరైనా దానిలోని బంగారం ఒకటే. అలాగే జీవుల రూపాలు వేరైనా వారిలోని జీవుడు ఒక్కడే.
జీవుడి విశ్వాసమే పంచభూతాలను క్రమంలో వుండేలా చేస్తుంది. దాని ఆదేశాన్ని అనుసరించే పంచభూతాలు శరీరానికి బలమైన జ్ఞానశక్తిగాను, బలహీనమైన జ్ఞానశక్తిగాను వ్యవహరిస్తాయి.
భూతకాలములోని మనో సంకల్పముచే ఒక మెట్టు ఎక్కగలిగే శరీర జ్ఞానాన్ని పొందిన జీవి, ప్రస్తుతము ఒక మెట్టు ఎక్కగలిగే సామార్ధ్యముతో పాటు భవిష్యత్తులో 5మెట్లు ఎక్కగలిగే సామర్థ్యాన్ని సంపాది౦చుకోగలదు.
ప్రస్తుత జన్మలో ప్రయత్న బలంతో 5 కిలోలు ఎత్తగలిగే జీవి, మళ్ళీ జన్మలో ఆ శక్తి వృద్ధిచేసుకుని అదనంగా బరువు ఎత్తగలిగే శక్తిని పొందుతుంది, నడవడం కష్టంగా భావించే జీవి నడిచే ప్రయత్నంలో తన విశ్వాసాన్ని పెంచుకుని వేగంగా నడిచే జీవిగా మార్పుచెందుతుంది. జీవి తన శక్తిని జన్మ జన్మల నుంచి వృద్ధి చేసుకుంటూ బలమైన జీవులుగా రూపాంతరం చెందుతున్నాయి.
చీమలు కొన్ని కోట్ల సార్లు బరువు ఎత్తే క్రమంలో కర్మ బలాన్ని పొంది తమ కన్నా 100 రెట్లు బరువులను అవలీలగా ఎత్తగలిగే మనో బలాన్ని, మనో విశ్వాసాన్ని కలిగివున్నాయి. చీమలు అధిక బరువు ఎత్తడానికి సహకరిస్తున్న పదార్థమును కలిగి వుండటానికి వాటి ప్రయత్న శీలము, సాధనా బలమే కారణము. ప్రయత్నమునకు అనుగుణంగా మనో బలాన్ని పొందింది. వాటి మనో బలాన్ని అనుసరించే పంచభూతాలు ఆకార్యాన్ని నెరవేర్చే అనుగుణమైన పదార్థ ధర్మాన్ని కలిగి వున్నాయి.
చీమ యొక్క జీన్స్ బలమైనవి కనుక బరువులను అవలీలగా ఎత్తగలుగు తున్నాయని అనేకులు భావిస్తున్నారు. వాటి జీన్స్ బలంగా మారడానికి అవి ఇతఃపూర్వము చేసిన కృషియే కారణము అని గ్రహించాలి. జీవి కార్య సాధన వలన తను పొందిన జ్ఞానశక్తియే బలమైన పదార్థ జ్ఞానముగా జీన్స్ రూపంలో కనిపిస్తుంది అని గ్రహించాలి. జీవి పొందిన జీన్స్ ను శక్తి భద్ర పరుస్తుంది. తన వారసత్వానికి బదిలీ చేసి వృద్ధి చేస్తుంది.
చీమలు వాటికి వున్న జ్ఞానానికి అనుగుణంగా నివాసములను, పక్షులు వాటికి వున్న జ్ఞానమునకు అనుగుణంగా గూడును, మనిషి తన జ్ఞానమునకు అనుగుణంగా గృహాలను నిర్మిస్తున్న విధముగా. పరిపాలనాత్మ అయిన జీవాత్మ మనో జ్ఞానమునకు అనుగుణంగా తదనుగుణమైన శరీర జ్ఞానాన్ని కలిగి వుంటుంది. సూక్ష్మ జీవులు వాటి మనో బలానికి అనుగుణంగా అంతే శరీర జ్ఞానాన్ని కలిగివున్నాయి. జంతువులు వాటి మనో జ్ఞానానికి అనుగుణంగా అంతే శరీర జ్ఞానం కలిగి వున్నాయి. మానవులు వారి వారి మనో జ్ఞానానికి మనో బలానికి అనుగుణంగా వివిధ రూపాలైన శరీర జ్ఞానాన్ని కలిగివున్నారు. ఊర్ధ్వలోకాలలో దేవతలు వారి మనో జ్ఞానానికి బలానికి అనుగుణంగా దైవ శరీరాన్ని కలిగి వున్నారు.
26. జీవు ప్రయాణం- బల సమీకరణ.
శ్రీరామ! జీవి వున్న స్థితిని బట్టి బలాన్ని సమకూర్చుకుంటుంది. మానవుడు తన ప్రతిభను ఈ జన్మలోనే వృద్ధి చేసుకొని ప్రదర్శించటంలేదు, ఎన్నో జన్మలనుంచి వృద్ధి చేసుకున్న జ్ఞానం తో తన కార్యాలు చేస్తున్నాడు, ఈ జన్మలో తన కర్మ బలాన్ని అనుసరించి మరింతబలాన్ని పొందుతాడు. పూర్వ సంస్కార జ్ఞానం, ప్రస్తుత జ్ఞానం తనకు సహకరిస్తుంది. జీవుడు సంపాదించిన జ్ఞానాన్ని ప్రకృతి భద్రపరిచి జీవుడికి మళ్ళీ తిరిగి తన జ్ఞానాన్ని తనకు అప్పచెబుతుంది. ప్రతిభావంతుడు ఈ జన్మలోనే పరిపూర్ణ జ్ఞానాన్ని పొందటానికి పూర్వ జ్ఞానం సహకరిస్తుంది. సింహం ఈ జన్మలోనే వేటాడడ౦ నేర్చుకోలేదు, తన పూర్వజ్ఞానం తనను ప్రేరేపిస్తుంది. పిట్ట తాను నివసించడానికి కట్టుకునే గూడు ఈ జన్మలో మాత్రమే నేర్చుకున్నది కాదు, జన్మ జన్మల నుంచి పరిణతి చెందుతూ వస్తుంది. ఇప్పుడు దానికి ఆ పూర్వ జ్ఞానం తనకు ప్రస్తుతం సహకరిస్తుంది. శక్తి పూర్వ సంస్కారాన్ని జ్ఞప్తి చేస్తుంది. ఆయా కార్యములు చేసేలా ప్రేరేపిస్తుంది.
దివ్య శరీరాన్ని కలిగి వున్న జీవుడు భౌతిక శరీరాన్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మార్పుచేస్తున్నాడు. జీవుడు దేహమును సామాన్య స్థూల శరీరం నుండి దైవ శరీరం వరకు అభివృద్ధి చెందడానికి కారకుడవుతున్నాడు.
27. జీవుని విశ్వాసమునకు అనుగుణంగా అతీంద్రియముగా పనిచేస్తున్న శక్తి.
మానవునిలో బలహీన ఉద్దేశ్యం మారాలి. ఏ కార్యమైన అది అంత కష్టమైనది కాదు అనే మనో బలాన్ని పొందాలి. అలా పొందడానికి సాధన ఎంతో ముఖ్యం.
70 కిలోలు వున్న వ్యక్తి అయినా 50 కిలోల బరువును ఎత్తలేక పోవడానికి కారణం అది బలమైనది అనే మనో భ్రమ కలిగి వుండటం. తరచూ ఆయా బరువులను ఎత్తే క్రమంలో తన మనో భ్రమ తొలగుతుంది. దాని పై వున్న దృక్పథం మారుతుంది. అది అంత కష్టమైనది కాదు అనే విశ్వాసం పెంపొందుతుంది. విశ్వాసాన్ని పొందిన వ్యక్తి ఎంత బరువునైనా అవలీలగా ఎత్తగలుగుతున్నాడు. ఎటువంటి కార్యాన్నైనా సానుకూలంగా చేయగలుగుతున్నాడు.
ప్రయత్నం చేయకుండా భ్రమను తొలగించుకోలేరు. ప్రయత్న పూర్వకంగా భ్రమ తొలగినప్పుడే, జ్ఞాన రహస్యం బహిర్గతమవుతుంది.
మనో బలానికి, మనోవిశ్వాసానికి విరుద్ధంగా శరీరజ్ఞానం, మానసిక జ్ఞానం, బుద్ధి బలం అనేది వుండవు.
విశ్వాసము యొక్క రహస్యాన్ని గ్రహించిన పూర్వీకులు దాని జ్ఞానాన్ని పొంది వారి శక్తి సామర్థ్యాలను లోక కళ్యాణానికి వినియోగించారు.
భ్రమను కల్పిస్తున్న మాయ రహస్యాన్ని తెలుసుకున్న వారే శివుడు, మహా విష్ణువు. వారు అత్యధిక సాంద్రత గల పదార్థములతో, సామాన్యులు ఎత్తలేని బరువుతో చేసిన శివ ధనుస్సును, విష్ణు ధనుస్సును ధరించి, సునాయాసంగా ఎక్కుపెట్టే బలాన్ని, విశ్వాసాన్ని పొందివున్నారు. కాలక్రమంలో విశ్వామిత్రుడి అనుగ్రహముతో బల, అతిబల విద్యలను పొందిన శ్రీరాముడు శివధనుస్సును, విష్ణు ధనుస్సును ఛేదించి తన పరాక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు.
శ్రీకృష్ణుడు, ఆంజనేయుడు కొండను అవలీలగా పైకెత్తి తమ బలాన్ని చాటారు. బరువు అనునది జీవుడి మనో భ్రమ, మనో విశ్వాసానికి సంబధించినది.
బలహీనమైన భ్రాంతిని జయించి విశ్వాసాన్ని కలిగి వుండడమే అతీంద్రియబలం. అతీంద్రియ బలాన్ని పొందిన వారిలో కృష్ణుడు, రాముడు, విష్ణువు, శివుడు, ఆంజనేయుడు, సీత, వసిష్ఠుడు, బుద్దుడు, మొదలైనవారున్నారు.
బయటికి వ్యక్తమవుతూ కనిపించే బలం భౌతిక శక్తి. మానవ నేత్రానికి కనిపించకుండా క్రియను కలిగి, కార్యమును అతీంద్రియముగా చేసేది చిత్ శక్తి(will power).
స్వయముగా తన శక్తి సామర్థ్యాలను విశ్వసించినా, లేదా దైవము పై బలమైన విశ్వాసము కలిగి వున్ననూ వారి శక్తి అతీంద్రియముగా పనిచేస్తుంది.
శ్రీ రామా! మంత్రములు కూడా విశ్వాసాన్ని అనుసరించే పనిచేస్తాయి. లేదా విశ్వసించిన గురువులు శిష్యులకు మంత్రోపదేశం చేయడం వలన ఆ శక్తి వారిపై శక్తివంతముగా పనిచేస్తుంది.
28. యోగా, వ్యాయామాలచే మానవుని శరీరము శక్తి వంతం అవుట.
శ్రీ రామా! మానవుడు పరిణామ క్రమ౦లో తన దైన౦దిన జీవితం లో చేసిన పనులు, ప్రయాణాల చే ఎక్కువదూరం నడవటం, పరిగెత్తడం, బరువులు ఎత్తడం వలన తన అవసరముల కోసం చేసిన ఆయా పనుల వలన మనో బలం, మనో విశ్వాసంతో తన శరీరాన్ని బలమైనదిగా మార్చుకున్నాడు.
శరీరంలో అవయవ, ఇంద్రియ బలం తగ్గకుండా, బలాన్ని కలిగి వుండటానికై శారీరక వ్యాయామం చేయాలి లేనిచో శరీరం, అవయవాలు వాటి సత్త్వాన్ని కోల్పోయి బలహీన పడతాయి. ఉపయోగించని అవయవాలు ,ఇంద్రియాలు బలహీన పడతాయి.
శరీరాన్ని బలముగా మార్చడం కోసమే ఋషులు యోగాసనాలను లోకానికి అందించారు. యోగాసనాలు చేయడంవలన తమ శరీరము తేలిక పాటి అనుభవానికి వస్తుంది. యోగసాధన వలన బలహీన మనో భావ౦ తొలగి మనో బలాన్ని పెంపొందించుకుంటారు. తదనుగుణంగా బలమైన శరీరయోగాన్ని పొందుతారు.
కష్టతరమైన ఆసనాలు సాధన చేసే క్రమలో బలహీనత తొలగి, బలమైన దృక్పథం ఏర్పడుతుంది.
శారీరక బలము కోసం యోగాసనాలు చేస్తూ మానసిక బలానికి కూడా మానసిక సాధనలు చేయాలి. మానసిక స్థితిలోని ప్రతికూలతలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని నియంత్రించే సాదన చేయాలి. ఉద్రేకాన్ని, భయాన్ని, వ్యసనాన్ని, అసూయా ద్వేషాలను పరిశీలిస్తూ వాటిని నిలవరించే సాధన చేయాలి. సాధన చేసి వాటిని గెలిచిన వాడే యోగి.
తనలోని శాంత స్వభావం చెదర కుండా చూసుకోవాలి. మనస్సు ప్రశాంతముగా వుంటే జీవుడు ఆనందముగా వుంటాడు. శరీరము బలంగా వుంటుంది.
జీవుడు తన శక్తితో బుద్ధిబలాన్ని పెంపొందించుకొనే ప్రయత్నం చేయాలి. శరీరబలం కన్నా బుద్ధిబలం ఉత్తమ మైనది. బుద్ధి బలం పెంపొందించుకోవడానికి కొత్త ఆవిష్కరణలకోసం ప్రయత్నిస్తూ వుండాలి. కొత్త విషయాలు తెలుసుకుంటూ, ప్రతి పనిలో నైపుణ్యం ప్రదర్శిస్తూ వుండాలి. లేనిచో బుద్ధి బలాన్ని కోల్పోతాడు.
జీవుడు అఖండ శక్తిని కలిగి వున్నాడు. కానీ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక పోవటం వలన పరిమితశక్తితో కనిపిస్తున్నాడు. తన శక్తిని ఉన్నత కార్యములకు, లోకోద్ధరణకు వుపయోగించడం వలన శక్తి తదనుగుణమైన జ్ఞానాన్ని, బలాన్ని సమకూరుస్తుంది.
శరీరానికి వ్యాయామం, బుద్ధికి ఆలోచన, హృదయానికి మంచి అనుభూతి, జీవితానికి ఉత్తమ లక్ష్యం వుండాలి. వ్యాయామం వలన శరీరం బలపడుతుంది, ఆలోచన వలన బుద్ధి బలం పెరుగుతుంది. మంచి అనుభూతులను పొందటం వలన హృదయం మానవత్వాన్ని, దైవత్వాన్ని కలిగి వుంటుంది. ఉత్తమ లక్ష్యాన్ని కలిగి వుండటం వలన శక్తి తదనుగుణమైన లక్ష్యం వైపు నడిపిస్తుంది.
వృత్తి రీత్యా లేదా ఏదైనా కార్యం సంకల్పించినప్పుడు అది కష్టమైనది అనే భావనతో చూడకుండా తన పని తాను చేసుకుంటూ పోతే కొండను సైతం తొలిచేయ గలరు. ప్రతి వ్యక్తి తను చేసే వృత్తిలో దానిపై వున్న దృక్పథం మార్చుకోవాలి.
వర్తమానకాలములో సుఖం, దుఃఖం, శాంతం, ఆనందం ఇలా అనుభవిస్తున్నది ఏదైనా ఉంటే అది భూత కాల కార్యాచరణకు ప్రతిఫలముగా లభించినదే. భవిష్యత్తు తన చేతుల్లో వుంది. దానికి అనుగుణంగా ప్రస్తుతం ప్రణాళికలు రచించుకొని ఆయా ప్రయత్నములు చేయాలి. అప్పుడే మంచి భవిష్యత్తు వుంటుంది.
29.సాధనలో శరీరములోని అయవముల గుణాలు మార్పుచెందుట.
శ్రీ రామా! నీటిలో వుండి వాయు దిగ్బంధనం చేసే వ్యక్తి లేదా ప్రాణాయామం చేసే వ్యక్తి మొదట శ్వాస తీసుకోవడంలో వుక్కిరి బిక్కిరి అవుతాడు, అదే ప్రయత్నం పదే పదే చేయగా మనో భ్రమ తొలగి ఎక్కువసేపు వుండగలను అనే మనో నిశ్చయానికి వస్తాడు. సాదన చేసే క్రమంలో తన ఊపిరితిత్తుల నిర్మాణంలో మార్పు వస్తుంది. ఎక్కువసేపు వుండగలిగే శక్తి ని సంపాదిస్తాడు. ఈ సాదన స్వతంత్రముగా చేయకూడదు. చేయాలని భావిస్తే అనుభవజ్ఞుల పర్యవేక్షణలోనే చేయాలి.
జీవి ఎక్కువ సేపు నీటిలో వుండటానికి ప్రయత్నించడం వల్లనే పంచభూతాలు జీవి సంకల్పానికి అనుగుణమైన శరీర స్ట్రక్చర్ ను నిర్మిస్తున్నాయి. చేప పూర్వ సంకల్పానికి అనుగుణంగా ప్రస్తుతము సుదీర్ఘ సమయము నీటిలో వుండేలా దాని శరీరము మార్పుచెందింది. జీవులు అవి చేసే చర్యలను బట్టి వాటి శరీరములో వివిధ మార్పులను పొందుతున్నాయి.
నీటి లో వాతావరణానికి అలవాటుపడి బయటకు వచ్చిన చేప మొదట్లో మనోవికారానికి లోనవుతుంది, బయటి వాతావరణం బాధిస్తుంది కానీ, అది ఎక్కువగా బయట తిరిగే ప్రయత్నం చేయడంవలన బయట కూడా తిరగగలిగే శరీర నిర్మాణాన్ని పొంది ఉభయ జలచర జీవిగా జీవిస్తుంది.
చేప బయటకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికీ, అది బయట తిరిగి పొందిన మనో నిశ్చయ జ్ఞానం దానిలో అలాగే పూర్వసంస్కార జ్ఞానంగా వుంటుంది, అది మళ్ళీ పుట్టినప్పుడు దానిలోని పూర్వ జ్ఞానం మళ్ళీ బయటకు వెళ్ళేలా ప్రభావితం చేస్తుంది. ప్రభావితమవుతున్న చేప ఎక్కువ సమయము బయట తిరిగే శక్తిని పొందుతుంది. అలా ఆ చేప పూర్తిగా బయట తిరుగుతూ మనో సంకల్పం వలన కాళ్ళు కూడా సంపాదించుకుంటుంది. ఆజీవే కాల క్రమంలో కొన్ని కోట్ల సంవత్సరాలకు బయట తిరిగే జంతువులా మార్పుచెందుతుంది. జీవి పూర్వ కర్మ ఫలముగా ప్రస్తుత శరీర జ్ఞానాన్ని కలిగివుంది.
మానసిక అవస్థలు పొందడమనేది భ్రమ. భ్రమను తొలగించుకొని మనో నిశ్చయం కలిగినప్పుడే విషయ జ్ఞానం ప్రాప్తిస్తుంది.
నీటిలో నుండి బయటకు వచ్చిన జీవి బయట ఎక్కువగా సంచరిస్తున్నచో, నీటిలో వుండగలిగే అవయవగుణాన్ని కోల్పోతుంది. బయట వుండగలిగే గుణాన్ని అభివృద్ధి చెందుతుంది.
30. ప్రకృతి జీవునికి స్వీయ రక్షణను కల్పిస్తుంది.
జీవుల స్వీయ రక్షణ కోసం కొమ్ములను ఆయుధాలుగా, నడవటానికి రక్షణ గా గెట్టెలను, వాటికి అవసరమైన అన్ని విధములైన రక్షణ నిర్మాణాలను శక్తి సమకూరుస్తుంది.
జీవుడు ఆహారంకోసం వేటాడే క్రమంలో ఆవిర్భవించినవి ఆయుధాలు. పాముకు విషపుకోరలు, ఊసరవెల్లికి నాలుక ఆ విధంగా ఏర్పడినవే.
పాముకాటుకు జీవులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కాలానుగుణంగా ఆ జీవులు విషాన్ని తట్టుకునే గుణాన్ని పొంది పామునే వేటాడే శక్తిని పొందుతున్నాయి.
ఆహారం స్వీకరించటానికే దంతాల నిర్మాణం జరిగింది. వాటిని ఏ జీవి ఎంత ఎక్కువగా వినియోగిస్తే ఆ జీవి అంత బలమైన దంతాలను దవడలశక్తిని కలిగివుంటుంది.
జీవి వేటాడే క్రమంలో కాళ్ళను ఎక్కువగా వుపయోగించడం వలన దాని అనుసందానంగా వున్న శరీరం బల పడుతుంది.
31. జీవుడు అమరుడు. శరీరము నందు దివ్య పదార్థముగా వున్నాడు.
జీవుడు తన దివ్యశక్తితో కలిసి దివ్య పదార్థంగా (god particle), దైవ పదార్థం గా వుంటాడు. జీవుడు పూర్వ జ్ఞానము, పూర్వ సంకల్పము, పూర్వ మనో వాంఛలను స్మృతులుగా కలిగి వుంటాడు. అదే విధముగా భౌతిక దేహము నందు తల్లి మరియు తండ్రి యొక్క శరీరజ్ఞానం కలిగివుంటాడు. వారి పూర్వ జన్మలోని కొరికలు, గుణములు జీవుడు చేసే ప్రతి కార్యంలో ప్రతిఫలిస్తూ వుంటాయి, విజ్ఞతతో వ్యవహరించి ధర్మాన్ని అనుసరించి వాటిలో ప్రతికూల గుణాలను తిరస్కరించి, ఉత్తమ గుణాలను పెంపొందించుకోవాలి.
జీవుడు ప్రస్తుత శరీరంతో మరణం లేకుండా వుండాలనుకోవడం అజ్ఞానమే. ఇది బావిలో వున్న కప్ప ఇదే ప్రపంచమని భావించడం లాంటిది. పరిమిత వాహనంలో ప్రయాణిస్తూ ఇదే ఉత్తమ వాహనం అని భ్రమ పడటం లాంటిది. దైవ శరీరాలు వున్నాయి అలాగే దైవ లోకాలు, ఉత్తమలోకాలు అనేకం వున్నాయి. ఉత్తమ లోకానికి, దైవ లోకానికి వెళ్ళేలా ప్రస్తుత శరీరమును సాధనముగా చేసుకోవాలి.
ఒక మేధావి తన శక్తితో ఒక బలమైన గృహం నిర్మించుకున్నాడు. అనివార్య కారణాలవలన ప్రకృతి విపత్తుల వలన ఆ గృహం పడిపోయినా తన మేధా శక్తితో మళ్ళీ నిర్మింకుకో గలడు. అలాగే పంచభూతాలతో నిర్మితమైన జీవుడి భౌతిక శరీరం అనివార్యముగా ,ప్రకృతిలో మార్పుల వలన పడిపోయినా తన చిత్ శక్తి తదనుగుణమైన శరీరాన్ని తల్లి గర్భమునందు మళ్ళీ నిర్మిస్తుంది. జీవుడు తన సంకల్పములకు అనుగుణంగా ఆయా లోకములలో జన్మిస్తూ వుంటాడు.
జీవుడు చైతన్యమై వెలుగొందుతున్న వాడు. అది గ్రహించ లేని జీవుడు దేహమే తానని భావిస్తున్నాడు. బుట్టలోని మణి కాంతి బుట్టంతా వ్యాపించినట్లు, ఆత్మ చైతన్యము దేహమంతా జగమంతా వ్యాపించి వుంది.
శరీరం ఆత్మ చైతన్యముతో గొప్పగా కనిపిస్తుంది. ఆ గొప్పదనం ఆత్మ చైతన్యానిదే. జీవుడు ఆత్మ స్వరూపుడు.
ఏది ఉత్తమమైనదో, ఏది ఆయాసాలు లేనిదో, ఏది శరీరాది ఉపాధులకు అతీతమో, ఏది భ్రాంతిని పోగొడుతుందో, దేనిలో దుఃఖము లేదో అదియే ఆత్మ .
ఆత్మకు శరీరం ఒక విశ్రామ స్థానం.
సత్యాన్ని పట్టుకోవాలి. ఏది అసత్యమో, ఏది అనిత్యమో, ఏది ఆనంద స్వరూపమో దాన్ని తెలుసుకోవాలి. సత్యం, జ్ఞానం, ఆనందం, అనంతమైనదే ఆత్మ.
శరీర పరిమితిలోనే మనస్సు చూస్తుంది, అఖండ మైన సత్తే నీ అసలు స్వరూపం. నీ ప్రజ్ఞను దాని యందు నిలిపితే అది అఖండ మైన శాంతిని ఇస్తుంది. సర్వత్రా దాన్నే దర్శిస్తావు.
ఉత్తమ జ్ఞానాన్ని కలిగి, సత్కర్మలతో, ధర్మ మార్గంలో ప్రయాణించే జీవుడు దైవ శరీర౦, దైవలోకం పొందటానికి అర్హుడు అవుతున్నాడు.
జీవుడు ఉన్నత స్థితిలోకి చేరడానికి జ్ఞానం, సత్కర్మ, ధర్మం ప్రధాన సాధనాలవుతాయి.
32. జీవుడి మనస్సును అనుసరించి పనిచేస్తున్న శక్తి.
జీవుడు ఎక్కడికి వెళ్లాలో స్పష్టత వుంటే శక్తి ఆ మార్గం వైపు అతణ్ణి నడిపిస్తుంది.
శక్తికి అలసట అనేది వుండదు. మనస్సు అలసట చెందుతుంది. మనస్సు అలసటగా భావించినప్పుడే శక్తి తదనుగుణమైన జ్ఞానమునే భ్రమింపచేస్తుంది. జీవుడు జ్ఞానము తో సరైన గమ్యాన్ని ఎంచుకొని కర్మలు చేయాలి.
జీవుడు విషయ జ్ఞానంతో, విషయ వాంఛతో విషయ బీజాలను వేస్తున్నాడు, ’శక్తి’ ఆ విషయ వృద్ధికి సహకరిస్తుంది.
జీవుడు విశ్వాసం కలిగివుంటే శక్తి అతీంద్రియంగా పనిచేస్తుంది. భ్రమ, సంశయం కలిగి వుంటే శక్తి అలాగే పనిచేస్తుంది.
జీవుడు విషయముల పుట్టుకకు తండ్రి వంటి వాడు . చిత్ శక్తి విషయములు పుట్టించుటకు, వృద్ధి చెందుటకు సహకరిస్తున్న తల్లివంటిది. వారి నుండి పుట్టిన భౌతిక శక్తియే విషయ జ్ఞానముగా కనిపిస్తుంది.
జీవుడు తన హృదయ క్షేత్రంలో ఏ విషయ బీజాన్ని వేస్తే, శక్తి ఆ బీజాన్ని వృద్ధి చేసి మహావృక్షాన్ని చేస్తున్నది.
శ్రీరామ! జీవుడు విషయ భావన చేయడమంటే శక్తితో విషయావిర్భావానికి సహకరించడమే.
ఇతరుల పై జీవుడి ఆగ్రహం శక్తి ఆగ్రహం ఒకటే, జీవుడి చల్లని చూపు శక్తి చల్లని చూపు ఒక్కటే. ఒకరిపై జీవుడి అనుగ్రహం శక్తి అనుగ్రహం ఒకటిగానే వుంటాయి. వేరు వేరు గా వుండవు. కావున ఎదుటి వారిని ప్రేమించడం, గౌరవించడం, ఆనందింప చేయడం శుభపరిణామానికి దారి తీస్తుంది. ఎదుటి వారిని ద్వేషించడం, భాదపెట్టడం అమంగళములకు దారి తీస్తుంది.
జీవుడు ఎల్లవేళలా శ్రేయస్కరమైనది, మంగళకరమైనది గ్రహించి దానిని పొందే ప్రయత్నమునే చేయాలి.
జీవుడు సంకల్పించిన అనంతరము ఆ కార్యమునకు శక్తి ప్రేరేపిస్తుస్తుంది. మంచి అయినా చెడు అయినా బుద్ధికి అనుగుణంగా ప్రేరేపిస్తుంది. కావున ఉత్తమ సంకల్పములు, ఉత్తమ గుణములు కలిగి వుండాలి.
జీవుడు దివ్యమైన భావాన్ని కలిగి వుంటే తన శక్తి దివ్యశక్తిగా మారుతుంది. దుష్ట భావాన్ని కలిగి వుంటే తన శక్తి దుష్ట శక్తిగా మారుతుంది.
జీవుడు కలిగి వున్న శక్తి అన్ని కోరికలను తీర్చే కామ ధేనువు, కల్పవృక్షం. కానీ ఏది అడగాలో, ఎలా అడగాలో తెలుసుకొని అడగాలి. లేకపోతే మంచితో పాటు చెడు కూడా పుచ్చుకోవలసి వస్తుంది.
శక్తి తత్త్వం లో ప్రతికూలమైన అంశం ఏది అంటే దుష్ట సంకల్పాలు చేసే దుర్మార్గునికి శక్తిని ఇస్తుంది. మంచి సంకల్పాలు చేసే మహనీయునికి శక్తిని ఇస్తుంది. దాని కారణంగా ఒకొక్క సారి దుర్మార్గుడు కూడా బలవంతుడవుతున్నాడు.
శ్రీరామ! జీవుడు దేనికోసం చింతిస్తున్నాడో మంచి చెడు అనే భేదాలు లేకుండా శక్తి దాన్నే వృద్ధి చేస్తుంది. జీవుడు తలచిన విషయం నిప్పురవ్వగా మొదలవుతుంది. సదా మనన౦ చేయడం వలన విచారణా బలం పెరిగి అది జ్వాలగా మారుతుంది. జీవుడు విషయమును మననం చేస్తూ శక్తికి ఆహార౦ గా ఇచ్చి విషయోత్పత్తికి సహకరిస్తున్నాడు.
శ్రీ రామా! జీవుడు మనసులో మధురవిషయాలను తలంపు చేస్తే మధురఫల బీజం వేసినట్లే, విషతుల్యమైన తలంపు చేస్తే విష బీజం వేసినట్లే. జీవుడు ఏ బీజం వేస్తే శక్తి దాన్ని వృద్ధి చేస్తుంది. ఆయా ఫలితాలనే ఇస్తుంది.
ఒకే విషయాన్ని ఏకాగ్ర చిత్తంతో మననం చేయడం వలన విషయ బీజం పడుతుంది .
శ్రీరామ! ప్రశాంత మైన మది నుండి పుట్టిన ఆనందపూర్వక విషయములే శాంతం, ఓర్పు, సహనం, ధైర్యం, సంతోషం, నిర్మలత్వం, విశ్వాసం, ధర్మం అనేవి. దుర్మార్గమైన మది నుండి పుట్టే బాధావ్యక్త విషయములే క్రోధం, భయం, దుఃఖం, భ్రమ, అశాంతి, అజ్ఞానం, అధర్మం అనేవి.
ప్రకృతి విష రూపంలోను వుంది. అమృత రూపంలోనూ వుంది. ఏది పుచ్చుకోవాలనేది జీవుని చేతిలో వుంది. ద్వేషం, స్వార్ధం,అసూయ అనే మలినపూరిత హృదయం వలన విషాన్ని ఇస్తుంది. ప్రేమ, కరుణా, అప్యాయతా అనే భావాలతో పవిత్ర హ్రదయం కల్గి వున్న వాడికి అమృతాన్ని ఇచ్చి అమరుడిని చేస్తుంది.
కర్మ మొదట మానసికంగా మొదలై తరువాత భౌతిక రూపం దాలుస్తుంది .
సృష్టించబడిన వస్తు, వాహనాలన్నీ, వారి వారి మనో సంకల్పాలకు అనుగుణంగా సృష్టించబడినవే. సృష్టించబడిన వస్తువులను ఇంకా మెరుగు చేయాలనే కుతూహలమే ఆ వస్తువులను ఉన్నతముగా రూపుదిద్దుకోవడానికి కారణం అవుతుంది. విషయం మీద ఆలోచనా బీజం పడితే, శక్తి కార్యానికి ప్రేరేపిస్తుంది. వచ్చే ప్రతి ఆలోచన వారు పూర్వం సంకల్పించిన విషయమే వారి యందు సంస్కార రూపంలో వుంటుంది. సంస్కార జ్ఞానాన్ని‘శక్తి’ గుర్తుచేస్తుంది. కార్యానికి ప్రేరేపిస్తుంది .
శక్తిని జ్ఞానంతో సంయోగం చేస్తే జ్ఞానం పుడుతుంది, అజ్ఞానం తో సంయోగం చేస్తే అజ్ఞానం పుడుతుంది.
జీవులు కలిగి వున్న శక్తులన్ని పరిమితమైనవే. వారి ప్రయాణంలో అదనపు జ్ఞానాన్ని సంపాదిస్తున్నాయి. అన్ని జీవ జాతులకన్నా మానవుడు అదనపు బుద్ధిబలాన్ని కలిగి వున్నాడు. మానవుడు కలిగివున్న శక్తి కూడా పరిమితమైనదే. ఇంకా పొందవలసినది ఎంతో వుంది .
జీవుడు చేసే అనేక ప్రయత్నాలలో తన భ్రమను ఛేదించడం వలన తత్త్వం బోధపడుతుంది.
ధర్మబద్ధంగా నడిచే జీవుడే దేవుడు, శక్తి దేవత ధర్మరూపంలో వుంటుంది.
జీవుడి మనోధర్మానికి విరుద్ధంగా శక్తి ధర్మాన్ని కలిగి వుండదు.
నదిలోని నీటిని పొలములోని మొక్కలకు మళ్లించే విధంగా, తన శక్తిని సరైన దిశలోకి మళ్లించే మార్గమే సత్కర్మ, సన్మార్గం, స్వధర్మం.
ధర్మాన్ని అనుసరించి, ప్రకృతి నియమాన్ని అనుసరించి మానవుడు వ్యవహరించాలి. ధర్మానికి విరుద్ధంగా, ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఊహించని పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది.
శక్తికి పరిమితి అనునది వుండదు. శక్తి కాంతికన్నా వేగంగా ప్రయాణించగలదు. మనో సంకల్పం పంచభూతాలకు కాంతికన్నా వేగంగా అందుతుంది. మనో సందేశం భూత భవిష్యత్తులకు కూడా ప్రయాణిస్తుంది. పంచభూతాలు ఆయా సందేశానికి అనుగుణంగా ప్రతి స్పందిస్తున్నాయి.
కాల జ్ఞానులు వారికున్న మనో దృష్టితో భవిష్యత్తును తెలుసుకొవాలనుకోవడం వలన పంచభూతాలు భవిష్యత్తును స్ఫురింప చేస్తున్నాయి. భవిష్యత్తును తెలుసుకోవడం సృష్టి నియమాలకు విరుద్ధం కనుక ‘దైవ శక్తి’ ఎంతవరకు తెలియ చేయాలో అంత వరకు మాత్రమే భవిష్యత్తును చూపిస్తుంది.
వ్యాస భగవానుడు, బ్రహ్మం గారు, మొదలైన వారు వారి తపోబలం వలన కొంత వరకు మాత్రమే భవిష్యత్తును తెలుసుకోగలిగారు. పూర్తిగా తెలుసుకోవాలని ప్రయత్నించినా సృష్టి నియమాలకు విరుద్ధం కనుక శక్తి అడ్డుపడుతుంది. భవిష్యత్తును గూర్చి అష్టవసువులు, ధర్మ దేవతలు మాత్రమే పరిపూర్ణముగా తెలుసుకొనే శక్తిని కలిగి, సృష్టి కార్యములను చేస్తారు.
జీవుడు తన భౌతికశక్తి పరిణతి చెందడం వలన సంపాదించినవే, వాయుగమనం, దూరశ్రవణం వంటివి.
పక్షి భౌతికముగా శక్తిని పెంచుకొని రెక్కల సహాయంతో వాయుగమనం చేస్తుంది .
ఆంజనేయుడు, విభీషణుడు, వాలి మొదలైన వారు శక్తి రహస్యాన్ని గ్రహించి భౌతిక మైన రెక్కలు అవసరం లేకుండా అతీంద్రియ శక్తితో వాయు గమనంతో ఆకాశయానం చేశారు.
33. జీవుని జ్ఞానం సంస్కార రూపంలో.
పూర్వ జ్ఞానాన్ని విద్యాలయ౦ లో ఎలాగయితే సమకూర్చుకుంటారో అలాగే శరీర జ్ఞానం తల్లి గర్భాలయంలో పొ౦దుతున్నారు. ప్రకృతి గుణముగా వున్న దేహము దేశ కాలాలకు పరిస్థితులకు అనుగుణంగా ఆయా సంస్కారాలను జ్ఞప్తి చేస్తుంది. బాల్యము, యౌవనము, కౌమారము, వృద్ధాప్యము మొదలైన దశలలో పూర్వ జ్ఞానాన్ని జ్ఞప్తికి తెస్తుంది. అలాగే నీటి దగ్గర నీటి జ్ఞానాన్ని, అగ్ని దగ్గర అగ్ని జ్ఞానాన్ని శక్తి జ్ఞప్తికి తెస్తుంది.
దివ్య దేహము నందు మనస్సు, బుద్ధి, అహకారము సమన్వయంతో సంస్కార రూపములో వుంటుంది. భౌతిక దేహము లో విషయ జ్ఞానాన్ని అనుభవానికి ఇచ్చే ప్రకృతి గుణముగా DNA, జీన్స్ రూపములో వుంటుంది. జీవుని శరీర జ్ఞానం సూత్రమాల వంటిది ఆ సూత్రమాలను(DNA) మహా శక్తి అర్హులైన వేరొకరికి దానం చేస్తుంది. శరీర జ్ఞానాన్ని అభివృద్ధి చేసిన జీవుడు జ్ఞానదాత. దాన్ని పొందడానికి అర్హతను, అధికారమును కలిగివున్న వాడు జ్ఞాన గ్రహీత.
పంచభూతాలతో నిర్మించచబడిన ఈ స్థూల దేహం నశించినప్పటికీ దివ్య దేహము నశించదు. దానికి సూక్ష్మ దేహం అని పేరు. జీవి మరణించడం అంటే తన శరీరం భౌతిక కార్యమునకు సహకరించనప్పుడు ‘జీవుడు’ భౌతిక శరీరాన్ని వదిలి సూక్ష్మ దేహముతో తన కోరికలకు, సంకల్పాలకు అనుగుణ మైన వేరొక శరీరములోకి ప్రవేశిస్తాడు.
34. అభివృద్ధి చెందిన శరీర జ్ఞానాన్ని జీవుడు ప్రాప్తముగా పొందుతున్నాడు.
జీవుడు వేరొక జీవునికి తన శరీర జ్ఞానం దానం చేయడం వలన ఆ జ్ఞానాన్ని పొందిన జీవులన్ని ఒకే శరీర జ్ఞానాన్ని కలిగి వుంటున్నాయి. 10 కోట్ల సం,, క్రితం వున్న తాబేలు లోని జీవుడు, ఇప్పుడు కనిపిస్తున్న తాబేలు లోని జీవుడు ఒకటి కాదు. పూర్వ కాలములో తాబేలు శరీరాన్ని ధరించిన జీవుడు తన బలహీనతను ఛేదించి ప్రస్తుతము ఇతర జీవిగా పరిణామం చెందినాడు. పూర్వం అభివృద్ధి చేసిన శరీరమును ‘ప్రకృతి’ వేరొక జీవికి దానం చేస్తుంది. దాని కోరికలకు, అవసరాలకు అనుగుణంగా వున్న జీవికి శరీరాన్ని ప్రాప్తింపచేస్తుంది.
కొన్ని యుగాల క్రితం పిల్లి శరీరాన్ని ధరించిన జీవుడు తన లోని బలహీనతను ఛేదించి ప్రస్తుతం పులి లేదా సింహముగా దేహ దారుఢ్యాన్ని పొంది వున్నాడు. దీని పూర్వ శరీర జ్ఞానాన్ని వేరొక జీవుడు ధరిస్తున్నాడు.
ఒకరు తన మేధా శక్తితో తయారు చేసిన వాహనాన్ని ఇతరులు ఎలా గయితే ఉపయోగిస్తున్నారో అలాగే జీవుడు తాను అభివృద్ధి చేసిన శరీరాన్ని వేరొక జీవుడు కూడా ఉపయోగిస్తున్నాడు. కారును చేసిన వాడు తన మేధా సంపత్తిని పెంచుకొని ఇంకా ఉత్తమ వాహనాన్ని పొందుతున్న విధముగా జీవుడు తాను పొందిన శరీరాన్ని ఇంకా ఉన్నతికి తీసుకువస్తున్నాడు. అందువలన పూర్వము ఒక జీవిగా కనిపించిన దాని లోని జీవుడు ఇప్పుడు అదే శరీరముతో కనిపిస్తున్న దాని లోని జీవుడు ఒకటి కాదు అని గ్రహించాలి.
జీవుడు అభివృద్ధి చేసిన శరీర జ్ఞానాన్ని ప్రకృతి భద్ర పరచి ఆ శరీర జ్ఞానాన్ని అనేక దివ్య దేహములకు ఇస్తుంది . ఆ కారణముచే పూర్వము ఒకప్పటి జీవుని శరీర జ్ఞానాన్ని ప్రస్తుతము వేరొక జీవుడు ప్రారబ్ద జ్ఞానముగా పొంది అదే శరీర జ్ఞానముతో కనిపిస్తున్నది. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చూసిన కోతి శరీరం లోని జీవుడు తన శక్తి సామర్ధ్యములను పెంచుకుని తన దేహమును చింపాంజీగా శక్తి వంతం చేశాడు. చింపాంజీ వేటాడుతూ బలాన్ని పొంది, తన మెదడుకు ఆలోచించే తత్వం అధికమయింది. ఆలోచనలచే దానిలో మానవత్వము మేల్కొని తన దేహాన్ని అడవిమనిషిగా శక్తివంతం చేశాడు. అడవి మనిషి తన వ్యూహాలతో, బుద్ధి ని పెంపొందించుకొని , వివిధ కార్యములను చేస్తూ ఇతరులపై కరుణ, దయ ప్రదర్శిస్తూ, సహాయం చేసే గుణాన్ని అవలంభించడం వలన మానవత్వం పూర్తిగా మేల్కొని జీవుడు మానవ దేహమును పొందాడు. జీవుడు చేసే ప్రతి కార్యానికి శక్తి ప్రేరణ వుంటుంది. జీవుడు ఆయా కార్యాలు చేసేలా శక్తి ప్రభావితం చేస్తుంది. జీవుడు, శక్తి సహకారముతోనే పరిపూర్ణ మానవ దేహాన్ని పొందగలిగాడు.
ఎటువంటి భౌతిక దేహాన్ని జీవుడు ధరించినా దాని లక్షణానికి వేరుగా అతడు ప్రవర్తించడు. అదే తను అయి వుంటున్నాడు. కుండలో పోసిన నీరు కుండాకారాన్ని కలిగివున్న విధముగా, ఆయా భౌతిక దేహాన్ని ధరించిన జీవుడు తదనుగుణమైన భౌతిక రూపము, గుణము, బలము కలిగి వుంటున్నాడు.
35. దైవ శరీరం వరకు పరిణామక్రమం.
పరిణామక్రమం మానవ దేహం వరకు మాత్రమే అభివృద్ధి చెందిందని కొందరు భావిస్తారు. కానీ జీవుడు దైవ శరీరం వరకు అభివృద్ధి చెందాడు. దైవ శక్తి స్వరూపుడైన మహావిష్ణువు అనేక యుగాల క్రితమే మానవ శరీరాన్ని దైవ శరీరముగా పరివర్తనం చేశాడు.
దివ్య దృష్టి కలిగిన మహాతపస్వులు మహా విష్ణువు ధరించిన అవతారాలను తెలియా చేస్తూ పరిణామ క్రమం గురించి అనేక యుగములకు ముందే తెలియ చేయడమైనది. వాటిని వివరించేవే మత్స్యావతారం, కూర్మావతారం, వరాహవతారం, నరసింహావతారం, వామనావతారం, పరుశురామావతారం, శ్రీ రామావతారం, శ్రీ కృష్ణావతారం, బుద్ధావతారం, కల్కి అవతారములుగా వివరించడమైనది. అలాగే వానర రూపం ధరించిన హనుమంతుడు, ఏనుగు శిరస్సు ధరించిన వినాయకుడు, అశ్వము యొక్క శిరస్సును ధరించిన హయగ్రీవుడు మొదలైన వారి అవతారాలు పరిణామ క్రమ వృక్షాన్ని(శాఖలు) తెలియ చేస్తుంది.
మహావిష్ణువు తన శక్తిని ఆయా శరీరాలలోకి ప్రసరింపజేసి వాటి తత్వంలో మార్పు కలిగిస్తాడు. ఒకే దిశలో ప్రయాణిస్తున్న జీవులను ఆ దిశనుండి మళ్లించి ఉన్నత దిశలోకి దారితీస్తాడు. ఆ దిశామార్పు వల్లనే ఉన్నత మానవ శరీరం, దైవ శరీరం ఆవిర్భవించాయి.
అనేక యుగములు క్రితమే వారు దివ్య శక్తితో పొందిన అతీంద్రియ జ్ఞానాన్ని, దేహ జ్ఞానాన్ని, వారికున్న గుణాలను బట్టి వారిని దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు అనే నామములతో పిలుస్తుండే వారు. వారు అంతరించి పోలేదు. వారు సంస్కార జ్ఞానానికి తగ్గట్టుగా ఆయా లోకములలో జీవిస్తున్నారు. వారి వారసత్వముగా దేహ జ్ఞానాన్ని పొందిన జీవుడు ఆ తత్వాన్ని ఎక్కువ కాలం కొనసాగించక పోవడం వలన దైవత్వాన్ని కోల్పోయి మానవ దేహముతో కనిపిస్తున్నారు. ఉపయోగించని ఇంద్రియం బలహీన పడుతున్నట్లే, దైవ గుణములో వుండని జీవుని దేహ గుణాలు బలహీన పడుతాయి. పవిత్ర హృదయంతో దైవత్వాన్ని పొందారు. పవిత్రత లోపించడం వలన, మలినాలు అంటుకోవడం వలన మానవ దేహముతో కనిపిస్తున్నాడు. అయినప్పటికీ ఆయా దైవ గుణాలు మానవ దేహము నందు నిగూఢముగా వున్నాయి. వారి హృదయ పవిత్రతను బట్టి, సంకల్పాలను బట్టి మెల్కోంటాయి. తన దైవత్వాన్ని తెలుసుకుంటే ప్రకృతి తన దైవ లక్షణాన్ని తిరిగి సమకూరుస్తుంది.
జీవుడు తన పవిత్ర ఉద్దేశాన్ని పరీక్షించుకుంటూ వుండాలి. అలా లేని పక్షములో పవిత్ర హృదయంతో వుండేలా సాధన చేయాలి. ఎంత కాలం పవిత్రంగా వున్నాడో తన తపో బలాన్ని బట్టి తనలోని దైవత్వం మేలుకుంటుంది. కణములు వాటి కవే దైవగుణం లోకి మార్పుచేసుకుంటాయి.
శ్రీ రామా! ఈ భూమండలములో దైవాత్మ మనోభావనకు, మనో సంకల్పానికి అనుగుణంగా అభివృద్ధి చేసిన శరీరమే జీవుడు ధరించిన మానవ శరీరము. ఈ శక్తి వంతమైన దేహము జీవుని సంకల్పాలను నెరవేర్చే శక్తి సామర్ధ్యములను కలిగి వున్నది. ఈ శరీరమును శ్రీమహా విష్ణువు, మహా శివుడు, శ్రీరాముడు, శ్రీ కృష్ణుడు, జగన్నాదుడు, తిరుమల వేంకటేశ్వరుడు, మహా వీరుడు, బుద్దుడు మొదలైన వారు ఈ శరీరాన్ని వారసత్వముగా ధరించి లోకానికి సేవచేశారు. వారు ధరించిన శరీర రూపం వేరయినా లక్షణం వొకటే. వారి వారసత్వముగా, జీవుని పూర్వ కర్మ లను అనుసరించి ప్రస్తుతము ఈ శరీరాన్ని అనేకులు ప్రాప్తముగా పొందారు. ప్రాప్తముగా పొందిన ఈ శక్తివంతమైన శరీరాన్ని కొందరు మంచిగా, సత్కర్మలు చేస్తూ సన్మార్గంలో నడుస్తూ మహనీయులుగా లోకాన్ని ఉద్ధరిస్తున్నారు.
యోగ, ధ్యాన, తపస్సులచే శరీరాన్ని శక్తి వంతం చేయాలి. అప్పుడే మహాత్ములు వచ్చినా అంతే శక్తి వంతంగా ఈ శరీరం ప్రతిస్పందిస్తుంది. యుద్ధం చేసే యోధుడికి మంచి అస్త్రములు ఎంత ముఖ్యమో, దైవము చేసే కార్యానికి మంచి శరీరం అంతే ముఖ్యం. కాబట్టి దైవత్వము పొంది వున్న శరీరాన్ని నిర్లక్ష్యముచే బలహీన పరచకూడదు. ఇంకా శక్తి వంతంగా మార్చాలి.
మతములు అన్నవి మానవుడు సృష్టించినవి. ఈ లోకంలో ధర్మ దేవతలు, ధర్మ రాజులు పాలకులుగా వుండే వారు. వారే సనాతన ధర్మ రక్షకులు. ఇప్పుడు ఆ ధర్మ రక్షకులు హిందువులుగా పిలవబడుతున్నారు. కాలక్రమంలో పాలకుల నిర్లక్ష్యం వలన ధర్మం తగ్గుతూ, అధర్మం పెరుగుతూ వచ్చింది. ధర్మం మరుగున పడింది. త్వరలో ఈ లోకాన్ని మల్లీ ధర్మమే పాలిస్తుంది.
ఇక కులాలుగా చలామణి అవుతున్నవి వారి వారి పూర్వీకుల వృత్తులు. ఒకప్పుడు వారి పూర్వీకుల వృతియే కాలక్రమంలో కులముగా మార్పుచెందింది. ఒకడు నా కులము గొప్ప అని మాట్లాడటానికి వాడి అజ్ఞానమే కారణం. పంచభూతాలలో ఆ ఒక్క గుణమే చాలా గొప్పది అనుకోవడం ఎంత అజ్ఞానమో అలాగే వారి వారి కులమే గొప్ప అనుకోవడము అంతే అజ్ఞానము. పూర్వము అన్ని వృత్తుల వారు కలిసి సమాజాన్ని స్థిరముగా, బలముగా వుంచినారు.
ఈ భూమి మీద వున్న అన్ని జీవులు, మానవులు ఈ భూమండలములో మాత్రమే వృద్ధి చెందినవికాదు. అనేక భూమండలాలు వున్నాయి. అనేక లోకాలు వున్నాయి. సప్త ఊర్థ్వ లోకాలు, సప్త అధోలోకాలు ఉన్నాయి. మానవులందరూ ఈ భూమండలంలో మాత్రమే అభివృది చెందలేదు. అనేక లోకాలలో వేరు వేరు గుణాలతో జీవించి తమ ప్రాప్తముగా, ధర్మాన్ని అనుసరించి ఇక్కడికి వచ్చి సేవలు చేస్తున్నారు. జీవులు ఆయా లోకములలో అభివృద్ధి చెందుతున్నాయి. జీవుల కర్మ ఫలాలకు అనుగుణంగా అనుకూల వాతావరణం వున్న చోటికి వస్తున్నాయి. వెళుతున్నాయి.
జీవుడు ఏ శరీరాన్ని దానముగా పొందివుంటే, ఆ శరీర లక్షణముతోనే జీవిస్తున్నాడు. పూర్వ సంస్కార జ్ఞానం స్ఫురించినా, ప్రస్తుతము పొంది వున్న వంశపారంపర్య శరీర జ్ఞానమే ఎక్కువ శాతం ప్రభావితం చేస్తుంది. అలాగే చుట్టూ వున్న వాతావరణం, సత్సంగము, తను నేర్చుకున్న చదువు, సంస్కృతిసంప్రదాయాలు, సంస్కారము మొదలైన వాటి చేత ప్రభావితమవుతూ వుంటాడు. జీవుడు పూర్వ ప్రస్తుత జ్ఞానముతో వ్యవహరిస్తూ వుంటాడు.
పూర్వము జీవునికి ఆనందాన్ని ఇచ్చినవి, సంతోషాన్ని ఇచ్చినవి వాసనా బలముగా జన్మ జన్మాంతరాలుగా వెంట వస్తూనే వుంటాయి. వాసనలు అన్నవి తను తిన్నది, త్రాగుతున్నది, చూస్తున్నవి, అనుభవిస్తున్నవి అన్నీ వాటిపై జీవునికి ఇంకా మమకారం, బలమైన కోరిక వుంటే వాటిని నెరవేర్చే తదనుగుణమైన శరీరాన్ని పునర్జన్మలో పొందుతున్నాడు. జీవులు వారి వారి అభిరుచులను బట్టి వారు విద్వాంసులుగా, గాయకులుగా, పాలకులుగా, విద్యావంతులుగా, గుణవంతులుగా వుంటున్నారు.
జీవుని మానస నగరంలో ఏ ఏ కోర్కెలు అగ్రగణ్యముగా ఉంటాయో వాటిని అనుసరించి అందుకు తగినట్టి భౌతిక దేహమును అతడు ధరిస్తున్నాడు.
దివ్య దేహము యొక్క మనోబలాన్ని అనుసరించి రాగద్వేషాలను, కోపతాపాలను, కోరికలను నియంత్రించడం జరుగుతుంది. పరిమిత మనో బలాన్ని కలిగి వున్న జీవుడు ఆయా కోరికలను నియంత్రించలేక నిశ్చేష్టుడై వ్యసనముల బారిన పడుతుంటాడు. దాని కారణముగా అతిగా మద్యము సేవించడం, వివిధ వ్యసనములకు అలవాటు పడటం, బద్దకాన్ని వదలక పోవడం, ఇతరులపై ద్వేషాన్ని కల్గిఉండడం, కోపతాపాలను నియంత్రించలేకపోవడం వంటివి జరుగుతుంది. కాని యోగా సాధకుడు కేవలం తన సాధనా బలముచే వాటిని నియంత్రించగలిగే శక్తిని పొందగలడు.
జీవుడికి నిత్యానుభవములో వుండేవి విషయములు. అనుభవములో లేనిది ఆత్మ చైతన్యం. ప్రయత్నముచే ఆత్మ చైతన్యాన్ని అనుభవములోకి తెచ్చుకోవాలి. పదార్థ మేమిటో, పరమార్థ మేమిటో వివేకముతో వేరు చేసి చూడాలి.
దేనిని దేహము, జగత్ అని అనుకుంటున్నాడో దాని అసలు స్వరూపం విచారణ చేసి మరీ తెలుసుకోవాలి.
జీవుడు ఈ శరీరమే నేను అనుకోవడం వల్ల, ఈ శరీరాదులకున్న ఆయువునాది అనుకోవడం వల్ల, భ్రమతో దుఃఖ కారణాలైన విషయములను పట్టుకోవడం వలన బాదకు గురవుతున్నాడు. తాను ఆత్మ చైతన్యము అని తెలుసుకున్ననాడు బాధలనుంచి విముక్తి పొందుతున్నాడు.
ఆత్మ శస్త్రముల చేత నరకబడేది కాదు. అది అగ్ని చేత కాల్చబడదు, అది నీటి చేత తడప బడదు, అది వాయువు చేత త్రోయబడదు. కప్పబడదు. ఆత్మ ఏ విషయముల చేత నశించబడదు. ఆ ఆత్మయే నీయందు వున్నది. ఆ ఆత్మ నీవై వున్నావు.
దైవ సభలోని సభాధ్యక్షుడు : ధర్మాచార్య మహా శక్తి శ్రీరాముడికి చెప్పినవి, జీవుడు ఇంద్రియములను ఎలా పొందుతున్నాడు సాధన, విశ్వాసము యొక్క గొప్పతనమును, జీవుడు దైవత్వాన్ని పొందుట,కోల్పోవుట వంటి విషయాలు చాలా చక్కగా వివరించారు. నాకు ఒక సందేహము వుంది దానిని కూడా వివరించవలసినదిగా విన్నవిస్తున్నాను. అదేమనగా జీవుడు సంకల్పము వలన కాళ్ళు, శరీరం, ఇంద్రియములు సిద్ధిస్తున్నాయి. ఎటువంటి సంకల్పం చేయ కున్ననూ గుండె, ఊపిరితిత్తులు అనేక విధములైన అవయములు, ఇంద్రియములు శరీరము న౦దువున్నాయి అవి ఏ విధముగా ప్రాప్తించినవి?
ధర్మాచార్యులు: ఇదే సందేహముతో శ్రీరాముడు మదన పడుతూ వుండగా, అప్పుడు మహా శక్తి శ్రీరాముడితో ఈ విధముగా చెప్పింది.
36. భవిష్యత్తుకు అనుగుణంగా దేహ నిర్మాణం, సృష్టి నిర్మాణం.
మహా శక్తి: శ్రీ రామా! జీవుడు కాళ్ళు కావాలని సంకల్పించడం వలన కాళ్ళు ఆవిర్బవించటం లేదు. జీవుడు నడవాలనే ప్రయత్నం చేయడం వలన నడవడానికి అనువైన సాధనముగా శక్తి పంచభూతాలచే కాళ్ళ ధర్మాన్ని కల్పించినది. పక్షి రెక్కలు కావాలని సంకల్పించటం లేదు దాని అవసరము కోసం ఎగిరే ప్రయత్నంలో దాని కార్యసంకల్పానికి అనుగుణంగా శక్తి రెక్కలు సమకూర్చింది. జీవుడు ఇంద్రియముల కోసం సంకల్పించకున్నను జీవుడు కార్య సంకల్పానికి తదనుగుణమైన కాళ్ళు, చేతులు, నేత్రాలు మొదలైన ఇంద్రియములు ఆవిర్భవించిన విధముగా, అవయవములకోసం సంకల్పించకున్ననూ జీవి భవిష్యత్తుకు అనుగుణంగా ఇంద్రియముల పోషణ, రక్షణ కోసం అనుబంధముగా ఆవిర్భవించినవే, శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ. వాటిలో భాగముగా ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ మొదలైన అవయవాలు నిర్మించబడ్డాయి.
శ్రీ రామా! శక్తి అష్టవసువులకు దేశము, కాలము యొక్క ధర్మాన్ని కల్పించింది. వాటికి అందిన సమాచారాన్ని అనుసరించి భవిష్యత్తుకు అనుగుణంగా దేహ నిర్మాణము, సృష్టి కార్యములు జరుగుతున్నాయి.
దేహము లోని అవయవాలు, ఇంద్రియాలు నిరంతరం శక్తివంతముగా వుండటానికి వాటి పొషణకు, రక్షణకు ఆహారము అందేలా జీవికి ఆకలి కల్పి౦చబడుచున్నది. తదనుగు౦గా పంచభూతాలు ఆకలిని ప్రేరేపించే గుణము గల కర్మేంద్రియముగా వుంటున్నాయి. ఆకలి ప్రభావంతో జీవుడు ఆహారం స్వీకరిస్తున్నాడు.
37. సృష్టి క్రమంలో, నిష్పత్తిలో వుండేలా కల్పింపబడిన ధర్మాలు.
విశ్వం క్రమంలోను, నిష్పత్తిలోను వుండటానికై దైవము తన శక్తిచే ప్రకృతిలో కొన్ని నియమాలు కల్పించడమైనది. వాటిలో భాగమే భూతాత్మలు పంచభూత ధర్మాలను, పరిపాల నాత్మలు స్త్రీ, పురుష ధర్మాలను కలిగి వున్నారు. భూతాత్మలు ఒకరికొకరు సహకరించుకొని పంచభూతములుగా ఉపాధి ధర్మాలను కలిగి వున్న విధముగా, పరిపాలనాత్మలు అయిన జీవాత్మలు కూడా ఒకరికొకరు పరస్పర సహకారము కోసం స్త్రీ పురషాది శరీర ఉపాధి ధర్మములు కల్పించబడింది.
జీవుడు సంకల్పించకున్ననూ ప్రాప్తించినవే స్త్రీ పురుష లింగ భేదాలు. జీవ నిష్పత్తిని అనుసరించి లింగ భేదం వుంటుంది. దైవ శక్తి లోకములో నియమించిన పరిపాలనా ధర్మాన్ని అనుసరించి అష్ట వసువులు, ధర్మ దేవతలు జీవునికి స్త్రీ, పురుష యోగాన్ని ఇస్తున్నాయి. జీవుడి మనో భావాలు, మనో సంకల్పాలకు అనుగుణగా ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ సహజీవనం చేయడానికై దైవ శక్తి వారికి ఆయా ధర్మాలు కల్పిస్తున్నది.
శరీర రూపంలో స్త్రీ కి పురుషుడు అనుబంధాత్మగా వున్నాడు. అట్లే పురుషుడికి స్త్రీ అనుబంధాత్మగా వుంది. ఇరువురు పరస్పరం అనుబంధ శరీర జ్ఞానాన్ని కలిగి వున్నారు.
శరీరాన్ని కలిగివున్న అనేకమైన జీవాత్మలకు పరస్పరం సహకరించుకుంటూ సహజీవనం చేయుటకై ప్రకృతి వారి శరీర తత్త్వానికి మోహించే ధర్మం కల్పిస్తుంది. శృంగారం సృష్టి కార్యానికై, దేహమును పునఃసృష్టించడానికై అందింపబడిన ఒక వ్యవస్థ.
జీవుడు స్వయముగా భావన చేయకున్నా ,మోహము చెందకున్నా భావన చేసేలా ఇచ్చాశక్తి మొహాన్ని కల్పిస్తుంది. చలి స్ఫురించడం వలన చలికి, వేడి తగలటం వలన వేడికి ప్రభావితమవుతున్న విధముగా ప్రకృతి కామ వాంఛను కల్పిస్తుంది. తదనుగుణంగా స్త్రీ ని మోహించేలా పురుషుడికి కామ వాంఛను, పురుషుడిని కామించేలా స్త్రీకి కామ వాంఛ కల్పిపబడింది. ప్రత్యుత్పత్తికి కారణమవుతున్న స్త్రీ పురుష సంయోగం సృష్టి క్రమానికి అనుగుణంగా నిర్దేశించినధర్మాలను కలిగి వుంది.
జీవుడు పూర్వము నుంచి సంపాదించిన జ్ఞానాన్ని, తన తేజస్సును పునరుత్పత్తి చేయడానికి ఏర్పరిచిన వ్యవస్థయే స్త్రీ గర్భం. శక్తి స్త్రీ గర్భము నందు జీవుని శరీర జ్ఞానాన్ని పునరుత్పత్తి చేస్తుంది.
గర్భాలయం భౌతిక దేహమును ఉత్పత్తి చేసే దేవాలయం.
జీవుడికి మరణం లేదు ఉపాధి(శరీరం)ని కలిగి వుండటం లేదా ఉపాధిని విడవటం మాత్రమే వుంటుంది.
38. జగత్ శరీర(బ్రహ్మండ) నిర్మాణం.
జీవుడి భవిష్యత్తుకు అనుగుణంగా భౌతిక శరీరములోని అవయవములు, ఇంద్రియములు సృష్టించబడిన విధముగా జగత్ శరీరములోని సూర్య చంద్రులు, గ్రహలు, నక్షత్రాలు భవిష్యత్తుకు అనుగుణంగా సృష్టించబడ్డాయి.
దివ్య శరీరము, భౌతిక శరీరము మరియు జగత్ శరీరము ఈ మూడు దేహములు కలిగి వున్న జీవుడు. దివ్య శరీరం అహం భావాన్ని ఇస్తుంది. ఇంద్రియాలు భౌతిక శరీరములో అంతర్భాగముగా వుంటూ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను అనుభవానికి ఇస్తున్నాయి. సూర్యచంద్రులు, గ్రహనక్షత్రాలు జగత్ శరీరములో అంతర్భాగముగా వుంటూ కాంతి, గురుత్వాకర్షణ మొదలైన విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తున్నాయి.
జీవుని మనో బలాన్ని అనుసరించి బ్రహ్మండము ఒక్కో జీవుడికి విశేషంగా ఒక్కో జీవుడికి సామాన్యముగా కనిపిస్తుంది. మానవ శరీరము లోని సూక్ష్మ జీవికి మానవ శరీరములోని అవయవాలు, ఇంద్రియాలు బ్రహ్మండముగా తోస్తున్నాయి. సూక్ష్మ జీవికి బ్రహ్మండముగా వున్న మానవ శరీరం, మానవునికి సామాన్యముగా కనిపిస్తుంది. మానవునికి బ్రహ్మండముగా వున్న విశ్వం అత్యంత బలమైన జీవునికి(దేవునికి) సామాన్యముగా తోస్తుంది. మానవుడికి బ్రహ్మాండముగా తోస్తున్న విశ్వం ఏ జీవునికి అయితే సామాన్యముగా తోస్తుందో అటువంటి అత్యంత శక్తి సామార్ద్యములు, అఖండ తపో బలము కలిగిన జీవుడినే దైవము అని అంటారు.
సూక్స్మ జీవి దృష్టిలో బ్రహ్మండముగా వున్న మానవుని భౌతిక దేహము. మానవుడి మనో సంకల్పానికి ఉద్భవించిన విధముగా, అఖండ బ్రహ్మండముగా వున్న విశ్వం దైవము యొక్క మనో సంకల్పానికి అనుగుణంగా సృష్టించబడింది.
దైవం తన మనో బలముతో, తపొ బలముతో సృష్టించిన జగత్ శరీరమును వారసత్వముగా మానవుడు, ఇతర సకల జీవరాశులు పొందాయి.
శ్రీరాముడు: మహా శక్తి! దేవుడు బ్రహ్మాండాన్ని సృస్టించే అంతటి దైవశక్తి ఎలా పొందాడు.
39.జీవుడు దైవ శక్తిని అంతరిక్షములో పొందుట.
మహా శక్తి: శ్రీరామా! చిన్న పిల్లవానికైనా లోకాన్ని పరిపాలించే శక్తి సామార్ద్యాలు వున్నాయి అంటే అది తాను ఇతఃపూర్వము సంపాదించిన సంస్కార బలం వలన అని గ్రహించాలి. అదే విధముగా దేవుడు విశ్వము నందు కళ్ళు తెరిచిన ఎంతో కాలానికి తన దైవ శక్తిని తెలుసుకొని పంచభూతములు, అష్టవసువులు, అష్ట దిక్పాలకులను, ధర్మ దేవతలను నియమించి సృష్టిని ధర్మంలో నడిపిస్తున్నాడు.
భూమి మీద మానవుడు తన శక్తిని ఎలా తెలుసుకుంటున్నాడో అలాగే దేవుడు అంతరిక్షంలో తన శక్తిని తెలుసుకోవడమైనది.
మహా మాయ: శ్రీ రామా! అంతరిక్షములో భూతాత్మలు అనంతముగా కారు మేఘాల్లా వుంటూ అవి వాటి సంకల్ప వికల్పములచే మనో బలాన్ని పొంది పరిపాలనాత్మలుగా బలాన్ని పొందుతున్నాయి. పరిపాలనాత్మ తన శక్తిచే ఇతర భూతాత్మలను ప్రభావితం చేసి తనకు శక్తిగా చేసుకుంటుందనే విషయం ఇది వరకే గ్రహించావు. అదే క్రమంలో ఆకాశమునందే పరిపాలనాత్మ సంకల్ప వికల్పాలచే కొన్ని కోట్ల సంవత్సరాలకు అత్యంత శక్తిని పొందింది. కాలము జరుగుతున్న కొలది దాని లోని మనో బలం అధికమవుతున్నది. అనేక కోట్ల సంవత్సరములకు తన శక్తి అత్యంత బలవత్తరమై అఖండ శక్తిగా బలాన్ని పొందింది. అఖండ శక్తిని కలిగి వున్న మహాత్మ మనోభావ, మనోబల ప్రబావానికి భూతాత్మలు విశ్వము నందు అధికముగా ప్రభావితమవుతున్నాయి. మహాత్మ మనో దృక్పథాన్ని అనుసరించి అది ఎలా కదిలితే అలా కదులుతూ, ఎలా భావన చేస్తే ఆ భావనకు భూతాత్మలు ప్రభావితమవుతూ రంగు రంగులతో, మిరుమిట్లు గొలిపే కాంతులతో వెలుగొందుతున్నాయి. పరిపాలనాత్మకు వాటి కాంతి స్ఫురించడం వలన కాంతిని చూడాలనే సంకల్పానికి అనుగుణంగా మహా శక్తి కాంతిని చూపే అతీంద్రియ నేత్ర ధర్మాన్ని ఆకాశము నందు కల్పించినది. కాలక్రమంలో అనంత శక్తిని, అఖండ మనో బలాన్ని కలిగి వున్న మహాత్మ మనో ఉద్దేశ్యానికి విశ్వములో భయంకరమైన శబ్దాలు రాజ్య మేలుతున్నాయి. తాను శాంత స్వభావముతో వుంటే విశ్వమంతయూ శాంతముగాను, తాను ఉగ్ర భావనలో వుంటే విశ్వ మంతయూ ఉగ్ర రూపముగాను బ్రహ్మాండంలో నాట్యమాడుతుండేది. వాయుగుండం వస్తే సముద్రం ఉప్పొంగే విధముగా బ్రహ్మాండం ఉప్పొంగుతుండేది. కొంతకాలానికి తన వల్లనే ఇలా విశ్వం మార్పు చెందుతుంది అని తన మహాశక్తి తెలియచెప్పి శాంతింపచేయడముచే ఆ మహా పురుషుడు శాంతించాడు. తనకు సందేశాన్ని ఇస్తున్న శక్తితో అనేక విషయాలు చర్చించుతూ సందేహాలు నివృత్తి చేసుకుని తన బలాన్ని అత్యంత బలముగా తన శక్తిని దైవ శక్తిగా చేసుకున్నాడు. దైవ శక్తితో లోక కళ్యాణం గురించి చర్చిస్తూ అస్థిరముగా వుండే బ్రహ్మండాన్ని స్థిరముగా, నివాస యోగ్యముగా, అద్భుత లోకముగా సృష్టించాలనే తన మనో సంకల్పాన్ని వ్యక్తపరిచాడు. దానికి అనుగుణగా లోకం ఎలా వుండాలో మనో దర్శనం చేశాడు. తన మనో దర్శనానికి అనుగుణంగా దైవ శక్తి అస్తవ్యస్తముగా, అస్థిరముగా వున్న భూతాత్మలకు అఖండ పంచభూతాలుగా, అష్టవసువులుగా, అష్ట దిక్పాలకులుగా ,ధర్మ దేవతలుగా వారి పాత్రకు తగ్గ పదార్థాన్ని ఆయా ధర్మాన్ని కల్పించి భవిష్యత్తుకు అనుగుణగా ఉత్తమ లోకాన్ని సృష్టించడమైనది. సృష్టించబడిన జ్ఞానమును బద్ర పరచడం, వ్యాప్తి చేయడం ప్రకృతి నియమం. అదే క్రమములో బ్రహ్మండాలను వ్యాప్తిచేస్తున్నది. అలా వ్యాప్తి చెందుతూ ఆ వారసత్వముగా పొందినదే ఈ జగత్ శరీరం. ఈ బ్రహ్మండాన్ని సృష్టించిన వాడు ఎవడున్నాడో ఆయనకు దేవుడు అని పేరు. తనకు సహకరించి భవిష్యత్తుకు అనుగుణంగా సృష్టించినది దైవ శక్తి. దైవ శక్తికి సహకరించి ఆయా కార్యములు నిర్వ హించిన వారు పంచభూతాలు, అష్టవసువులు, అష్టదిక్పాలకులు, ధర్మ దేవతలు.
బలమైన శక్తిగా వున్న జీవికి లోబడి కణాలు, పంచభూతాలు ఆయా ధర్మాలలో పనిచేస్తున్న విధముగా, అపర శక్తిమంతుని దైవ శక్తికి లోబడి సూర్య ,చంద్ర గ్రహ నక్షత్రాలు వివిధ ధర్మాలను కలిగి వున్నాయి.
తన మనో సంకల్పానికి అనుగుణంగా దైవ శక్తి ఇతర పరిపాలనాత్మలకు అఖండ శక్తిని ఇచ్చి సూర్య చంద్ర గ్రహ నక్షత్రాల ఉపాధిని కల్పిస్తుంది. ఆయా ధర్మాలను కలిగి వున్న అఖండ పంచభూతాలు వారికి కార్యములను నెరవేర్చే ధర్మాలను కలిగి వున్నాయి. అష్టవసువులు , ధర్మ దేవతలు విశ్వాన్ని క్రమంలో వుండేలా సహకరిస్తూ జీవుల మనుగడకు అనుకూలముగా సంరక్షిస్తూ వున్నారు.
జీవుడు జ్ఞాన భావన చేస్తాడు. శక్తి జ్ఞాన రూపములో ప్రకృతి ధర్మాన్ని కలిగి వుంటుంది. దేవుడు ప్రకృతిని శాసిస్తాడు. ప్రకృతి పంచభూతాలను శాసిస్తుంది.
తన దైవ శక్తితో బ్రహ్మండాన్ని సృస్టించిన దేవుడిని ఒకొక్కరూ ఒకలా పిలుస్తున్నారు. హిరణ్య గర్బుడని, విరాట్ స్వరూపుడని, మహా విష్ణువు అని, మహా శివుడు అని, బ్రహ్మ అనియు, శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, పరాశక్తి అని, చిత్ శక్తి అని వివిధ నామములతో దేవుడు పిలవ బడుతున్నాడు. పాలకుడిని ఒకో బాషలో, ఒకో ప్రాంతములో రాజు, ప్రిన్స్, కింగ్, రూలర్, ఇలా ఒకోలా పిలుస్తున్న విధముగా దేవుడిని ఒకో ప్రాంతములో, ఒకో భాషతో ఒకొక్కరూ ఒకోలా పిలుస్తూన్నారు. ఎవరు ఏ పేరుతో పలిచినా అందరూ పిలిచే దేవుడు ఒక్కడే. అందరికి దేవుడు ఒక్కడే.
తన మనసులో బలంగా ముద్రపడినా ఒక నామముతో ఆయనే దేవుడు అని బలపరుచుకున్న మనస్సు వేరొక దేవుడి నామాన్ని స్వీకరించదు. ఈ బలహీనతను గ్రహించి సర్వనామములతోను పిలుస్తున్నది ఒకే దైవాన్ని అని గ్రహించేవాడు మహనీయుడు.
విశ్వములో వున్న మానసిక, భౌతిక, రసాయనిక, భౌగోళిక, ఖగోళ, ఆర్ధిక, సామాజిక మొదలైన అన్ని నియమాలకు కారణం మనో ఉద్దేశ్యం, మనో సంకల్పం. జీవుడి కున్న మనో బలంతో శక్తి ఆయా నియమాలను కలిగి వుంది.
విశ్వంలో అదృశ్యముగా పనిచేసే పంచభూతాలు వివిధ కార్యములను చేస్తున్నాయి. సముద్రంలోని చేపలను నీటి అణువులు స్థిరముగా వుంచుతున్న విధముగా, కనిపించని పంచభూతాలు గ్రహాలను, నక్షత్రాలను స్థిరముగా వుంచుతున్నాయి.
భూమిలో మట్టి, బురదనీరు రూపంలో క్రమరహితంగా వున్న పంచభూతాలు, మొక్క వెర్లలోని రంద్రాల ద్వారా వెలుతూ, ఆకుల రూపంలో, కాయ రూపంలో, చెట్టు రూపంలో ఒక క్రమపద్దతిలో ఆయా ధర్మాలలో వుంటున్నవి. అదే విధముగా, బ్రహ్మాండము లో క్రమరహితముగా వున్న భూతాత్మలు, పంచభూతాలు, గ్రహాలు శూన్య మండలము(black holes) ద్వారా వెలుతూ ఒక క్రమంలో నిర్దేశించిన దేశ కాలములలో ఆయా ధర్మాలను కల్గి వుంటాయి.
వస్తు ఆకర్షణ విద్య తెలిసిన యోగులు తన మహిమాతో వస్తువులను, ఆహారాన్ని ఆకర్శిస్తారు. ఎక్కడో వున్న ఆహారం, వస్తువులు శూన్య మండలము ద్వారా ప్రయాణినించి తమ దగ్గరకు వస్తాయి.
మహా శక్తి మంతుల సంకల్పాలతో పంచభూతాలు ఆహారముగా మారుతాయి. తన ఆశ్రమానికి వచ్చిన అతిధులకు ఆహారం పెట్టాలనే వశిష్ట మహర్షి సంకల్పం మేరకు కామధేనువు తన మహిమతో లక్షలాది మందికి ఆహారం వడ్డించింది. శ్రీ కృష్ణుడు తన మహిమతో అనేక మంది ఋషుల ఆకలి తీర్చాడు.
మరణానంతరం ‘శక్తి’ జీవుని దివ్య దేహమును (సూక్స్మ దేహమును) శూన్యమండలము ద్వారానే తీసుకుని వెళుతుంది. తన కర్మఫలానుసారం వేరు వేరు ప్రదేశములోకి, వేరు వేరు లోకములోని తీసుకుని వెళుతుంది.
ఆత్మ చైతన్యం బ్రహ్మాండాలకు వ్యాపిస్తుంది. ఎవడు బ్రహ్మాండాలకు వ్యాపించి బ్రహ్మండాలను ఇష్టానుసారంగా నడపగలడో, ఎవడు బ్రహ్మండాలకు అతీతుడో వాడు నీలో వున్నాడు, వాడే ఆత్మగా అందరి యందు వున్నాడు .
సృష్టి నంతా ఎవడు లొంగదీసుకుంటున్నాడో ఆ పరమాత్మ నీలో వున్నాడు. నీవు అమరుడవు. నీకు మృత్యువు లేదు. నీవు అజరుడవు. నీకు వృద్ధాప్యం లేదు. నీవు అజేయుడవు. నిన్ను ఎవరు కూడా ఓడించలేరు. నీవు అమేయుడవు నీ బలమెంత అని ఎవ్వరూ లెక్కపెట్టలేరు. అది ఎవ్వరికీ సాద్య౦ కాదు.
ఈ దేహాదులకు, జగత్ కు అధిస్ఠానమైనది ఆత్మ చైతన్యము. ఆ చైతన్యం అఖండం, నామ రూపాలకు అతీతం, అది సత్యం, అది కేవలం చిత్ రూపం, అది ఆనందం, అది అనంతం, అది అపరిమితం, దానికి సత్ అని పేరు దానిని ఆధారం చేసుకుని జగత్తు భాసిస్తుంది. భాసిస్తున్న జగత్తును చూస్తున్నావు, దేని యందు ఆధారం చేసుకుని భాసిస్తుందో దాన్ని చూడు ఆ ఆధారాన్ని తెలుసుకున్నాక జగత్తు జీవుని మనో జ్ఞానము యొక్క ప్రతిబింబము అనే సత్యం బోదపడుతుంది.
ఎటువంటి పని లేకుండా ఇష్టానుసారముగా తిరుగుతున్న వ్యక్తిని పరిపాలకుడు అధికారులచే ఒక ఉపాధిలో నియమిస్తున్న విధముగా దైవ సంకల్పానికి అనుగుణగా దైవ శక్తి అస్థిరముగా వున్న భూతాత్మలకు, పరిపాలనాత్మలకు సృష్టి కార్యానికి సహకరించే వివిధ ధర్మాలను కల్పించి స్థిరముగా వుంచుతుంది. ఒక క్రమలో నియమింపబడిన పంచభూతాలు, అఖండ పంచభూతాలు, అష్టవసువులు, అష్ట దిక్పాలకులుగా వివిధ ధర్మాలను కలిగి సూర్య చంద్ర, గ్రహ నక్షత్రాలు గా, సముద్రములుగా మహా నదులుగా, మేఘములుగా, పర్వత శిఖరములుగా, మంచుపర్వతములుగా, ధ్రువాలుగా, వృక్షాలుగా, ఆయా ధర్మాలను కలిగి సృష్టి కార్యానికి సహకరిస్తున్నాయి.
అష్ట వసువులు, పంచభూతాలు, అష్ట దిక్పాలకులు, ధర్మ దేవతలు జీవ వైవిధ్యాన్ని కూడా నియంత్రిస్తూ, పాలిస్తున్నారు. భూమండలమంతా జీవులతో నిండిపోకుండా,ఈ భూమండలం పై ఎంత జీవం వుండాలో అంతే వుంచుతూ నియంత్రిస్తున్నారు. జీవులకు వివిధ గుణాలను కల్పించి ఏ జీవికి ఏ జీవి మిత్రుడుగా, శత్రువుగా వుండాలి. ఆహారంగా వుండాలో నియమిస్తూ నడిపిస్తున్నాయి.
భూమి పైన జీవ జాతి నియంత్రణలో వుంచడానికై ప్రకృతి మృగాలకు వేటాడే తత్త్వాన్ని కల్పిస్తుంది. అవి వాటి ధర్మాలలో వున్నాయి. ప్రతి జీవరాశికి ఒక ప్రత్యేకమైన లక్షణం ప్రకృతి కల్పిస్తుంది. అవి చేసేది హింస కాదు అది వాటి ధర్మం. కాని మానవుడు చేసేది హింసయే అవుతుంది.
సకాలజీవరాశులలో గుణాలను నియత్రించుకొనే స్వేచ్చా, శక్తి సామార్ద్యాలు ఒక్క మానవునికి మాత్రమే వుంది. కావున మానవుడు త్రిగుణాలను నియంత్రణలో వుంచుకోవాలి. దేశ కాల పరిస్థితులను అనుసరించి మానవుడు సత్వ, రజో, తమో గుణములలో ఏ గుణంలో ఎప్పుడు ,ఎలా వుండాలో ఆయా గుణములలో అలాగే వ్యవహరించాలి.
సత్వ గుణం నందు శాంతి, శుద్ధత, ఆనందమును కలిగి వుంటారు. రజో గుణం క్రియా శీలత, పని పట్ల ఆసక్తి చూపడం, సానుకూల ఆలోచనలు, జ్ఞానం పట్ల జిజ్ఞాస, విజయాన్ని పొందాలనే ఆతృతగా వుంటారు. తమో గుణం అలసత్వం, బాద్యతల పట్ల నిర్లక్షం, ప్రతికూల ఆలోచనలు, వాయిదా వేయడం మొదలైనవి. ఎప్పుడు సత్వ గుణంలో వుండాలి, కార్యముల నందు రాజోగుణముతో వుండాలి. తమో గుణాన్ని అనుకూలముగా మార్చుకోవడానికి దుష్ట సంకల్పాలను, ప్రతికూల ఆలోచనలను, నిర్లక్షం వహించాలి. అశుభ కార్యములు చేయడంలో వాయిదా వేయాలి. కొంతకాలానికి అవే తొలగిపోతాయి. అప్పుడే తమో గుణం అనుకూలముగా మారుతుంది.
శ్రీ రామా! జీవుడు తన ప్రయత్న బలం ద్వారా పరిణామం చెందుతున్నాడు. అదే విదంగా జీవుడు విశ్వానియమానికి అనుగుణంగా కల్పించిన ప్రకృతి గుణాలకు లోబడి జీవిస్తాడు.
40. జీవుని శరీరం యోగ, బోగ శరీరముగా బహుల ధర్మాలు కలిగి వుండుట.
విశ్వంలోని ప్రతి భూతాత్మకు మరియు పరిపాలనాత్మకు వున్న భౌతికశక్తికి విషయజ్ఞానాన్ని తెలుసుకునేలా యోగశరీరం, అలాగే విషయ జ్ఞానాన్ని తెలియచేసేలా భోగ శరీరం ద్వంద్వ ప్రమాణాలతో కల్పించబడుతుంది.
విషయానుభవాన్ని తెలుసుకొనేది యోగ శరీరం. విషయముగా వుంటూ ఆయా అనుభవములు ఇచ్చేది భోగ శరీరం.
పురుషునికున్న యోగ శరీరం తనకు విషయ యోగాన్ని, స్త్రీకి విషయ భోగాన్ని ఇస్తుంది. స్త్రీ యోగ శరీరం తనకు విషయయోగాన్ని పురుషుడికి విషయ భోగాన్ని ఇస్తుంది. ఒకే శరీరమే తనకు యోగశరీరం గా ఇతరులకు భోగ శరీరంగా ద్వంద్వ ప్రమాణాలతో కల్పించబడించి. ఇరువురూ పరస్పర విషయానుభవాన్ని పొందుతున్నారు.
సుఖం, దుఃఖం, రాగ ద్వేషాలు తెలుకునే జీవాత్మ అనుభవాన్ని తెలుసుకునే శరీర యోగం కలిగివుంది. సుఖః ధూఖాలు తెలిపే పంచభూతాలు వివిధ శరీర యోగాన్ని కలిగి విషయ జ్ఞానాన్ని అనుభవానికి ఇస్తున్నాయి.
భూతాత్మలకు పంచభూతములుగా వివిధ యోగములను కల్పించడం వలన అవి రాగ ద్వేషాలు, శీతోష్ణస్థితిగతుల విషయ జ్ఞానమును ఇస్తున్నాయి. జీవాత్మలకు శరీర యోగము కల్పించడం వలన అవి స్పర్శ జ్ఞానం తెలుసుకుంటున్నాయి.
ప్రమాత(జీవాత్మ) విషయ భోగం అనుభవి౦చేది, ప్రమాణం(ఇంద్రియజ్ఞానం)విషయ యోగం తెలిపేది.
శరీరంలోని ప్రతి పరమాణువునకు విషయ జ్ఞానం తెలిపే నియమ౦(యోగ శరీర౦) కల్పించ బడింది. భూతాత్మ కార్యమునకు కలిగి వున్న ఆయా వృత్తుల యందు స్థాన భ్రంశం కలగ కుండా వాటికి స్థితి శక్తిగా వుండే ధర్మం కల్పించ బడుతుంది.
శరీరములో ఉపాధి యోగమును కలిగి వున్న నేత్రం వస్తువును చూపే యోగ ఇంద్రియముగా వుంది. జగత్తు శరీరయోగముగా వున్న సూర్యుడు వస్తువును ప్రకాశింప చేసే అనుబంధ యోగ ధర్మాన్ని కలిగి వున్నాడు.
యోగ శరీరంలోని నేత్రం, భోగ శరీరంలోని సూర్యకిరణ సంయోగంతో వెలుగు అనుభవానికి వస్తుంది, యోగ శరీరంలోని స్పర్సేంద్రియాలతో భోగ శరీరంలోని శీతలం, ఉష్ణ సంయోగం వలన శీతోష్ణస్థితులు అనుభవానికి వస్తున్నాయి, యోగ ఇంద్రియము గా నాలుక సహాయముతో భోగ పదార్థముగా వున్న మామిడి పండు రుచి అనుభవానికి వస్తుంది. ఇలా అనేక భూతాత్మల శక్తికి వాటి స్థితి, గమనం కోసం కార్య యోగం కల్పించబడి౦ది. వాటికి కల్పింపబడిన యోగశరీరం ఇతర ఆత్మలకు విషయ జ్ఞానం తెలిపే భోగాన్ని ఇస్తున్నాయి.
దేశ కాలములను తెలిపే ఆకాశం, గాలిని ఇచ్చే వాయువు, వేడిని ఇచ్చే అగ్ని, దాహాన్ని తీర్చే జలం, ఆహారాన్ని, ఆశ్రయాన్ని ఇస్తున్న భూమి, జీవుడికి భోగాన్ని ఇచ్చే ఉపాధి యోగాన్ని కలిగి అనుబంధాత్మలుగా వున్నాయి. జీవుని శరీరం ఇతరులకు భోగాన్ని ఇచ్చే యోగ శరీరముగా వుంది. అనేక సూక్ష్మ జీవులకు దేహం భోగ శరీరముగా వుంది.
యోగ మరియు భోగ శరీరములు స్త్రీ, పురుష, సూర్య చంద్ర గ్రహాల రూపంలో, శీతోష్ణ స్థితుల రూపంలో, ధన, ధాన్య, సంగీత రూపంలోను పంచభూతాలు అయిన అగ్ని, వాయువు, ఆకాశం, నీరు, భూమి రూపంలోను వున్నాయి.
ఆత్మ కలిగి వున్న భౌతిక శక్తి వివిధ యోగ ధర్మాలను కలిగి వున్న ప్రకృతి గుణం.
దేవాలయములలో వున్న శివ లింగమును ఋషులు ఆత్మ శక్తిగా ప్రతిష్టించడమైనది. ఆత్మ లింగ రూపం అనుకుంటే దాని చుట్టూ ఆధారముగా బండించబడినది శక్తి స్వరూపం. సృష్టి ధర్మానికి అనుగుణంగా శక్తి ఏ లింగానికి ఆ ధర్మముతో వివిధ గుణాలను కలిగి వుంటుంది. ఆకాశ లింగము నందు ఆకాశ గుణాన్ని, వాయు లింగము నందు వాయు గుణాన్ని, అగ్ని లింగము నందు అగ్ని గుణాన్ని, జల లింగము నందు జల తత్వాన్ని, పృధ్వీ లింగము నందు ఘన పదార్థ ధర్మాన్ని కలిగి వుంటుంది. శివలింగ రూప్ములోని లింగరూప గుణానికి అధికారిగా జీవుడు. దాని చుట్టూ బందించబడిన శక్తి ప్రకృతి గుణంగా వుంటుంది. ఆత్మయే దేవుడు, శక్తియే దేవత. ఇరువురి సహకారముతో సృష్టి నడుస్తుంది.
ప్రపంచంలో ఏ ప్రదేశములో అయినా లింగ రూపము దానికి చుట్టుకొని ఆధారముగా వుంటూ ప్రకృతి రూపములో కనిపించే ఏ శిలారూపము అయినా ఆరాధించబడుతుంది అంటే అది ఆత్మ శక్తి స్వరూముగా ప్రతిష్టింపబడిందని గ్రహించాలి.
విగ్రహారాధన చేయడం వలన మనశ్శాంతిని, యశస్సు, తేజస్సును పొందుతారు. ఆంజనేయుడు, మహా విష్ణువు, రాముడు, శివుడు వేంకటేశ్వరుడు, బుద్ధుడు, మొదలైన వారు తేజోవంతులైన దేవతా మూర్తులు. వీరిని దర్శించడం వలన అటువంటి శక్తి, యశస్సు, తేజస్సు దర్శించే భక్తుని యందు ఉత్పన్నమవుతుంది.
శక్తి భూతాత్మల యందు పంచభూతాల ధర్మములో వున్న విధముగా, దైవీ శక్తి దైవాత్మలు అయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యందు జ్ఞానము, సంపద, బలము గా సమ ధర్మాలను కలిగి వుంది. బ్రహ్మజ్ఞానానికి అధికారము కలిగి తన శక్తి సరస్వతిగా వుంది. శ్రీ మహా విష్ణువు సంపదలకు, ధనానికి అధికారము కలిగి తన శక్తి లక్ష్మి దేవిగా వుంది. ఈశ్వరుడు బలానికి అధికారము కలిగి తన శక్తి పార్వతిదేవిగా వుంది. త్రిమూర్తుల అనుగ్రహం వలన జనులు సుఖ శాంతులతో, ఆయుర్ ఆరోగ్యాలతో, ధన ధాన్యాలతో సుఖసంతోషంగా ఆనందముగా వుంటున్నారు. ఈ త్రిమూర్తులు పరస్పరం సహకరించుకుంటూ లోకాన్ని సుభిక్షంగా వుంచుతున్నారు. వీరి శక్తి విశ్వమంతా వ్యాపించి వుంటుంది.
ఒక దేవుని పేరుతో విగ్రహము చేశాక, పండితులు ఆ విగ్రహానికి మహర్షులు తెలియ చేసిన మూల మంత్రాలతో ప్రచోదనం చేసి ప్రాణప్రతిష్ట చేస్తారు. చేయడం వలన అది శక్తివంతం అవుతుంది. గొప్ప పుణ్య క్షేత్రం అవుతుంది. ఆ విగ్రహాన్ని దార్సించిన వారు శక్తితో వుంటారు. వారి మనస్సు ప్రశాంతముగా వుంటుంది. మానసిక ఆనందము కలిగిస్తుంది. ఆ శక్తి ప్రజలను తన దగ్గరకు ఆకర్శించే శక్తి కూడా వుంటుంది.
ఇతరులు ఆరాధించే దేవుడిని ద్వేషించడం, ఇతర మతస్థులను తక్కువగా చూడడం, వేరే కులానికి చెందిన వారిని అవమానించడం, వేరే ఆచారాలను తిరస్కరించడం — ఇవన్నీ భిన్నత్వాన్ని అంగీకరించలేని, విభజనతో చూసే మనస్సు యొక్క బలహీనతలు. మానవుడు తాను కట్టుకున్న ఒక చిన్న వలయంలోనే జీవిస్తున్నాడు. ఆ వలయాన్ని ఛేదించి, కులమతాలకు అతీతంగా విశ్వ భావనతో చూడగలిగినప్పుడే, ఈ అనంత విశ్వ జ్ఞానాన్ని గ్రహించి, మానసికంగా మరియు శారీరకంగా ఉన్నత స్థితిని పొందగలడు.
మానవుడు ఈ భూలోకమే అభివృద్ధి చెందిన లోకము అనుకుంటున్నాడు. అనేక లోకాలు వున్నాయి. అత్యంత అభివృద్ధి చెందిన లోకాలు వున్నాయి. కొన్ని ప్రారంభ దశలో మరికొన్ని పరిణామ దశలో ఇంకొన్ని ప్రతిఫల దశలో వున్నాయి.
మానవుడు ఈ భూమండలమునకు కాలం తీరుతున్నది అని ఆందోళన చెంది, వేరొక గ్రహా౦లో జీవించాలి అని వెదకడం,వెంపర్లాడటం అజ్ఞానం అవుతుంది .
ఒక చెట్టుకు వున్న కాయలోని బాక్టీరియా ఈ కాయే ప్రపంచము అనుకోవడము ఎంతటి అజ్ఞానమో ఈ భూమండలము ఇది ఒక్కటే లోకం అనుకోవడము అంతే అజ్ఞానము.
మానవుడు మంచి భవిష్యత్ కోసం ఇప్పుడున్నదానికి తగినట్టి ప్రణాళికలతో మంచి కట్టుబాట్లు, సంస్కృతి సంప్రదాయాలతో మంచి వాతావరణం కల్పించడం వలన తన జీవితం తన పిల్లల భవిష్యత్తు అద్భుతముగా, ఆనందముగా మారుతుంది.
ప్రతి పరమాణువు నుండి సూర్యుని వరకు అలాగే సకల జీవరాశులకు వాటి శక్తికి లోకక్షేమంకోసం పరస్పరం సహకరించుకొనే నియమ౦ కల్పించబడింది. ఇది దైవ శక్తి, మహాశక్తి మరియు ప్రకృతి అనుసరిస్తున్న నియమం.
శ్రీ రామా! నీవు చూసిన ఆ సజీవ విగ్రహము అయిన సుగుణ సుందరి తన మనో జ్ఞానాన్ని వ్యక్త పరుస్తుంది. అలాగే తన తల్లి తండ్రి నుంచి కొంత జ్ఞానాన్ని ప్రాప్తముగా పొందింది. తన వాతావరణములోని ప్రజల, సహచరుల జ్ఞానము కూడా ఆమె పొంది వున్నది. అదేవిధముగా లోకక్షేమం కోరి సృష్టిని ధర్మంలో నడిపించడం కోసం దైవ శక్తి ఆమెకు సృష్టి ధర్మములలోని స్త్రీతత్వం కల్పించబడింది.
దైవ శక్తి దేశకాల పరిస్థితులను చూసి, పూర్వ కర్మను చూసి ఆయా ఉపాధులను ఇస్తుంది. జీవుడు దాన్ని తిరస్కరించేది ఏమి వుండదు. ఆచరించవలసినదే. స్త్రీయా, పురుషుడా, గంధర్వుడా, మానవుడా, దేవుడా, దేశాధినేతనా, ఇంజనీర్, డాక్టర్, కార్మికుడా అనే భేదం లేకుండా లోక కళ్యాణం కోసం ఎటువంటి ఉపాధి కల్పించబడుతుందో దానికి సిద్ధముగా వుండాలి. దాన్ని తిరస్కరించకుండా ఆ ధర్మానికి న్యాయం చేసిన వారు ఊర్ధ్వ గతులను, ఉన్నత స్థితిని పొందుతారు.
జీవుడు సానుకూల దృక్పథంతో, పవిత్ర హృదయంతో వుంటూ మానసిక అర్హతను సంపాదిస్తే ప్రకృతి దైవ శరీరాన్ని ఇస్తుంది.
అభివృద్ధి చెందిన దైవ శరీరాలు కూడా ఈ విశ్వమునందు అనంతముగా వున్నాయి. ముక్తి, మొక్షం పొందిన మానవులు దైవ శరీరానికి అర్హులవుతున్నారు.
జీవుడికి వున్న జ్ఞానాన్ని, సంకల్పాలను, కోరికలను అనుసరించి శక్తి ఆయా గర్భము లోకి, వివిధ లోకములలోకి తీసుకొని వెళుతుంది.
జీవుడు కలిగివున్న జ్ఞానాన్ని అనుసరించి పంచభూతాల లోకం, క్రిమి లోకం, మత్స్య లోకం, పక్షి లోకం, జంతు లోకం, రాక్షస లోకం, మానవ లోకం, దైవ లోకం. మొదలైన అనేక లోకాలున్నాయి. జీవి తాను కలిగి వున్న జ్ఞానయోగానికి అనుగుణంగా ఆయా లోకాలలో సంచరిస్తుంటాడు.
వస్తువులలో వున్న పరమాణువులకు జడత్వము కల్పించడం వలననే మానవులు నడవగలుగుతున్నారు, స్థిరముగా వుండగలుగుతున్నారు. పంచభూతాలు పరమాణువు స్థితిలోనే జడత్వము కలిగి వుంటున్నాయి.
జీవం మానవ శరీరము నందు, భూమి, సూర్య చంద్రుల యందు ఆకాశమునందు ప్రతి పరమాణువునందు జీవం వుంది. దేహములో ఎముక కణం జీవుడు నడవడానికి అనుకూలముగా వుండటానికి స్థితి శక్తిని కల్పించడం వలన చలనం లేకుండా జడముగా వుంది. జగత్ శరీరములో గృహము నందు, భూమి యందు వున్న అణువులకు కూడా స్థితి శక్తిలో వుండేలా ధర్మం కల్పించడం వలన చలనము లేకుండా జడముగా వున్నాయి.
సర్వ జీవుల సమాచార నిక్షిప్తము అతీత శక్తిగా మెదడు రూపంలో వుంది. పరమాణువుల, అణువుల పంచభూతాల సమాచార నిక్షిప్తం వాటి పదార్థ ధర్మంలో వుంది. పరిపాలనాత్మ నుంచి అందిన సమాచారానికి అనుగుణంగానే పంచభూతాల స్థితిగతులు మారుతాయి. సమాచారానికి అనుగుణంగానే పరమాణువులు ఇతర పరమాణువులతో సంయోగ, వియోగ, ఆకర్షణ, వికర్షణలచే పదార్థ ధర్మాన్ని, అవయవ ధర్మాన్ని, ఇంద్రియ ధర్మాన్ని, శరీర ధర్మాన్ని, సూర్య చంద్ర గ్రహ తారకల ధర్మాన్ని కలిగివున్నాయి.
శిష్యుడు: ధర్మాచార్య ఇతర గ్రహాలపై జడముగా పదార్థ రూపములో వున్న జీవుడు తన సంకల్పానికి శరీరధర్మాన్ని ఎందుకు పొందటం లేదు.
ధర్మాచార్యుడు: అన్ని గ్రహాలు జీవ మనుగడకు నిర్మించబడినవి కావు. జీవ మనుగడకు భూమి మాత్రమే నిర్మించబడింది. ఇతర గ్రహాలు వేరు వేరు ధర్మాలను కలిగి వున్నాయి కావున వాటి ధర్మంలోనే పనిచేస్తాయి. ఒక వేళ జీవుని సంకల్ప వికల్పాలచే సూక్మ బౌతిక శరీరాన్ని పొందినా మళ్ళీ నియత్రించబడుతుంది. నదులున్న దగ్గరకు జీవులు వలసవెళ్లే విధముగా జీవులు భూమికి వలసగా వచ్చి నివశిస్తాయి.
శిష్యుడు: ధర్మాచార్య! గ్రహాలు మానవుడిని ప్రభావితం చేస్తాయా?
ధర్మాచార్యులు: గ్రహాలు మానవుడి మనస్సుపై ప్రభావం చూపిస్తున్నాయి. జీవుడి పూర్వ కర్మలకు అనుగుణంగా ప్రభావితం చేస్తాయి.
జ్యోతిష్య శాస్త్రములో మహర్షులు వారి దివ్య దృష్టి తో ఎంతో విలువైన సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. దానిలో చెప్పిన ప్రతికూలతకు భయపడనవసరము లేదు. మహర్షులు చెప్పిన జ్యోతిశ్యాన్ని జనులు ఒక శాతం మాత్రమే గ్రహించగలిగారు. జీవుడు దేన్ని ఆశ్రయించాడు అన్నదాన్ని బట్టి వారిపై గ్రహాల ప్రభావం వుంటుంది. ఫలానా సమయమందు వర్షము వస్తుంది అని తెలిసినప్పుడు గృహామును ఆశ్రయించిన వాడిని ఆ వర్షము తడపలేని విధముగా, అతడు ఎవరిని ఆశ్రయించాడు, ఏ గొడుగుక్రింద వున్నాడు అన్న విషయాలను బట్టి అతని స్థితి గతులు వుంటాయి. అందుకే ధర్మాన్ని పట్టుకోవాలి. సత్కర్మలు చేయాలి. దైవాన్ని శరణాగతితో ఆశ్రయించాలి. శక్తివంతమైన పరిపాలనా నియమముతో సంస్థలు, ప్రభుత్వాలు పనిచేయాలి. అప్పుడు ఎటువంటి గ్రహ దోషాలు వున్నా వారిని ఎక్కువగా బాధించవు.
ఎప్పుడైనా మీకు సందేహం కలిగితే, ఒక విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకొండి, కారణం లేకుండా ఫలితం ఉండదు. కారణం కనబడకపోతే, అది లేదని కాదు. ఈ క్షణంలో దానిని నీవు గ్రహించలేకపోతున్నావన్న మాట. ఎలా అంటే, కొన్ని కారణాలు కనబడకపోయినా వాటి ఫలితాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి. కర్మ విషయంలోకూడా ఇలాగే జరుగుతుంది. గత కర్మలు మనిషికి కనిపించవు. కానీ వాటి ఫలితాలు మాత్రం వర్తమానంలో అనుభవిస్తాడు. మన నిత్య జీవితంలో అనేక లౌకిక విషయాలలో ఇలాగే జరుగుతుంది. వాటి గురించి ఆ దైవిశక్తి శ్రీరామునితో చెబుతున్న విషయాలను మీకు తెలియ చేస్తున్నాను శ్రద్ధగా ఆలకించండి.
41. లౌకిక విషయాలలో కర్మ ప్రభావము.
మహా శక్తి: శ్రీ రామా! జీవుడి కర్మానుసారం అతీత శక్తి పంచభూతాలను, సూర్య చంద్ర గ్రహ నక్షత్రాలను నడిపిస్తున్న విధముగా, లౌకిక పారమార్ధిక విషయాలలో కూడా జీవుడిని ఆయా కార్యములకు ప్రేరేపించి నడిపిస్తుంది.
మూడు విధములైన కర్మలచే శక్తి జీవుడిని ప్రభావితం చేస్తూ ఆయా కార్యములలో నియమిస్తుంది. మనో భావన, మనో సంకల్పం 2. పూర్వ సంస్కారములచే ఆయా కర్మలు చేయబడుతున్నాయి. 3. సృష్టి నియమాన్ని అనుసరించి.
ఏదైనా ఒక విషయం విచారణ చేయడం, ఆ విషయముపై ఒక ఉద్దేశ్యాన్ని కలిగి వుండటం అనేది కర్మ. కర్మ ప్రభావ౦ వలన శక్తి జీవుణ్ణి ఆయా కార్యములు చేసేలా ప్రభావితం చేస్తుంది. చేసిన కార్యము ఆయా ఫలితాలను అనుభవానికి ఇస్తుంది. మంచి ఆలోచన వలన మంచి కార్యము జరగడం, తదనుగుణమైన మంచి ఫలితము రావడం జరుగుతుంది. చెడు ఆలోచన వలన శక్తి చెడు కార్యమును చేసే విధంగా ప్రభావితం చేస్తుంది. తదనుగుణంగా చెడు ఫలితములే అనుభవించవలసివస్తుంది.
విషయ విచారణ వలన సంస్కార జ్ఞానం ప్రారంభమవుతుంది. విచారణాబలాన్ని బట్టి సంస్కారజ్ఞానం ఆయా కర్మలు చేసేలా ప్రేరేపిస్తుంది, కర్మ తీవ్రతను బట్టి దాని ఫలితమును పొందుతారు. మంచి విచారణాబలాన్ని బట్టి ఏర్పడిన సత్ సంస్కారం సత్కర్మలు చేసేలా ప్రభావితం చేస్తుంది. సత్ కర్మలు సత్ ఫలితమును ఇస్తున్నాయి, చెడు విచారణాబలాన్ని బట్టి ఏర్పడిన చెడుసంస్కారం దుష్కర్మలు చేసేలా ప్రభావితం చేస్తుంది. దుష్కర్మలు దుష్ఫలితాలనే ఇస్తాయి.
వర్తమానములో జీవుడు చేసే విషయ విచారణ లేదా విషయ వాంఛ అనేది భవిష్యత్తులో ఒక సంస్కార జ్ఞానముగా మారుతుంది. సంస్కార జ్ఞానము ఆయా కర్మలను చేసేలా మనస్సును ప్రేరేపిస్తుంది.
పాలు త్రాగాలి అని ఆలోచించడం సత్కర్మ, పొగత్రాగాలి అని ఆలోచించడం దుష్కర్మ. మనస్సు లోని భావన, ఆలోచన అలాగే కొనసాగితే కర్మ విచారణాబలాన్ని పొందుతుంది. కర్మ బలాన్ని బట్టి శక్తి సంస్కార జ్ఞానముగా బలమును కలిగి వుంటుంది. సంస్కార జ్ఞానము క్రియను చేసేలా ప్రభావితం చేస్తుంది. పాలు త్రాగాలనే విషయ విచార కర్మ వలన కర్మ బలాన్ని పొంది సంస్కార జ్ఞానముగా బలపడుతుంది. బలపడిన సంస్కార జ్ఞానము పాలు త్రాగేలా ప్రభావితం చేస్తుంది. సత్కర్మ తన ఆరోగ్యముపై తదనుగుణమైన మంచి ఫలితాన్ని ఇస్తుంది. పొగ త్రాగాలనే దుష్కర్మ వలన దుష్కర్మ తదనుగుణమైన కర్మను ప్రేరేపించి పోగాత్రాగేలా చేస్తుంది. అందువల్ల దుష్కర్మ చేత మానవుడు తన ఆరోగ్యముపై దుష్ఫలితాలను పొందుతున్నాడు. సత్కర్మ వలన సత్ ఫలితాన్ని పొందుతున్నాడు.
మొక్కను నాటాలి అని ఆలోచించడం కర్మ. మొదట కలిగిన ఆలోచన ఆ కార్యమును చేయడానికి సహకరించలేని బలహీనముగా వుంటుంది. అదే ఆలోచన తీవ్రమవుతున్న కొద్ది కర్మ బలాన్ని పొందుతుంది. కర్మ బలాన్ని అనుసరించి సంస్కారజ్ఞానం కార్యము చేసేలా ప్రభావితం చేస్తుంది. కార్యము జరిగే క్రమములో కార్య తీవ్రతనుబట్టి దానిఫలితం అనునది దేశకాలపరిస్థితులకు అనుగుణంగా వుంటుంది. చెట్టు పెద్దదయ్యాక ఫలములను, నీడను ఇస్తుంది. ఆక్షిజన్ ను అందిస్తుంది.
ప్రస్తుతం అనుభవిస్తున్నవన్నీ ఇతఃపూర్వ కర్మల ప్రభావము వలననే జరుగుతున్నాయి.
మహాశక్తి: శ్రీరామధర్మజ! కర్మ ఫలితముల గురించి మహర్షి వసిష్ఠుల వారు శ్రీ రామ చంద్రునికి చెప్పిన విషయాలను నేను నీకు చెప్పుతాను శ్రద్ధగా విను.
చేసిన కర్మలు సంస్కారములుగా(వాసనలుగా) మారతాయి. సంస్కారములు అనునవి నీవు ప్రస్తుతం ఆయా పనులు చేయాలని ఆలోచించకున్నను పూర్వ కర్మ వలన అవి జ్ఞప్తి చేస్తూ ఆయా కార్యములు చేసేలా ప్రభావితం చేస్తాయి. ఎవరు ఎటువంటి కర్మలకు యత్నించుతారో వారు అట్టి కర్మ ఫలమును పొందుతున్నారు.
అంతరంగము నందు ప్రవృత్తియే సర్వ బాహ్య ప్రవర్తనల యొక్క అంతర్లీన కారణం. అట్టి ప్రవృత్తి శ్రద్ధాశక్తులను అనుసరించి ఆయా ప్రయోజనముల సిద్ధికి కారణమగుచున్నది.
చిన్న జామ విత్తనములో పెద్ద జామ చెట్టు వ్యూహం దాని ఫలములు దాగి వున్న విధముగా, కర్మ బీజములో కార్య వ్యూహం, దాని ఫలాలు దాగి వున్నాయి.
జీవుని ఇతఃపూర్వ కర్మ బలము ఇప్పటి ప్రయత్నముల కర్మ బలము రెండు నిరంతరం ఒక దానితో మరొకటి సంఘర్షణ పడుతుంటాయి అందులో అధిక బలముగలది గెలుస్తుంది. పూర్వ-ప్రస్తుత కర్మలలో ఏది బలవత్తరమైనదైతే అదియే జయిస్తుంది. పూర్వకర్మ దోషములను వర్తమాన ఉత్తమ కర్మలచే తప్పకుండా శుభప్రదం చేసుకోవచ్చు. ఎప్పుడైనా వర్తమాన ప్రయత్నములు విఫలమౌతుంటే అప్పుడు పూర్వ వ్యతిరేక ప్రయత్నములు ప్రబలముగా ఉన్నవని గ్రహించాలి. మరలా మరలా ప్రయత్నశీలురు కావాలి. ఈ జగత్తులో లభ్యమవుతున్న ప్రస్తుతం అనుభవిస్తున్న ప్రతి వస్తువు వెనుక పూర్వ కర్మ ప్రయత్నాశీలత్వం అతీంద్రియముగా ఉన్నది అని గ్రహించాలి.
అందుచేత మానవుడు శాస్త్ర విధిని అనుసరించి సత్కర్మలకు సంబంధించిన ప్రయత్నములను ఎప్పటికప్పుడు అధికం చేసుకోవాలి క్రమముగా అట్టి సత్కర్మలు బలవత్తరమై ఉత్తమ సంస్కారములుగా రూపుదిద్దుకుంటాయి. అట్టి సుసంస్కారం వివేకమును నిదురలేపి శుద్ధ సత్త్వమగు ఆత్మ వస్తువు యొక్క సామీప్యతను ప్రసాదిస్తుంది. ఒక వేళ శుభ కర్మలు ఆచరించటానికి ప్రయత్నములు చేస్తున్నప్పుడు ఏవైనా అవాంతరాలు వస్తే ‘ఇవన్ని ఇతఃపూర్వం నా దుష్కర్మల ప్రబలత్వమే’ అని గ్రహించవలెను. అట్టి సమయములందు స్వప్రయత్నములను విడనాడకూడదు. పట్టువిడవక దృఢ సంకల్పముతో, నిరంతరము కృషి చేస్తూ శుభ కర్మలనే ఆశ్రయించాలి. ఫలోన్ముఖములగుచున్న ఇతఃపూర్వ అమంగళకరమగు కర్మల ప్రభావమును, దుష్ట సంస్కారములను, వాసనలను తొలగించుకోవాలి. అందుకై ఓర్పు, పట్టుదల, దృఢ సంక్జల్పం, కృషి అవసరమై వున్నాయి.
రామా! ఇతఃపూర్వ౦ ఆర్జించుకొని వున్న మనో దోషములను హరించిపోయే వరకు శాస్త్రోచితమైన సత్కర్మలను శరణువేడవలసి౦దే. పూర్వ అశుభకర్మలు ఇప్పటి ప్రయత్నములచే జయించబడతాయి. శుభకర్మల వలన శుభం చేకూరుతుంది. అశుభ కర్మల వలన అశుభం ప్రాప్తిస్తుంది.
శ్రీ రామా! ఈ జగత్తులో ఎవరైనా ఏ వస్తువైనా లభించాలంటే ప్రయత్నమే ఉపాయం. ప్రయత్నం లేకుండా ఏది ప్రాప్తించదు. ఏ ఫలితమైనా ప్రయత్నం చేతనే లభిస్తుంది. ప్రయత్నమును విరమించకుండా కృషి సాగించినప్పుడు తప్పక విజయాన్ని సాధిస్తాడు. కావున మానవుడు ఉత్తమమైన తన జీవిత లక్ష్యమును ముందుగా ధ్రువీకరించుకొని ఆపై శాస్త్ర సమ్మతమైన మార్గములో నడవాలి.
శ్రీ రామా! ఈ ప్రపంచములో అజ్ఞానం, పేదరికం తాండవించడానికి కారణం ప్రజలు ప్రయత్నశీలురు కాకపోవడమే. ప్రయత్నశీలుడు సమర్ధుడు తన చుట్టూ పక్కలను కూడా సంవృద్ధిచే నింపివేయగలడు. అతనికి ఈ ధరణీతలమంతా ఒక లెక్క లోనిది కాదు. ప్రయత్నశీలున్ని అతని లక్ష్యము నుండి దూరము చేయుగలిగేది కేవలం ‘ప్రయత్న రాహిత్యము’ ఒకటే కావచ్చునేమోగాని మరింకేది కాదు.
బాల్యము నుండే మనిషిని సత్సంగము(విజ్ఞులు, పెద్ధలు), శాస్త్ర చర్చ, మంచి అభ్యాసములు లక్ష్యమును దృఢతర౦ చేస్తాయి. ఉత్తమ జ్ఞానం కొరకు తదనుకూలమైన ప్రయత్నములను చేసెదను గాక అను సంకల్పము రూపుదిద్దుకుంటుంది. తాను ఆశ్రయిస్తున్న ప్రయత్నమే మానవునికి అమోఘమైన ఫలములను ప్రసాదిస్తుంది.
సోమరితనము త్యజించిన వారికే ఉత్తమ వస్తువు లభ్యమవుతుంది.
ప్రయత్నశీలుడు అనాయాసముగా అదృష్టము అనుదానిని వశపరుచుకోగలుగుతున్నాడు .
ఒకానొకడు ఏదైనా సాధించుటలో సమర్థుడు అగునన్నచో దాని వెనుక ప్రయత్నము దాగి వున్నది. కానీ మందమతి అట్టి సమర్థత వెనుకవున్న ప్రయత్నశీలత్వమును గ్రహించలేడు. చివరికి అదృష్టము అతనిని వరించింది. అని భావించి ఊరట చెందుతున్నాడు. ‘సమర్థత’ అనునది అదృష్టానుసారం ఉండేది కాదని స్వప్రయత్నముల అల్ఫాధిక్యతలను బట్టి ప్రాప్తించేదని గ్రహించాలి.
వర్తమాన శుభప్రయత్నములను పూర్వ అశుభ ప్రయత్నముల ఆకర్షణచే ఓడించకుండా చూసుకోవాలి.ఉత్తమ లక్ష్యము నుండి వెనుతిరగని వాడే విజయమును పొందుచున్నాడు.
వర్తమాన సత్కార్యములు ప్రారబ్ద(పూర్వ) కర్మలు శుభములుగా మారి సమర్థునికి భవిష్యత్తు నందు శోభను కలుగచేస్తున్నాయి. అందుచేత జీవుడు ఉత్తమ కార్యశీలుడు కావాలి. బద్దకము, అశ్రద్ధ ను త్యజించాలి. అతడు స్వకీయమైన ప్రత్నముల (సత్కర్మల)చేత కోరుకున్న ఫలమును పొందగలడు.
మనస్సు నందు ఎట్టి విషయము స్ఫురిస్తుందో చిత్తము కూడా అట్టి ఆకారమునే దాల్చుట జరుగుతుంది. అట్టి చిత్తము నుండి ఇంద్రియముల యత్నములు బహిర్గతమవుతున్నాయి. ఒకడు తన బాల్యము నుండి ఏ ఏ విషయములను గురించి ఏ ఏ ప్రయత్నములు చేస్తాడో ఫలితములు కూడా ఆ విధంగానే వుంటాయి. అందుచేత కర్మ అనునది సర్వమునకు మూలకారణమై ఉన్నది. కర్మ ప్రభావం చే కలిగే ఫలమును తను మాత్రమే కాకుండా ఆ ప్రభావం సమీపములో వున్న వారు కూడా అనుభవిస్తారు.
సత్ కర్మ, సత్ భావన కలిగి వున్న కుటుంబయజమాని వలన కుటుంబములోని వారు ఆనందముగా వుంటారు. సంస్థ యజమాని వలన సంస్థ ఉద్యోగులు ఆయా మార్గమునే అనుసరిస్తూ సంస్థ ఉద్ధరణకు హేతువవుతారు. నాయకులు, గురువులు సత్ కర్మలు చేస్తూ సన్మార్గములో నడవడం వలన శిష్యులు కూడా సత్ కర్మలే చేస్తూ సన్మార్గములో ప్రయాణిస్తారు.
భవిష్యత్ ప్రణాళిక రచించుకొని తదనుగుణమైన కృషి చేయడం వలన అనేకులు భోగ భాగ్యములతో ఆనందముగా జీవిస్తున్నారు. అనేకులకు కలిగే ఆపదలకు, దుర్దశలకు కారణం భవిష్యత్ ప్రణాళిక లేకపోవడమే.
ఓ రామా! మరల మరల ప్రకటిస్తున్నాను ఏ వ్యక్తి దేని కొరకు ఎంతగా ప్రయత్నిస్తున్నాడో అతడు దానిని అంతవరకే పొందుచున్నాడు. అశ్రద్ధ, నిర్లక్ష్యం వహించి ఊరుకునే వానికి ఎక్కడా ఏమి సిద్ధించుట లేదు. మనిషి దేనిని కోరుకుంటున్నాడో దాని కొరకే ఉత్తమ ప్రయత్నం చేయాలి. ఇక ఫలితమనేది వెనువెంటనే లభించవచ్చు లేదా ఆలస్యముగా ప్రాప్తించవచ్చు ఏది ఏమైనా శుభ ప్రయత్నములకు శుభము, అశుభ ప్రయత్నములకు అమంగళము వచ్చి తీరుతాయి. వాటిని ఎవరూ నిరోధించలేరు. ఇది అప్రతిహతమైన విధాన శాసనం.
అనర్థకములైన ప్రయత్నములు అట్టి ప్రయోజనమునే కలుగజేస్తున్నాయి. సమగ్ర-సదవగాహనతో కూడిన ప్రయత్నము చేతనే అనుకున్నది లభిస్తుంది.
పూర్వ కర్మల చే ప్రాప్తించిన దుష్ట సంస్కారములను ఇప్పటి ప్రయత్నములచే శుభప్రదం చేసుకోవచ్చు. వర్తమాన సత్కర్మలు పూర్వ దోషములను ప్రక్షాళనం చేయగలవు. కాబట్టి రామా! సర్వదా సత్కార్యములు చేయుటకే యత్నించవలెను.
ఈ నా ప్రయత్నములు అల్పమైనవా? లేక పరమోత్కృష్టమైనవా? అని జీవుడు యోచించి సరి అయిన నిర్ణయం చేసుకోవాలి.
ఈ లౌకిక కార్యములను గమనిస్తే రాజ్య క్షేమం, భోగ విలాసం, కట్టు దిట్టమైన వ్యవస్థలు, కుటుంబ పోషణ, కోపం, నిగ్రహం, అరికట్టడం లేదా ఆకట్టుకోవడం ఇత్యాది అనేక క్లిష్టమైన పనులన్నీ ప్రయత్న బలము చేతనే ఒనగూడుతున్నాయి. దైవమును సమ్మతిస్తూనే మానవులు ఉత్తమమగు సత్కర్మలను ఆశ్రయించి సమున్నతులు కావాలి.
‘అభీష్టములు నెరవేరడం’ అనే విషయానికి వస్తే దాని కొరకు తీవ్రేచ్ఛచే వారు చేయు అభ్యర్థన పూర్వకమగు ప్రయత్నము చే లక్ష్య శుద్ధి ఏర్పడి సాధించవలసిన దానికి సానుకూల౦గా ఆలోచనా -క్రియాదులు ఒనగూడుతున్నాయి. పూర్వ ప్రయత్నముచే ఏర్పడిన బుద్ధి అందుకు సిద్ధమై ఆ ఆలోచనను స్వీకరిస్తుంది. మరలా మరలా ప్రయత్నము చేత ఫలితం ప్రాప్తిస్తుంది.
పూర్వ స్వకీయ ప్రయత్నముల సారమై ఉన్నట్టి వాసనలను అనుసరించే మనిషి వాటికి ప్రభావితమవుతూ ఈ వర్తమానము నందు ఆయా విధములుగా భావించుట, మాట్లాడుట, ప్రవర్తించుట చేస్తున్నాడు. వాసనలే కర్మలుగా పరిణమిస్తున్నాయి. వాసనలు మళ్ళీ అవే కర్మలు చేసేలా ప్రభావితం చేస్తున్నాయి. ఎవరికి ఏ వాసనలుంటే వారు వాటి నిమిత్తమై ఎల్లప్పుడు ప్రయత్నిస్తూ వుంటారు.
ఒకనిలో ఏ వాసనలైతే బలమును చేకూర్చుకొని ఉంటాయో, అవే అతని కర్మలుగా పరిణమిస్తున్నాయి. అయితే తన యొక్క పూర్వ ప్రయత్నముల వ్యవహారమంతా సమగ్రముగా పరిశీలించకపోవుటచే అవి ఎదురుగా కనపడక పోవుటచే గ్రహించలేకున్నాడు.
ప్రతి జీవుని యందు శుభ-అశుభ పూర్వ కర్మలు ఉన్నాయి. అందులో శుభవాసనలు శుభకర్మల వైపు ,అశుభ వాసనలు అశుభ కర్మల వైపు ఆ జీవున్ని ప్రేరేపిస్తున్నాయి. ఆ రెండింటిలో ఏది బలవత్తరమైతే అది రెండవ దానిని శీఘ్రంగా జయించి జీవుడిని అట్టి ఆచరణలో నియమిస్తుంది. కానీ వర్తమానములో ఏది చేయాలి? ఏది చేయకూడదు? దేనిని ఆశ్రయించాలి? దేనిని ఆశ్రయించకూడదు? దేనిని ఎట్లు గ్రహించాలి? దేనిని ఎట్లు గ్రహించకూడదు?… ఇవి చైతన్య స్వరూపుడగు జీవుని చేతిలో వున్నాయి. అందుకు సన్మార్గం చూపించే మార్గాన్ని, విధి విధానాలను వివేకబుద్ధితో గ్రహించి శుభకర్మలనే ఆశ్రయించాలి. శుభమగు వాసనలచే ప్రేరేపితులైతే ఈ జీవులు శుభ పురుషార్థ బలం చేత క్రమంగా శాశ్వతమగు ముక్తిని పొందగలరు. ఒకవేళ అశుభ వాసనలు ప్రబలమై అశుభ కర్మలయందు ప్రవేశింపచేస్తున్నట్లయితే, వర్తమానకాలములో ఉత్తమ ప్రయత్నము అత్యంత ఆవశ్యకతమై యున్నది. వర్తమాన ప్రయత్నం చేత క్రమంగా అశుభవాసనలను బలహీనం చేయాలి. అట్లు ప్రయత్నిస్తూ ఒక శుభతరుణంలో ఆ అశుభ సంస్కారములను మొదలెంట పెకల్చివేయాలి.
జీవుడు జడమగు దేహము కాదు. చిన్మాత్ర స్వరూపుడు. ప్రజ్ఞాతత్వ స్వరూపుడు. అట్టి జీవుడు పూర్వ సంస్కారములకు లొంగి వుండవలసిన అవసరమేమున్నది?
నీ మనస్సు చెడు మార్గములో ప్రవేశిస్తున్నప్పుడు దానిని మంచి మార్గ౦లో నియమించడానికి చేసే ప్రయత్నమే శుభ కర్మ.
ఈ జీవుని యొక్క చిత్తము అల్లరి చేసే పిల్లవాని వలె అతి చంచలమైనది. అయితే ఈ చిత్తమునకు ఒకానొక ప్రత్యేకత ఉన్నది దానిని మనం ఏ దిశకు నియమిస్తామో ఆ దిశకు ఉరకలు వేస్తూ పరుగులు తీస్తుంది. దానిని మనం అశుభము నుండి శుభము వైపు త్రిప్పితే క్రమంగా అది శుభకర్మలనే ఆప్యాయతతో ఆశ్రయిస్తుంది. అలా కాకుండా మంచి నుండి చెడు వైపుకు వెళ్లనిచ్చామో అదే వేగముతో దుష్ట కర్మలను ప్రీతిగా ఆశ్రయిస్తుంది. అందుచేత ఈ చిత్తమును కొంత పట్టుదలతో బలవంతంగా శుభ ప్రయత్నముల వైపుకే మరల్చాలి. అంతేకానీ అలాగే వదలివేయరాదు. అశుభకర్మలను క్రమంగా క్షీణింప చేస్తూ కరుణ, సమదర్శనము మొదలైన ఉత్తమ గుణములను ప్రయత్న పూర్వక౦గా ఆశ్రయించాలి.
వాసనలు అభ్యాస వశం చేతనే దట్టమగుచున్నాయి. వాసనలు అనునవి అభ్యాసవశం చేతకాని లేక అజ్ఞాన వశం చేత కానీ మరింకే కారణం చేతనైనా వృద్ధి చెందనీ అందుకు చికిత్స మాత్రం శుభకర్మలే. శుభాచరణం సర్వదా మంచిదే. అవి భవిశ్యత్తులో దుర్వాసనలు ఏర్పడే అవకాశమును బలహీనపరుచగలవు.
మనస్సు పరిశుద్ధమైన తర్వాత సూర్యకాంత మణి వలె జీవుడు స్వయముగా ప్రకాశిస్తాడు.
పరిశుద్ధమైన మనస్సు తో అర్హత పొందిన జీవుడు త్వరగా ముక్తిని, మొక్షాన్ని పొందుతున్నాడు.
శ్రీరాముడు: మహా శక్తి! జీవుడు అర్హతను బట్టి ముక్తి, మోక్షము ప్రాప్తిస్తున్నదని విశేషముగా చెబుతున్నావు. ముక్తి, మోక్షము గురించి ఇంకా వివరంగా తెలియపరుచమని కోరుతున్నాను.
ముక్తి అనగా జీవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం. మరియు బాధల నుంచి, కష్టాలనుంచి బయటపడటం. మోక్షము అంటే త్రివిధ ధుఃఖాల నుండి బయటపడడం. జీవుడు భ్రమ యొక్క రహస్యం తెలిసి పరిపూర్ణ జ్ఞానము పొందడం. మొక్షమును పొందిన జీవుడు స్వేచ్ఛా జీవుడు. ప్రకృతిని శాసిస్తాడు. జీవునికి ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించే శక్తిని కలిగి వుంటాడు. మోక్షమును పొందినవాడు దైవముతో సామానుడు. విశ్వనిర్మాణానికి తోడ్పడే అధికారములు కూడా కల్గి ఉంటారు. వారు విశ్వాన్ని రక్షించే ధర్మ దేవతలుగా వుంటారు.
42. ధర్మం వలన ముక్తి, మోక్షం లభించుట.
జీవుడు ముక్తిని, మోక్షాన్ని పొందడానికి కాల పరిమితి నిర్దేశించబడింది. జీవునికి కల్పింపబడిన ఉపాధి ఎంత వరకు ఉంటుందనే విషయంలో కర్తవ్య కాలం నేర్దేశింపబడివుంటుంది. అంత కాలం, వివిధ ఉపాధులతో జీవుడు చేయదగిన కర్తవ్యం పూర్తి అయిన తర్వాత అతనికి దేవుడు ముక్తిని లేదా మొక్షాన్ని ప్రసాదిస్తున్నాడు.
పంచభూతాలకు, వాటితో కల్పించిన ఉపాధులలో అవి చేయవలసిన కర్తవ్య కాలం అయిపోగానే ముక్తిని పొంది స్వేశ్చాజీవిగా మారుతున్నాయి. జీవులకు వాటి గుణములలో వివిధ ధర్మాలు నిర్దేశించబడినది. ఆ గుణములతో అవి వివిధ కర్తవ్యాలను నిర్వర్తిస్తున్నాయి. వాటి కర్తవ్య కాలం అయిపోగానే అవి ముక్తిని పొంది. ఉత్తమ గుణాలు గల దేహాన్ని ప్రాప్తముగా పొందుతుంది. మానవుడు తనకు అప్పచెప్పిన విధిని ధర్మ బద్ధముగా నిర్వర్తించడమే తన కర్తవ్యం. తను ధర్మమార్గములో ఎంత కాలం వున్నాడో లెక్క కట్టబడుతుంది. మానవుడు తన కర్తవ్య కాలము పూర్తవగానే ముక్తిని లేదా మోక్షాన్ని పొంది ఉత్తమ గతులను పొందుతున్నాడు.
జీవుని మనస్సును, తన అర్హతను అనుసరించి ఉన్నత లోకాలకు ప్రవేసించే మోక్షం కలుగుతుంది. డైవలోకములోకి ప్రవేశించే యోగ్యతను పొందడానికి మానవుడు అనుసరించాల్సిన ధర్మాలు దైవలోక ధర్మశాస్త్రములో వివరించడమైనది. దానిని గ్రహించి, మానవుల మనస్థితి, తను చేసే కార్యములను అనుసరించి మోక్షనికి అర్హతను పొందుతారు.
43. దైవలోక ధర్మ శాస్త్రం.
మానవుడు ముక్తిని లేదా మోక్షాన్ని పొందడానికి ‘దైవ లోక ధర్మ శాస్త్రము’ లో చెప్పబడిన నియమాలను పాటించాలి. నియమాలు రెండు రకాలు . ఉపదేశము 2. ఆదేశము.
ఉపదేశము: దైవలోక ధర్మశాస్త్రంలో చెప్పిన విధంగా అలాగే పెద్దలు సూచించే విదంగా ఆచరించడమే ఉపదేశము. ముక్యంగా అంతరంగికముగా ఎటువంటి నియమాలను కలిగి వుండాలో సూచించేదే ఉపదేశము. 2. ఆదేశము: ఇందులో మానవుడు కచ్చితంగా పాటించవలసిన నియమాలు తెలియ జేయబడుతాయి. వాటిని యథాతథంగా పాటించాలి. అలాగే రాజ్యాంగము చెప్పిన శాసనాన్ని, ధర్మాలను ఆచరించాలి.
ఈ చరాచర జగత్తును ధరించే ఒకానొక దివ్యశక్తి ధర్మం. ధర్మం వలన ఈ లోకం నిలబడుతుంది. సర్వ లోకాలను పరస్పర ఆధారాలచే నిలబెడుతున్న దానిని ధర్మం అంటారు.
ధర్మము అంటే ఆచరించడం. అనుభవజ్ఞులచే ఏది చేయాలి ఏది చేయకూడదు. చేస్తే ఎలా చేయాలి. ఎలా చేయకూడదు అన్నటువంటి నీతి నియమాలను చెప్పేది ధర్మం. ప్రజల అభ్యున్నతికి కారణమయి వుండేది ధర్మ శాస్త్రం.
పరిపాలన అనే వ్యవస్థ వుండటానికి ముఖ్యమైన కారణం, ఎవరికి ప్రియమైనది వారి ఇష్టానుసారం, వారి బలాను సారం వెళ్లకుండా అందరికీ శ్రేయస్సును కలిగేలా అందరికీ అన్ని సదుపాయాలు అందించేలా ఏర్పడిన వ్యవస్థ పరిపాలనా వ్యవస్థ. బలవంతుడు తన బలంతో అన్నీ దోచుకుంటే బలహీనులు, సామాన్యులకు కొరత ఏర్పడుతుంది. ఈ వ్యత్యాసాన్ని నియంత్రించి ఎవరి అర్హతను అనుసరించి వారికి సమాన న్యాయంచేసేదే పరిపాలనా ధర్మం. కావున పరిపాలనా వ్యవస్థ నియమాలను గౌరవిస్తూ, ధర్మ బద్ధముగా వాటిని ఆచరించాలి.
నదీ ప్రవాహానికి ఆనకట్ట ఎలాంటిదో సమాజమునకు ధర్మం అటువంటిది. సమాజ హితం కోసం ధర్మం చేత వ్యవస్థ కట్టుబడి వుంటుంది. వ్యవస్థలో నియమించబడిన ధర్మానికి కట్టుబడి పనిచేయడం చేత సమాజం రక్షించబడుతుంది.
ధర్మం మనిషిని సాటి మనిషితో, ప్రకృతితో కలిసి సుఖంగా ఎలా జీవించాలో చెబుతుంది. ధర్మం మనిషిలోని సంఘర్శణలనన్ని౦టిని నాశనం చేసి ప్రశాంతం గా జీవించేలా చేస్తుంది.
ధర్మం అంటే పట్టుకొని ఉండటం, ధరించి ఉండటం, ఆధారంగా ఉండటం, న్యాయం వైపు మద్దత్తుగా ఉండటం, స్థిరత్వాన్ని కలగజేయడం. మనకు ఎదైతే ఆధారాన్ని, స్థిరత్వాన్ని కలిగిస్తుందో దాన్నే ధర్మం అంటారు.
సైనికుడు కవచం ధరించడం వలన శత్రువుల బారి నుండి రక్షించబడుతున్నాడు. ఆవుల మంద దగ్గర కాపరి కర్ర పట్టుకొని ఉండడం వలన మృగముల దాడి నుండి ఆవులు రక్షించబడుతున్నాయి. న్యాయవాదులు, రక్షక బటులు సత్యానికి మద్దతుగా వుండి దుష్టులను శిక్షించడం వలన పౌరులు రక్షించబడుతున్నారు.
ఏ బాధ్యతలైతే ఒక వ్యక్తి ఇవ్వబడ్డాయో, ఏబాధ్యతలైతే ఆ వ్యక్తి స్వీకరించాడో వాటికి కట్టుబడి పనిచేయుటయే ధర్మం.
ఆపత్కాలము నందు కూడా నేను రక్షింపబడకున్నా, ధర్మం రక్షించబడటం ప్రధానం అని ధర్మానికి పెద్దపీట వేసేవాడు వుత్తముడైన ధార్మికుడు, తనకు కష్టముగా వున్నా ధర్మాన్ని రక్షించడానికే మానవుడు ఎప్పుడూ ప్రయత్నపూర్వకంగా సిద్ధపడి వుండాలి .
చేసే పనిని త్రికరణ శుద్ధితో అనగా మనసా వాచా కర్మణా దాని యందే నిమగ్నమై తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
ధర్మం ఆశ్రమాన్ని బట్టి, దేశ కాల పరిస్థితులను బట్టి మారుతుంది.
బాధ్యతా యుతముగా వుండటం ధర్మం. బాధ్యతా రహితంగా వుండటం అధర్మం.
అధికారుల ఆదేశాన్ని ధిక్కరించకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించడం ధర్మం.
ఏ సత్కర్మలైతే మనకు అభివృద్ధిని, శ్రేయస్సును, ఆన౦దాన్ని, సిద్ధిని కల్గజేస్తాయో ఆ కర్మలను ధర్మం అంటారు. శారీరక, మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక సాంఘిక అభివృద్ధిని ఇచ్చి సంపూర్ణ క్షేమమును ఇచ్చేది ధర్మం.
ధర్మం వ్యక్తి కి మాత్రమే కాక సమాజ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ధర్మానికి ఆపద కలిగితే దాని వలన ధర్మాత్ములకు, బలహీనులకు ఆపద వస్తుంది.
స్వధర్మం ఆచరించువాడే ఉత్తమోత్తముడు. అతడే ధర్మాన్ని రక్షించువాడు, సమాజాన్ని ఉద్ధరించేవాడు అవుతున్నాడు.
స్వధర్మం అనగా తను చేసే వృత్తికి న్యాయం చేయడం. అతను ఉద్యోగి అయినా, అధికారి అయినా తన కర్తవ్యాన్ని విస్మరించకుండా తనకు అప్పచెప్పబడిన బాధ్యతను బాధ్యతాయుతముగా ఎటువంటి ఆటంకం లేకుండా నెరవేర్చడం. తన బాధ్యతను చక్కగా నెరవేర్చడమే స్వధర్మం.
ధర్మాన్ని పట్టుకున్న వారు ధైర్యంగా వుంటారు. ధర్మం ధైర్యాన్ని, తేజస్సును ఇస్తుంది.
సకల ధర్మాలకు సత్యమే మూలం. ధర్మం దురాచారాలను తొలగిస్తుంది. సత్యము, శౌచము(శుచత్వ౦), దయ మొదలైన మంచి గుణాలతో మానవుడు సత్కర్మ నిరతులై జీవించాలి. శుద్ధ చిత్తముతో ధర్మం ప్రకాశిస్తుంది. ధర్మం వున్న చోట పాపం వుండదు.
ఓర్పుతో ధర్మం పట్టుకోవాలి. ఓర్పు పట్టకపోతే ధర్మం నిలబడదు. ఓర్పే సర్వం. ఓర్పే యజ్ఞం. ఓర్పే దానం. ఓర్పే ధర్మం. ఓర్పును మించిన ధర్మం లేదు. ధర్మానికి కావలసిన మొట్టమొదటి లక్షణం ఓర్పు. సమాజ హితం కోసం ధర్మం అత్యంత ఆవశ్యకం.
ధర్మమును బలహీన పరిచేటటువంటి ఆజ్ఞలు వుండకూడదు. ధర్మాన్ని బలహీనపరిచేటటువంటి ప్రసంగాలు వుండకూడదు.
ఎవడి వల్లనైతే సమాజంలోని వారు ధైర్యముగా జీవిస్తారో. ఎవడైతే మీకు నేనున్నానని అభయాన్ని ఇస్తాడో. ఎవడైతే సంస్కార హితంగా ప్రవర్తిస్తాడో వాడు ధర్మాత్ముడు. వాడి వలన ప్రజలు క్షేమంగా వుంటారు. అతను ఏ సంస్థలో ఉద్యోగం చేస్తే ఆ సంస్థ అతని వలన నష్టపోదు. పైగా కీర్తింపబడుతుంది. ధర్మం తప్పడం వలన తను పతనమవడమే కాకుండా తనని నమ్ముకున్న వారు కూడా పతనమై పోతారు. మనిషిని శాశ్వతముగా రక్షించేది ధర్మ మొక్కటే.
‘నా ధర్మ౦ నేను చేశాను’ అని మనోనిశ్చయముతో వున్న వాడు పరమ సంతోషముగా, పరమ శాంతముగా వుంటాడు.
ధనము ధర్మముతో ముడి పడక పోతే క్రూరమృగములతో కూడికున్నటువంటి మహారణ్యము నందు పశువులను పెంచాలని ఆశపడిన వ్యక్తి జీవితం ఎలా దుర్భరమవుతుందో, ధర్మ౦ విడిచిపెట్టి ధనాన్ని సంపాదించాలనే వారి జీవితం అలాగే వుంటుంది.
ధర్మము నందు కఠిన పరిస్థితులలో కూడా నిలబడిన వాడు శ్రద్ధా వంతుడు. ఎంత విపత్కర పరిస్థితిలోనైనా సరే శాస్త్రము, ధర్మము వదలకుండా నిలబడితే అతడు శ్రద్ధా వంతుడు.
అనుకూలతలో మాత్రమే కాకుండా సంక్లిష్టమైన ప్రతికూల పరిస్థితులలో కూడా ధర్మం పట్టుకొని ధైర్యం వహించాలి. ఉత్సాహాన్ని విడవకుండా పరమ శ్రద్ధతో ధర్మాన్ని పట్టుకోవాలి. ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
వ్యక్తిగతమైన అవసరం కోసం, ప్రతిష్ఠ కోసం, స్వలాభం కోసం ధర్మం విడిచిపెట్టవద్దు .
ఎక్కడికి వెళ్లినా అక్కడ ధర్మం పాటించాలి. ఎవరి ధర్మాన్ని వారు పాటించితే లోకంలో శాంతి భద్రతలకు లోటుండదు. లోకములో శాంతి అన్న మాటకు అర్థం ధర్మాచరణయే.
ఎప్పుడైతే ధర్మం మరుగున పడుతుందో ఎన్ని శాసనాలు పెట్టినా ఎంత కష్టపడినా ప్రజలు శాంతముగా జీవించలేరు. ధర్మం విడిచి పెడితే అది ప్రజలను ఎంత ప్రమాదానికైనా తీసుకెళుతుంది.
ధర్మాన్ని పట్టుకున్న వాడు ఎక్కడుంటాడో అక్కడ శాంతి సౌభాగ్యాలు పుష్కలంగా వుంటాయి.
మానవజన్మ చాలా అపురూపమైనటువంటి జన్మ. ఇంతటి అపురూపమైనటువంటి జన్మను పొందినటువంటి వాడు ధర్మాచరణ చేతనే మోక్షాన్ని పొందగలడు. ధర్మాచరణ చేతనే మానవుడి యొక్క జన్మ ప్రయోజనము పొందుతుంది.
జీవుడు దైవస్వరూపుడు. సర్వ జీవుల, మానవుల యోగ క్షేమాలు చూడటం అంటే దేవతల యోగక్షేమాలు చూడటమే. అప్పుడే వారి అనుగ్రహం పొందుతారు. బాధలకు గురిచేస్తే ఆగ్రహానికి బలవుతారు. ఇదే ధర్మం. నీ శత్రువైనా అతనిని కేవలం మనిషిగా చూడకు పంచభూతాల అధికారిగా చూడాలి. తన సంకల్పానికి శక్తి ఎలా క్రియాశీలంగా పని చేస్తుందో తన అనుగ్రహానికి, ఆగ్రహానికి శక్తి అలాగే క్రియాశీలంగా పనిచేస్తుంది. బాధించేవాడు ప్రతిఫలం అనుభవించవలసిందే. ఇది ప్రకృతి నియమం. ఇప్పుడున్న పరిస్థితులు, కాలం తనకు అనుకూలంగా వుండి దాని ప్రభావం కనిపించకపోవచ్చు, కాని అనుకూలించనికాలం కూడా ఒకరోజు వస్తుంది. ఆ కాలంలో పంచభూతాలు నలువైపులా నిలబడి ఎటూ కదలకుండా చేసి మరీ శిక్షను అమలు చేస్తాయి.
ఒకరిని బాధపెట్టడం వలన బాధ పడిన జీవుని ఆగ్రహముచే శాపగ్రస్తులవుతారు. సుఖము, ఆనందము పొందిన జీవుని అనుగ్రహము వలన పుణ్యాన్ని పొందుతారు. దాని ఫలితముగా అదృష్టముగా భోగ బాగ్యములు పొందుతారు. శాపమే పాపము గా, అనుగ్రహమే అదృష్టము గా పొందుతున్నారు. వీటి పూర్వ కర్మలు ఎవరూ గ్రహించలేనంత గుప్తముగా వుంటాయి. కాలానుగుణంగా అనుభవములోకి వస్తాయి.
తప్పుచేయకున్నా ఒకరి ఆవేశానికి శాపగ్రస్తుడనవుతానని భయపడనవసరము లేదు. తప్పుచేయకున్నా ఆగ్రహించేవారికి వారి ప్రతికూల వైబ్రేషన్స్ వారినే ప్రభావితం చేసి నశింపచేస్తాయి. ప్రతి శాపం పొందుతారు బాధలకు గురవుతారు.
మనస్సులో ప్రసన్నత వున్న వారిని ఇతరుల శాపములు చేరవు.
ఒకరి నిర్లక్ష్యము, ఆవేశము వలన బాధలకు గురైన వారిని, అనారోగ్యముతో వున్న వారిని శాపము వలన జరిగింది అని భావించకూడదు అది అజ్ఞానము, అధర్మం అవుతుంది. ఎవరైతే నిర్లక్ష్యముగా, ఆవేశముగా ప్రవర్తించి వారి బాధకు కారణమౌతారో వారు మాత్రం శిక్ష అనుభవిస్తారు.
ఒకరు చేసిన తప్పులకు న్యాయస్తానములు మాత్రమే శిక్షను వేయాలి. దాన్ని ధిక్కరించిన వాడు అధర్మముతో ప్రవర్తిస్తున్నవాడు అవుతాడు.
వ్యక్తి యొక్క వుద్దేశ్యాన్ని, కర్తవ్యాన్ని దృష్టి లో పెట్టుకొని హింస లేదా అహింస అనేది నిర్ధారణ అవుతుంది. తమ కర్తవ్యాన్ని నిర్వర్తించే సైనికులకు, న్యాయవాదులకు హింసాదోషం వుండదు.
దుష్టాంగాన్ని కత్తిరించే వైద్యుడు హింసించేవాడు కాదు. ఏ వుద్దేశ్యంతో చేస్తున్నాడు ఎంత పవిత్ర హృదయంతో చేస్తున్నాడు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అది హింసనా, అహింసనా అనేది నిర్ధారించుకోవాలి. తాను కర్తవ్యతానిష్ఠతో చేశాడు అంటే అది హింస కాదు.
తగినంత కారణం లేకుండా కర్తవ్యతానిష్ఠ లేకుండా, యుక్తా యుక్త విచక్షణ లేకుండా కేవలం అవతలి వారిని బాధపెట్టడం కోసం మాట్లాడితే, అప్పుడు అది హింసా దోషం అవుతుంది. మనస్సును బాధపెట్టడం కూడా హింసయే.
జ్ఞాన మైనా, అజ్ఞానమైనా, ధర్మ మైనా, అధర్మమైనా వ్యాప్తి చెందడం దాని లక్షణం. జ్ఞానాన్ని, ధర్మాన్ని స్వీకరించాలి. వ్యాప్తి చేయాలి. ఆజ్ఞానాన్ని, అధర్మాన్ని నిలువరించాలి. తమకు ఆప్పచెప్పిన వృత్తిని ధర్మ బద్ధంగా చేయువారు, తన అధికారాన్ని సరైన ధర్మ మార్గ౦ లో నడిపించే వారు, జ్ఞానాన్ని, ధర్మాన్ని వ్యాప్తి చేస్తున్న వారు ధీరులు. తన మార్గాన్ని అనేకులు ఆచరించినచో, అతడు వారికి జ్ఞాన౦ ఇచ్చిన దాత అవుతున్నాడు. కర్తవ్యముపై నిర్లక్ష్యము, సోమరితనము, అధికార దుర్వినియోగం చేసే వారు ఆజ్ఞానాన్ని వ్యాప్తి చేస్తున్న వారవుతున్నారు. వారు దైవ ఆగ్రహానికి గురవుతారు.
జ్ఞాని తన శక్తిని ధర్మం వైపు ధర్మకార్యాలవైపు మళ్లించాలి, సమాజ క్షేమం, సమాజ రక్షణే తన ధ్యేయ౦ కావాలి. ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో. ధర్మం వారి యోగ క్షేమాలు చూసుకుంటుంది. శక్తి ని అధర్మం వైపు వినియోగిస్తే చెడు ప్రభావాన్ని చవి చూడవలసి వస్తుంది.
స్వార్థం, ద్వేష౦, అధర్మం పక్కలో బల్లెం లాంటివి. అవి ఏ రోజుకైనా బాధించి దుఖాన్ని కలిగిస్తాయి. శాంతం, సహనం, ఓర్పు, జాలి, దయ, దానం, ధర్మం. అనేవి ఎండ నుండి, వాన నుండి రక్షించే గొడుగు లాంటివి. అందరికి ఆనందాన్ని కలగజేస్తాయి.
దుష్ట భావనలు చేసే వారి శక్తి తదనుగుణమయిన సూచనలు చేయడమే కాకుండా అగ్నికి వాయువు తోడైనట్టు దుష్ట శక్తులు కూడా తోడయి ప్రభావితం చేస్తాయి. ధర్మ సంకల్పాన్ని కలిగి వుండే వారి శక్తి ధర్మ మార్గాన్నే సూచిస్తుంది. అలాగే వారి సంకల్పానికి పంచభూతాలు, అష్ట వసువులు, అష్ట దిక్పాలకులు, ధర్మ దేవతలు సహకరిస్తారు.
మనిషిని అజ్ఞానం, అవివేకం బాధించినంతగా వ్యాధులుకాని ఆపదలు కానీ బాధించలేవు. కావున మానవుడు యే యే అజ్ఞానముల చేత బాధించబడుచున్నాడో పరిశీలనాత్మక దృష్టి తో గ్రహించాలి.
ప్రస్తుత కాలములో జ్ఞానం, ధర్మం లోపించాయి. అజ్ఞానం, అధర్మం పెచ్చుమీరాయి. ప్రస్తుతము కనిపిస్తున్న దురవస్థలకు అవే కారణం అని గ్రహించాలి.
చెడు పై మంచి విజయం సాధించాలి అంటే, అధర్మం పై ధర్మం విజయం సాధించాలి. తన పరిసరాలలో, తన సమాజంలో అధర్మం జరుగుతున్నా, అన్యాయం జరుగుతున్నా వాటిని మార్చగలిగే శక్తి సామర్థ్యాలు వున్నప్పటికీ అధర్మాన్ని ఆపక పోతే దాన్ని సమర్థించినట్లే అవుతుంది. అధర్మాన్ని, అజ్ఞానాన్ని ఖండించే వాడు ధర్మాన్ని కాపాడిన వాడు అవుతాడు.
శత్రువు, మిత్రుడు ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగే సమయంలో న్యాయం శత్రువు వైపువుంటే శత్రువు వైపే నిలబడాలి అదే ధర్మ౦. ధర్మం ఆచరించడంలో శత్రువు, బలహీనుడు అనే భేదాలు చూడకూడదు. ధర్మాన్ని పట్టుకున్న వాడు అసలైన బలవంతుడు. బలహీనులు ఎక్కువ కాలం ధర్మాన్ని పట్టుకోలేరు. ఎవడైనా ధర్మాన్ని పట్టుకున్నాడంటే, వాడు అత్యంత బలవంతుడు అనే అర్ధం. ధర్మం పక్షం నిలబడి ధనం, ప్రాణం పోతుందన్నా లెక్క చేయని వాడే ధర్మాత్ముడు. అప్పుడు విధి తనను వున్నత స్థితిలో వుంచుతుంది.
జీవునికున్న జ్ఞానాన్ని, ధర్మాన్ని అనుసరించే విధి తనని ఆయా లోకాలకు, లోకములోని తదనుగుణమైన ప్రదేశాలకు తీసుకునివెళుతుంది. ఆయా విధులలో నియమిస్తుంది.
విధిని, విధాతను, విశ్వసించడమంటే తనశక్తికి స్వేచ్ఛను ఇవ్వడమే, ఎవరైతే విధిని నమ్మి వారి కర్తవ్యాన్ని ధర్మబద్ధముగా చేస్తారో వారు నిశ్చింతగా, నిర్భయ౦గా జీవించవచ్చు.
ఎవరైతే దైవాన్ని నమ్మకుండా పరిమిత జ్ఞానమును కలిగి తమ వాక్ బలంతో ఇతరుల శక్తిని బలహీన పరుస్తారో వారు సమాజాన్ని బలహీన పరిచే అజ్ఞానులని గ్రహించాలి. అటువంటి వారి యడల జాగరూకులై వుండాలి.
మానవుడు తన శక్తిని విశ్వసించాలి. తన శక్తి తెరవెనుక అత్యంత ప్రభావవంతముగా, శక్తి వంతముగా నమ్మశక్యం కాని విధముగా ఉండి ఆయా కార్యములు చేస్తుంది. తన శక్తిని విశ్వసిస్తూ దైవ శక్తిని కూడా విశ్వసించాలి. అప్పుడు తన జీవితంలో అద్భుతాలను చూస్తారు.
క్షణికానందం కోసం ఇతరులను బాధించే మూర్ఖుడు, స్వార్థంతో ప్రవర్తించే వాడు తన అజ్ఞానం తొలగనంత వరకు అటువంటి ప్రదేశములలోనూ, లోకాలలోనూ జన్మిస్తూ వుంటాడు.
ఎదుటి వ్యక్తిని మానసికంగా, లేదా శారీరకంగా బాధించి పాపము చేస్తే పర్యవసానముగా ప్రతి చర్య వెంటనే వుండక పోవచ్చు కానీ తర్వాత దేశ కాల పరిస్థితులను అనుసరించి చర్యకు ప్రతి చర్య తప్పక వుంటుంది.
దైవ స్వరూపులైనటువంటి మహా విష్ణువు, రాముడు, కృష్ణుడు, శివుడు, బుద్ధుడు వంటి వారు కూడా బాధలు, కష్టాలు తప్పించుకోలేక పోయారు. జీవునికి జ్ఞానం ఎరుకలో లేని సమయములో చేసిన తప్పులు కాల క్రమంలో ప్రభావం చూపిస్థాయి.
పరిపాలనాత్మ మనో సందేశం పంచభూతాలకు చేరుతున్నవిధముగనే, జీవుడి హృదయ పవిత్రత దైవాత్మకు అందుతుంది. మంచి ఉద్దేశ్యం వున్న వారు దైవానుగ్రహం పొందుతున్నారు. చెడు ఉద్దేశ్యం ఉన్న వారు దైవాగ్రహనికి పాత్రులవుతారు.
దైవము సంకల్పించినది ఘటన తర్వాత జీవుడు చేసేటటువంటి కార్యములన్నీ కేవలం పాత్రలు మాత్రమే అని గ్రహించాలి. దైవ సందేశానికి అనుగుణంగా జీవుడిని కర్మ ప్రభావితం చేస్తూ నడిపిస్తుంది. జీవుడు నేను ఆలోచిస్తున్నాను అనుకుంటూ వుంటాడు. కానీ వచ్చిన సందేశం కూడా తన ఆలోచనలాగే తలపిస్తుంది. వేరు వేరు గా వుండదు. ఒక చోట వున్న బల్బునకు దానికి విద్యుత్ ను ఆన్(on) చేసి ప్రవహింపచేయడానికి, అలాగే ఆఫ్(off) చేసి నిలువరించడానికి వున్న రెండు టువేస్విచ్ ల నుంచి వచ్చే విద్యుత్ బల్బునకు ఏ స్విచ్ విద్యుత్ ను ప్రవహింప చేస్తుందో, ఏ స్విచ్ కరెంట్ ప్రవహించకుండా నియంత్రిస్తుందో, దానికి తెలియని విధముగా దైవము నుంచి వచ్చిన సంకేతమా లేదా తనబుద్ధి నుంచి వచ్చిన సంకేతము ఏది అనేది పరిమిత జ్ఞానం గల జీవుడు గ్రహించలేడు.
జీవుడు క్రితం చేసిన తప్పులు ఏమైనా వుంటే చేయవలసిన మంచి కార్యములకు దుష్ట శక్తి అడ్డుపడుతుంది. దైవానుగ్రహం వుంటే ఆయా కార్యములకు అడ్డువస్తున్నవి తొలగి పోయి త్వరగా సంకల్పించిన కార్యం నెరవేరుతుంది.
ప్రజలు పాలకుడి ఆదేశాన్ని గౌరవించి విశ్వాస పాత్రులై వుండాలి.
పాలకులు, నాయకులు, అధికారులు, ఉద్యోగులు ధర్మ రక్షకులుగా సమాజ సేవకులుగా విధులను నిర్వర్తించాలి. వారి వృత్తికి న్యాయం చేయాలి.
ధర్మాన్ని ఆచరిస్తున్న వారు విశ్వనియమానికి సహకరిస్తున్న వారు.
పరమాణువు నుండి సూర్య చంద్రుల వరకు అందరికీ ఒకే ధర్మం. అదే పరస్పర సహకార ధర్మం. ఆ ధర్మాన్ని మరవకుండా సాటి మనిషికి సహాయ సహకారాలు అందివ్వాలి.
దేశం యొక్క భవిష్యత్తు ఒక వ్యక్తి వ్యవస్థలో చేస్తున్న వృత్తిని బట్టి, తను సమాజములో వ్యవహరించే తీరును బట్టి ఆధార పడివుంటుంది. తను చేసే వృత్తిని నిర్లక్ష్యం చేయ కూడదు. సమాజములో నిర్లక్ష్యముగా వ్యవహరించకూడదు. కర్తవ్యతానిష్ఠతో సమాజ హితముతో వ్యవహరిస్తే వ్యవస్థ ఉద్ధరణకు, సమాజ ఉద్దరణకు కారకుడవుతాడు.
వ్యవస్థ బాగుపడాలంటే వ్యవస్థలో ఉద్యోగము చేసే ఉద్యోగి స్వార్థం లేకుండా శక్తి వంచన లేకుండా తనకు అప్పచెప్పిన వృత్తిని నెరవేర్చాలి. తన పై అధికారిపై అహంకారముతో ప్రవర్తించకూడదు. అలాగే అధికారియై వుంటే క్రింది ఉద్యోగిని మంచి దృష్టితో చూడాలి. వారిని వ్యవస్థకు వెన్నముక లాంటి వారిగా చూడాలి. ఇతరులను గౌరవిస్తూ గౌరవాన్ని పొందాలి. వ్యవస్థను బలహీన పరుస్తున్న లంచాన్ని వ్యతిరేకించాలి. అప్పుడే వ్యవస్థ ఉద్ధరించబడుతుంది.
ధర్మాచార్యులు: ఈ విషయాన్ని ఎప్పటికి గుర్తుంచుకోండి పూర్వ కర్మ ఫలితం వలన ఇప్పుడు అధికారం కలిగి వున్నారు. అధికార బలాన్ని నీ స్వార్ధానికి ఉపయోగిస్తే, క్రిందకు జారిపడటానికి ఎక్కువ కాలం పట్టదు. మళ్ళీ ఉన్నత స్థితిని పొందాలంటే ఎంతో కాలం పడుతుంది.
ఇచ్చిన లక్ష్యం త్వరగా నెరవేరడానికి ఉద్యోగులపై వత్తిడి తీసుకురావడం అధికారి యొక్క ధర్మం. ఉద్యోగులు వారికిచ్చిన లక్షాన్ని నెరవేర్చకుండా పై అధికారిని నిందించడం, ధిక్కరించడం అధర్మం.
జీవుడు చేసిన కార్యములచే సంపాదించిన పుణ్య ఫలానికి అనుగుణంగా విధి వారు చేయవలసిన కార్యమును నెరవేర్చే సమర్ధతను, ప్రజ్ఞను, ఆయా శక్తిని సమకూర్చి వారిని వివిధ స్థానములలో నియమిస్తున్నది.
చీకటిలో కూడా నీవు చేసే పాప పుణ్యములు చూడబడుతాయి. ఆత్మ సాక్షి యై చూస్తూ వుంటుంది. శక్తి గ్రహిస్తుంది. శక్తి విధి రూపములో సమాధానం ఇస్తుంది.
పాలకులు ధర్మాన్ని రక్షిస్తూ వుండాలి. ధర్మము నందు ఏ మాత్రం ఏమరపాటు వహించినా అంధకారం వ్యాపిస్తుంది.
మానవులు పడుతున్న బాధలకు ముఖ్యమైన కారణం, ప్రజా నిష్పత్తిని మరచి, అధిక జనులు అధికార౦ కోసం ప్రాకులాడటం, సుఖకరమైన వృత్తినే చేయాలని భావించడం.
చేతికి వున్న ఐదు వ్రేళ్ళు సమానంగా వుంటే పిడికిలి బలంగా వుండదు. ఏదైనా చేయతలచిన కార్యానికి వేళ్ళు సహకరించవు. అలాగే పంచభూతాలు సమ నిష్పత్తిలో లేకుండా ప్రతి భూతాత్మ నీటిగుణం కలిగివుండాలి అని భావిస్తే భూగోళమంతా నీరే ఆవహిస్తుంది. కేవలం అది అగ్ని తత్వం కలిగి వుండాలని భావిస్తే భూమి అగ్ని గోళంగా మారిపోతుంది. పంచభూతాలు సమన్యాయంతో ఆయా ధర్మాలను కలిగి వుండటం వలననే, భూమి జీవ కోటి మనుగడకు అనుకూలంగా వుంది. ప్రతి మానవుడు సమ సమాజం కోసం సమన్యాయంతో ఆయా వృత్తులు చేస్తూ వారికి ప్రాప్తించిన ఉద్యోగానికి న్యాయం చేయాలి దేశాభివృద్ధికి, ప్రజా క్షేమానికి సహకరించాలి. అధికారం కోసం ప్రయాస పడకూడదు వారుకలిగివున్న వృత్తిని దైవకార్యంగా భావించాలి. కాలానుగుణంగా దైవశక్తి వారికి సరైన న్యాయం చేస్తుంది.
వృత్తిలో వున్న పారిశుధ్య కార్మికులైనా, దేశాన్ని పాలించే దేశాధినేత అయినా సమాజానికి సేవ చేస్తున్న వారిగా భావించాలి. దైవ సేవగా భావించాలి. చిన్న వృత్తిలో వున్నానని ఉద్యోగులు భావించకూడదు. ప్రజాసేవగా దైవాజ్ఞగా భావించాలి.
భయము, బద్ధకము వుంటే బలహీన పర్చుకోవాలి. బలము, ధైర్యము, ఉత్సాహము పెంపొందించుకోవాలి అప్పుడే కార్యం శీగ్రముగా ఫలిస్తుంది.
జ్ఞాన మథనం లో విశయములను విచారణ చేస్తున్నప్పుడు అనేక విషయాలు బీజం పోసుకుంటాయి. కర్మను తెలుసుకునే క్రమములో పుట్టిన బీజమే ‘కర్మను చేయనిచో జన్మ తొలగుతుంది’ అనే సిద్ధాంతం వాస్తవము అయినప్పటికి ప్రస్తుత దేశ కాలపరిస్థితులలో అనుకూలమైనది కాదు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. పంచభూతాలు కర్మ చేయాలని సంకల్పించకున్ననూ విశ్వ నియమం వాటికి ఆయా కర్మను చేసేలా ఉపాధి కల్పించబడింది. దేవతలు సైతం లోక కళ్యాణార్థము వివిధ బాధ్యతలు తీసుకొని ఆయా కార్యములు చేస్తున్నారు. జీవుడు కర్మకు ఉపక్రమించకున్ననూ సృష్టి నియమానికి అనుగుణంగా ప్రకృతి ఏదో ఒక కార్యములో నియమిస్తుంది. మానవుడు కర్మకు సంకల్పించకున్నను పరిపాలనా నియమాన్ని అనుసరించి ఆయా ఉపాధి చేయవలసినదే. కర్తవ్యముతో చేసే కర్మ జీవునికి అంటదు. అది మొక్షానికి దగ్గర చేస్తుంది.
సమాజ సేవ చేసి మోక్షానికి అర్హత పొందితే ఎటువంటి కర్మ చేయకుండా జీవించే ఆనందమయమైన లోకాలు దైవలోకాలు వున్నాయి. ఆయా లోకాలలో ఎటువంటి కర్మలు చేయనవసరం లేదు. దైవత్వం పొందే వరకు కచ్చితంగా కర్మలు చేయవలసినదే.
మోక్షం కోసం 100 సంవత్సరాలు అడవిలో తపస్సు చేసే వారి కన్నా సమాజక్షేమంకోరి ఒకరోజు సేవ చేసే వారు మొక్షానికి దగ్గర అవుతారు.
కర్మ చేయనిచో తనకున్న శక్తి, జ్ఞానం, ధనం బలహీన పడుతుంది. దాని కారణముగా అష్ట దరిద్రాలు వచ్చి చేరుతున్నాయి. కర్మను నమ్మి కార్యాన్ని చేయాలి. ధర్మాన్ని నమ్మి లోక వ్యవహారం కలిగి వుండాలి. అన్నింటా విజయమే. అందరికీ శుభదాయకం.
అన్నిటికన్న గొప్ప సేవ నీ కర్తవ్యాన్ని నీవు ధర్మ బద్ధముగా నిర్వర్తించడం.
అధికార నిర్ణయం ధర్మబద్ధంగా వుండాలి. అర్హత వున్న వారికి అధికారం, ఉద్యోగం ఇవ్వాలి. ఎవరికి దేనిలో ప్రావీణ్యత వుంటే వారికి ఆ అధికారాన్ని ఇవ్వాలి.
చేసే కార్యాలు దేశాభివృద్ధికి, సమాజానికి పరిపూర్ణంగా ఉపయోగపడేలా వుండాలి.
స్వర్గం, నరకం ఎక్కడో వేరే లోకంలో వున్నవి కావు. ఎక్కడైతే ప్రజలు సుఖసంతోషాలతో, ఆహ్లాదకరంగా అందమైన వాతావరణములో జీవిస్తారో అదే స్వర్గం. ప్రజలు బాధలకు గురవుతూ దుఃఖించబడతారో అదే నరకం. స్వర్గలోకం పరిమితముగా ఒకే చోట మాత్రమే వుండదు అంతటా సృష్టించబడుతుంది. వేరే కొత్తలోకాలకు వెళ్లాలని కలలు కనకుండా తను వున్న లోకాన్ని స్వర్గలోకముగా మార్చాలి. నీవున్న వాతావరణం ఆహ్లాదకరముగా తీర్చి దిద్దుకోవాలి.
నిరుత్సాహముతో, విద్వేషముతో రగిలిపోవడమే నరకం. ఉత్సాహముతో ఆనందములో తేలిపోవడమే స్వర్గం.
జన్మనిచ్చిన తల్లికి, తండ్రికి కృతజ్ఞతగా వుండాలి. శరీరాన్ని రక్షించే ప్రకృతికి, పంచభూతాలకు, అష్టవసువులకు, అష్ట దిక్పాలకులకు,ధర్మ దేవతలకు కృతజ్ఞతగా వుండాలి.
ఎక్కడైతే ధర్మము౦దో అక్కడున్నవన్నీ రక్షించబడతాయి. ధర్మం చేత రక్షించబడనిదేదివున్నా చివరికి అది అంతరించి పోయేదే అవుతుంది.
ధర్మానికి కట్టుబడే లక్షణం వుండాలి. వ్యవస్థ లోని ఆయా నియమాలకు కట్టుబడి నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించడం వలన సత్యము నందు నిలబడిన వాడవు అవుతావు. చిత్త శుద్ధి కలుగుతుంది. కర్మను చేయడంలో కౌశల్యాన్ని పొందుతావు.
సర్వ మానవుల ఆచార వ్యవహారాలు ధర్మ చట్రంలో ఇమడాలి.వృత్తి వ్యవస్థ నియమాన్ని అనుసరించి వుండాలి. వ్యవస్థ నియమాలు, పరిపాలనా నియమాన్ని అనుసరించి వుండాలి. పరిపాలనా నియమం ప్రజలకు అన్ని సౌకర్యాలు అందేలా, ఆనందమును ఇచ్చేలా వుండాలి. అప్పుడే ధర్మ చట్రంలో ఇమిడిపోతాయి.
ఒక మనిషికి కీర్తి, అభ్యున్నతి, ప్రతిష్ఠ, శాంతి వారు పట్టుకున్న ధర్మం నుంచి వస్తాయి.
ఒకరు ఇతరులకు సహాయం చేయాలి. మరియు వారి నుండి సహాయం పొందాలి. ఇదే పరస్పర సహకార ధర్మం.
ధర్మం అనే మహా శబ్దం అర్థ మయి ఏమిచేయాలో తెలిస్తే నీవు చేస్తున్న తప్పొప్పులు నీకు అర్థమై పోతాయి. మోహము పోయి జ్ఞానం కలుగుతుంది. నీ కర్తవ్య మేమిటో నీకు అర్థమవుతుంది.
పని చేసేటప్పుడు మనస్సు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రతగా నేర్పరి తనంతో చేయాలి. నిర్లక్ష్యం వహించకూడదు. ఇది వరకు నైపుణ్యముతో చేసినవన్నీ చిన్న నిర్లక్ష్యముతో పాడై పోతుంది. కర్మను చేసేటప్పుడు శ్రద్ధతో, నేర్పరి తనముతో ఎవరు చేస్తారో వారే యోగము నందు కుశలురు.
నీవు కర్మ చేసేటప్పుడు ఫలితము ఆశించకుండా చేస్తూ వెళితే, ఫలితమును ఇచ్చేవాడు ఒకడున్నాడు. అది ఏది ఇవ్వాలో దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ఇవ్వబడుతుంది. ఇది గ్రహించి ఓర్పుతో తన కర్తవ్యములను తాను నెరవేర్చే వాడే యోగి.
కోరిక వలన కానీ, భయం వలన కానీ లోభం వలన కానీ ధర్మం వదల కూడదు.
నీవు చేసే ఏ పని అయినా మొదట ఆ పనిని శ్రద్ధగా, నిస్వార్థముతో చేస్తున్నానా లేదా అని పరిశీలించుకొని చేయాలి. అది ధర్మ బద్ధమైనదా? స్వార్ధమును కలిగి వుందా? నిస్వార్ధమును కలిగి వుందా? అని గ్రహి౦చి సత్ప్రవర్తనతో విధులను త్రికరణ శుద్ధితో ధర్మ బద్ధముగా నిర్వర్తించాలి. అదే దైవ గుణం. నీ మనస్సు పవిత్రముగా వుండటమే దైవ గుణం.
మనస్సులోని భావాన్ని బట్టి శక్తి ప్రతి స్పందన వుంటుంది. జీవుడు దైవ గుణాన్ని, సానుకూల దృక్పథాన్ని కలిగివుంటే తన శరీరంలో DNA లో మార్పువస్తుంది. శరీరం దైవ లక్షణాలను పొందుతుంది.
నీవు మాట్లాడేటప్పుడు, వాదించేటప్పుడు, తీర్పు చెప్పేటప్పుడు కర్తవ్యమును నిర్వర్తించేటప్పుడు నీ మనస్సులో ఉద్దేశ్యము ప్రధానము. దాన్ని అనుసరించే భౌతికముగా రూపుదిద్దుకుంటుంది. ఆ ఉద్దేశ్యాన్ని అనుసరించే పంచభూతాలు పని చేస్తున్నాయి. ఉద్దేశ్యాన్ని అనుసరించే దైవానికి సందేశం అందుతుంది. దానిని అనుసరించే దైవానుగ్రహం లేదా దైవాగ్రహానికి గురవుతారు.
ఎటువంటి విషయములకు కోపము, ద్వేషము, అసూయ, భయము అనునవి వస్తున్నాయో వాటిని పరిశీలించ గలిగే ఓర్పు, జ్ఞానం వుండాలి. అప్పుడే మనస్సు నిర్మలము, పవిత్రమవుతుంది.
చేసే పనిలో కష్టమనే భావన చేయడం, విసుగు కలిగి వుండటం వలన కర్తవ్య నిష్ఠకు ఆటంకం కలుగుతుంది. శక్తికి కష్టమనేది వుండదు. మనస్సు మాత్రమే కష్టము అనే భావన చేస్తుంది. విసుగు చెందుతుంది. విసుగుతో చేసిన పని భారమవుతుంది. ఇష్టంగా, శ్రద్ధతో చేసిన పని తేలికగా వుంటుంది.
ఎప్పుడైతే నీవు ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో బుద్ధితో ప్రవర్తిస్తావో, అప్పుడు నీ మనోవాంఛ ఫలసిద్ధి కలగటానికి ప్రతి బంధకమైనటువంటి పాపములు తొలగించబడతాయి. ధర్మ కార్యములను ఎప్పుడైతే చేయాలనే ధార్మిక బుద్ధి నీ యందు కలుగుతుందో, అప్పుడు దాని చేత సమస్త మంగళములు ప్రారంభమవుతాయి.
ధర్మబద్ధముగా చేసిన పని సఫలం కాకపోయినా అది నీ తప్పు కాదు. నీ బాధ్యతను, కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి.
ఏ పని అయినా ఉన్నతముగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశ్యముతో నీవు ఎంతచేయగలవో అంత ప్రయత్నాన్ని చేయడమే నీ ధర్మం. చేసే ప్రతి పనిని, ప్రతి వస్తువును ఇంకా పురోగతిలోకి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూనే వుండాలి.
మనో పవిత్రతను, సంస్కారబలమును అనుసరించే తదనుగుణమైన జన్మ ప్రాప్తిస్తుంది.
ధైర్యము, నిస్వార్థము, ఉత్తేజముతో ఉన్నవారు పవిత్రులు. ఆ స్థితిని ఎంతకాలం నిలుపుకుంటారో అంత కాలం పరమ ప్రశాంతముగా, నిర్మలముగా, నిశ్చలముగా ఆనందముగా వుంటారు. వారి నీడలో, రక్షణలో ఎంతోమంది నిశ్చింతగా, నిర్భయముగా జీవిస్తారు.
ఉద్రేకము, వ్యగ్రతతో కూడిన నాటకములు, సినిమాలు, పుస్తకాలు, ప్రసంగాలు మొదలైనవి మనిషి మనస్సును విషపూరితం చేస్తాయి. వాటి యందు ఎరుక వహించి జాగరూకులై వుండాలి.
చేసిన తప్పును చేశాను అని ఒప్పుకొని చింతించి దిద్దుకునే వాడు మంచి ప్రవర్తన వైపు వెళ్ళే వాడు అవుతాడు.
చేయవలసిన కార్యానికి దేవుడు నెరవేర్చగలిగే సమర్ధతను నీకు ఇచ్చి నియమిస్తున్నాడు. దాన్ని నీవు దుర్వినియోగం చేయకుండా పదిమందికి వినియోగించు.
ఎవరైతే నీ వృద్ధిని కోరుకుంటున్నారో వారి యందు నీవు ప్రేమ, భక్తిని కలిగి వున్నావని అర్థం. నీవు ధార్మికంగా జీవిస్తున్నావు అని అర్థం.
ఆడవారిని గౌరవించాలి. వారిని శక్తి స్వరూపముగా బావించాలి.
ధర్మం వైపు అడుగు వేసేలా నా బుద్ధిని ప్రేరేపించు, అధర్మం వైపు క్షణమైనా నిలవకుండా చేయుము అని ఆ దేవుడిని ప్రార్థించాలి.
మట్టిలో వున్నటువంటి విత్తన౦ పై ఒక్క చినుకు పడినా అది మహా వృక్షమవుతుంది. రాయి పైన వున్న విత్తన౦ పైన ఎంత నీరు పోసినా తడవడమే కానీ మొలవడం వుండదు. ఆత్మ, ధర్మము, కర్మల విషయత్రయజ్ఞానము ఎవరు కలిగి ఉంటారో వారు జ్ఞానమునందు మహా వృక్షసదృశమై పది మందికి మధుర ఫలాలను, నీడను అందిస్తారు. ఆయా విషయ జ్ఞానము తెలియని వారికి ఎన్ని మ౦చి విషయములు బోధించినా రాయిపై వున్న విత్తనమునకు నీరు పోయడం లాగా నిరుపయోగమే అవుతుంది. పూర్తి జ్ఞానం బోధపడదు. కర్మ, ధర్మము మరియు ఆత్మ జ్ఞానము గురించి తెలుసుకున్న వారు సర్వ ధర్మ సారం తెలిసిన పండితులవుతారు.
ధర్మ౦ నీవు శాంతముగా వుండు, ఇంకొకరిని శాంతముగా వుంచు అంటుంది.
ఎవరు శ్రద్ధా భక్తులతో ధర్మము అనే జపం చేస్తారో వారు దైవముచే రక్షించ బడతారు.
నదిలోని నీటి ప్రవాహములా తనలోని ప్రజ్ఞ ప్రవహించాలి. జ్ఞాన, ధన, శక్తి ప్రవాహము ఒకరి నుంచి ఒకరికి ప్రవహించాలి. ప్రవహిస్తే వుపయుక్తమవుతుంది. ప్రవహించలేదా ఎవరికీ పనికి రాదు. ధర్మ చట్రం బలహీన పడుతుంది.
సత్యం, ధర్మం కోసం ఎవరు తాపత్రయపడతారో వారి పాపం తుడుచి పెట్టుకొని పోతుంది.
ధర్మానుష్ఠాన౦ చేసిన వాడు ముక్తిని పొందుతాడు. ఏది పరమ సత్యమో, దేనికి మార్పు లేదో, ఏది అన్నింటికి అతీతమో, ఏది షట్ వికారములకు అతీతమో అటువంటి సత్యమైన ‘ఆత్మ’ ఎరుకలోకి వస్తుంది.
శ్రవణం, వినడం ఎంత ముఖ్యమో మననం చేయడం అంతే ముఖ్యం. మననం చేయడం ద్వారానే ధారణ ఏర్పడుతుంది. విన్న దాన్ని ఎంత పరిశీలనం చేస్తారో, ఎంత జ్ఞాపకం పెట్టుకుంటారో అంత బాగా అది మనస్సులో ఇమిడి పోతుంది.
నీ పరిశీలనలో నీ తప్పు నీకు స్పష్టంగా కనిపిస్తుంటే, దాన్ని సరిచేసుకోకపోతే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది.
ధర్మము ప్రయత్న పూర్వకముగా కాకుండా అలవాటుగా మారిపోవాలి.
ఆపద వున్న వాడి ముందు నిలబడ గలగడం, వారిని సేవించడం వారికి ఏదైనా సేవ చేశాను అని చెప్పకోగలగడం, పది మందికి ఉపయోగ పడేటట్లు బ్రతకగలగడం మొదలైన పనులు చేసిన నాడు నీ ఆరోగ్యం, నీ బలం, నీ తెలివి నీ మాట సార్థకం పొందుతాయి. ఇందులో ఏదైనా నీ స్వార్థానికే వాడుకున్న నాడు అందులో నీవు సంతోషించడానికి ఏమీ వుండదు. నిన్ను ఆదర్శంగా తీసుకోవడానికి కూడా ఏమి వుండదు. నీ స్వార్ధం కోసం నీవు వీటన్నిటినీ వాడుకోకుండా త్యాగమయుడవై సమాజానికి సేవలు అందించు. అప్పుడు నీవు అందరికీ ఆదర్శ పురుషుడవై నిలబడతావు.
నిన్ను చూడగానే ఆయనలా నిలబడాలి అన్న కోరిక ఇతరుల లోపల కలిగి వారు ఉత్తేజితులైతే ఆ నాడు నీ జన్మ ధన్య౦.
కేవలం ధర్మం తెలుసుకున్న వాడు ధర్మాత్ముడు కాడు. ధర్మాన్ని ఆచరించేవాడు, అనుష్ఠించే వాడు మాత్రమే ధర్మాత్ముడు.
ధర్మం పట్టుకున్నంత కాలం లోకం సురక్షితంగా, శాంతియుతంగా వుంటుంది. ధర్మ ప్రబోధం చేయడమే సమస్త శాస్త్రముల యొక్క ప్రయోజనం.
ధర్మ శాస్త్రం అనేది దైవ శాసనం. అది సమాజ శ్రేయస్సుకు హేతువు అవుతుంది. ధర్మ శాస్త్రము నందు అచంచల విశ్వాసము కలిగి వుండాలి.
మనిషికి వుండవలసిన మొదటి లక్షణం ధర్మానికి లొంగడం. కర్తవ్యానికి లొంగిపోవడం. శాస్త్రమే శాసనముగా ధర్మాన్ని ఆచరించాలి. ధర్మానికి లోంగే వాడే లోకానికి పనికి వస్తాడు. లోకాన్ని ఉద్ధరిస్తాడు.
ధర్మం గురించి ఏ పట్టింపు లేకుండా ధర్మం పాడై పోతున్నా అధర్మం పెచ్చుమీరుతున్నా నీవు నిశ్శబ్దం వహించకుండా, ధర్మ సంరక్షణ కొరకు నిలబడాలి. ధర్మం కోసం నిలబడక పోతే ధర్మమునకు వైక్లబ్య౦(హాని) కలిగుతుంది. కాబట్టి ఆయా పరిణామాలకు నీవు కూడా బాధ్యుడవే అవుతావు. అంతేకాక దానికి తగిన మూల్యం కూడా పొందవలసి వుంటుంది.
ఏది ధర్మమో ఏది అధర్మమో అనే సందేహం వస్తే అప్పుడు గ్రహించవలసినది ఒక్కటే ఇతరులు నీకు ఏది చేస్తే నీకు బాధకలిగిస్తుందో, దాన్ని నీవు ఇతరులకు చేయకుండా ఉండడమే ధర్మం. నీవు చేసే పని మంచిదా కాదా అనేది మొదట నీ అంతరాత్మ చెబుతుంది. దాన్ని కాదని చేసేది అధర్మం.
ధర్మాన్ని పట్టుకున్నానని ఎవరైతే సంతోషిస్తారో, ఫలానా సమయములో ధర్మాన్ని విడిచి పెట్టానని ఎవరైతే బాధపడతారో వారు ధర్మమును పట్టుకున్న వారే అవుతున్నారు.
ఎన్ని కష్టాలలోనైననూ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ధర్మం ఎప్పుడో ఒకప్పుడు గట్టెక్కిస్తుంది.
ధర్మం పట్టుకున్న వారికి, వారికి తెలియకుండానే వారి శీల వైభవం చెక్కబడుతుంది.
ఎవరైతే ధర్మాన్ని పట్టుకున్నారో వారు ధర్మం చేత రక్షించబడుతుంటారు .ధర్మాచరణయందు మనస్సు ఉత్సాహాన్ని పొందుతుంది.
ధర్మము నందు సమాజానికి అనురక్తి కలిగి అనుష్ఠించితే, ఇనుప గొట్టం వేడెక్కితే ఇక ఏ పురుగు చేరనట్టు సమాజానికి కూడా చీడపట్టదు.
44. క్రోధం
ఎక్కడ క్రోధం వుందో అక్కడ కుతంత్రం పుడుతుంది. అది జీవుడు పతనమై పోవడానికి హేతువు. అజ్ఞానం చేత, మాయ చేత ఏర్పడుతున్న పెద్ద కందకం. దాన్ని దాటడానికి మళ్ళీ ఎన్నో జన్మలకు గాను మార్పు తీసుకు రాలేరు.
క్రోధము వలన సంపాదించిన తపశ్శక్తి నశిస్తుంది. క్రోధము ఆవహించిన వాడి తపస్సు చెడిపోతుంది. క్రోధము వలన అణిమాది సిద్దులు, మహిమలు అన్నీ నశించిపోతాయి. క్రోధము ధార్మికమైనటువంటి పనులు చేయనీయదు. క్రోధమున్నట్టి వాడు తపస్వి కాలేడు.
కోపం శరీరాన్ని ఆవహించి వుండగా ఏ నిర్ణయం తీసుకోకూడదు. నిర్ణయం చేయడం, ఆలోచన చేయడం, ప్రణాళికలు రచించడం చేయకూడదు. క్రోధములో చేసిన దాని యందు యుక్తా యుక్తా విచక్షణ వుండదు. కోపము వలన బుద్ధి యందు కలిగిన వ్యగ్రత సరైనటువంటి రీతిలో ఆలోచన చేయనీయదు. కోపం వలన చేసిన ఒక తప్పు వలన యావజ్జీవితం బాధపడవలసి వస్తుంది. క్రోధం వచ్చినప్పుడు తీసుకున్న నిర్ణయం వలన ఆ నిర్ణయం తీసుకోకుండా వుండి వుంటే నా పరిస్థితి వేరేలా వుండేది అని బాధపడక ముందే జాగ్రత్త పడాలి.
మనిషి దేని వలన పాడవుతాడో, ప్రధానమైన బలహీనత ఏదో, దేని వలన మనిషి ఉన్నతిని పొందుతాడో పరిశీలించి జాగరూకుడై తనను తాను ఉద్ధరించుకోవాలి. ఒక చెట్టు తొర్రలో ప్రారంభమైనటువంటి అగ్ని కణం చిట్ట చివరికి ఆ చెట్టును అగ్ని జ్వాలయై ఎలా కాల్చేస్తుందో, అలా మనిషిని అసూయ, ద్వేషం, క్రోధం అనే దుర్గుణములు కాల్చేస్తాయి.
నీవు శక్తిని సక్రమ మార్గంలో వినియోగించకపోతే అక్రమ మార్గంలో వెళుతుంది. తను చేసే కర్మయే తన ఉద్ధరణకు, తన పతనానికి దారితీస్తుంది.
మనిషి జీవితంలో అత్యంత ప్రధానముగా పరిశీలించుకోవలసిన విషయం ఏదైనా వుందంటే అది అసూయయే. అసూయను జీవుడు ఎప్పటినుంచో కోట్ల జన్మల నుంచి తెచ్చుకుంటున్న వాసనా దోషం. కాబట్టి ప్రయత్న పూర్వకంగా ఈ అసూయ స్థాన౦ లోకి ప్రేమను తీసుకు రావాలి.
ఓర్పు గలవాడు నిత్య సత్య ధర్మ వ్రతుడైనటువంటి వాడు దేన్నైనా భరించగలిగే శక్తి సామర్థ్యాలను కలిగి వుంటాడు. తను ఎటువంటి మహత్తర కార్యమైనా నెరవేర్చగలుగుతాడు.
ఆవేశ పడటానికి శక్తి అవసరంలేదు. ఓర్పు వహించడానికి ఎంతో శక్తి వుండాలి.
ఎన్నో చోట్ల వ్యగ్రతతో విడిచిపెట్టిన వాక్కు బ్రహ్మ దండము కన్నా గొప్పదై పడగొట్టేస్తుంది. తపస్సు చేయడం మాత్రమే గొప్ప కాదు, తపస్సు చేసేటటువంటి వాడు నిగ్రహాన్ని పొందటం కూడా అంతే గొప్ప. విడిచి పెట్టిన వాక్కు వాడి శక్తిని ప్రచోదనం చేస్తుంది. ఆ సందేశాన్ని పొందిన శక్తి ఆ సందేశాన్ని పంచభూతాలకు ప్రచోదనం చేస్తుంది. సందేశాన్ని స్వీకరించిన పంచభూతాలు ఆయా కార్యములను నెరవేరుస్తున్నాయి.
మనిషి మనసులోకి కక్ష అన్నది ప్రవేశిస్తే అంతకు ముందు విన్నది, చదువుకున్నది, నేర్చుకున్నది అన్నీ కొట్టుకు పోతాయి. అవేవీ నీ స్ఫురణకు రావు. వేరొక ఆలోచన రాదు. బుద్ధి మందగిస్తుంది. ఎటువంటి దుష్ట సంకల్పములనైనా చేస్తుంది.
45. శీలము
శీలము అనునది అత్యంత ప్రధానమైనటువంటి విషయం. శీలమే గొప్ప సంపద.
ఎవరిలో శీలవైభవము వుంటుందో, అటువంటి వాడు ధార్మికుడై, ఆదర్శవంతుడైనటువంటి వ్యక్తిగా ఎంతో మందిని ప్రభావితం చేస్తాడు. తిరిగి వారు అనేక మంది జీవితాలను ప్రచోదనం చేసి చక్కటి మార్గంలో నడిపిస్తారు.
ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడు, ఏది చదువుతున్నాడు, ఏది వింటున్నాడు, ఏది ఆచరిస్తున్నాడు అన్న దాన్ని బట్టి తన శీల వైభవం చెక్కబడుతుంది.
46. మనస్సు-బుద్ది.
మనస్సు బలంగా వుంటే, మనస్సు తేజోవంతంగా వుంటే, మనస్సు సత్య దర్మములను ఆశ్రయించితే, దేవుడున్నాడని పూనిక వుంటే ఆ వ్యక్తి ఏదైనా సాధించగలడు.
ఆనందం అంటే నీ యొక్క దివ్యమైన నిశ్చల నిరాకార స్థితిలో నీవు వుండటం. నిన్ను ఏ విషయం బాధించకుండా, తుచ్ఛ విషయములకు చలించకుండా వుండటం. నిన్ను ఏ విషయమైనా భాదిస్తుంది, చలింపచేస్తుంది అంటే నీవు ఆనందముగా లేనట్టే. ఎవరికో నీవు ప్రభావితం అవుతున్నావు నీ అధికారము లేనిది ఇతరులు నిన్ను ప్రభావితం చేయలేరు. ఇష్టమైన తిండిలో, ఇష్టమైన వస్తువులో ఆనందం అనేది క్షణికం. పరిపూర్ణ ఆనందం బ్రహ్మనందములో వస్తుంది. ఆ ఆనందము ఇతరులు దొంగలించలేరు.
నిర్మలమైన చిత్తము వుంటే మనస్సు ప్రశాంతంగా వుంటుంది. మనస్సు ప్రశాంతంగా వున్నవాడు మృదువుగా మాట్లాడతాడు. మనిషికి వుండవలసిన లక్షణం మృదుత్వ౦. మనస్సు ప్రశాంతంగా వుంచుకోవడం నీ చేతల్లోనే వుంది.
మనస్సు ఎన్నింటినో సృష్టించుకుంటుంది. లేని పోని ఆందోళన చెందుతుంది. ఈ ఆందోళన ఆరోగ్యానికి భంగ౦ కల్గిస్తుంది. సత్యవ్రతం, శాస్త్ర శ్రవణం, మననం, ప్రాణాయామం, యోగా, ధ్యానం మనస్సును నియంత్రించే సాధనములు.
మనస్సుపై నియంత్రణ కలిగివుండాలి. భయమును సృష్టించేది మనస్సే, భయాన్ని పోగొట్టేది మనస్సే, ఆపదను తెచ్చేది మనస్సే, ఆపదను తొలగించేది మనస్సే. మనస్సు ఆజ్ఞలను అనుసరించే శక్తి పనిచేస్తుంది.
బలమైన పాలకుని మనస్సు ప్రశాంతంగా, బలంగా వుంటే అతడు అన్ని శక్తులను నియంత్రించి ప్రశాంతముగా, ఆనందముగా వుంచుతాడు. తానే గనుక ఆందోళనతో, ఉద్రేకముతో వుంటే లోకం లోని శక్తులు ఉద్రిక్తంగా మారుతాయి. లోకం అశాంతితో నిండి పోతుంది.
సంస్కారము పొందడానికి ఇంద్రియముల గుండా లోపలికి వెళ్లవలసిన విషయములు, వస్తువుల విషయంలో పరాకుగా వుండాలి. మనస్సు ఇంద్రియముల చేత ప్రభావితమవుతుంది. కంటితో ఏది చూస్తున్నావో, చెవితో ఏది వింటున్నావో, చర్మంతో ఏది స్పర్శిస్తున్నావో, ఏది రుచి చూస్తున్నావో, ఏది వాసన చూస్తున్నావో దాన్ని బట్టి నీ మనస్సు ఉద్రేకపడుతుంది. ఉద్విగ్వత పొందుతుంది.
దేన్ని ఆశ్రయించాలో అది బుద్ధి మీద ప్రభావ౦ చూపుతుంది.
లక్ష్యానికి నిలబడినవాడే బలవంతుడు, గుణవంతుడు, దైర్య వంతుడు.
మనస్సు పవిత్రమై, పరిపుష్టమై వున్న నాడే లక్ష్య సిద్ధి కలుగుతుంది.
నీ మనస్సు మంచి మనస్సో, చెడ్డ మనస్సో దానికి నీవు మాత్రమే సాక్షి.
ఎన్ని సంకల్పాల్లో నీవు ఇతరులను ద్వేషిస్తే అంత సేపు నీవు చెడ్డ మనస్సుతో వు౦టావు. ఎన్ని సంకల్పాలలో ఇతరులు చేసిన మంచిని తలిస్తే నీవు అంత మంచి మనస్సుతో వుంటావు. నీవు ఎంత మంచి మనస్సుతో వుంటే అంత ప్రశాంతంగా వుంటావు. నీవు ఎంత ప్రశాంతంగా వుంటే అంత మంచి మాటలు మాట్లాడుతూ, మంచి ప్రవర్తన కలిగి వుంటావు.
ఎటువైపు వెళ్లాలో మార్గనిర్దేశం చేసేది బుద్ది. నిర్ణయం చేసేది బుద్ధి. బుద్ధి ఎప్పుడూ మంచి వైపునకు నడిపిస్తుంది. నిష్పక్షపాతంగా ఏది మంచి, ఏది చెడు అని సంకల్పంలోని మంచి చెడులను విచారణ చేసి పక్ష పాతం లేకుండా ఆలోచించి ఇది మంచి అని మార్గాన్ని సూచిస్తుంది.
కర్మ బుద్ధిని ప్రేరేపిస్తుంది. బుద్ధి కర్మను ప్రేరేపిస్తుంది.
శ్రేయస్కరము కాని పనిని బుద్ధి చేయవద్దు అని చెబుతుంది. శ్రేయస్కరము కానిది విడిచి పెట్టిన వాడు గొప్పవాడు.
లోకంలో ఏ వస్తువు వుంటే సుఖంగా వుంటుందని భావిస్తారో నిజానికి అది పూర్తి సుఖమును ఇవ్వదు. ఎన్ని వున్నా స్థితప్రజ్ఞత లేకుంటే సుఖశాంతులు వుండవు. ఏవి లేకున్నా స్థిత ప్రజ్ఞత వుంటే శాంతంగా వుంటారు.
స్వభావాన్ని గెలవడం చాలా కష్టం. సాధనతో చెడు స్వభావాన్ని తొలగించుకొని మంచి స్వభావాన్ని పెంపొందించుకోవాలి. హృదయం ప్రసన్నముగా వుండాలి. నీ ప్రవర్తనచే ఇతరుల మనస్సు కూడా ప్రసన్నతతో వుంచాలి.
హృదయము మాట్లాడుతుంది, హృదయ భావనే సందేశముగా వెళుతుంది.
ప్రతి చిన్న విషయానికి క్రుంగిపోవడం వల్ల శరీరం మృత్పిండ౦ అవుతుంది. పడిపోతాడు. పైకి లేవలేడు. కనుక నిరంతరం ఉత్సాహము కలిగి వుండాలి.
పవిత్రమైన ఆలోచనా సరళి ఉన్నప్పుడే మనస్సు తప్పుడు మార్గాన్ని పట్టకుండా నియంత్రించుకోగలిగే స్థితిని పొందుతుంది.
అంతఃశౌచమే అన్నింటికన్నా ప్రధానమైనది.
శత్రువు లందరిలోకెల్లా పెద్ద శత్రువు శోకమే. ఎప్పుడైనా నేను ఇది సాధించలేక పోయానని దుఃఖానికి వశుడైన వాడు వృద్ధిలోకి రాలేడు. శోకం మొట్టమొదట ధైర్యాన్ని పోగొడుతుంది. శోకము ఇంతకు ముందు విన్న మంచిమాటలను మర్చిపోయేటట్టు చేస్తుంది. శోకము వలన మనిషి వృద్ధిలోకి రాకుండా పడిపోతాడు. ఎవరు నిరంతరం ఉత్సాహంగా వుంటారో, వారు సాధించలేనిది జీవితంలో ఉండదు.
మనస్సు నిర్వేదం పొందకూడదు .నిరాశా వాదం వుండకూడదు. మనిషి ఆశావాదియై పైకి లేచే ప్రయత్నం చేయాలి.
ఎవరిగురించైనా మాట్లాడేటప్పుడు మొట్టమొదట వారిలో వున్న మంచిని స్మరించి వారిలో వున్న మంచి గురించి మాట్లాడటం మొదలు పెడితే అది క్రమంగా అలవాటవుతుంది. మంచిని చూడటం జరిగితే ప్రశాంతత దక్కుతుంది. చెడును చూసిన కొద్ది నీలో క్రోధం, వుద్రేకం పుడుతుంది. మంచిని చూసిన కొద్ది ప్రశాంతంగా వుంటారు.మీ మనస్థితి చక్కబడుతుంది.
నీకు ఏ వస్తువుపై ప్రీతి వుందో ఆ వస్తువు చుట్టూ మనస్సు తిరుగుతుంది. అదే మనస్సుకు వున్నటువంటి గొప్పబలం. అదే మనస్సుకు వున్నటువంటి గొప్ప బలహీనత కూడా. సారవంతమైన వస్తువుపై మనస్సును పెట్టడం బలం. నిస్సారమైన వస్తువుపై పెట్టడం బలహీనత.
నీవు ఎంత బలవంతుడవు అని కాదు నీ మనస్సు ఎంత బలంగా వున్నది అన్నది ప్రధానం.
తను చేయవలసిన ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని తాను విస్మరించి తనకు అక్కర్లేని పనుల జోలికి వెళ్లకూడదు. అక్కర్లేని విషయాలను తాను అధ్యయనం చేసుకోరాదు. తాను చేయనవసరం లేని పని చేస్తానని, చేయవలసిన పనిని చేయకుండా ఉండడం వలన తాను పాడవడమే కాకుండా ఇతరులు కూడా నష్టపోయి, అధర్మం విచ్చలవిడిగా పెరిగిపోతుంది.
మనస్సు ఎంత పవిత్రం, మనస్సు ఎంత శక్తి వంతం అనేది ప్రధానం అయి వుంటుంది. ఒక వ్యక్తి శరీర బలముతో పనిలేకుండా, మనస్సుకు వున్న పవిత్రత చేత, శక్తి చేత సమాజమునకు మహోపకారం చేయగలడు.
మనస్సు పవిత్రమైనది ఆ మనస్సుకు ఎప్పుడూ పవిత్రమైన వస్తువులను పట్టుకునేటటువంటి తర్ఫీదును ఇచ్చే జీవుడు దాని వలన తరించిపోతాడు.
మనస్సును సంస్కరించడానికి ఒకటే మార్గం. శాస్త్రాన్ని తెలుసుకోవడం. బాగా పరిశీలించడం. శాస్త్రాన్ని అధ్యయనం చేయడం. తెలుసుకున్న దాన్ని అభ్యాసము, సాధనలచే ఆచరించడం వలన మనస్సు సంస్కరించబడుతుంది.
నీ మనస్సును సంస్కరించు. దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకొనే వైపునకు మనస్సును తిప్పాలి. ఇదే అభ్యాసం. లొంగని గుర్రాన్ని లొంగదీయడం. అభ్యాసములో లొంగదీసే ప్రజ్ఞను సంపాదిస్తారు.
నీ మనస్సును నీవు లొంగదీయ గలిగితే, అనవసరమైన వ్యామోహం నుంచి నీవు విముక్తుడవైతే, నీ ఆకాంక్షను లోక క్షేమం కోసం మార్చగలిగితే, నీవు చేసే క్రియాలన్నీ లోక ప్రీతి కొరకు చేస్తే, వాటి వలన లోకమునకు మేలుచేకూర్చేవాడిగా, నీవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించినవాడిగా కీర్తివంతుడవవుతావు.
47. సత్యము.
వాక్కు మనస్సు ఏకీకృతం అయి పలకడమే సత్యం.
సత్యమును మాట్లాడేటప్పుడు అప్రియమైన విషయాలు మాట్లాడ కూడదు. ప్రియమైన, ప్రయోజనకరమైన మాటలే మాట్లాడాలి.
అవతలి వారిలో అవగుణాలను ఎంచి నేను సత్యమునే చెబుతున్నాను అని భావించకూడదు. నీవు చెప్పేది సత్య మైనప్పటికి అలా మాట్లాడడం ధర్మం కాదు.
ప్రియమునే మాట్లాడాలి. ఒక మాట మాట్లాడితే ఆ మాట వలన అవతలి వారికి ఏదో ఒక ప్రయోజనం వుండాలి. మంచి మార్పునకు కారణం కావాలి. ఉద్ధరణకు హేతువు కావాలి.
వాక్కు ఆజ్ఞానాన్ని కాల్చేస్తుంది.
వాక్కు తపస్సు గా భావించి వాక్కు ద్వారా హింస చేయకుండా ఎవరు వాక్కు ద్వారా సత్యమును ప్రతిష్ఠిస్తారో వారు ఉత్తములు. తమ వాక్కు మీద తమకు నియతి వుండాలి.
మాట్లాడకూడని మాట మాట్లాడితే ప్రశాంతంగా వున్న వారికి ఆగ్రహము తెప్పిస్తుంది. అశాంతికి గురిచేస్తుంది. ఏది మాట్లాడాలో అది మాట్లాడితే అశాంతితో వున్న వారిని ప్రశాంతంగా వుండేటట్లు చేస్తుంది.
చూసేదీ, వినేది, మాట్లాడేది, నడిచేది, ఉన్నతికి దారితీయాలి. ప్రయోజనకరమై వుండాలి.
వాక్కు మీద నియమం అత్యంత ప్రధానం. ఎవరు ఏది మాట్లాడినా మనస్సుని వాక్కుని సమన్వయం చేసుకొని మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఏది మాట్లాడితే సత్యమో దాన్నే మాట్లాడాలి .
సత్యమును తపస్సుగా చేసినటువంటి వారి వాక్కు అద్భుతమైన శక్తిని పొందుతుంది.
వాక్కు ప్రాణం తీస్తుంది. వాక్కు ప్రాణం పోస్తుంది. వాక్కు నశింప చేస్తుంది. వాక్కు ఉద్ధరణకు కారణమవుతుంది.
వాక్కు శక్తి బలవత్తరమైనది. అస్త్రము, శస్త్రముల కన్నా ఎంతో గొప్పది వాక్కు. తపస్సు వున్న వాడు తొందర పడి వాక్కును విడిచి పెట్టేస్తే అవతలి వాడు ఎంత బాధపడవలసి వస్తుందో ఆలోచించాలి.
యోగి మనస్సులో ఏముందో అదే వాక్కు రూపములో బయటకు వస్తుంది .
ఎప్పుడూ అసత్యము పలికే వాడి వాక్కు పిల్లవాడు కూడా వినిపించుకోలేనంత బలహీనముగా వుంటుంది. నిజము పలికినా వాడి చెవిన పడదు. ఎప్పుడూ సత్యము పలికే వ్యక్తి వాక్కు అత్యంత శక్తి వంతమయి, అతని వాక్కు ప్రపంచాన్నే శాసిస్తుంది.
అమంగళకర మైన మాటలు మాట్లాడకు, వినకు.
ధర్మాన్ని రక్షించడానికి వాక్కును ఆయుధంగా చేసుకోవాలి. వాక్కు గతులను తిప్పేస్తుంది. వాక్కు ఎంత గొప్ప విశేషాన్ని అయినా ఒకలా వెళ్ళే దాన్ని వేరే మార్గం లోకి మారుస్తుంది. వాక్కు వైభవమును కలిగి వుండాలి.
వాక్కు ఎంత దూరమైనా వెళుతుంది. అంత శక్తి వంతమైన వాక్కును మానవుడు పొంది వున్నాడు. దాని విలువ తెలుసుకొని దాన్ని చాలా జాగ్రతగా వాడాలి. వాక్కును సరిగా వినియోగించక పోతే ఎవరి పతనాన్ని వారే కోరి తెచ్చుకున్నట్లు అవుతుంది. వాక్కును ఎవరు సరిగా వినియోగిస్తే వారు తరించిపోతారు. ఉద్ధరించబడుతారు.
సత్య దీక్ష వలన యశస్సుతో వుంటావు.
ధర్మము నందు సత్యము ప్రతిష్ఠితమై వుంటుంది. ధర్మము విడిచి పెడితే సత్యము, ధర్మము రెండూ విడిచి పెట్టినట్లవుతుంది. సత్యముతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి.
సత్యాన్ని పట్టుకొని ధర్మాన్ని వదలినా, ధర్మాన్ని పట్టుకొని సత్యాన్ని వదలినా రెండూ ప్రమాదమే.
మారని దానికి సత్యం అని పేరు .దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న దానికి ధర్మం అని పేరు.
సత్యము, ధర్మము చేత కట్టుబడాలి తప్ప మరి దేనికి కట్టుబడకూడదు. ఎల్లవేళల సత్య ధర్మముల వైపుకు మొగ్గుచూపాలి.
దేశకాలపరిస్థితులను అనుసరించి సత్యం విషయములో ధర్మాధికారులకు మినహాయింపు వుంటుంది.
మనస్సులోని ఉద్దేశ్యం సమాజమునకు మేలుచేకూర్చడం కోసమైతే ఆయా సమయముల యందు కర్తవ్య ధర్మముగా సత్యము చెబుతునట్లు నటించవచ్చు. రక్షకభటుడు దొంగ వ్యూహం కనుగొనటానికి దొంగలో వొకడిగా ప్రవర్తిస్తూ సమాజ హితం కోసం వాడే అబద్ధపు వాక్కు అసత్యం కాదు. చేసే హింస కూడా హింస కాదు. మనస్సులో ప్రజా క్షేమం కాంక్షించి బయటకు అసత్యవాదిగా నటిస్తున్నాడు. కాని దీన్ని కర్తవ్యముగా ధర్మాన్ని పాటిస్తున్నాడు అనే భావించాలి.
అసత్య వాక్కు, హింస మినహాయింపు విషయంలో ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకొని చేయాలి. ఇది చాలా సున్నితమైన అంశం. తగినంత ప్రవేశం లేకుండా, పరిశీలన చేయకుండా సాధారణ సిద్ధాంతముగా అసత్య వాక్కు, హింస చేయడం సరైనది కాదు. అప్పుడది కూడా అధర్మమే అవుతుంది.
ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి, నేను ధర్మము నందు ప్రతిష్టింపబడడానికి పరమాద్భుతమైన అవకాశాన్ని నిలబెట్టుకున్నాను అని సంతోషించిన నాడు నీవు ధన్యుడవు.
ధర్మ దేవత నీకు సహకరించాలి అంటే నీవు ధర్మంగా వుండాలి. అప్పుడే నీకు ఆమె అనుగ్రహం కలుగుతుంది.
రాజ్యం ధర్మంలో నడిచేలా ఎవడు నిలబడతాడో, దానికి ఎవరు సహకరిస్తారో వారే లోక రక్షకులు.
భక్తితో వుండటమే అన్నిటికన్నా శ్రేష్ఠం.
ఏ సత్యాన్ని శాస్త్రం చెబుతుందో, ఏ సత్యాన్ని ఆశ్రయించి ఈ సమస్త బ్రహ్మండం నిలబడ్డదో అటువంటి సత్యమునకు ఆధారమే ధర్మం.
ఇప్పుడు అసత్యం చెబితే కష్టం లోంచి బయట పడవచ్చు కాని అది శాశ్వత రక్షణ కాదు. ఇప్పుడు సత్యమే చెప్పి కష్టమే వచ్చినా శాశ్వతముగా నిన్ను సత్యం రక్షిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చి మీద పడనివ్వండి ఎన్నడూ అసత్యం పలక రాదు. ఎన్నడూ సత్యం విడిచి పెట్టకూడదు.
పాలకుడే ధర్మం, పాలకుడే జయం, పాలకుని వల్లే లోకానికి రక్షణ, పాలకుడు ధర్మం తప్పిన నాడు ఇక లోకంలో రక్షణ వుండదు. ఎవరూ కూడా సుఖ౦గా బ్రతకలేరు, ఆన౦దముగా జీవించలేరు.
పాలకుడు అన్న వాడు ప్రజల వెంట, అధికారి అన్న వాడు ఉద్యోగుల వెంట ఎలా వుండాలంటే కొడుకు వెనుక తండ్రిలా వుండాలి.
ఉలి మీది సుత్తి దెబ్బకు శిల ఎలా మారుతుందో ధర్మ శాస్త్రము నుంచి వచ్చే వాక్యములు మనస్సు మీద ప్రసరిస్తే మనస్సుకు పట్టినటువంటి దుర్గుణములు వదిలి లోపల వున్నటువంటి పదార్థం ప్రకాశిస్తుంది. మనస్సు సత్వ గుణంతో వుంటుంది. శాస్త్రాభ్యాసం కూడా తపస్సే.
సుఖం ఎక్కడి నుంచి వస్తుందో శాంతి ఎక్కడి నుంచి వస్తుందో వాటి స్థానం తెలుసుకో.
మనస్సులో వుండవలసినటువంటి పవిత్రత ఎటువంటిదో చూసుకోవాలి. మనస్సులో సంస్కారం లేని నాడు నీవు ఎన్ని చేసినా ఏమి ప్రయోజనం లేదు.
ధర్మం ఎంతకాలం వుంటుందో అంతకాలం మాత్రమే సమాజం సుభిక్షంగా వుంటుంది.
పరిస్థితుల యొక్క వ్యగ్రతకు చెక్కుచెదరని వ్యక్తిత్వమును కలిగి వుండాలి. వ్యగ్రతకు లొంగిపోయేటటువంటి మనస్సులోంచి ఉత్తమ నిర్ణయాలు రావు. స్వస్థితినుండి విడివడకుండా సాక్షి మాత్రముగా విషయములను చూసి నిర్ణయం చేయగలిగినటువంటి వారు ఎవరున్నారో వారు గొప్ప నిర్ణయములను చేయగలరు.
దేవుడు లోపలి హృదయం తెలిసివున్న వాడు. మిగిలిన వారు పైకి కనిపించేది మాత్రమే తెలిసివున్న వారు. హృదయం తెలిసిన వాడికి జవాబు దారిగా వుండాలి.
నేను చేసింది సత్యమే అని అనగలిగే స్థితిలో వుండాలి. నీవు ఒక నిర్ణయం తీసుకొని ఒక పని చేస్తే ఆ తర్వాత తప్పు చేశాననే భావన రాకుండా, నేను చేసింది యదార్థమే అని చెప్పగలిగితే ఆ పని చేయి. అలా చెప్పుకోలేని స్థితి వస్తే ఆ పని చేయకు. ఇది సత్యవంతుడికి వుండవలసిన ప్రధాన లక్షణం. నీ యందు ఏ దోషం లేకుండా ధర్మాన్ని ఆధారం చేసుకొని విచక్షణ చేయి.
దేవుని పై సంశయం పోవాలి, స౦పూర్ణ శరణాగతి పొందాలి. బుద్ధి యందు వైక్లబ్యం లేకుండా నీవు సంపూర్ణ శరణాగతి చేయగలిగితే దైవానుగ్రహాన్ని పొంది తీరుతావు. అనుమానం బాధించి తీరుతుంది. సంపూర్ణ శరణాగతి దైర్యాన్ని, శాంతిని, ఆనందాన్ని ఇస్తుంది.
చితి ఒక్క సారే కాలుస్తుంది. చింత ప్రతి క్షణం కాలుస్తుంది.
కాలము బలవత్తర మైనటువంటి స్వరూపంచేత తన ఫలితాన్ని తాను ఇవ్వడానికి నీ బుద్ధిని మోహ పెట్టింది. మోహ పెట్టి వైరం, కామం వచ్చేటట్టు చేస్తుంది. నీవు నీ ఫలితాన్ని అనుభవించాలి. ఈ ఫలితాన్ని అనుభవించేటట్లు చేయడ౦ కోసమే ఈ పథక రచన. ఇది వారి వారి ప్రారబ్దం.
అర్థము(ధనము)ను ధర్మ బద్ధముగా సంపాదించాలి. కామము ధర్మ బద్ధముగా వుండాలి. ధర్మ బద్ధము కాని అర్థము తనని కాల్చేస్తుంది. సమాజాన్ని కాల్చేస్తుంది. ధర్మ బద్ధము కాని కామము తనని శోకింపచేస్తుంది, సమాజాన్ని శోకింపచేస్తుంది.
శ్రీ రామ! ప్రజలు ఆయా ప్రదేశములయందు ఆనందము తాండవం చేయడానికి, సంతోషముతో మనశ్శాంతిని కలిగి వుండటానికి కారణం సత్ కర్మ, సన్మార్గం, అత్యున్నత జ్ఞానం, ధర్మం. ఇవి వున్న చోటనే ఆ ప్రదేశం సుభిక్షముగా వుంటూ రక్షించబడుతుంది. ప్రజలు చవిచూస్తున్న దుర్ఘటనలకు, దురవస్థలకు కారణం దుష్కర్మ, దుర్మార్గం, అజ్ఞానం. అధర్మం వున్న చోట ప్రజలు దుఃఖించబడతారు. పీడింపబడతారు, బాధలకు గురవుతారు.
48. జ్ఞానం.
జ్ఞాన విచారణచే, జ్ఞాన సముపార్జనచే జ్ఞాన సంపదను పొందాలి. అన్ని సంపదలోకెల్ల ఉత్తమ సంపద జ్ఞాన సంపద.
జ్ఞానమును సంపదగా కలిగిన వివేకులు, బుద్ధి బలము గలవారే శ్రేష్ఠమైన ప్రయోజనమును లక్ష్యముగా కలిగి వుంటారు.
సత్య వస్తువు ఎరుకలోకి రావాలంటే జ్ఞానం అనే కాంతి కలగాలి. జ్ఞానమనే కాంతి లో యధార్థమైన వస్తువు కనబడుతుంది. కాంతి లేకపోతే చీకట్లో దుంగకి, దొంగకి తేడా తెలియనట్లు. త్రాడుకి, పాముకీ తేడా తెలియనట్లు. జ్ఞానమనే కాంతి కలగనంత వరకు సత్య వస్తువుకి అసత్య వస్తువుకి భేదం గోచరించదు. అటువంటి సత్య వస్తువు ఎరుకలోకి రావాలంటే జ్ఞానమనే కాంతి కలగాలి. జ్ఞానమనే కాంతి కలగాలి అంటే శాస్త్రమును తెలుసుకొని ధర్మ చట్రములో బ్రతకాలి.
జ్ఞాన విచారణ సామర్థ్యము గలవారు తామున్న చోట సర్వ భయములను విడిచిపెట్టి దశదిశల శోభిల్లుతున్నారు.
వివేకము గలవాడే చివరికి అన్నింటిలోనూ అందరిలోనూ ఉత్తముడవుతూ విజయం సాధిస్తాడు. ఈ ఆపదలను వాటినుండి రక్షిస్తున్నాడు .
పరిపూర్ణ జ్ఞానముచే బుద్ధిబలమును పొందిన జీవుడికి శమము, సంతోషమును ఆశ్రయించమని సూచిస్తుంది.
49. శౌచము (శుబ్రత).
శౌచము అత్యంత ప్రధానమైన ధర్మం.
శౌచము రెండు రకాలు. బాహ్య శౌచము 2 అంతర్ శౌచము. బాహ్య శౌచము అంటే శరీరాన్ని శుభ్రముగా వుంచుకోవడం. పరిసరములు శుభ్రముగా వుంచుకోవడం. అంతర్ శౌచము అంటే మనస్సును శుభ్రముగా వుంచుకోవడం.
దేహం సత్యం తెలుసుకోవడానికి, లక్ష్యం చేరుకోవడానికి సాధనం. కావున దేహాన్ని పరి శుభ్రంగా వుంచుకోవాలి.
హృదయం స్వశ్చంగా వుంచుకోవాలి.
ఇతరులపై ఈర్ష్యా ద్వేషాలు పెట్టుకున్న వారు ఎలా పతన మైతారో ఎవరూ చెప్పలేరు. కానీ ఈర్ష్యా ద్వేషాలు కలిగి వున్న వారు మాత్రం ఖచ్చితంగా పతనమౌతారు.
అంతర్ శౌచము నందు కళ్యాణ గుణములను ప్రయత్న పూర్వకంగా తెచ్చుకోవాలి. అసహనము తగ్గించుకొని ఓర్పు పెంచుకోవాలి.
మంగళ ప్రదమైన గుణములను లోపలికి ప్రయత్న పూర్వకంగా తెచ్చుకుంటే ఎప్పుడూ మంచి విషయాలే ఆలోచిస్తూ వుంటాడు. మనుసులోకి ఎటువంటి ఆలోచనలు వస్తాయో దాన్ని బట్టి బుద్ధి వుంటుంది.
లోపల మంచి ఆలోచనలు వుంటే మంచి సంకల్పాలు వస్తాయి. మంచి సంకల్పాలు వస్తే మంచి కార్యాలు చేస్తారు.
ఉద్వేగ పడేవి చూస్తున్నా, విన్నా, మాట్లాడినా, మనస్సు ప్రశాంతంగా వుండదు.
పాత్ర శుద్ధి లేనిది కాదు. పాత్ర శుద్ధి గలదే కాని ఆ తరువాత దానికి మలినం అంటుకుంది. మలినము కలిగిన పాత్రను శుద్ధి చేసే పదార్థము పాత్రను పరిశుభ్రంగా ఉంచుతుంది. మలినాన్ని పోగొట్టేటందుకు ఉపయోగించే పాదార్థం లాగే మనస్సులో పట్టుకున్నటువంటి మలినాన్ని పోగొట్టేదే ధర్మ శాస్త్రం.
జీవుడు చెడ్డవాడు కాదు, తను సంపాదించుకున్న గుణాలు చెడ్డవై వున్నాయి.
అందరూ మంచి మనస్సు కలవారే కానీ కాలక్రమములో వారికి ఈర్శ్యా ద్వేషాలు, స్వార్ధం అనే మలినాలు అంటుకున్నాయి. వాటిని శుద్ధి చేసేవే సత్కర్మలు, ధర్మ శాస్త్రం మొదలైనవి. ధర్మ శాస్త్రం తెలుసుకొని ఆచరించడం వలన చిత్త శుద్ది ఏర్పడుతుంది. చిత్తము శుద్ధి పొందితే మనస్సు ప్రశాంతముగా వుంటుంది. ప్రశాంతముగా వున్న మనస్సు నిన్ను తరింపచేస్తుంది. లోకానికి మేలు చేకూరుస్తుంది.
చిత్తము శుద్ధి పొందితే ఎప్పుడో ఒకప్పుడు జ్ఞానం బోధపడుతుంది. జ్ఞానం వలన అజ్ఞానం పటాపంచలయి అంతటా వున్నది ఒక్క దైవమే అని ఎరుక కలుగుతుంది. పరిపూర్ణ జ్ఞానం కలగడానికి సత్కర్మ, సన్మారము చూపించే ధర్మ మార్గమును పట్టుకోవాలి.
రౌద్రచింత చేయడం వలన ఎవడి పతనం గురించి ఆలోచిస్తున్నారో అది నెరవేర్చే శక్తిగా మారి వాడిని అంతమొందించడమో లేదా ప్రతి చర్య వలన తను అంతమవడమో జరుగుతుంది. రౌద్ర చింత వలన ప్రతీకార శక్తి మాత్రమే బలవత్తరముగా వుంటుంది. ఇతర శక్తులు జడమవుతాయి. అతనికి కూడా హాని జరుగుతుందనే ఎరుకకూడా లేనంత జడముగా ఇంద్రియములు క్షీణించి ఉన్మాదిని చేస్తాయి.
శుక్ల చింతన చేయడం వలన శాస్త్రమును గురించి పరివేదన దాని వలన శాస్త్ర సంబంధమైన బుద్ధి ప్రాప్తిస్తుంది. శుక్ల చింతన వలన మహా జ్ఞాని, గొప్ప పండితుడు అవగలిగే శక్తిసామార్ద్యాలు పొందుతాడు. ఆయా శక్తులు తన సాధనను అభ్యాసమును అనుసరించి ఈ జన్మలో పొందవచ్చు లేదా భవిష్యత్ జన్మలో పొందవచ్చు. ఈ జన్మలో పొందలేనప్పటికీ తను తీసుకొనే తరవాతి జన్మలో పూర్వ అనుభూతుల, వాసనల వలన మళ్ళీ శుక్లచింతనకు అనుగుణమైన కార్యములనే చేస్తూ ఎప్పటికైనా సాధిస్తాడు.
50. దేహము -ప్రయోజనము.
పడవను ఉపయోగించుకున్న వాడు ఏరు దాటుతాడు. పడవను చూసుకొని మురిసిపోయి పడవ ఏమైపోతుందో ఏమో అని పడవను ఉపయోగించుకోని వానికి పడవ ఉపయోగపడదు. దేహమును కూడా ప్రయోజనం కోసం ఉపయోగించి తరించాలి.
ఉత్తమ లోకాలు చేరుకోవాలన్నా దేహాన్ని ప్రయోజనం కోస౦ ఉపయోగించవలసి వుంటుంది. అప్పుడే శరీరం తరించగలదు. ఈ తెప్పను ఎవరు సరిగా వాడుతారో వారు మాత్రమే ఏరు దాటతారు.
శోకమును, భయమును మించిన శత్రువు లేదు. శోకము, భయము ఎవరి యందు ఉత్పన్న మైతే వారికవి శత్రువులయి కీడు చేస్తాయి. శోకము వలన ధైర్యం పోతుంది మనస్సు బలహీన పడుతుంది. ఎన్ని వనరులున్నా, ఎంత చేయవలసిన సమర్ధత వున్నా, మనస్సు బలహీన పడితే అవి నిరర్ధకము అవుతాయి.
భయము తో సమానమైనటువంటి శత్రువు లేడు. దైర్యము తో సమానమైనటువంటి మిత్రుడు లేడు. ఉత్సాహం వున్న వాడికి కష్టమనే మాట వుండదు. ఉత్సాహమున్న వాడు యత్నముచే నిలబడగలడు. ఉత్సాహము లేని వాడు ఎన్ని వనరులు వున్నా చేయవలసినదంటూ ఏమీ వుండదు.
తన కర్తవ్యమేదో తనకు గుర్తొస్తే, తన ధర్మమేదో తనకు జ్ఞాపకానికి వస్తే తాను చేయవలసిన పనికి తాను ఉద్యుక్తుడైతే తాను దేన్నైనా సాధించగలడు.
51. దేహి -దేహము.
శ్రీ రామా! దివ్య శరీరమే(దేహి) దైవముగా మోక్షమును కలిగి వుంది. ప్రతి జీవి లేదా మానవుడు వస్తుసిద్ధంగా దైవముగానే వున్నాడు. కాని బుద్ధి సిద్ధంగా గ్రహించలేకున్నాడు. ఆ భావాన్ని మానవుడు అనుభవం లోకి తెచ్చుకోలేక వున్నాడు. కాలక్రమంలో దైవ భావ౦ అనుభవంలోకి వస్తుంది.
దేహి దేహమును తొడుక్కున్నాడు .
దేహములోపల వున్న ‘ఆత్మ’ నేను. దేహము నా సంకల్పాలకు, కోరికలకు సహకరించే శక్తి అనే విషయాన్ని స్థిరపరుచుకోవాలి.
అత్యంత శక్తి వంతమైన పరికరములతో చూసినది సత్యమని, అనుకుంటున్నది అది ఆయా సమయములందు ఆయా ఉపాధులను కలిగివుందని తెలుసుకోవాలి. కాని అది నిత్యము కాదు. అది కనిపించడానికి కారణమైనఆత్మయే నిత్యము, సత్యము అయి వున్నది. దానిని చూడలేరు, తాక లేరు, ఎవరూ నాశనము చేయలేరు.
వికారం లేనిది ఆత్మ, వికారం చెందేది మనస్సు, మనస్సులోని వికారానికి స్పందించేది, చలించేది శక్తి. చలిస్తూ తిరిగి మనస్సును చలింపచేస్తుంది.
‘ఆత్మ’కొత్తగా దర్శనమవడం వుండదు. ఆత్మ తెలియ బడుతుంది. వున్నది ఆత్మయే. ఆత్మ, మనస్సు, శక్తి అని మూడు లేవు ఒకటే అవి ఆత్మలోని మూడు అవస్థలు.
నేను అన్నది లోపల వున్న సాక్షి. దానికి మార్పు లేదు. అది మార్పులన్నిటినీ తెలుసుకుంటుంది.
సర్వ మానవులు ఆత్మ జ్ఞానం కలిగి వుండాలి. శరీరము నేను కాను అని నిశ్చయం చేసుకోవాలి. ’ఆత్మ’ నేను. దాని శక్తి సర్వవ్యాపకమై వున్నది. అది పడిపోదు, అది నీటిచేత తడవబడదు, అగ్నికి కాలదు. దానికి నాశనము లేదు. అదియే నేను. అనే నిశ్చయానికి రావడమే ఆత్మ జ్ఞానం. ఈ స్థితిలో నిలబడినటువంటి వారు జీవన్ముక్తులు.
బాల్యములో వున్న శరీరం యౌవనంలో వస్తుంది. మార్పు చెందుతున్నది జీవుడు కాదు శరీరం. దేశ కాల పరిస్థితులలో ఆయా అనుభవములను శరీరమే జీవుడికి ఇస్తుంది. దేహము మార్పు చెందుతుంది. దేహి మార్పును అనుభవ౦ చెందుతున్నాడు.
తెలుసుకుంటున్నది ఏది వున్నదో అది నిజమైన నేను అనే సత్యం. అది అన్నింటికీ సాక్షిగా చూస్తుంది. మార్పు లేని ఆత్మ మార్పు చెందుతున్న దేహమును తెలుసుకుంటుంది. తెలుసుకుంటున్న ఆత్మకు మార్పు లేదు తెలియ బడుతున్న దేహమునకు మార్పు వుంటుంది. కాలము నందు దేహము వెళ్లిపోతుంది కాని దేహి వెళ్ళడు. తన ప్రయాణానికి వేరొక శరీరం ఎన్నుకుంటున్నాడు.
ఎన్ని వస్తువులు మార్చినా, ఎన్ని వాహనాలు మార్చినా, ఎన్ని గృహములు మార్చినా నీవు మాత్రం మారటం లేదు. జీర్ణమైనదానిని పనికిరాని దానిని విడిచి పెడుతున్నావు.
ఏ శక్తి అయితే శరీరాన్ని సమకూర్చిందో అదే శక్తి నీ సంకల్పానికి, కోరికలకు తదనుగుణమైన శరీరమును సమకూరుస్తుంది.
బ్రహ్మ (ఆత్మ)ను చూడటానికి ఈ బాహ్య నేత్రము సరిపోదు. మాంస నేత్రములతో జగత్తును మాత్రమే చూడగలదు. జ్ఞాన నేత్రమునకు, దివ్య నేత్రమునకు మాత్రమే కనిపించునది దేహము నందున్న పరమాత్మ .
మాయ అనుగ్రహం వుంటేనే పరమాత్మను దర్శించగలడు.
నీవు చేసిన కర్మ ఏది వున్నదో ఆ కర్మయే నీవు శరీరము పొందడానికి హేతువై వున్నది.
దేహము నివాస యోగ్యము కాని పక్షములో దేహి దేహమును విడుస్తుంది. గతంలో వేరొక శరీరం విడిచి ఈ శరీరంలోకి వచ్చి౦ది. ఈ శరీరం విడిచి వేరొక శరీరం ధరిస్తుంది. ధీరుడైన వాడు ఈ విషయమును గూర్చి భయమును పొందడు.
‘ఆత్మ’వస్తువు గురించి సరైన జ్ఞానం పొందిన వారు భయమును పొందరు.
జీవుడికి గత జన్మ జ్ఞాపకాలు రాకుండా నియంత్రించ బడుతుంది .ఒక వేళ గుర్తుకు వస్తే మళ్ళీ పాత అనుభవాలు, పాత కక్షలు అంటూ తన జీవితం తిరోగమనంలో పడుతుంది. పురోగమనంలోకి ప్రయాణం సాగదు. మరొక కారణం ప్రకృతి జీవ వైవిధ్యంలో వుంచవలసిన ధర్మానికి ఆటంకం కలుగుతుంది. నీ జీవితం గురించి చింతించకుండా దైవానికి శరణాగతి పొంది, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. నీవు ఎక్కడుండాలో దైవం నిర్ణయిస్తుంది.
పూర్వ జన్మల జ్ఞాపకాల వలన చేయ దలచిన సృష్టి కార్యమునకు విఘాతం కలుగుతుంది.
గత జన్మ వాసన కానీ, గత జన్మ జ్ఞాపకాలు కానీ వస్తే ఆ జీవుడు ఉద్ధరింపబడడు.
చిన్న వయసు నుంచి తెలుసుకున్న అనుభవాలు మళ్ళీ చేయకూడదు అనే జ్ఞానం ఎలా వుందో, పూర్వ జన్మలలో తెలుసుకున్న మంచి చెడులు సంస్కార జ్ఞానముగా ఆయా విషయముల యందు అనుభవానికి వస్తుంటాయి. మంచి అనుభవానికి వస్తుంది. చెడు అనుభవానికి వస్తుంది. మానవుడి జీవనాన్ని ఇవే నడిపిస్తున్నాయి. చెడును గుప్తముగా వుంచి మంచిని మేల్కొల్పడమే జీవితాన్ని ఉన్నతికి తీసుకొనివెళుతుంది.
ఆర్థము గురించి చింత చేయడం వలన ధనం, ధాన్యం, అధికారం పొందుతారు.
దర్మ చింతన వుండటం వలన విధి సరైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. స్వతంత్రతను కల్పిస్తుంది. మోక్షానికి దగ్గర చేస్తుంది.
ప్రస్తుత జన్మకు భవిష్యత్తులో ఉత్తర జన్మలలో ఎటువంటి బుద్ధి, జ్ఞానం ఇవ్వబడినదో, దానికి కర్తవై వున్నావు.
పునర్జన్మకు కారణం దేవుడు కాదు, పునర్జన్మకు కారణం మనస్సు. మనస్సు ద్వారానే మానవుడు ఉద్ధరింపబడుతాడు.
దేవుడు నీకు ఒక్క అధికారమును ఒకొక్క ఉపాధి యందు ఒకొక్క విభూతిగా ప్రవేశ పెడతాడు. ఆ కర్తవ్యమును మాత్రమే నీవు నిర్వహించవలసి వుంటుంది.
ఉన్నది శుద్ధ చైతన్యమే. వున్నది వున్నట్లు తెలియబడటం లేదు. ఉన్నది గొప్ప బంగారు పాత్ర. అది మలినముచే కప్పబడి అలా కనిపిస్తుంది. బంగారు పాత్ర అని నమ్మకం కలగాలి అంటే మలినాన్ని తొలగించాలి. అప్పుడే రాశీ భూతమైన ఆత్మచైతన్యం తానై నిలబడతాడు.
అన్నిటికి ఆత్మ సాక్షి. సాక్షి గా నిలబడటంలో అది పడిపోవడానికి కూడా సాక్షి. తాను చెదరని వస్తువు, తరగని వస్తువు, నశించని వస్తువు అని తెలుసుకున్న ఉత్తర క్షణములో దాని పర్యాయ పదమే దైవము కాబట్టి, తాను దైవమై, తాను దైవముగా, జ్ఞానమును పొంది దైవముగా నిలబడి పోతాడు. ఇలా నిలబడినటువంటి స్థితిని చేరడానికి సాధనా ప్రక్రియ ప్రధానమైనది.
మనస్సు, ఇంద్రియముల యొక్క సూక్ష్మ కదలికలను సాక్షిగా వుంటూ గ్రహించాలి. దుష్ట భావనలు సూక్ష్మ దశలోనే ఆర్పివేయాలి. తద్వారా అంతర్ముఖత్వము అలవాటవుతుంది. ఆత్మ పరిశీలనము అలవాటవుతుంది. ఆత్మ వస్తువు ఒకటుంది అనే ప్రజ్ఞ ఏర్పడుతుంది .
ఉన్న చైతన్యము యొక్క లక్షణం దాని కొక నామం లేదు. రూపం లేదు. అభివ్యక్తి కూడా లేదు. అది వెలుగు కాదు, చీకటి కాదు. దానిలో క్రియ అనునది లేదు. దానికి కొలమానం లేదు. కేవలం చైతన్య స్వరూపం. కారణం లేదు కార్యం లేదు. అది అంధకారము కాదు, తేజస్సు కాదు .ఆ ఏకత్వానికి శాస్త్రం అనేక పేర్లు పెట్టింది. దాన్ని ఋతం అని, ఆత్మ అని, పర బ్రహ్మ అని, సత్యం అని, దైవం అని పిలుస్తారు. అది శుద్ధ చిత్ స్వభావం. దాని నుంచే జగత్తు వివర్త భావం పొంది వ్యక్తమవుతుంది.
మనస్సు పట్టుకున్న దృశ్యమే ప్రపంచం. పట్టుకున్న దాని అనుభూతి జగత్తు. అనుభూతులతో తాదాత్మ్యం అయినంత వరకు అధిష్ఠానం తెలియ బడదు. జ్ఞానము వచ్చిన తర్వాత ఎరుక కలుగుతుంది .
వివిధ ఆకృతులతో కనిపిస్తున్న పదార్థము ఆ దైవ తత్వమే. అది చిత్ శక్తి చేత వివిధ ఆకృతులలో కనిపిస్తుంది .
ఉన్న సముద్రమును ఆధారము చేసుకుని వచ్చి పోయే తరంగాలలా, ఆత్మ చైతన్యమును ఆధారము చేసుకుని పుడుతూ పెరుగుతూ పోయేవి విషయములు. ప్రపంచము కాకుండా దాని కంటే వేరుగా నిలిచి వున్నదే అఖండమైన సచ్చిదానంద స్వరూపం. దైవ స్వరూపమైన ఆత్మ చైతన్యమే నీ దృష్టిలో వుండాలి.
52. శమము.
జీవుడు నిత్యము శమము కలిగి వుండాలి. శమము అంటే శాంత చిత్తం.
శమము పొందిన వాడి మనస్సు ఎప్పుడూ ప్రశాంతముగా వుంటుంది. నిర్మలంగా వుంటుంది. భ్రమ అనేది తనకుండదు. వాంఛా శూన్యం. తను ఏది కోరడు. ఇది నా దగ్గర నుంచి పోవాలి అనుకోడు. తను ఎప్పుడూ శాంత స్థితిలో వుంటాడు .
శమమే శ్రేయస్సు,శమమే పరమ పదం, శమమే శాంతి, శమమే భ్రాంతిని పోగొడుతుంది.
శమము అనే చంద్రుడు ఎవరి హృదయంలో ప్రకాశిస్తాడో వారి హృదయం ఎల్లవేళలా ప్రశాంతముగా వుంటుంది.
సర్వ లోకములలోని వస్తువులన్నీ లభిస్తే కలిగే ఆనందం ఈ శాంతములో కలిగే ఆనందము కన్నా అల్పము.
శాంతం కలిగినటువంటి వాడు సర్వ జీవుల పట్ల దయార్ద్ర హృదయంతో స్నేహ బుద్ధి కలిగి వుంటాడు. అతని వైపు అందరూ ప్రీతి కలిగి వుంటారు.
ఏ వ్యక్తి సమత్వాన్ని, శమాన్ని పాటిస్తాడో వాడే జీవించి వున్న వాడి కింద లెక్క. మిగిలిన వాళ్ళు జీవించి వున్నా జీవించి లేనట్లే.
ఏది విన్నా, ఏది స్పృశించినా, ఏది చూసినా, ఏది స్వీకరించినా, ఏ కర్మ చేసినా ఉప్పొంగి పోవడం గాని దుఃఖపడటం గాని రెండూ ఎవరికుండవో అతడే శాంతుడు.
శాంత గుణము గలవాడు ఈ సృష్టిలో ఎవరిని చూసినా సమాన ప్రీతి భావంతో వుంటాడు.
శాంతమునకు ధైర్య లక్షణము వుంటుంది.
శమము గలవాడు మాత్రమే రాజిల్లుతుంటాడు.
శమామృతాన్ని ఇతరులెవ్వరూ దొంగిలించలేరు. అలాంటి శమమును అవలంబిస్తే పరమ పదం పొందినట్లే.
ఆకాశములో ఉదయాస్తమయాలు ఎలా వుండవో ఆత్మ జ్ఞానం కలిగిన వాడికి అశాంతి, ద్వేషం, స్వార్థం, భయము, దుఃఖము అనేవి వుండవు.
విచారణ చేత ఆత్మ స్థితిని పొందిన వాడు పోయిన దాని గురించి చింతించడు. వచ్చిన దాన్ని కాదనడు. దుఃఖించడు, తపించడు కెరటాలు లేని నిండు సముద్రంలా వుంటాడు.
బ్రహ్మ పదార్థం జడమూ కాదు, శూన్యమూ కాదు. కేవలం చైతన్యం, ఆనందం.
53. సంతోషం.
ఎప్పుడూ నిత్య సంతుష్టులై వుండాలి.
సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడము లేదా చూసి సంతోషించడం ఎదోవొకటి చేయాలి. పాటలు పాడటం లేదా పాటలు వినడం, డాన్స్ లేదా నాట్యము, నాటకములు మొదలైనటువంటి కార్యక్రమాలను చూడటం వలన మనస్సు సంతోషంతో నిండి వుంటుంది.
సంతోష మనేది ఉత్కృష్ఠమైన శ్రేయస్సు. సంతోషికి నిరాశా, దైన్యము వంటి దోషాలుండవు.
ఆటలు ఆడడం, చూడటం వలన మనస్సు కుతూహలం ,శారీరక ,మానసిక దారుడ్యాన్ని ఆనందాన్ని పొందుతారు.
ధర్మంతో తనకు లభించిన దానితో సంతృప్తి పడుతూ దైన్యం వైపు వెళ్లకుండా వుండడమే సంతృప్తి. సంతుష్టుడికున్నటు వంటి హాయి ఇంకెవరికీ వుండదు.
సంతృప్తి వుంటే తేజస్సు పెరుగుతుంది. సంతృప్తి, సంతోషం లేకపోతే తేజస్సు లోపిస్తుంది.
నీరు పడితే నిప్పు ఎలా ఆరిపోతుందో అసంతృప్తి వల్ల తేజస్సు కూడా అలా పోతుంది.
సంతోషం అన్ని లాభాల్లో గొప్పది. సత్సంగం అన్ని గతులలో గొప్పది. విచారణ జ్ఞానాల్లో గొప్పది. శమమే సుఖాల్లో గొప్పది.
పూర్ణముగా బుద్ధి స్థిరపడనంత వరకు కేవలం శాస్త్రోపదేశం వింటూ సౌజన్యముతో జీవించాలి. ధర్మబద్ధంగా పురుషార్ధాలు సంపాదించాలి.
శ్రీ రామ! ధర్మ శాస్త్రములో చెప్ప బడిన మంచిని పెంపొందించుకొని చెడుని నిర్మూలించుకొని ఎవరు పవిత్ర హృదయముతో వుంటారో వారు దైవత్వాన్ని కలిగి వుంటారు.
శ్రీ రామా! ఇప్పుడు చెప్పిన వాటితో పాటు సూపర్ పవర్ అడ్మినిస్ట్రేసన్ కలిగిన దైవలోక పరిపాలనా నియమం పాలనలో అమలవుతే ఇక ప్రజలు సుఖశాంతులతో ఎంతో ఆనందముగా జీవిస్తారు.
54. దైవలోక పరిపాలనా నియమం (Divine Rule) ఉపయోగాలు.
శ్రీ రామా! అన్ని విశయాలలోనూ ధర్మం ప్రధానముగా వుంటుంది. ఒక సామాన్య వస్తువుకు విశేషముగా పని చేసే ధర్మం కల్పించడం వలన అది సమర్ధవంతముగా పని చేస్తుంది. సామాన్యముగా నడుస్తున్న వాహనమునకు బలమైన యంత్ర ధర్మాన్ని కల్పించడం వలన అది వేగవంతముగా శక్తి వంతముగా నడుస్తుంది. వ్యవస్థకు ఉత్తమ విలువలతో కూడిన ధర్మాన్ని కల్పించడం వలన ఆ వ్యవస్థ సమర్ధవంతముగా పనిచేస్తుంటాయి. ఉన్నత విలువలతో, మంచి సంస్కృతీ సంప్రదాయాలతో, గొప్ప నియమ నిబంధనలు కల్పించబడిన సమాజము వలన ఆ దేశం ఉద్ధరించబడుతుంది.
ప్రజలు తమకు కావలసిన అన్ని సౌకర్యాలు అందించేది రాజకీయ నాయకులు అని, ఆయా ప్రాంతాల్లో ఉన్న ఉచ్చ-నీచ స్థితులకు కారణం రాజకీయ నాయకులే అని బావించి నాయకుడిని ఎన్నుకొంటున్నారు. అధికారం లోకి వచ్చిన నాయకుడు పదవిలో వున్నంత వరకు అతని వలన మా ప్రాంతం అభివృద్ధి చెంద లేదు అని మళ్ళీ ఇంకో నాయకుడిని ఎన్నుకోవడం ప్రస్తుతకాలములో చూస్తున్నాము. ప్రజలు ఇలా అనేక మంది నాయకులను మారుస్తున్నారు. వాస్తవానికి మారవలసినది నాయకులు కాదు. మార వలసినది వ్యవస్థ. ఆయా వ్యవస్థలను నడిపించే పరిపాలనా నియమం (administration system) మారాలి. అభివృద్ధిలో పాలకుని పాత్ర వున్నప్పటికి ప్రదాన పాత్ర పోసించేది పరిపాలనా నియమం. పరిపాలనా నియమమే వ్యవస్థలను నడిపిస్తుంది. శక్తి వంతమైన పరిపాలనా నియమమే భూలోకాన్ని స్వర్గలోకముగా మార్చే శక్తి వుంటుంది. పరిపాలనా నియమం గురించి స్పస్టముగా తెలియాలంటే ఒక వాహనమును ఉదాహరణగా తీసుకుని తెలియచేస్తాను. ప్రయాణికులు ఎక్కిన వాహనము వారిని ఒక గమ్య స్తానం చేర్చడానికి వాహనములోని ఇంజెన్ ఎంతటి ప్రధానపాత్ర పోసిస్తుందో ప్రజలను నడిపించే పరిపాలనా నియమం అంతటి ప్రధాన పాత్ర పోసిస్తుంది. ఇది ఎంత శక్తి వంతముగా వుంటే వ్యవస్థలు అంతే శక్తివంతముగా పనిచేస్తాయి .
ప్రజలకు ఎంతో మేలు చేయాలనే సత్ సంకల్పంతో వచ్చిన ధర్మపాలకుల సంకల్పం ఫలించడం లేదు. దానికి కారణం శక్తివంతమైన పరిపాలనా నియమం లేకపోవడం. ప్రయాణికులను తీసుకువెళ్లే వాహనము యొక్క ఇంజన్ కెపాసిటీ ఎంత శక్తివంతముగా వుంటే అంత మంది ప్రయాణికులను తీసుకు వెళ్లగలదు. అలాగే పరిపాలనా నియమము యొక్క బలము ఎంత శక్తివంతముగా వుంటే అంత మందిని మాత్రమే నడిపించగలదు. ప్రపంచములో వున్న కోట్ల మందిని నడిపించడానికి ఇప్పుడు వున్న పరిపాలనా నియమం యొక్క బలం సరిపోవడం లేదు. ప్రపంచములో అశాంతికి, విద్వంశాలకు, దొంగతనాలకు పేదరికానికి, మత విద్వేశాలకు కారణం శక్తివంతమైన పరిపాలనా నియమం లేకపోవడమే. ప్రస్తుత ప్రపంచ జనాబాకు ఒక శక్తివంతమైన సూపర్ పవర్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్(Divine Rule) కావాలి. ఈ నియమాన్ని నడిపించడానికి మానవులు మానసిక బలాన్ని, శక్తి సామర్ద్యాలను, నైపుణ్యాలను కలిగి వుండాలి. వాహనము, ఇంజన్ బాగున్నప్పటికి దానిని నడిపే డ్రైవర్ కూడా నైపుణ్యము, సామర్ద్యముతో నడిపితేనే ప్రయాణికులు గమ్యానికి చేరుతారు. అదే విదముగా పరిపాలనా నియమం శక్తివంతముగా వున్నప్పటికి దాన్ని నడిపే పాలకులు, నాయకులు, అధికారులు, ఉద్యోగులు మానసిక బలాన్ని, సామర్ద్యాన్ని, నైపుణ్యాన్ని కలిగి వుండాలి.
దైవ లోక పరిపాలనా నియమం(Divine Rule) లో ద్రవ్యోల్బణం వుండదు, పేదరికం వుండదు, సర్వ జనులు విధ్యా వంతులుగా, స్థిరమైన ఆదాయముతో, ఆరోగ్యవంతులుగా ఆనందముగా వుంటారు. అందరికీ విశాలవంతమైన గృహాలు, మంచి సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన వాతావరణం కల్పిస్తూ ప్రజలందరూ సుఖ శాంతులతో జీవిస్తారు. ప్రజల క్షేమాన్ని కాక్షించి ఆయా దేశపాలకులు(Divine Rule) వ్యవస్థను అమలు చేయాలి. ప్రజలు ఈ వ్యవస్థలోని నియమాలను అనుసరించి వారి ధర్మాన్ని నిర్వర్తించాలి.
Divine Rule విదానం వలన చేయతలచిన ప్రాజెక్ట్‌లకు నిదుల కొరత వుండదు. దేశములోని ప్రజలందరికి ఉపాధి అవకాశాలు వుంటాయి. అన్ని వనరులు సరిగా వినియోగింపబడతాయి. నదిలో నీరు సముద్రంపాలు కాకుండా వాటిని మళ్లించి చేరవలసిన చోటుకి అనగా పంటపొలాలకు, చెరువులకు పంపించు విధముగా (Divine Rule) ప్రజలకు అవసరమయిన సర్వ సదుపాయములు సమకూరుతాయి.
దోపిడీలు, దొంగతనాలు చేయవలసిన దుస్థితి రాదు. ఆహారము కోసమని అడుక్కునే వారు వుండరు. కల్తీ వ్యాపారాలు వుండవు. అన్ని కార్యములు సవ్యముగా స్వచ్చంగా ఎవరి కార్యములలో వారు వుంటూ తమ కర్తవ్యాలను నిర్వర్తిస్తారు.
మనస్సును చుట్టూ వున్న వాతావరణం ప్రభావితం చేస్తుంది. మనస్సు ఆహ్లాదకరంగా వుండేలా సాంస్కృతిక విశాలవంతమైన మందిరాలు, క్రీడలకు అవసరమైన వాతావరణం. ఔట్ డోర్, ఇండోర్ స్టేడియాలు, ధ్యాన, కళా మందిరాలు, వీక్షక మందిరాలు. ప్రజల సేదతీర్చడానికి అనువైన మనో ఆహ్లాద మందిరాలు అనేకం వెలుస్తాయి. ఆహ్లాదకరమైన ఉద్యాన వనాలు, children పార్క్, యోగ, మెడిటేసన్, జిమ్ సెంటర్స్, మొదలైనవి spa వ్యవస్థ కల్పిస్తుంది.
శ్రీ రామా! నీవు దైవ లోకాన్ని దర్శించి నప్పుడే దైవ లోక నిర్మాణానికి బీజం పడింది .దైవ లోక నిర్మాణం తథ్యం! ఇది ఎవరూ నిలువరించలేనిది.
శ్రీరామా! నీ దృష్టిలో పడిన, నీవు చూసిన నీచస్థితులు, అజ్ఞానము, అధర్మము ఇక కనిపించవు. ఆ స్థితులు అన్నీ గతం అవుతాయి. ఈ స్థితి చరిత్రలో చూడవలసినదే కానీ కంటికైనా కనిపించవు. ఈ భూమండలం ఆహ్లాదకరంగా మారుతుంది. అందరి హృదయాలు స్వచ్ఛంగా మారుతాయి. అందరూ జ్ఞాన మార్గంలో, ధర్మ మార్గంలో ప్రయాణిస్తారు. దైవత్వాన్ని పొందుతారు.
భూమండలం పై దైవ లోకం సృష్టించబడుతుంది. ప్రజలందరూ ఆ లోకంలోకి ప్రవేశించే కాలం ఆసన్నమయింది. దైవ లోకములోని వారు ఇక్కడికి వస్తూ వెళుతూ వుంటారు.
ఇప్పటి వరకు చెప్పిన ధర్మ శాస్త్రం లోని అతీంద్రియ జ్ఞానం, విశ్వరహస్యం, ఉపదేశము మనిషి అంతర్ దృష్టిని మార్చి మనస్సు స్థిరముగా వుండేలా చేస్తుంది. తరువాత చెప్పబోయే మరికొన్ని ఉపదేశాలు, ఆదేశములు మానవుడు ఎలా నడవాలో ఆదేశిస్తాయి. అలాగే దైవ లోక పరిపాలనా నియమం Divine Rule గురించి స్పస్టముగా వివరించబడుతుంది.
ఇప్పుడు చెప్పిన ఉపదేశము. అలాగే తరువాత చెప్పబోయే ఆదేశము, దైవ లోక పరిపాలనా నియమము(Divine Rule) లోకంలో అమలుచేసి ఎప్పుడైతే ఆచరించబడుతుందో అప్పుడు ఈ లోకం దైవ లోకముగా వెలుగొందుతుంది.
ఈ అఖండ జ్ఞానమే అమృతం. ఈ జ్ఞానమును పొందిన వారు అజ్ఞానముచే చంపబడుతున్న, బాధపడుతున్న జీవుడికి విముక్తి కలుగుతుంది. అమరుడుగా వుంటాడు. అఖండ జ్ఞానామృతాన్ని ఎవరు సేవించి ఆచరించుతారో వారు తరిస్తారు. మరణాన్ని జయించిన వారే అవుతున్నారు.
ధర్మచార్యులు: ఈ విధముగా దైవీ శక్తి శ్రీరాముడికి సృష్టి రహస్యాలను వెలువరించింది. సభలోని వారికి ముక్యముగా చెప్పదలచినది ఏమి అంటే సృస్టి రహశ్యాలు మానవుడు ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి. మహా శక్తి రాముడికి చెప్పిన అన్ని రహస్యాలు మీకు తెలియచేయడం లేదు. ఎంత వరకు చెప్పాలో అంతవరకు మాత్రమే నేను మీకు చెప్పడమైనది .మీ మానసిక బలాన్ని బట్టి మరికొంత జ్ఞానం కాలానుగుణంగా పొందుతారు. దైవీ శక్తి శ్రీరాముడికి చెప్పిన దైవ లోక పరిపాలనా నియమాన్ని(Divine Rule) త్వరలో తెలియ జేస్తాను. ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లు తారు.
భక్తుడు: గురువుగారు! దైవశక్తి శ్రీ రామునికి వివరించిన పరమసత్యాన్ని మాకు బోదించినందుకు మీకు కృతజ్ఞతలు. మరికొని ఉపదేశాలు, మానవుడు నడవడికకు అవసరమైన ఆదేశము, దైవలోక పరిపాలనా నియమము త్వరగా ప్రసాదించాలని వేడుకుంటున్నాను.
ధర్మాచార్యులు: ప్రపంచానికి ఆనందాన్ని, పరమ శాంతిని ప్రసాదించే దైవ లోక పరిపాలనా నియమాన్ని(Divine Rule) అతి త్వరలో తెలియ చేస్తాను. మీరు ఇప్పటి వరకు తెలుసుకున్న ఈ దైవ జ్ఞానాన్ని అనుసరించండి మరియు ఇతరులను కూడా అనుసరించమని చెప్పండి. మీరు చేసే ప్రతి కార్యము లెక్కించబడుతుంది అని గ్రహించండి. దైవానికి శరణాగతి పొందండి. ధర్మ మార్గంలో నడుస్తూ లోక అభ్యున్నతిలో పాల్గొనండి.
‘సర్వేజనాం సుఖినో భవంతు’
“ధర్మో రక్షతి రక్షితః”.




















